Author: ADMIN

తెలంగాణ తల్లి కష్టజీవి. ఊరి సంస్కృతికి ప్రతిరూపం. మన తల్లి దొరల గడీలలో దొరసాని కాదు… ఒంటి నిండా వజ్రవైడుర్యాలు పొదిగిన నగలు, నెత్తిన బంగారు కిరీటాన్ని ధరించి రాచరికానికి ప్రతిరూపంగా రాజదర్పాన్ని కలిగి ఉండటం మన తల్లి లక్షణం కానే కాదు. పెత్తందార్ల పై తిరుగుబాటు చేసిన చాకలి ఐలమ్మ, రజాకార్ల పై తుపాకీ ఎక్కుపెట్టిన మల్లు స్వరాజ్యం తెలంగాణ సంస్కృతికి నిదర్శనాలు. సకల జన తెలంగాణకు, సబ్బండ వర్గాల జనులకు తమ తల్లిని స్ఫురించే రూపం తెలంగాణ తల్లి స్థానానికి అర్హురాలవుతుంది తప్ప… దొరల గడీలలోని దొరసాని రూపమో, రాచరికపు లక్షణాలు కలిగి ఉన్న మహారాణి రూపంమో మన తల్లి కాదు… కాబోదు. అందుకే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్సే తెలంగాణ సబ్బండ వర్గాల ఆమోదయోగ్యమైన “తెలంగాణ తల్లి” ని కూడా ఆవిష్కరిస్తోంది. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాన్ని తిరిగి పున:ప్రతిష్ఠించబోతోంది. మన రాష్ట్రం, మన తల్లి, మన గేయం, మనగానం,…

Read More

అప్పు చేసి పప్పు కూడు…*********************బాయి దగ్గర మీటర్లు పెట్టాలని విద్యుత్ సవరణలు కేంద్రం తెస్తుందంటూ ముఖ్యమంత్రి పదే, పదే చెబుతూ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టాల్సిన అవసరం లేదంటూ కేంద్రం తన విధానాన్ని జూలై, 2021 లో (Revamped Distribution Sector Scheme-RDSS) ప్రకటించింది. దానికి అనుగుణంగా పార్లమెంటులో ప్రవేశపెట్టిన విద్యుత్ సవరణ బిల్లు 2022 లో ఎక్కడా వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెట్టాలన్న అంశం చేర్చలేదు. పంపు సెట్లకు మీటర్లు పెట్టడానికి టి‌జే‌ఏ‌సి వ్యతిరేకం. (ట్రాన్స్ ఫార్మర్ వద్ద కానీ, ఫీడర్ వద్ద కానీ మీటర్లు పెట్టడం శాస్త్రీయం). కానీ విద్యుత్ సంస్థలు ప్రభుత్వ ఆదేశాలమేరకు వినియోగదారులకు సరఫరా చేస్తున్న రాయితీ విద్యుత్తుకు పూర్తి సబ్సిడీలు ప్రభుత్వమే చెల్లించాలి. లేకుంటే విద్యుత్ సంస్థలు కుప్పకూలి పోతాయి. వినియోగదారులకు ఉచిత విద్యుత్తు కాదు కదా… అసలు సరఫరా చేయడానికి విద్యుత్తు కొనలేని పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటి…

Read More

జాతీయ పతాకం రూపశిల్పి పింగళి వెంకయ్య ముని మనుమరాలి లేఖ యధావిధిగాబ్రాహ్మణుడికి జంధ్యం ఎంత ముఖ్యమో.. మా కుటుంబంలో దేశభక్తి కలిగి ఉండటం అంత ముఖ్యం (ఈ పోలిక కావాలనే చెప్తున్నాను). దేశం గురించి ఏమన్నా తెల్సా అంటే.. తెల్సి కాదు, అది వారసత్వంగా వచ్చిన ఆస్తి.ముత్తాత స్వతంత్రోద్యమంలో ఉన్నారు. త్రివర్ణ పతాకం రూపకల్పన చేశారు. ఇది నా చిన్నప్పుడే నూరి పోశారు. స్కూల్‌ లో జెండా వందనం రోజు ఒక గౌరవం. ఈ ప్రివిలేజ్‌ ని చక్కగా ఎంజాయ్ చేసేదాన్ని. వెంకయ్య కొడుకు, అంటే మా తాత, చలపతిరావు ఇండియన్‌ ఆర్మీలో పని చేశారు. సర్వీస్‌ లో ఉండగానే చనిపోయారు. మా నాయనమ్మని కనీసం ట్రైన్‌ పాస్‌ కూడా తీసుకోనివ్వలేదు వెంకయ్య గారు. మా నాన్నని 28 ఏళ్ళకి చంపేశారు. ఈ త్యాగాలు, కీర్తుల వల్ల, నేను చదువుతున్న పుస్తకాల వల్ల.. తెలీకుండానే.. మా కుటుంబ వాతావరణంలో దేశభక్తి అనేది,…

Read More

కాళేశ్వరం పంప్ హౌసుల మునక డిజైన్ వైఫల్యమే… ఇవిగో ఆధారాలుతెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ“గోదావరి వరదలు ప్రకృతి విపత్తే” అంటున్న శ్రీ శ్రీధర్ రావ్ దేశ్పాండే గారి వివరణలకు tjac స్పందన..కాళేశ్వరం పంప్ హౌసుల మునకపై 15.07.2022 నాడు టి‌జే‌ఏ‌సి లేవనెత్తిన కీలక అంశాలపై శ్రీ శ్రీధర్ రావు దేశ్పాండే గారు “గోదావరి వరదలు ప్రకృతి విపత్తే” అంటూ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఈ వివరణ చివర్లో కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్ ఇన్ చీఫ్ లు శ్రీ బి హరిరామ్ & శ్రీ నల్ల వెంకటేశ్వర్లు గార్లకు దేశ్పాండే గారు కృతజ్ఞతలు కూడా చెప్పారు. కాబట్టి ఈ వివరణకు మరింత ప్రాధాన్యత ఉంది. దేశ్పాండే గారి వివరణలపై టి‌జే‌ఏ‌సి స్పందన ఇది. మొదట 15.07.2022 నాడు tjac లేవనెత్తిన అంశం, తరువాత దేశ్పాండే గారి వివరణ, ఆపై tjac స్పందన వరుసగా ఇచ్చాము. మొత్తం చదివిన తరువాత, కాళేశ్వరం పంపుహౌసుల మునకకు…

Read More

కాంగ్రెస్ వైపు ఆశగా అన్నదాతలు..! రైతులను రాజులను చేస్తామని అధికారంలోకి వచ్చింది తడవు ఇప్పటివరకు అదే డైలాగ్ తో అన్నదాతలను నమ్మబలుకుతు వస్తోన్న తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నదాతలను నట్టేట్టా ముంచేస్తున్నాడన్న విమర్శలు ఉన్నాయి. 2018ముందస్తు ఎన్నికల్లో రైతు బంధు పథకం, రైతు రుణమాఫీ అంటూ అన్నదాతల మెప్పు పొందిన గులాబీ అధినేత అధికారంలోకి వచ్చాక రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాలయాపన చేస్తున్నారు. నిధుల కటకట కొనసాగుతూ ఉండటంతో రైతు బంధు సకాలంలో అందటం లేదు. ఇక, రైతు రుణమాఫీ చేస్తామని మూడేళ్ళుగా ఊరిస్తునే ఉన్నారు. కాని హామీని నెరవేర్చడం లేదు. దీంతో రుణమాఫీ అవుతుందని గంపెడు ఆశలు పెట్టుకున్న తెలంగాణ రైతాంగానికి బ్యాంక్ సిబ్బంది నుంచి వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. చేసిన అప్పుకు వడ్డీ అంతకంతకు పెరగడంతో రైతులు ఎం చేయాలో తోచక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు…

Read More

గత ఎన్నికల్లో చంద్రబాబును బూచిగా చూపి సెంటిమెంట్ ను మరోసారి రగిల్చి టీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకురావడంలో కేసీఆర్ సఫలీకృతమయ్యారు. కాని మరోసారి తెలంగాణ , ఆంధ్ర అనే సెంటి మెంట్ పునరావృత్తమయ్యే అవకాశం లేదు. పైగా , ప్రతిపక్షాలు మంచి టచ్ లో కనిపిస్తున్నాయి. దీంతో కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కావాలని కేంద్ర దర్యాప్తు సంస్థల గురించి కేసీఆర్ తరుచుగా వివాదాస్పదంగా మాట్లాడుతున్నారని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. కేంద్రం దూకుడుగా వ్యవహరించి ఈడీ, సీబీఐ లను రంగంలోకి దించిన పక్షాన తెలంగాణపై కేంద్రం పెత్తనమంటూ రివర్స్ లో నరుక్కురావాలని పీకే వ్యూహంలో భాగంగా కేంద్రంపై కేసీఆర్ కాలు దువ్వుతున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల అవినీతి జరిగిందని.. ఇందులో కల్వకుంట్ల ఫ్యామిలీకు ముడుపులు అందాయని బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి…

Read More

ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కపై టీఆర్ఎస్ అనుబంధ సోషల్ మీడియా సోమవారం తప్పుడు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ బలపరచిన ద్రౌపది ముర్ముకు ఓటేసిందని సీతక్క అభిప్రాయం తెలుసుకోకుండానే తెగ ప్రచారం చేసేసింది. ఓటు వేసే క్రమంలో బ్యాలెట్ పేపర్లో పేర్లు ఉన్న చోట కాకుండా మరో చోట ఇంకు పడిందని సీతక్క స్పష్టతనిచ్చారు. కొత్త బ్యాలెట్ పేపర్ అడిగానని… వారు ఇవ్వకపోవడంతో అదే బ్యాలెట్ ను బ్యాలెట్ బాక్స్ లో వేయాల్సి వచ్చిందని…కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థికే తాను ఓటు వేశానునని సీతక్క క్లారిటీ ఇచ్చారు. అయితే, సీతక్క ఓటును పరిగణనలోకి తీసుకుంటారా..? ఒకవేళ పరిగణనలోకి తీసుకుంటే ఆమె ఓటును కాంగ్రెస్ అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతుగా లేక్కిస్తారా..? ద్రౌపది ముర్ము ఖాతాలో వేస్తారా..? అన్నది టీఆర్ఎస్ సోషల్ మీడియా టీం అప్పుడే తేల్చేసింది. ఎక్కడ కాంగ్రెస్ ను బద్నాం చేసేందుకు ఛాన్స్ దొరుకుతుందా అని…

Read More

ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల మధ్య ముందస్తు ఎన్నికలపై ఫైట్ జరుగుతుందా..? ప్రతిపక్షాలు ఏమాత్రం కుదురుకోక ముందే ముందస్తుకు వెళ్లాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారా..? ఇప్పటికప్పుడు ఎన్నికలకు వెళ్తే అప్పనంగా కాంగ్రెస్ కు అధికారం అప్పగించడం మినహా టీఆర్ఎస్ పవర్ లోకి వచ్చే పరిస్థితి లేదని కేటీఆర్ చెబుతున్నారా..? ఇంతకీ తండ్రి కొడుకుల మదిలో ముందస్తుపై మెదులుతున్న ఆలోచన ఏంటి..?ముందస్తు ఎన్నికలకు ముహూర్తం ఖరారు చేయమనండి అంటూ సీఎం కేసీఆర్ విసిరిన సవాల్ కు ప్రతిపక్షాలు కూడా స్పందించాయి. నాలుగు రోజుల్లో ప్రభుత్వాన్ని రద్దు చేయండి అంటూ తెలంగాణ కాంగ్రెస్ సారధి రేవంత్ రెడ్డి, ముందస్తు ఎన్నికలకు మేము సై అంటూ బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ ప్రతిస్పందించారు. కాని మళ్ళీ ప్రగతి భవన్ నుంచి సౌండ్ లేదు. తాజాగా యాక్టింగ్ సీఎం కేటీఆర్ వచ్చి ముందస్తు లేదు గిందస్తు లేదు…షెడ్యూల్ మేరకు ఎన్నికలు జరుగుతాయ్ అంటూ తేల్చేశారు. అయితే…

Read More

ఓబీసీల సాధికారత కాంగ్రెస్‌ తో మాత్రమే సాధ్యం: నూతి శ్రీకాంత్ గౌడ్తెలంగాణలో ఇతర వెనుకబడిన వర్గాల సాధికారత కాంగ్రెస్ పార్టీ మాత్రమే సాధ్యమని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఓబీసీ విభాగం చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ గురువారం అన్నారు.‘‘కాంగ్రెస్ పార్టీలోని ఎస్సీ,ఎస్టీ, ఓబిసి, మైనారిటీలకు అన్ని స్థాయిల్లో ఇప్పుడున్న 20శాతం రిజర్వేషన్స్ ను 50శాతానికి పెంచుతూ గత వారం ఉదయ్ పూర్ లో జరిగిన ‘నవ సంకల్ప చింతన్ శిబిరం’లో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం తెలంగాణ రాష్ట్రంలో పార్టీకి చాలా మేలు చేస్తుంది. రాష్ట్ర జనాభాలో దాదాపు 48శాతం ఉన్న ఓబిసిలు ఎన్నడూ న్యాయబద్దమైన వాటాను పొందలేదు. తాజాగా కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్స్ పెంచుతూ తీసుకున్న నిర్ణయం ఓబిసిలు రాజకీయంగా ఎదగడానికి తోడ్పడుతుంది. అలాగే వారి వర్గాల హక్కుల కోసం పోరాడటానికి వీలు కల్పిస్తుంది’’ అని నూతి శ్రీకాంత్ గౌడ్ మీడియా ప్రకటనలో తెలిపారు.ఒబిసిలు మరియు ఇతరులకు…

Read More

కోవిడ్ మరణాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దొంగాట WHO నివేదిక ప్రకారం దేశంలో 47 లక్షల మరణాలుకేవలం 5 లక్షలే అంటోన్న మోడీ సర్కార్తెలంగాణలో ప్రభుత్వ నివేదిక ప్రకారం 4,111వాస్తవ సంఖ్య 2.5 – 3 లక్షలగా ఉంటుందని అంచనాకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాస్తవ లెక్కలు చెప్పాలిమృతుల కుటుంబాలకు వెంటనే పరిహారం చెల్లించాలితెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి డిమాండ్ దేశంలో కోవిడ్ మరణాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కప్పిపుచ్చుతున్నాయని, సుప్రీంకోర్టుకి కూడా తప్పుడు లెక్కలు చెబుతున్నాయని తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి విమర్శించారు. కోవిడ్ తో దేశంలో 47 లక్షల మంది చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడిస్తోంటే… మోడీ సర్కార్ మాత్రం కేవలం 5 లక్షల మంది మాత్రమే మృతి చెందారని లెక్కలు చెబుతూ సుప్రీంకోర్టుని తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. ఈ మేరకు గాంధీ భవన్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ…

Read More