Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    శ్రీరామనవమి కళ్యాణంలో ‘లంకా దహనం’ చేసింది ఎవరు?

    March 30, 2023

    శ్రీరామ నవమి రోజు ‘దాసరా’ను చూపిన గొప్ప సినిమా (సమీక్ష)

    March 30, 2023

    ఇద్దరు మంత్రులు, 25 ఎమ్మెల్యేలపై వేటుకు కేసీఆర్ నిర్ణయం..?

    March 30, 2023
    Facebook Twitter Instagram
    Polytricks.inPolytricks.in
    • POLYTRICKS
    • AndhraPradesh
    • Telangana
    • CONTACT
    Facebook Twitter Instagram YouTube WhatsApp
    SUBSCRIBE
    • Home
    • Telangana
    • AndhraPradesh

      శ్రీరామనవమి కళ్యాణంలో ‘లంకా దహనం’ చేసింది ఎవరు?

      March 30, 2023

      శ్రీరామ నవమి రోజు ‘దాసరా’ను చూపిన గొప్ప సినిమా (సమీక్ష)

      March 30, 2023

      ఇక నుంచి ప్రతి నెల కరెంట్ చార్జీల పెంపు

      March 30, 2023

      ఇకనుంచి ఇంట్లో ఉండి ఓటు వేయవచ్చా?

      March 29, 2023

      నాటి దృతరాష్ట్రుడికి 101 పిల్లలు, నేటి దృతరాష్ట్రుడికి 550 పిల్లలా?

      March 29, 2023
    • News
      1. AndhraPradesh
      2. Telangana
      3. CinemaPolytricks
      4. View All

      శ్రీరామనవమి కళ్యాణంలో ‘లంకా దహనం’ చేసింది ఎవరు?

      March 30, 2023

      శ్రీరామ నవమి రోజు ‘దాసరా’ను చూపిన గొప్ప సినిమా (సమీక్ష)

      March 30, 2023

      ఇక నుంచి ప్రతి నెల కరెంట్ చార్జీల పెంపు

      March 30, 2023

      ఇకనుంచి ఇంట్లో ఉండి ఓటు వేయవచ్చా?

      March 29, 2023

      శ్రీరామనవమి కళ్యాణంలో ‘లంకా దహనం’ చేసింది ఎవరు?

      March 30, 2023

      శ్రీరామ నవమి రోజు ‘దాసరా’ను చూపిన గొప్ప సినిమా (సమీక్ష)

      March 30, 2023

      ఇద్దరు మంత్రులు, 25 ఎమ్మెల్యేలపై వేటుకు కేసీఆర్ నిర్ణయం..?

      March 30, 2023

      టీడీపీలోకి ఇందిరా శోభన్..?

      March 30, 2023

      శ్రీరామనవమి కళ్యాణంలో ‘లంకా దహనం’ చేసింది ఎవరు?

      March 30, 2023

      శ్రీరామ నవమి రోజు ‘దాసరా’ను చూపిన గొప్ప సినిమా (సమీక్ష)

      March 30, 2023

      ప్రముఖ హీరోయిన్ తాప్సిని పోలీసులు అరెస్ట్ చేయడానికి రంగం సిద్దం?

      March 29, 2023

      అంత మాట అనేశాడా..? దేవి నాగవల్లికి విశ్వక్ సేన్ దారుణమైన కౌంటర్..?

      March 29, 2023

      శ్రీరామనవమి కళ్యాణంలో ‘లంకా దహనం’ చేసింది ఎవరు?

      March 30, 2023

      శ్రీరామ నవమి రోజు ‘దాసరా’ను చూపిన గొప్ప సినిమా (సమీక్ష)

      March 30, 2023

      ఇద్దరు మంత్రులు, 25 ఎమ్మెల్యేలపై వేటుకు కేసీఆర్ నిర్ణయం..?

      March 30, 2023

      ఐపీఎల్ కు ధోని రిటైర్మెంట్ ..?

      March 30, 2023
    • Contact
    Polytricks.inPolytricks.in
    Home » కాళేశ్వరం పంప్ హౌసుల మునక డిజైన్ వైఫల్యమే. ఇవిగో ఆధారాలు
    Telangana

    కాళేశ్వరం పంప్ హౌసుల మునక డిజైన్ వైఫల్యమే. ఇవిగో ఆధారాలు

    ADMINBy ADMINJuly 30, 2022Updated:July 30, 2022No Comments21 Mins Read
    Facebook Twitter WhatsApp Pinterest LinkedIn Tumblr Reddit Email VKontakte
    Share
    Facebook Twitter WhatsApp LinkedIn Email

    కాళేశ్వరం పంప్ హౌసుల మునక డిజైన్ వైఫల్యమే… ఇవిగో ఆధారాలు

    తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ

    “గోదావరి వరదలు ప్రకృతి విపత్తే”

    అంటున్న శ్రీ శ్రీధర్ రావ్ దేశ్పాండే గారి వివరణలకు tjac స్పందన..

    కాళేశ్వరం పంప్ హౌసుల మునకపై 15.07.2022 నాడు టి‌జే‌ఏ‌సి లేవనెత్తిన కీలక అంశాలపై శ్రీ శ్రీధర్ రావు దేశ్పాండే గారు “గోదావరి వరదలు ప్రకృతి విపత్తే” అంటూ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఈ వివరణ చివర్లో కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్ ఇన్ చీఫ్ లు శ్రీ బి హరిరామ్ & శ్రీ నల్ల వెంకటేశ్వర్లు గార్లకు దేశ్పాండే గారు కృతజ్ఞతలు కూడా చెప్పారు. కాబట్టి ఈ వివరణకు మరింత ప్రాధాన్యత ఉంది.

    దేశ్పాండే గారి వివరణలపై టి‌జే‌ఏ‌సి స్పందన ఇది. మొదట 15.07.2022 నాడు tjac లేవనెత్తిన అంశం, తరువాత దేశ్పాండే గారి వివరణ, ఆపై tjac స్పందన వరుసగా ఇచ్చాము. మొత్తం చదివిన తరువాత, కాళేశ్వరం పంపుహౌసుల మునకకు పూర్తి స్థాయి డిజైన్ వైఫల్యంతో పాటు మనకు రెండు ప్రధాన కారణాలు బోధపడతాయి: 1. సెంట్రల్ వాటర్ కమిషన్ (cwc) కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ కు సంబంధించి జారీచేసిన స్పష్టమైన ఆదేశాలను పాటించక పోవడం 2. కనీస అవగాహన, జాగ్రత్తలు లేకుండా వేలకోట్ల విలువైన నిర్మాణాలను చేపట్టడం.

    *tjac లేవనెత్తిన అంశం-1:*
    కనీస ఇంజనీరింగ్ పరిజ్ఞానం…నాణ్యత లేకుండా కట్టిన “కాళేశ్వరం” ప్రాజెక్టు డొల్లతనం ఒక్కవరదతో బయటపడింది…

    ఇరిగేషన్ ప్రాజెక్టుల డిజైన్ కు సెంట్రల్ వాటర్ కమిషన్ (cwc) నిర్దేశించిన స్థాయి వరద రాకుండానే రెండు పంపు హౌసులు(అన్నారం, మెడిగడ్డ) పూర్తిగా మునిగిపోయాయి…కోట్ల రూపాయల ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరైంది… సెంట్రల్ వాటర్ కమిషన్ గోదావరిపై నిర్మాణాలకు నిర్దేశించిన డిజైన్ ప్రవాహ అంచనాలతో, నాణ్యతా ప్రమాణాలతో నిర్మాణం జరిగితే ఈ పరిస్థితి వచ్చేది కాదు…

    *దేశ్పాండే గారి వివరణ :*

    ఈ సంవత్సరం సంభవించినది 500 సంవత్సరాలకు ఒకసారి (500 years frequency flood ) వరద అన్న సంగతి మరచిపోయి చేస్తున్న విమర్శ తప్ప మరొకటి కాదు. కేంద్ర జల సంఘం వారు 30.10.2017 న కాళేశ్వరం ప్రాజెక్టుకు hydrology క్లియరెన్స్ ఇచ్చినప్పుడు వారు అంచనా కట్టిన 500 years frequency flood పరిమాణం 81,576 క్యూమెక్కులు. అనగా 28,80,829 క్యూసెక్కులు. కాళేశ్వరం బ్యారేజి ఈ వరదను తట్టుకునే విధంగానే డిజైన్ చేయడం జరిగింది. బ్యారేజి నిర్మాణం వలన వచ్చే afflux ను కూడా పరిగణనలోకి తీసుకొని 85 గేట్లు అమర్చడం జరిగింది. కేంద్ర జల సంఘం 1986 లో కాళేశ్వరం వద్ద నమోదు చేసిన అత్యున్నత వరద మట్టం (high flood level ) 107.05 మీటర్లు. ఈ మట్టాన్ని పరిగణలోకి తీసుకొని, బ్యారేజి యొక్క కంట్రోల్ లెవెల్స్(frl, gate hoisting level, bridge level మొదలైనవి నిర్ధారించడం జరిగింది. కరకట్టల నిర్మాణం, పంప్ హౌజ్ ల నిర్మాణం చేయడం జరిగింది. కేంద్ర జల సంఘం ప్రమాణాల ప్రకారం గోదావరి నదిలో కాళేశ్వరం వద్ద నది వరద మట్టం 103.5 మీటర్లు ఉంటే అది వార్నింగ్ లెవెల్ గా పరిగణిస్తారు. నది 104.75 మీటర్ల మట్టం వద్ద ప్రవహిస్తుంటే అప్పుడు డేంజర్ లెవెల్ దాటిందని చెప్పవచ్చు.

    కాళేశ్వరం వద్ద గోదావరి వరద మట్టం 1986 లో నమోదు అయిన hfl కు మించి 108.19 మీటర్లు 14.7.22 న నమోదు అయ్యింది. జులై 13-14 తేదీల్లో నమోదు అయిన వరద పరిమాణం 28 – 29 లక్షల క్యూసెక్కులకు పైగా ఉందని ఆంచనా కట్టారు. ఇవి తెలంగాణ ఇంజనీర్లు నమోదు చేసినవి కావు, కేంద్ర జల సంఘం వారు నమోదు చేసినవని గమనించాలి. ఈ అసాధారణ వరద పరిస్థితి ఏర్పడిన కారణంగానే కన్నేపల్లి పంప్ హౌజ్ నీట మునిగిపోయింది తప్ప ఇందులో నాణ్యతా లోపం, డిజైన్ లోపం ఎక్కడ ఉన్నదో ఈ పత్రం రాసిన ఇంజనీరింగ్ నిపుణులకే తెలియాలి. ఇది పూర్తిగా ప్రకృతి విపత్తు అని స్పష్టంగా తెలిసి పోతున్నా సమస్యను ఒక రాజకీయ పార్టీ లాగా రాజకీయ కోణంలో విమర్శించడం tjac చేయవలసిన పని కాదు.

    *టి‌జే‌ఏ‌సి స్పందన:*

    దేశ్పాండే గారు రాసిన సమాధానంలోనే ఇంజనీరింగ్ పై కనీస అవగాహన లేక మేడిగడ్డ (కన్నేపల్లి) పంప్ హౌస్ మునిగిపోయిందనేది ఉంది. అదెలాగో చూద్దాం. అయితే ఇక్కడ జరుగుతున్న చర్చ మేడిగడ్డ బ్యారేజీ గురించి కాదు, మునిగిన మేడిగడ్డ (కన్నేపల్లి) పంప్ హౌస్ గురించి…మునకకు దారితీసిన నదీ వరద మట్టాల గురించి…అనే విషయం మరచిపోవద్దు…

    *ఇక దేశ్పాండే గారు చెప్పిన విషయాలు చూద్దాం…*

    • సెంట్రల్ వాటర్ కమిషన్ (cwc) కాళేశ్వరం ప్రాజెక్టుకు నిర్దేశించిన డిజైన్ వరద: 28,80,829 క్యూసెక్కులు.

    • కేంద్ర జల సంఘం 1986 లో కాళేశ్వరం వద్ద నమోదు చేసిన అత్యున్నత వరద మట్టం (high flood level ) 107.05 మీటర్లు.

    • మేడిగడ్డ పంప్ హౌస్ మునిగినప్పుడు (14.7.22) కాళేశ్వరం వద్ద నమోదు అయిన వరద 28 నుండి 29 లక్షల క్యూసెక్కులు.

    • పంప్ హౌస్ మునిగినప్పుడు కాళేశ్వరం వద్ద గోదావరి వరద మట్టం 108.19 మీటర్లు. (వాస్తవానికి 14.07.2022 నాడు మధ్యాహ్నం 3 గంటల వరకు కాళేశ్వరం వద్ద cwc నమోదు చేసిన అత్యధిక వరద మట్టం 107.91మీటర్లు మాత్రమే. అప్పటికే మేడిగడ్డ పంప్ హౌస్ మునిగిపోయింది. అంటే పంప్ హౌస్ మునిగిన సమయానికి వరద మట్టం 107.91 మీటర్ల కన్నా తక్కువ. అయినా దేశ్పాండే గారు పేర్కొన్న వరద మట్టాన్నే పరిగణలోనికి తీసుకుందాం…)

    *ఇక తప్పిదం ఎక్కడ జరిగిందో చూద్దాం…*

    • ఒక్క మాటలో చెప్పాలంటే, కాళేశ్వరం ప్రాజెక్టును 28.80 లక్షల క్యూసెక్కులకు డిజైన్ చేయమని cwc ఆదేశించింది.
    దేశ్పాండే గారి సమాచారం మేరకు మేడి గడ్డ పంప్ హౌస్ మునిగినప్పుడు వచ్చిన వరద 28 నుండి 29 లక్షల క్యూసెక్కులు. అంటే, cwc నిర్దేశించిన డిజైన్ వరద మేరకే వరద వచ్చినప్పుడు, పంప్ హౌస్ మునిగిపోయిందంటే అది డిజైన్ లోపం కాక మరేమిటి?

    • నిజానికి దేశ్పాండే గారి వివరణకు ఇంతకన్నా పెద్ద సమాధానం అవసరం లేదు. కానీ మన కన్సల్టెంట్ల డిజైన్ సామర్ధ్యం ఏమేరకు ఉందో మరింత వివరంగా చూద్దాం…

    • cwc కాళేశ్వరం నిర్మాణాలను 500 సంవత్సరాల వరదకు డిజైన్ చేయమంటే… వీళ్ళు 100 ఏళ్ల వరదకు కూడా పంప్ హౌసులు డిజైన్ చేయలేదు. అదే కొంప ముంచింది. అదెలా అంటే…

    • 1986 లో కాళేశ్వరం వద్ద వచ్చిన వరద సుమారు 18 లక్షల క్యూసెక్కులు. cwc అంచనాల మేరకు కాళేశ్వరం వద్ద 100 ఏళ్ల వరద 23.23 లక్షల క్యూసెక్కులు. అంటే కాళేశ్వరం వద్ద 1986లో నమోదైన వరద, గోదావరిపై 100 సంవత్సరాల వరద అంచనా కన్నా తక్కువ.

    • 1986 లో 18 లక్షల క్యూసెక్కులకు కాళేశ్వరం వద్ద రికార్డయిన నీటి మట్టం 107.05 మీటర్లు.

    • ప్రస్తుతం, అంటే 14.07.22 నాడు నమోదైన నీటి మట్టం: 108.29 మీటర్లు

    • అంటే, ప్రస్తుతం వచ్చిన వరద, 1986 లో వచ్చిన వరద కన్నా అదనంగా ప్రవహించిన ఎత్తు కేవలం 1.24 మీటర్లు మాత్రమే…

    • cwc 500 ఏళ్ల వరదకు, అంటే 28.80 లక్షల క్యూసెక్కులకు డిజైన్ చేయమంటే మనవాళ్లు చేయలేదు సరికదా… కనీసం 100 సంవత్సరాల వరదకు (23.23 లక్షల క్యూసెక్కులు) కూడా డిజైన్ చేయలేదు. చివరికి 1986 లో వచ్చిన 18 లక్షల క్యూసెక్కుల వరదకు నమోదైన వరద మట్టం కన్నా కేవలం 1.24 మీటర్ ఎక్కువ ఎత్తులో నీళ్ళు ప్రవహించేసరికి పంప్ హౌస్ మునిగిపోవడం అంటే దాన్ని ఇంజనీరింగ్ అద్భుతం అందామా…? లేక భారీ ఇంజనీరింగ్ తప్పిదం అందామా…?

    • ఇంజనీరింగ్ పదాలు కాసేపు పక్కకు పెట్టండి…మీరు మీ ఇంటిని చెరువును ఆనుకొని నిర్మిస్తున్నారనుకుందాం…చెరువులో వర్షాకాలం నీళ్ళ లెవెల్ ఎంత ఉంటుందో చూసి, మీరు కనీసం రెండు…మూడు మీటర్ల ఎత్తుకు మీ ఇంటి బేస్ మెంట్ నిర్మిస్తారు. లేకుంటే ఏ మాత్రం వరదలోచ్చినా, ఇల్లు మునిగిపోతుంది. ఇలా కనీసం 2-3 మీటర్ల ఎత్తులో కట్టుకోడానికి ఇంజనీరింగ్ పరిజ్ఞానం అవసరం లేదు.

    • చిన్న ఇంటినే మనం అంత జాగ్రత్తగా కనీసం 2 నుండి 3 మీటర్ల ఎత్తుకు నిర్మించుకుంటుంటే, కాళేశ్వరం లాంటి వేల కోట్ల ప్రాజెక్టును, అదీ రెండు, మూడేళ్ళకోసారి ఉగ్ర రూపం దాల్చే గోదావరీ నదీ ఒడ్డున, నిర్మించేటప్పుడు డిజైన్ పరంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి… గతంలో వచ్చిన నీటిమట్టం కన్నా ఒక్క మీటరు ఎత్తుకు వరద వస్తే పంప్ హౌస్ మునిగిపోవడం మీకు “అద్భుతం” అనిపిస్తుందా?

    • అంటే మన పంప్ హౌసులు 1986 వరదకు కూడా డిజైన్ చేయలేదని స్పష్టమౌతుంది. ఎందుకంటే, 1986 నాటి వరదకు అఫ్లక్స్ (afflux), బ్యాక్ వాటర్ (back-water), ఆలాగే వివిధ కట్టడాలకు అవసరమైన కనీస అదనపు ఎత్తు (free board) లాంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నా పంప్ హౌస్ మునగదని స్పష్టమౌతున్నది.

    • మరోవైపు cwc 28,80,829 క్యూసెక్కుల వరదకు కాళేశ్వరం నిర్మాణాలు డిజైన్ చేయాలని స్పష్టం చేసింది. అంటే, 1986 వరదతో పోలిస్తే కనీసం 60% ఎక్కువ. cwc మాట విని ఈ వరదకు పంప్ హౌస్ నిర్మాణాలను, లెవెల్స్ ను డిజైన్ చేసివుంటే మేడిగడ్డ పంప్ హౌస్ కు జీవిత కాలంలో ముంపు అనే మాట ఉండేది కాదు.

    • ఇప్పటికే తప్పుడు డిజైన్ తో నిర్మాణం పూర్తయ్యింది కాబట్టి, మన “సలహాదారులు” చెప్పినట్టు జీవితకాలం ముంపులు… మనకు తిప్పలు… తప్పేలా లేవు….

    *tjac లేవనెత్తిన అంశం-2:*

    బ్యారేజీల నిర్మాణ ప్రభావం కారణంగా నదీ ప్రవాహ మార్గం కుచించుకు పోతుంది…నదీ ప్రవాహమార్గం తగ్గి పోవడంతో బ్యారేజీల ఎగువన ప్రవాహం ఎత్తు పెరుగుతుంది.. దీన్ని బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ (back water effect) అంటారు…గతంలో వచ్చిన వరద కన్నా తక్కువ స్థాయి వరద వచ్చినా, నది ప్రవహించే ఎత్తు పెరగడానికి ఈ బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ కారణం….పంప్ హౌజుల నిర్మాణానికి ఈ బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ ను పరిగణలోనికి తీసుకోవాలి…ప్రస్తుతం కాళేశ్వరం పంప్ హౌజులు మునిగిపోవడానికి, ఈ బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ పరిగణలోనికి తీసుకోకపోవడం, నాణ్యతాలోపాలే ప్రధాన కారణం…

    రెండవది.. గతంలో కన్నా ఎక్కువ వరద వచ్చిందని కొంత మంది చేస్తున్న వాదన శుద్ద అబద్దం… “గతంలో ఇన్ని లక్షల క్యూసెక్ (cusec) ల ప్రవాహం వచ్చింది…ఇప్పుడు దాన్ని మించి ఇన్ని లక్షల క్యూసేక్ ల నీళ్ళు ప్రవహించాయి….అందుకే పంప్ హౌజులు మునిగిపోయాయి” అనే మాట ప్రజలను పక్క దోవ పట్టించడమే…

    ఎందుకంటే…వరద ప్రవాహం తక్కువగానే ఉన్నా, పైన ఉన్న బ్యారేజీలలోని నీరు ఒకే సారి విడుదల చేయడంతో వచ్చే సమస్య ఇది. ఉదాహరణకు నది లో ఒక క్యూసెక్ నీటి ప్రవాహం ఉంది అనుకుంటే, సెకనుకు ఒక ఘనపుటడుగు (క్యూసెక్) నీరు నదిలో ప్రవహిస్తున్నట్టు…ఈ నీటిని మనం ఒక రిజర్వాయర్ లో రోజంతా నింపితే, ఆ రిజర్వాయర్ లో నీటి నిల్వ 86,400 (1x60x60x 24) ఘనపుటడుగులు ఉంటుంది. ఒక వేళ ఈ రిజర్వాయర్ లో నిల్వ ఉన్న నీటిని, అంటే, మొత్తం 86,400 ఘనపుటడుగులను ఒకే గంటలో విడుదల చేస్తే, నదిలో ప్రవాహం 24 క్యూసెక్ లు గా ఉంటుంది. అంటే సెకనుకు 24 ఘనపుటడుగుల చొప్పున గంటలో మొత్తం రిజర్వాయర్ లోని 86,400 (24x60x60) ఘనపుటడుగుల నీరు నదిలో ప్రవహిస్తుంది. అంటే సాధారణ ప్రవాహం 1 క్యూసెక్ కాగా, మనం నిలువ చేసి, ఒకేసారి నీటిని విడుదల చేయడంతో ఈ ప్రవాహం 24 క్యూసెక్ లుగా మారింది….ఇప్పుడు వస్తున్న వరదనీటి పరిమాణం గతం కన్నా తక్కువగా ఉన్నా, మనం రిజర్వాయర్లలో నిలువ ఉంచి ఒకేసారి వదులుతున్న నీటి పరిమాణం ఎక్కువ ఉండడంతో, గతం కన్నా వరద ఎక్కువ ఉన్నట్టు కనబడుతున్నది…ఇది రిజర్వాయర్ల, వరద ప్రవాహ నిర్వహణకు సంబంధించిన అంశం…పై ప్రాంతాల నుండి ఎంత ప్రవాహం వస్తున్నది అనే అంచనాలను బట్టి, మన రిజర్వాయర్లలో ఎంత నీరు నిల్వ ఉంచుకోవాలి, ముందే ఎంత నీటిని వదలాలి…అని ప్రణాళికలు ముందే సిద్దం చేసుకోవాలి…. క్యూసెక్ లకు, ఘనపుటడుగులకు మధ్య ప్రజలను గందరగోళం చేసే ప్రయత్నం కనబడుతుంది…

    *దేశ్పాండే గారి వివరణ :*

    డ్యాములకు, బ్యారేజిలకు తేడా తెలియని ఈ tjac ఇంజనీరింగ్ నిపుణులు ఎవరో కాకి లెక్కలు కట్టి బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ ను పరిగణనలోకి తీసుకోలేదు అని చెప్పి ప్రజలను గందరగోళ పరిచే ప్రయత్నం చేస్తున్నారు. డ్యాంలను, బ్యారేజీలను డిజైన్ చేసేటప్పుడు తప్పనిసరిగా బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ (afflux) లెక్క గట్టి ఆ ప్రభావాన్ని కూడా తగ్గించే విధంగానే గేట్ల సంఖ్యను నిర్ధారిస్తారు. డ్యాంల కైతే ఎగువన ఎంత దూరం, ఏ మట్టం వరకు నీరు చేరుతుందో లెక్కగట్టి రక్షణ చర్యలు తీసుకుంటారు. మేడిగడ్డ వద్ద నిజానికి 81,576 క్యూమెక్కుల వరదకు లెక్క గట్టిన గేట్ల సంఖ్య 77 మాత్రమే. కానీ అక్కడ అమర్చిన గేట్ల సంఖ్య 85. ఎందుకంటే afflux ను నివారించడానికే అన్న సంగతి గమనించాలి. డ్యాంలు నీటి నిల్వ కోసం నిర్మిస్తారు. డ్యాంలో ప్రధానంగా నీటి నిల్వ కాంక్రీట్ గోడ ద్వారా జరుగుతుంది. కొద్ది పరిమాణంలో గేట్లు కూడా నిల్వ చేస్తాయి. బ్యారేజీలు నీటిని మళ్లించే diversion structures. నీటి నిల్వ మొత్తం గేట్ల ద్వారానే జరుగుతుంది. అయితే వరదల సందర్భంగా బ్యారేజి గేట్లు పూర్తిగా తెరచి free flow condition లోనే ఉంచుతారు.

    ఇక వారు వివరించిన పరిస్థితి డ్యాముల్లో ఉంటుంది తప్ప బ్యారేజీల్లో ఉండదు. వరద సమయంలో బ్యారేజి గేట్లు పూర్తిగా ఎత్తి వేసి free flow condition లో ఉంచుతారు కాబట్టి బ్యారేజి లేనప్పుడు నది ఏ విధంగా ప్రవహిస్తుందో అదే విధంగా ప్రవహిస్తుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజిలని జూలై నెల ప్రారంభం నుంచే free flow condition లోనే ఉంచారు ఇంజనీర్లు. బ్యారేజిలు ఈ స్థితిలో ఉన్నప్పుడు బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ అనేది ఉండే ఆస్కారమే లేదు. అయితే నదిలో నీటి మట్టం ఎందుకు పెరుగుతుంది అన్నది ప్రశ్న.1986 లో గోదావరిపై ఏ బ్యారేజి లేదు. అయినా వరద మట్టం 107.05 మీటర్లకు చేరింది కదా. దానికి కారణం ఏమిటంటే.. నదికి ఉండే సహజ ప్రవాహ సామర్థ్యంకు మించి నీరు నదిలోకి వస్తే నదిలో నీటి మట్టం పెరుగుతుంది. ఒడ్డును దాటి ప్రవహిస్తుంది.100 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యం ఉన్న కాలువలో 200 క్యూసెక్కులు వదిలితే ఏమవుతుంది? నీరు కాలువ గట్లను దాటుకొని ప్రవహిస్తుంది. ఇదీ అటువంటిదే. ఈ స్థితి కొన్ని గంటలు ఉండవచ్చు, కొన్ని రోజులు ఉండవచ్చు. ఇది ఎగువన కురుస్తున్న వర్షపాతంపై ఆధారపడి ఉంటుంది. జూలై 13,14 తేదీల్లో కాళేశ్వరం సంగమం వద్ద గోదావరి నుంచి ప్రాణహిత నుంచి వస్తున్న వరద 29 లక్షలకు పైబడి ఉన్నది. ఇంత వరద సామర్థ్యాన్నితరలించే విస్తీర్ణం గోదావరి నది గర్భంలో లేదు కాబట్టే నది మట్టం 108 మీటర్ల పైన చేరింది. అప్పుడు కూడా మేడిగడ్డ బ్యారేజి free flow condition లోనే ఉంది. కాబట్టి బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ ను పరిగణనలోకి తీసుకోలేదు అన్నది పస లేని, river hydraulics పై అవగాహన లేకుండా చేసిన వాదన. వారు ప్రస్తావించిన బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ అనేది storage reservoirs కి వర్తిస్తుంది కానీ వరద కాలంలో free flow condition లో ఉండే బ్యారేజిలకు వర్తించదు.

    పోలవరం బ్యారేజి కాదు. అది స్టోరేజ్ రిజర్వాయర్. పోలవరం మొత్తం నిల్వ సామర్థ్యం (gross storage) 194 టిఎంసిలు. జలాశయం నుంచి కాలువల్లోకి వాడుకోగలిగే నీటి నిల్వ(live storage) 75 టిఎంసి లు. మిగతా నీరు అంటే .. 119 టిఎంసిలు ఎప్పుడు డ్యాంలో నిలువ ఉంటాయి. దీన్ని డెడ్ స్టోరేజ్ అంటారు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న వాతావరణ మార్పులను (climatic changes), ఈ ఏడు వచ్చిన వరద పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావాలను (back water effects) అధ్యయనం చేయాలని, తదనుగుణంగా గోదావరి తీర ప్రాంతాల రక్షణకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ డిమాండ్ చేస్తున్నది.


    ఇకపోతే గోదావరి నది వరదతో ఉదృతంగా ప్రవహిస్తున్న సమయంలో చిన్న చిన్న వాగులను తనలో కలువనివ్వదు. దాని వల్ల వాగు ఎగువకు నీరు ఎగదన్నుతుంది. అన్నారం బ్యారేజి మునిగిపోవడానికి ఇదే కారణం. గోదావరికి కుడి వైపు నుంచి వచ్చే చందనాపూర్ వాగు ఉదృతంగా ప్రవహిస్తున్న గోదావరిలో కలువక పైకి ఎగదన్ని అన్నారం పంప్ హౌజ్ రక్షణ కోసం నిర్మించిన మట్టికట్ట పైనుంచి ప్రవహించి అన్నారం పంప్ హౌజ్ మునకకు కారణం అయ్యింది. చందనాపూర్ వాగులో ఈ స్థాయిలో afflux రావడం గతంలో ఎప్పుడూ లేదు. 0.5 మీటర్లకు మించని afflux ఈ సారి 1.5 – 2 మీటర్లకు దాకా పెరిగింది. అదే విధంగా బొక్కలవాగు పైకి ఎగదన్ని మంథని పట్టణాన్ని ముంచేసింది. ఈ సంగతులు river hydraulics పై అవగాహన ఉన్న ఇంజనీర్లు మాత్రమే కాదు ఏ మాత్రం విజ్ఞత ఉన్న వారైనా అర్థం చేసుకోగలరు. tjac తరపున ఈ పత్రం రాసిన పెద్ద మనిషికి మాత్రం అర్థం అయినట్టు లేదు. ఆ జ్ఞాన సంపన్నుడు ఎవరో తెలిస్తే మా లాంటి వారం వినమ్రంగా ఒక నమస్కారం చేసుకుంటాము.

    *tjac స్పందన:*

    “డ్యాములకు, బ్యారేజిలకు తేడా తెలియని ఈ tjac ఇంజనీరింగ్ నిపుణులు ఎవరో కాకి లెక్కలు కట్టి బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ ను పరిగణనలోకి తీసుకోలేదు అని చెప్పి ప్రజలను గందరగోళ పరిచే ప్రయత్నం చేస్తున్నారు” అని దేశ్పాండే గారి అభిప్రాయం. నిజమే… డ్యాములైనా, బ్యారేజిలైనా…ప్రజలకు మేలు చేయడానికి గానీ, ముంచడానికి కాదనే ఒక్క విషయమే మాకు తెలుసు… ముంచడంలో పరిజ్ఞానం మాకు లేదని సవినయంగా ఒప్పుకుంటున్నాము.

    బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ గురించి దేశ్పాండే గారు ఏమన్నారో చూడండి… “… కాబట్టి బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ ను పరిగణనలోకి తీసుకోలేదు అన్నది పస లేని, river hydraulics పై అవగాహన లేకుండా చేసిన వాదన. వారు ప్రస్తావించిన బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ అనేది storage reservoirs కి వర్తిస్తుంది కానీ వరద కాలంలో free flow condition లో ఉండే బ్యారేజిలకు వర్తించదు” అని దేశ్పాండేగారు సెలవిచ్చారు.

    బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ వరద సమయంలో బ్యారేజీ గేట్లు మొత్తం ఎత్తినప్పుడు “free flow condition” లో ఉండదన్న దేశ్పాండే గారి వాదన సరిగాదు. గేట్లు ప్రవాహానికి అడ్డు లేకున్నా, బ్యారేజీ నిర్మించిన ప్రాంతంలో పిల్లర్లు (piers), గైడ్ బండ్స్, మట్టికట్టలు, ఇతర నిర్మాణాల కారణంగా నదీ ప్రవాహమార్గం కుచించుకు పోతుంది. గేట్లు ఎత్తివున్నా పైనుండి వచ్చిన వరద మొత్తం ఈ తక్కువ ప్రాంతంనుండి ప్రవహించాలి. దీనివల్ల బ్యారేజీ ఎగువన నదీ నీటిమట్టాలు పెరుగుతాయి. కాబట్టి గేట్లు పూర్తిగా ఎత్తినప్పుడు బ్యారేజీలలో బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ ఉండదు అనడం సరిగాదు. ఒక్క సారి దేశ్పాండే గారు మేడిగడ్డ బ్యారేజీ వద్ద వరద సమయంలో గేట్లు ఎత్తినప్పుడు ఉన్న ప్రవాహ వైశాల్యాన్ని, అదే సమయంలో బ్యారేజీ ఎగువకు ఉన్న నదీ ప్రవాహ వైశాల్యంతో పోల్చిచూస్తే విషయం స్పష్టమౌతుంది. డిజైన్ వరదకు బ్యారేజీల బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ లెక్క కట్టేటప్పుడు క్రిటికల్ (critical), సబ్-క్రిటికల్ (sub-critical), మిక్స్డ్ ఫ్లో (mixed-flow) కండిషన్లకు, బ్యారేజీ గేట్లు పూర్తిగా ఎత్తివేసివున్నప్పుడు అంటే free flow condition లో లెక్కకట్టాలి అనే విషయం దేశ్పాండే గారికి తెలియక పోవడం ఆశ్చర్యమే!

    ఇక పంప్ హౌసులు మునగడానికి దేశ్పాండే గారు ఇచ్చిన వివరణ కనీస ఇంజనీరింగ్ పరిజ్ఞానం లేకుండా కాళేశ్వరం నిర్మాణం జరిగిందని మరోమారు స్పష్టం చేస్తున్నది.

    “1986 లో గోదావరిపై ఏ బ్యారేజి లేదు. అయినా వరద మట్టం 107.05 మీటర్లకు చేరింది కదా. దానికి కారణం ఏమిటంటే.. నదికి ఉండే సహజ ప్రవాహ సామర్థ్యంకు మించి నీరు నదిలోకి వస్తే నదిలో నీటి మట్టం పెరుగుతుంది. ఒడ్డును దాటి ప్రవహిస్తుంది.100 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యం ఉన్న కాలువలో 200 క్యూసెక్కులు వదిలితే ఏమవుతుంది? నీరు కాలువ గట్లను దాటుకొని ప్రవహిస్తుంది. ఇదీ అటువంటిదే. ఈ స్థితి కొన్ని గంటలు ఉండవచ్చు, కొన్ని రోజులు ఉండవచ్చు. ఇది ఎగువన కురుస్తున్న వర్షపాతంపై ఆధారపడి ఉంటుంది. జూలై 13,14 తేదీల్లో కాళేశ్వరం సంగమం వద్ద గోదావరి నుంచి ప్రాణహిత నుంచి వస్తున్న వరద 29 లక్షలకు పైబడి ఉన్నది. ఇంత వరద సామర్థ్యాన్నితరలించే విస్తీర్ణం గోదావరి నది గర్భంలో లేదు కాబట్టే నది మట్టం 108 మీటర్ల పైన చేరింది.”

    దేశ్పాండే గారు… ఒక చిన్న విషయం చెప్పండి… 1986 లో 107.05 మీటర్లు ( అంటే 18 లక్షల క్యూసెక్కులకే) వచ్చిందని మీరే సెలవిచ్చారు. అలాగే cwc కాళేశ్వరం నిర్మాణాలు 28.8 లక్షల క్యూసెక్కులకు డిజైన్ చేయాలని ఆదేశించిందని కూడా మీరే చెప్పారు. 18 లక్షల క్యూసెక్కులకు కాళేశ్వరం వద్ద 107.05మీటర్ల ఎత్తులో నది పారితే, 28.80 లక్షల క్యూసెక్కులకు నది ఎంత ఎత్తులో పారుతుంది…? అని ఒక్కసారి ఆలోచించినా నది పంప్ హౌసు లోపలికి ప్రవేశించకుండే.. అవి మునగకపోతుండే…అవునా…

    *ఇక అన్నారం ముంపు గురించి…*

    అన్నారం పంప్ హౌస్ మునకకు దేశ్పాండే గారి వివరణ చూడండి…
    “ఇకపోతే, గోదావరి నది వరదతో ఉదృతంగా ప్రవహిస్తున్న సమయంలో చిన్న చిన్న వాగులను తనలో కలువనివ్వదు. దాని వల్ల వాగు ఎగువకు నీరు ఎగదన్నుతుంది. అన్నారం బ్యారేజి మునిగిపోవడానికి ఇదే కారణం. గోదావరికి కుడి వైపు నుంచి వచ్చే చందనాపూర్ వాగు ఉదృతంగా ప్రవహిస్తున్న గోదావరిలో కలువక పైకి ఎగదన్ని అన్నారం పంప్ హౌజ్ రక్షణ కోసం నిర్మించిన మట్టికట్ట పైనుంచి ప్రవహించి అన్నారం పంప్ హౌజ్ మునకకు కారణం అయ్యింది. చందనాపూర్ వాగులో ఈ స్థాయిలో afflux రావడం గతంలో ఎప్పుడూ లేదు. 0.5 మీటర్లకు మించని afflux ఈ సారి 1.5 – 2 మీటర్లకు దాకా పెరిగింది.”

    దేశ్పాండే గారూ…నది ఉదృతంగా ప్రవహిస్తున్నప్పుడు చిన్న వాగులను తనలో కలవనివ్వదు…దాని వల్ల వాగు ఎగువకు నీరు ఎగదన్నుతుంది అని చిన్నపిల్లలను అడిగినా చెబుతారు. కానీ మన డిజైన్ కన్సల్టెంట్లకు తెలియకపోవడమే విషాదం…

    ఇక మీరు చెప్పిన రెండో విషయం… “చందనాపూర్ వాగులో ఈ స్థాయిలో afflux రావడం గతంలో ఎప్పుడూ లేదు. 0.5 మీటర్లకు మించని afflux ఈ సారి 1.5 – 2 మీటర్లకు దాకా పెరిగింది.” అని అనడం ఎంతవరకూ సమంజసం? అన్నారంలో గతంలో ఈ స్థాయిలో వరదలు రాలేదని ఒప్పుకుందాం. కానీ అన్నారం దగ్గర డిజైన్ ఏ వరదకు చేయాలని cwc ఆదేశించింది? cwc లెక్కల ప్రకారం అన్నారం దగ్గర 100 ఏళ్ల వరద- 11.55 లక్షల క్యూసెక్కులు, 500 ఏళ్ల వరద 14.91 లక్షల క్యూసెక్కులు. ఈ రెండింటినీ కాదని cwc probable maximum flood (pmf) 22.93 లక్షల క్యూసెక్కులకు డిజైన్ చేయమని చెప్పింది. ఎందుకు అంత ఎక్కువ స్థాయిలో వరదను డిజైన్ వరదగా అన్నారం వద్ద తీసుకోవాలో కూడా స్పష్టంగా వివరించింది. ఈ వరద స్థాయి, అన్నారం వద్ద గతంలో వచ్చిన వరదల స్థాయికి అనేక రెట్లు ఎక్కువ. అంటే, cwc అత్యంత ప్రమాదకరమైన వరదలను అన్నారం వద్ద డిజైన్ లో పరిగణలోనికి తీసుకోవాలని ముందే ఆదేశించింది. ఇప్పుడు అన్నారం వద్ద వచ్చిన వరద 15 లక్షల క్యూసెక్కులు. cwc నిర్దేశించిన 22.93 లక్షల క్యూసెక్కుల వరద స్థాయి కన్నా చాలా తక్కువ. అయినా అన్నారం పంప్ హౌస్ ఎందుకు మునిగినట్టు? అంటే డిజైన్ పరంగా cwc ఆదేశాలను బేఖాతరు చేసినట్టేగా… లేక నదిలో నీటిని పరిగణలోకి తీసుకొని, అంత తీవ్రమైన వరదలోనూ వాగునీరు ఎదురు తిరుగుతుందనే విషయం మన కన్సల్టెంట్లు పరిగణలోకి తీసుకోలేదంటారా…అందుకే మేము కనీస ఇంజనీరింగ్ పరిజ్ఞానం లేకుండా కాళేశ్వరం నిర్మాణం జరిగిందని చెప్పేది. ఏ రకంగా చూసినా అన్నారం పంప్ హౌస్ మునకలో పూర్తి డిజైన్ వైఫల్యం కనబడుతున్నది.

    *tjac లేవనెత్తిన అంశం-3:*

    మరో వైపు పంప్ హౌజ్ గేట్లు విరిగి పోయి మేడిగడ్డ పంప్ హౌస్ మునిగితే, దానిని వరద ప్రవాహానికి ముడి పెడుతున్నారు. ఇది నాణ్యతకు సంబంధించిన అంశం…నాణ్యతా లోపాలను ప్రకృతికి ముడిపెట్టడం హాస్యాస్పదం.

    *దేశ్పాండే గారి వివరణ:*

    ఏ నిర్మాణం అయినా దాన్ని డిజైన్ చేసినప్పుడు తీసుకున్న ఒత్తిడికి మించి ఒత్తిడి పెరిగితే విరిగిపోయే అవకాశం ఉంది. 20 మంది కూర్చోవడానికి కట్టిన వేదికల మీద 100 మంది ఎక్కితే వేదికలు కూలిపోయిన ఘటనలు ఎన్ని చూడలేదు! మేడిగడ్డ బ్యారేజీకి 20 కిమీ ఎగువన కన్నెపల్లి వద్ద పంప్ హౌజ్ నిర్మాణం అయ్యింది. పంప్ హౌజ్ fore bay లోకి కూడా hfl ను దాటి నీరు చేరినందున పంప్ హౌజ్ మునిగిపోయింది. పంప్ హౌజ్ రక్షణ గోడ విరిగిందా? ఎంత మేరకు విరిగింది? అనేది నీటిని తోడిన తర్వాత తెలుస్తుంది. ఇది కూడా అసాధారణ వరద ఒత్తిడికి సంభవించిన సంఘటన తప్ప డిజైన్ వైఫల్యం అనడానికి వీలు లేదు.

    2009 లో కృష్ణా నదికి అసాధారణమైన వరదలు వచ్చినప్పుడు శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ కేంద్రం, ఎస్ ఎల్ బి సి సొరంగం, కర్నూలు పట్టణం మునిగిపోయిన వాస్తవం మన ముందు ఉన్నది. శ్రీశైలం డ్యాం డిశ్చార్జ్ కెపాసిటీ frl 885 అడుగుల వద్ద 12 లక్షల క్యూసెక్కులు, mwl 892 అడుగుల వద్ద 13 లక్షల క్యూసెక్కులు. అయితే ఆ ఏడు 25 లక్షల క్యూసెక్కులు శ్రీశైలం డ్యాంకు చేరినాయి. డ్యాం mwl ను దాటి 896 అడుగులకు చేరింది. ఆ అసాధారణమైన పరిస్థితిలో శ్రీశైలం విద్యుత్ కేంద్రం మునకకు డిజైన్ వైఫల్యంమే కారణమని ఎవరైనా అంటే నవ్విపోతారు. ఎస్ ఎల్ బి సి సొరంగంలో తవ్వకాలు జరుపుతున్న టన్నెల్ బోరింగ్ మెషీన్ కూడా ద్వంసం అయ్యింది. దాన్ని బయటకు తీసి మరమ్మతులు చేసి తిరిగి సొరంగంలో ప్రవేశ పెట్టడానికి రెండు సంవత్సరాలు పట్టింది.

    2009 లో శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చిన విపత్తు లాంటిదే ఈ సంవత్సరం కడం ప్రాజెక్ట్ కూడా ఎదుర్కొన్నది. ప్రాజెక్టులో ఏర్పాటు చేసిన మొత్తం 18 గేట్లు తెరిస్తే నదిలోకి పోయే నీరు సుమారు 3 లక్షల క్యూసెక్కులు. జూలై 12,13 తేదీల్లో కడం ప్రాజెక్టు పరీవాహక ప్రాంతంలో కురిసిన అతి భారీ వర్షపాతానికి (40 సెంటీ మీటర్లు) కడం డ్యాం వద్దకు 5 , 6 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. ఈ వరదను నదిలోకి పంపించడానికి ప్రాజెక్టు ఇంజనీర్లు విశ్వ ప్రయత్నం చేసినారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం (frl) 700 అడుగులు ఉంటే డ్యాం డిశ్చార్జ్ సామర్థ్యానికి మించి వరద చేరిన కారణంగా డ్యాంలో నీటి మట్టం ఒక దశలో 705 అడుగుల వరకు పోయింది. ఈ స్థితి మరికొన్ని గంటలు కొనసాగి ఉంటే డ్యాం తెగి పోయే ప్రమాదం సంభవించేది. అదే జరిగి ఉంటే సముద్రం దాకా గోదావరి తీర ప్రాంతాలలో విపరీతమైన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించి ఉండేది. అదృష్టవశాత్తు ప్రకృతి సహకరించింది. ఎగువన వర్షపాతం తగ్గినందున వరద ఉదృతి కూడా తగ్గి డ్యాంలో నీటి మట్టం తగ్గుతూ వచ్చింది. జూలై 14 నాటికి డ్యాం ప్రమాదం నుంచి బయట పడిపోయింది. ఇది కూడా పూర్తి ప్రకృతి విపత్తుగానే పరిగణించాలి. కడెం వరదను అంచనా వేయడంలో ఇంజనీర్లు ఘోరంగా విఫలం అయినారని రాజకీయపరమైన విమర్శలు గుప్పించారు. కడం నదిపై వరదని అంచనా వేయడానికి గేజింగ్ స్టేషన్లు లేవు. కడం నదిలో కలిసే అనేక చిన్నచిన్న వాగుల నుంచి వచ్చే నీరు ఎంతనో డ్యాంను చేరే వరకు అంచనాకు రాదు. సుమారు 2500 చదరపు కిలోమీటర్ల చిన్నపరీవాహక ప్రాంతం నుంచి వచ్చే నీరు కొన్ని గంటల్లోనే కడం డ్యాంను చేరుకుంటాయి. గేజింగ్ స్టేషన్ లు లేకపోవడం వలన వరదను ఖచ్చితంగా అంచనా వేయడానికి ఇంజనీర్లకు సాధ్యం కాదు. ఈ ఏడు సంభవించిన వరదలను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్ లో 5, 6 లక్షల క్యూసెక్కుల వరదను సురక్షితంగా కిందకు పంపడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉన్నది. అట్లాగే కడం డ్యాంకు ఎగువన కుప్టి వద్ద మరో డ్యాం నిర్మాణాన్ని చేపట్టి రెండేండ్లలో పూర్తి చేస్తే కడం వద్ద వరద నియంత్రణ మరింత సులువు అవుతుంది. కుప్టి డ్యాం నిర్మాణానికి గతంలోనే ప్రభుత్వం పరిపాలనా అనుమతి ఇచ్చింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో డ్యాం నిర్మాణాన్ని చేపడతామని బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం హామీ కూడా ఇచ్చింది. కుప్టి ప్రాజెక్టు నిర్మాణం అయితే కడం డ్యాంలోకి ఎంత వరద ఎన్ని గంటల్లో రాబోతున్నది ఖచ్చితంగా తెలుస్తుంది కాబట్టి ఆ వరదను సురక్షితంగా కిందకు పంపించడానికి తగినంత జాగాను (flood cushion) డ్యాంలో ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. డ్యాంలో నీటి మట్టం frl ను దాటకుండా చూసుకోవచ్చు.
    ప్రకృతి విపత్తును అంగీకరించే సౌజన్యం లేని tjac కాళేశ్వరం ప్రాజెక్టుపై గతంలో విషం గక్కినట్టే ఇప్పుడూ అదే పని చేస్తున్నది. ప్రకృతి విపత్తులు సంభవించి నప్పుడు సమాజం అంతా రాజకీయ విభేధాలను పక్కనబెట్టి ఏకతాటి మీద ప్రజలను ఆదుకునే పనిలో నిమగ్నం కావాలి. కానీ tjac ఈ కనీస విజ్ఞతను, సామాజిక బాధ్యతను ప్రదర్శించలేకపోయింది.

    *tjac స్పందన:*

    cwc ఆదేశించిన వరదను పరిగణించకుండా తప్పుడు డిజైన్ చేశారని ఇప్పటికే నిరూపణ చేశాం… 100 మంది కోసం నిర్మించిన వేదిక 20 మంది కూర్చుంటే కూలితేనే సమస్య. కాబట్టి కాంట్రాక్టరు కట్టిన పంప్ హౌస్ లు మునిగితే ప్రకృతిని తప్పుపట్టడంలో అర్ధం లేదు. ఇక నాణ్యత గురించి… cwc నిర్దేశించిన వరద రాకుండానే కాంక్రీట్ రక్షణ గోడ కూలిందనేది వీడియోలు చూస్తే స్పష్టంగా తెలుస్తుంది…ఇది నాణ్యతా లోపం కాకుంటే మరేమిటి? రక్షణ గోడ కూలి నీళ్ళు మేడిగడ్డ పంప్ హౌస్ లోనికి ప్రవేశించాయి కానీ, పైనుంచి ప్రవాహం పంప్ హౌస్ లోనికి ప్రవేశించిందనేది శుద్ద అబద్దం అని వీడియోలలో కనబడుతున్నది. (వీడియో చూడండి)

    ఇక 2009 లో మునిగింది శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ కేంద్రం కాదు. ఇది నదికి ఎడమవైపున ఉంటుంది. మునిగింది శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రం. అప్పుడు వచ్చిన వరద cwc నిర్దేశించిన వరద కన్నా ఎక్కువ వచ్చిందని మీరే ఒప్పుకుంటున్నారు. కాబట్టి అప్పుడు జరిగిన ప్రమాదానికి ఇప్పటి మునకకీ ముడిపెట్టకండి. ఇప్పుడు cwc నిర్దేశించిన ప్రమాణాలను పాటించకపోవడం వల్ల వచ్చిన మునక ఇది. మన కాంట్రాక్టరే శ్రీశైలం డ్యామును నిర్మిస్తే పరిస్తితి ఎలా ఉండేదో ఊహకందదు.

    ఇక కడెం ప్రాజెక్టు సంగతి… అది నిలబడింది అంటే భగవంతుడి దయ అవునో, కాదో మాకు తెలియదు కానీ, పటిష్టమైన డిజైన్, ఇంకా పనులలో నాణ్యత ఆ ప్రాజెక్టును బతికించాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇక మన ప్రాజెక్టుల సంగతా… కాళేశ్వరం లోని ఏ పంప్ హౌస్ వద్ద కూడా cwc నిర్దేశించిన వరద పరిమితులు దాటకున్నా మునిగాయి కాబట్టి, మన మునకలకు డిజైన్, నిర్మాణ వైఫల్యాలే కారణమని ఒప్పుకుందాం.
    ఇక చివర్లో మీరు చెప్పిన మాట… “ప్రకృతి విపత్తును అంగీకరించే సౌజన్యం లేని tjac కాళేశ్వరం ప్రాజెక్టుపై గతంలో విషం గక్కినట్టే ఇప్పుడూ అదే పని చేస్తున్నది. ప్రకృతి విపత్తులు సంభవించి నప్పుడు సమాజం అంతా రాజకీయ విభేధాలను పక్కనబెట్టి ఏకతాటి మీద ప్రజలను ఆదుకునే పనిలో నిమగ్నం కావాలి. కానీ tjac ఈ కనీస విజ్ఞతను, సామాజిక బాధ్యతను ప్రదర్శించలేకపోయింది.” …

    దేశ్పాండే గారూ… నిజాలు చెప్పడమే మా దృష్టిలో విజ్ఞత, ప్రజల పక్షాన నిలబడడమే మా దృష్టిలో సామాజిక బాధ్యత.

    *tjac లేవనెత్తిన అంశం-4:*

    కేవలం భారీ కట్టడాలను చూపించి “ఇంజనీరింగ్” అద్భుతంగా అమాయక ప్రజలను మభ్యపెట్టారు…ఈ ప్రాజెక్టు ఇంజనీరింగ్ అద్భుతం కాదు…భారీ ఇంజనీరింగ్ తప్పిదంగా ఇప్పటికే (2016,2018) టీజేఏసీ శాస్త్రీయంగా వివరిస్తూ పుస్తకాలు అచ్చువేసింది…ఇంకా పొంచివున్న ముప్పులు కూడా వివరించింది…

    ఈ ప్రాజెక్టులో నాణ్యతాలోపాలు, డిజైన్ లోపాలు కోకొల్లలు…వీటిని నిర్లక్ష్యం చేస్తే పర్యవసానాలు ఇంతకన్నా తీవ్రంగా ఉంటాయి…ఇలాంటి ప్రమాదాలు మల్లన్నసాగర్ వంటి భారీ ప్రాజెక్టువద్ద జరిగితే జరిగే ప్రాణ…ఆస్తినష్టాలు అంచనాకందవు…

    ఇప్పటికైనా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యతను, డిజైన్ లోపాలను సమీక్షించి, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఇంజనీరింగ్ నిపుణులతో తక్షణం ఒక కమిటీని వేసి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి…లేకుంటే పాలకుల తప్పులకు తెలంగాణ ప్రజలు మరింత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.

    *దేశ్పాండే గారి వివరణ:*

    tjac ప్రచురించిన “కాళేశ్వరం ఎత్తిపోతల పధకం రీ ఇంజనీరింగ్ – భారీ ఇంజనీరింగ్ తప్పిదం” పుస్తకంలో ప్రస్తావించిన అన్ని అంశాలను పూర్వపక్షం చేస్తూ, వారి వాదనల డొల్ల తనాన్ని ఎత్తి చూపుతూ గతంలోనే వివరమైన సమాధానాలు, వివరణలు తెలంగాణ ఇంజనీర్లు రాసి ఉన్నారు. ఆ వ్యాసాలను సంకలనం చేసి “తెలంగాణ జీవధార : కాళేశ్వరం ప్రాజెక్టు” అనే పుస్తకాన్ని కూడా తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం వారు ప్రచురించారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు ఏ విధంగా ఒక జీవధారగా, ఒక ప్రగతి రథంగా మారిందో అనుభవజ్ఞులైన ఇంజనీర్లు ఆ వ్యాసాలలో వివరించారు. పాఠకులు ఆ పుస్తకాన్ని కూడా చదవమని కోరుతున్నాము.

    కాళేశ్వరం ప్రాజెక్టు రోజుకు మూడు టిఎంసిల నీటిని ఎత్తిపోసే భారీ ప్రాజెక్టు. ప్రాజెక్టులో భారీ కట్టడాలు ఉండక తప్పదు. అవి నిజంగా కూడా ఇంజనీరింగ్ అద్భుతాలే. ఇవి మేము చెపుతున్నది కావు. ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చిన కేంద్ర జల సంఘం ఛైర్మన్ మసూద్ హుస్సైన్, చీఫ్ ఇంజనీర్ సి కె ఎల్ దాస్, ఇతర cwc సీనియర్ ఇంజనీర్లు ప్రాజెక్టును కళ్ళారా చూసిన తర్వాత చెప్పిన వాస్తవాలు. తాము అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టు తమ పదవీ కాలంలోనే పూర్తి కావడం తాము గతంలో ఎన్నడూ చూడని అద్భుతమని వారు కొనియాడారు.10 స్టేజీల్లో నిర్మాణం అయిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకంగా ప్రఖ్యాతి గాంచింది. గూగుల్ సెర్చ్ ఇంజన్ కూడా ఇదే చెపుతున్నది.

    కాళేశ్వరం ప్రాజెక్టులో పనులు మొత్తం 7 లింకుల్లో, 28 ప్యాకేజీల్లో వివిధ జిల్లాల్లో పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పనులు తెలంగాణ రాష్ట్రంలో 13 జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. 20 జిల్లాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో 3 బ్యారేజిలు, 16 జలాశయాలు, మేడిగడ్డ నుంచి కొండపోచమ్మసాగర్ దాకా 10 స్టేజిల ఎత్తిపోతలు, అన్ని లింకుల్లో కలిపి 21 పంప్ హౌజ్ లు, 108 భారీ పంపులు, సర్జ్ ఫూల్స్, 98 కిమీ డెలివరీ పైపులు, డెలివరీ సిస్టెర్న్స్, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల కాలువలు, భారీ విద్యుత్ సబ్ స్టేషన్లు, వందల కిలోమీటర్ల విద్యుత్ లైన్లు .. ఇట్లా అనేక కాంపొనెంట్స్ కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నాయి. వీటి ద్వారా 18.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు; శ్రీరాంసాగర్, వరద కాలువ, నిజాంసాగర్, సింగూరు, వనదుర్గా ప్రాజెక్టులు, చెరువులు, చెక్ డ్యాంల కింద ఉన్న26.75 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో మొత్తం 45 లక్షల ఎకరాల ఆయకట్టును సాధించడం కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యం.
    ఈ సంగతి అటుంచితే కాళేశ్వరం ఏమి సాధించిందనేది కీలకమైన అంశం.
    1. కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి నదిని .. ధర్మపురి నుంచి సమ్మక్క సాగర్ దాకా సుమారు 200 కిమీ సజీవం చేసింది. ఇక గోదావరి ఎండిపోయే స్థితి ఎప్పటికీ రాదు. గోదావరి నదీ గర్భంలోనే ఎటువంటి గ్రామాల ముంపు, పునరావాసం లేకుండా 62.81 టిఎంసిల నీటిని నిల్వ చేయగలుగుతాము. దీనివల్ల గోదావరి తీర ప్రాంతంలో భూగర్భ జలాలు పైకి లేచినాయి. మత్స్య కారులకు గొప్ప మేలు జరిగింది. ఈ ప్రాంతంలో భవిష్యత్ లో పరిశ్రమ స్థాపనకు, దేశీయ జల రవాణాకు, టెంపుల్ & ఎకో టూరిజం అభివృద్దికి బాటలు వేసింది.
    2. 10 స్టేజీల్లో ఎత్తిపోతల నిర్మాణాలు, రాజరాజెశ్వర (మిడ్ మానేరు), అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ జలాశయాల నిర్మాణం పూర్తి కావడంతో శ్రీరాంసాగర్, నిజాం సాగర్, సింగూరు, వన దుర్గా (ఘన పూర్ ఆనకట్ట), వరదకాలువ, వేలాది చెరువులు, చెక్ డ్యాంల కింద సుమారు 20 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ పొందింది. ఆయా ప్రాజెక్టుల కింద నీటి కొరత ఎప్పుడు ఏర్పడినా కాళేశ్వరం ఆ కొరతను తీర్చగలదు. కేంద్ర జల సంఘం అనుమతించిన కాళేశ్వరం ప్రాజెక్టు డిపిఆర్ లోనే స్థిరీకరణ ఒక అంశంగా ఉన్నది. శ్రీరాంసాగర్ రెండో దశ ఆయకట్టుకు రెండు పంటలకు నికరంగా నీరు అందుతున్నది. కాలువలు తవ్విన 20 ఏళ్ళకు ఈ కాలువల్లో నీరు ప్రవహిస్తున్నదంటే అది కాళేశ్వరం ఫలితమే. సూర్యాపేట జిల్లాలో ఆయకట్టు చిట్ట చివరన ఉన్న భూములకు కూడా నీరు అందుతున్నది.
    3. ఇప్పటికే పైన పేర్కొన్న జలాశయాల కింద సిద్దిపేట, మెదక్, సిరిసిల్ల కరీంనగర్ జిల్లాల్లో సుమారు 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కాలువల వ్యవస్థ నిర్మాణం అవుతున్నా కొద్దీ కొత్త ఆయకట్టు అందుబాటులోకి వస్తుంది. ప్రాజెక్టులలో కాలక్రమేణా ఆయకట్టు అందుబాటులోకి రావడం సాధారణంగా జరిగేదే.
    మిషన్ భగీరథ ద్వారా వేలాది గ్రామాలకు తాగునీరు, రాబోయే 50 ఏళ్ల వరకు గ్రేటర్ హైదబాదాద్ నగరానికి తాగునీరు, గ్రేటర్ హైదరాబాద్ లో వెలసిన పరిశ్రమలకు నీటి సరఫరాకు కాళేశ్వరం పూర్తి భద్రతను కలిగించింది. వీటి కోసం ఎప్పుడు అవసరం అయితే అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని సరఫరా చేయగలుగుతుంది. మంత్రి హరీష్ రావు గారు అన్నట్టు.. కాళేశ్వరం any time water “ ప్రాజెక్టు. ఈపాటికే కాళేశ్వరం ఫలితాలు ప్రజల అనుభవాల్లోకి వచ్చాయి.
    కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవసాయం, తాగునీరు, పరిశ్రమలు, మత్స్య పరిశ్రమ ,టూరిజం, పట్ణాణాభివృద్ది, పర్యావరణం, దేశీయ జల రవాణా తదితర రంగాలను ప్రభావితం చేసి తెలంగాణా సమగ్ర వికాసానికి దోహదం చేసే ఒక ప్రగతి రథం (growth engine). ఎవరు ఎంత అక్కసు వెళ్లగక్కినా అదే నిజం.

    *tjac స్పందన:*

    • మీరు కాళేశ్వరం గురించి చెప్పినవి నిజం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.

    • అయితే కాళేశ్వరం గురించి ఇప్పటివరకూ మేము చెప్పినవన్నీ నిజమయ్యాయి…

    అందులో మచ్చుకు కొన్ని…

    • ఇది ఎత్తిపోతల కాదు, తిప్పిపోతల అని చెప్పాము. మొదటి మూడేళ్లు, ఎత్తిన నీళ్ళన్నీ, మళ్ళీ సముద్రంలో తిప్పిపోశారు. కోట్లాది రూపాయల ప్రజా ధనం వృధా… లక్ష కోట్లు పెట్టి ప్రపంచంలో కట్టిన ఒకే ఒక్క తిప్పిపోతల ప్రాజెక్టు ఇది…

    • కరెంటు ఖర్చుపై కాళేశ్వరం చివరి ఆయకట్టుకు, ఎకరాకు ఒక పంటకు ఏటా కరెంటు ఖర్చు కేవలం 13 వేల రూపాయలు అవుతుందని మీరు మొదట చెప్పారు. తరువాత మీరే లింక్-4 లో ఎకరాకు సుమారు 38 వేల రూపాయలు అవుతుందని వ్యాసం రాశారు. అయితే మీరు లెక్క కట్టిన కరెంటు ఛార్జీ యూనిట్ కు రూ 5.20/- కానీ రెగ్యులేటరీ కమిషన్ వసూలు చేస్తున్న రేటు (ఎనర్జీ ఛార్జీ , డిమాండ్ ఛార్జీ, ఇతర ఛార్జీలు కలిపి) యూనిట్ కు సగటున రూ 7.20 పైనే. ఈ లెక్కన ఎకరాకు కరెంటు బిల్లు రూ 52,000 వస్తుంది. ఇంకా, మీరు ఒక టి‌ఎం‌సి 10,000 ఎకరాలు పారుతుందని రాశారు. కానీ, మేము ఆరుతడి పంటలు 10,000 ఎకరాలు, వరి 6000 ఎకరాలు… సగటున 8000 ఎకరాలు ఒక టి‌ఎం‌సి కి తీసుకున్నాము. (ఇవన్నీ మనం ఉద్యమ కాలంలో ప్రజలకు చెప్పిన లెక్కలే…). ఈ లెక్కన ఒక ఎకరాకు కరెంటు ఖర్చు 65,000 వేల రూపాయలు అవుతుంది. ఇందులో ఆవిరి నష్టాలు, ఇంకుడు నష్టాలు ఇవన్నీ కలిపితే మా లెక్క ఎకరాకు పంటకు ఏటా 70,000 రూపాయల కరెంటు లెక్క తేలుతుంది. దీనికి అదనంగా నిర్వహణ ఖర్చులు, కాళేశ్వరంపై పెట్టిన లక్ష కోట్ల రూపాయల పెట్టుబడిపై అసలు, వడ్డీల పేరుమీద ఏటా చెల్లిస్తున్న వేల కోట్ల రూపాయలను కలుపుకుంటే, ఎకరా పంటకు ఏటా అయ్యే మొత్తం ఖర్చు ఎన్ని లక్షలౌతుందో మీరే చెప్పాలి. నిజానికి ఖర్చుపై మేము వేసిన అంచనా తక్కువే…

    • ఇలా చాలా చెప్పొచ్చు… కానీ దాని వల్ల ప్రయోజనం లేదు. ప్రస్తుతం మనముందు ఉన్న సమస్యపై దృష్టి పెట్టాలి. పంప్ హౌసులను పునరుద్దరించడంతో సమస్య సమసిపోదు. మొత్తం కాళేశ్వరం పధకం డిజైన్ లలో, నిర్మాణంలో, నాణ్యతలో అనేక లోపాలు ఉన్నాయి. లక్ష కోట్ల రూపాయలకు పైగా ఖర్చుపెట్టి నిర్మించుకున్న ప్రాజెక్టులు తెలంగాణ ప్రజలకు గుదిబండలు కావడం మాత్రమే కాదు, ప్రజల జీవితాలను మరింత దుర్భరం చేస్తాయి.

    • మరోవైపు భవిష్యత్తులో ఎప్పుడైనా ప్రాజెక్టులలో తీవ్రమైన లోపాలు బయటపడ్డప్పుడు కాంట్రాక్టరు “ ప్రాజెక్టు గ్యారెంటీ సమయం అయిపోయింది” అనే నెపంతో వందల, వేల కోట్ల రూపాయల రిపేరు ఖర్చునంతా ప్రభుత్వంపై నెట్టే ప్రమాదం ఉంది. ముందే ఈ లోపాలు పసిగడితే ప్రభుత్వానికి అదనపు భారం ఉండదు. నష్టపరిహారం కూడా కాంట్రాక్టరు నుండి వసూలు చేసే అవకాశం ఉంటుంది.

    • చివరగా, మరోసారి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యతను, డిజైన్ లోపాలను సమీక్షించి, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఇంజనీరింగ్ నిపుణులతో తక్షణం ఒక కమిటీని వేసి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి…లేకుంటే తెలంగాణ ప్రజలు భవిష్యత్తులో మరింత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.

    ****************************
    *తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ*(tjac)
    ****************************

    Faild Kcr Projects Kaleshwaram Project Kaleshwaram Pump House
    Share. Facebook Twitter Pinterest Tumblr Email WhatsApp
    ADMIN
    • Website

    Related Posts

    శ్రీరామనవమి కళ్యాణంలో ‘లంకా దహనం’ చేసింది ఎవరు?

    March 30, 2023

    శ్రీరామ నవమి రోజు ‘దాసరా’ను చూపిన గొప్ప సినిమా (సమీక్ష)

    March 30, 2023

    ఇద్దరు మంత్రులు, 25 ఎమ్మెల్యేలపై వేటుకు కేసీఆర్ నిర్ణయం..?

    March 30, 2023

    Leave A Reply Cancel Reply

    Don't Miss
    AndhraPradesh

    శ్రీరామనవమి కళ్యాణంలో ‘లంకా దహనం’ చేసింది ఎవరు?

    March 30, 20230

    శ్రీరామనవమి వేడుకలలో భాగంగా సీతారాములు కళ్యాణం వైభోగంగా, కన్నుల పండుగగా జరుగుతోంది. భక్తులు ఆదమరిచి కళ్యాణ మంత్రాలు వింటూ పులకిస్తున్నారు.…

    శ్రీరామ నవమి రోజు ‘దాసరా’ను చూపిన గొప్ప సినిమా (సమీక్ష)

    March 30, 2023

    ఇద్దరు మంత్రులు, 25 ఎమ్మెల్యేలపై వేటుకు కేసీఆర్ నిర్ణయం..?

    March 30, 2023

    ఐపీఎల్ కు ధోని రిటైర్మెంట్ ..?

    March 30, 2023
    Stay In Touch
    • Facebook 1000K
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo
    • WhatsApp
    Our Picks

    శ్రీరామనవమి కళ్యాణంలో ‘లంకా దహనం’ చేసింది ఎవరు?

    March 30, 2023

    శ్రీరామ నవమి రోజు ‘దాసరా’ను చూపిన గొప్ప సినిమా (సమీక్ష)

    March 30, 2023

    ఇద్దరు మంత్రులు, 25 ఎమ్మెల్యేలపై వేటుకు కేసీఆర్ నిర్ణయం..?

    March 30, 2023

    ఐపీఎల్ కు ధోని రిటైర్మెంట్ ..?

    March 30, 2023

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Demo
    Facebook Twitter Instagram Pinterest
    • Home
    • AndhraPradesh
    • Telangana
    • News
    © 2023 Polytricks. Designed by Polytricks.

    Type above and press Enter to search. Press Esc to cancel.