Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: ADMIN
ప్రభుత్వ ఉద్యోగి నుంచి వ్యాపారవేత్తగా ఎదిగిన అసామాన్యులు సానా సతీష్ బాబు. విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దల మన్ననలను అందుకున్నవారు. తన నిజాయితీని, నిబద్ధతను కొనసాగిస్తూ ప్రతి రంగంలో తనదైన ముద్రను వేస్తున్నారు. ఓ ఉద్యోగిగానే కాదు ఓ వ్యాపారవేత్తగా కూడా తాను ఎంతో ప్రత్యేకమని ప్రతి క్షణం నిరూపించుకుంటున్నారు. రంగం ఏదైనా తనదైన ముద్రను వేస్తూ చుట్టూ ఉన్న వారిని విస్మయ పరుస్తున్నారు. తన అసామాన్య విజయాలతో ఆశ్యర్యానికి లోనయ్యేలా చేస్తున్నారు. అడుగు పెట్టిన ప్రతి చోట విజయ దుందుభి మోగిస్తూ తిరుగులేని శక్తిగా ఎదుగుతున్నారు సానా సతీష్ బాబు గారు. అందుకే ఆయనంటే పరిచయస్తులకు ప్రేమ, తెలిసిన వారికి అభిమానం. సాయం పొందిన వారికి దైవంతో సమానం. ఎక్కడకు వెళ్లినా జన నీరాజనాలు ఆయనకు సొంతం. పెద్దల ఆశీస్సులతో, ప్రజల ఆదరణతో దినదినాభివృద్ధి చెందుతున్న ధృవ నక్షత్రం మన సానా సతీష్ బాబు.…
మన కాకినాడ వాస్తవ్యులు మన కాకినాడ ఆహ్లాదకరమైన వాతావరణానికి కేంద్రం. సముద్ర తీర ప్రాంతం ఆనుకొని ఉన్న సహజ వనరుల నెలవు. కేవలం ప్రకృతి వనరులే కాదు, మానవ వనరులు పుష్కలంగా ఉన్న ప్రాంతం. ప్రపంచానికి, దేశానికి ఎందరో మేధావులను, రచయితలను, క్రీడాకారులను, ప్రతిభావంతులను మన కాకినాడ అందించింది. అందిస్తోంది, అందిస్తూనే ఉంటుంది. విద్యా నిలయంగా ప్రసిద్ధికెక్కిన మన కాకినాడ ప్రతి ఏడాది మెరికల్లాంటి విద్యార్థులను తయారు చేస్తోంది. అలాంటి ఓ విద్యావంతులు, ప్రతిభావంతులు, మేధావి, వ్యాపారవేత్త, పారిశ్రామికవేత్త, సామాజికవేత్త మన సానా సతీష్ బాబు గారు. ఆయన పుట్టిన నేల మన కాకినాడ. అందుకే సతీష్ బాబు గారికి కాకినాడ అంటే ఎనలేని ఆప్యాయత. మనసుతో ముడిపడిన అనుబంధం. విద్యాభ్యాసం నుంచి ఉద్యోగం వరకు కాకినాడ కేంద్రంగానే సాగింది. అంతగా ఆయన కాకినాడతో మమేకమయ్యారు. కాకినాడలోని ప్రతి చోటూ ఆయనకు సుపరిచితమే. ప్రతి గుండె చప్పుడు ఆయన వినినదే.…
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో రాష్ట్ర రాజకీయం రసవత్తరంగా మారింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో పార్టీలు ప్రచార హోరును పెంచుతున్నాయి. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పార్టీలన్నీ పావులు కదుపుతున్నాయి. హ్యాట్రిక్ విజయం కోసం అధికార బీఆర్‌ఎస్ ప్రణాళికను సిద్ధం చేసుకొగా… కాంగ్రెస్, బీజేపీ సైతం విజయం కోసం సై అంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుడడంతో రాజకీయ పార్టీలల్లో చేరికల కొలహాలం మెుదలైంది. వార్డు మెంబర్, సర్పంచ్‌ల నుంచి మెుదలుకొని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతల వరకు పార్టీలు మారుతున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, బీజేపీకి… కాంగ్రెస్, బీజేపీ నుంచి బీఆర్‌ఎస్‌కు ఇలా వలసల పర్వం కొనసాగుతోంది. పార్టీలో నేతలకు ఇచ్చే ప్రాధాన్యతను బట్టి నేతలు వేర్వేరు పార్టీలలో చేరుతున్నారు. రాష్ట్రంలో హ్యాట్రిక్ విజయమే లక్ష్యమని చెబుతున్న బీఆర్‌ఎస్‌కు గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే బీఆర్‌ఎస్ నుంచి కొంతమంది నేతలు బీజేపీ, కాంగ్రెస్‌లోకి చేరారు. ఇప్పుడు బీజేపీలోకి చేరికలు ఆగిపోయాయి.…
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులు మరియు పరిశ్రమల పేర్లతో వేలాది ఎకరాల వ్యవసాయ భూములు ప్రజల నుండి బలవంతంగా సేకరిస్తుంది. “నిర్వాసితుల త్యాగాలు వెలకట్టలేనివి మేము వారిని కడుపులో పెట్టుకొని చూసుకుంటాం వారికి ఎంత చేసిన తక్కువే”. అని గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నుండి ప్రజాప్రతినిధులు, అధికారులు అంటున్న మాటలు. కానీ పై మాటలకు భిన్నంగా రావాల్సిన నష్టపరిహారం సంవత్సరాలైనా ఇవ్వకపోవడం ప్రశ్నించిన నిర్వాసితులను కేసులు పెట్టి బేడీలు వేసి వేధించడం.ప్రజా ప్రతినిధులు మరియు ప్రభుత్వ అధికారులు నిర్వాసితుల పట్ల వ్యవహరిస్తున్న తీరు మనకు కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది. భూ నిర్వాసితుల పట్ల”ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసినట్టుగా ఉంది”. ప్రభుత్వం తీరు. తెలంగాణ రాష్ట్రం అవతరించిన రెండు సంవత్సరాల తర్వాత సరిగ్గా 16 మే 2016 రోజున మల్లన్న సాగర్ నిర్మిస్తున్నట్లు ఆయా గ్రామాల భూములు , ఇండ్లు ప్రభుత్వం సేకరిస్తున్నట్టు గెజిట్ నోటిఫికేషన్…
తెలంగాణ తల్లి కష్టజీవి. ఊరి సంస్కృతికి ప్రతిరూపం. మన తల్లి దొరల గడీలలో దొరసాని కాదు… ఒంటి నిండా వజ్రవైడుర్యాలు పొదిగిన నగలు, నెత్తిన బంగారు కిరీటాన్ని ధరించి రాచరికానికి ప్రతిరూపంగా రాజదర్పాన్ని కలిగి ఉండటం మన తల్లి లక్షణం కానే కాదు. పెత్తందార్ల పై తిరుగుబాటు చేసిన చాకలి ఐలమ్మ, రజాకార్ల పై తుపాకీ ఎక్కుపెట్టిన మల్లు స్వరాజ్యం తెలంగాణ సంస్కృతికి నిదర్శనాలు. సకల జన తెలంగాణకు, సబ్బండ వర్గాల జనులకు తమ తల్లిని స్ఫురించే రూపం తెలంగాణ తల్లి స్థానానికి అర్హురాలవుతుంది తప్ప… దొరల గడీలలోని దొరసాని రూపమో, రాచరికపు లక్షణాలు కలిగి ఉన్న మహారాణి రూపంమో మన తల్లి కాదు… కాబోదు. అందుకే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్సే తెలంగాణ సబ్బండ వర్గాల ఆమోదయోగ్యమైన “తెలంగాణ తల్లి” ని కూడా ఆవిష్కరిస్తోంది. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాన్ని తిరిగి పున:ప్రతిష్ఠించబోతోంది. మన రాష్ట్రం, మన తల్లి, మన గేయం, మనగానం,…
అప్పు చేసి పప్పు కూడు…*********************బాయి దగ్గర మీటర్లు పెట్టాలని విద్యుత్ సవరణలు కేంద్రం తెస్తుందంటూ ముఖ్యమంత్రి పదే, పదే చెబుతూ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టాల్సిన అవసరం లేదంటూ కేంద్రం తన విధానాన్ని జూలై, 2021 లో (Revamped Distribution Sector Scheme-RDSS) ప్రకటించింది. దానికి అనుగుణంగా పార్లమెంటులో ప్రవేశపెట్టిన విద్యుత్ సవరణ బిల్లు 2022 లో ఎక్కడా వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెట్టాలన్న అంశం చేర్చలేదు. పంపు సెట్లకు మీటర్లు పెట్టడానికి టిజేఏసి వ్యతిరేకం. (ట్రాన్స్ ఫార్మర్ వద్ద కానీ, ఫీడర్ వద్ద కానీ మీటర్లు పెట్టడం శాస్త్రీయం). కానీ విద్యుత్ సంస్థలు ప్రభుత్వ ఆదేశాలమేరకు వినియోగదారులకు సరఫరా చేస్తున్న రాయితీ విద్యుత్తుకు పూర్తి సబ్సిడీలు ప్రభుత్వమే చెల్లించాలి. లేకుంటే విద్యుత్ సంస్థలు కుప్పకూలి పోతాయి. వినియోగదారులకు ఉచిత విద్యుత్తు కాదు కదా… అసలు సరఫరా చేయడానికి విద్యుత్తు కొనలేని పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటి…
జాతీయ పతాకం రూపశిల్పి పింగళి వెంకయ్య ముని మనుమరాలి లేఖ యధావిధిగాబ్రాహ్మణుడికి జంధ్యం ఎంత ముఖ్యమో.. మా కుటుంబంలో దేశభక్తి కలిగి ఉండటం అంత ముఖ్యం (ఈ పోలిక కావాలనే చెప్తున్నాను). దేశం గురించి ఏమన్నా తెల్సా అంటే.. తెల్సి కాదు, అది వారసత్వంగా వచ్చిన ఆస్తి.ముత్తాత స్వతంత్రోద్యమంలో ఉన్నారు. త్రివర్ణ పతాకం రూపకల్పన చేశారు. ఇది నా చిన్నప్పుడే నూరి పోశారు. స్కూల్ లో జెండా వందనం రోజు ఒక గౌరవం. ఈ ప్రివిలేజ్ ని చక్కగా ఎంజాయ్ చేసేదాన్ని. వెంకయ్య కొడుకు, అంటే మా తాత, చలపతిరావు ఇండియన్ ఆర్మీలో పని చేశారు. సర్వీస్ లో ఉండగానే చనిపోయారు. మా నాయనమ్మని కనీసం ట్రైన్ పాస్ కూడా తీసుకోనివ్వలేదు వెంకయ్య గారు. మా నాన్నని 28 ఏళ్ళకి చంపేశారు. ఈ త్యాగాలు, కీర్తుల వల్ల, నేను చదువుతున్న పుస్తకాల వల్ల.. తెలీకుండానే.. మా కుటుంబ వాతావరణంలో దేశభక్తి అనేది,…
కాళేశ్వరం పంప్ హౌసుల మునక డిజైన్ వైఫల్యమే… ఇవిగో ఆధారాలుతెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ“గోదావరి వరదలు ప్రకృతి విపత్తే” అంటున్న శ్రీ శ్రీధర్ రావ్ దేశ్పాండే గారి వివరణలకు tjac స్పందన..కాళేశ్వరం పంప్ హౌసుల మునకపై 15.07.2022 నాడు టిజేఏసి లేవనెత్తిన కీలక అంశాలపై శ్రీ శ్రీధర్ రావు దేశ్పాండే గారు “గోదావరి వరదలు ప్రకృతి విపత్తే” అంటూ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఈ వివరణ చివర్లో కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్ ఇన్ చీఫ్ లు శ్రీ బి హరిరామ్ & శ్రీ నల్ల వెంకటేశ్వర్లు గార్లకు దేశ్పాండే గారు కృతజ్ఞతలు కూడా చెప్పారు. కాబట్టి ఈ వివరణకు మరింత ప్రాధాన్యత ఉంది. దేశ్పాండే గారి వివరణలపై టిజేఏసి స్పందన ఇది. మొదట 15.07.2022 నాడు tjac లేవనెత్తిన అంశం, తరువాత దేశ్పాండే గారి వివరణ, ఆపై tjac స్పందన వరుసగా ఇచ్చాము. మొత్తం చదివిన తరువాత, కాళేశ్వరం పంపుహౌసుల మునకకు…
కాంగ్రెస్ వైపు ఆశగా అన్నదాతలు..! రైతులను రాజులను చేస్తామని అధికారంలోకి వచ్చింది తడవు ఇప్పటివరకు అదే డైలాగ్ తో అన్నదాతలను నమ్మబలుకుతు వస్తోన్న తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నదాతలను నట్టేట్టా ముంచేస్తున్నాడన్న విమర్శలు ఉన్నాయి. 2018ముందస్తు ఎన్నికల్లో రైతు బంధు పథకం, రైతు రుణమాఫీ అంటూ అన్నదాతల మెప్పు పొందిన గులాబీ అధినేత అధికారంలోకి వచ్చాక రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాలయాపన చేస్తున్నారు. నిధుల కటకట కొనసాగుతూ ఉండటంతో రైతు బంధు సకాలంలో అందటం లేదు. ఇక, రైతు రుణమాఫీ చేస్తామని మూడేళ్ళుగా ఊరిస్తునే ఉన్నారు. కాని హామీని నెరవేర్చడం లేదు. దీంతో రుణమాఫీ అవుతుందని గంపెడు ఆశలు పెట్టుకున్న తెలంగాణ రైతాంగానికి బ్యాంక్ సిబ్బంది నుంచి వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. చేసిన అప్పుకు వడ్డీ అంతకంతకు పెరగడంతో రైతులు ఎం చేయాలో తోచక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు…
గత ఎన్నికల్లో చంద్రబాబును బూచిగా చూపి సెంటిమెంట్ ను మరోసారి రగిల్చి టీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకురావడంలో కేసీఆర్ సఫలీకృతమయ్యారు. కాని మరోసారి తెలంగాణ , ఆంధ్ర అనే సెంటి మెంట్ పునరావృత్తమయ్యే అవకాశం లేదు. పైగా , ప్రతిపక్షాలు మంచి టచ్ లో కనిపిస్తున్నాయి. దీంతో కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కావాలని కేంద్ర దర్యాప్తు సంస్థల గురించి కేసీఆర్ తరుచుగా వివాదాస్పదంగా మాట్లాడుతున్నారని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. కేంద్రం దూకుడుగా వ్యవహరించి ఈడీ, సీబీఐ లను రంగంలోకి దించిన పక్షాన తెలంగాణపై కేంద్రం పెత్తనమంటూ రివర్స్ లో నరుక్కురావాలని పీకే వ్యూహంలో భాగంగా కేంద్రంపై కేసీఆర్ కాలు దువ్వుతున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల అవినీతి జరిగిందని.. ఇందులో కల్వకుంట్ల ఫ్యామిలీకు ముడుపులు అందాయని బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి…