ఈ మూవీకి ఇప్పటికే బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా?.ఈ మూవీ సమంత తో పాటు త్రిషకూడా హీరోయిన్ గా చేస్తోందా?..బన్నీ తో త్రిష కాంబో ఎలా ఉండబోతోంది
అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా తర్వాత ఏ దర్శకుడితో తొందరగా సినిమా స్టార్ట్ చేస్తాడ నే విషయంలో మాత్రం చాలా సస్పెన్స్ క్రియేట్ అవుతోంది. ఫ్యాన్స్ అయితే బన్నీ నెక్స్ట్ అనౌన్స్మెంట్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. లిస్టులో ఇదివరకే చాలామంది దర్శకుల పేర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు హఠాత్తుగా అట్లీ పేరు టాప్ లిస్టులో చేరిపోయింది. తప్పకుండా మంచి ఫామ్ లో ఉన్న ఈ దర్శకుడు తోనే బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.ఇక ఇప్పుడు నిర్మాత అల్లు అరవింద్ తో పాటు సన్ పిక్చర్స్ కూడా రంగంలోకి దిగాయి. ఇక అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అఫీషియల్ గా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ముందుగానే హీరోయిన్ విషయంలో కూడా మేకర్స్ ఒక నిర్ణయానికి వచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
స్పాట్..
అయితే చాలా రోజులుగా అయితే సమంత పేరు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇదివరకే అల్లు అర్జున్ తో సమంత సన్నాఫ్ సత్యమూర్తి లో కలిసి నటించారు. అలాగే పుష్ప సినిమాలో సమంత ఒక స్పెషల్ సాంగ్ లో కూడా కనిపించిన విషయం తెలిసిందే. ఆ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో బన్నీ చేయబోయే సినిమాలో కూడా ఈ బ్యూటీని ఒక హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే మరొక హీరోయిన్ కూడా ఇందులో నటించబోతున్నట్లు సమాచారం. ఆ పాత్ర కోసం సీనియర్ నటి త్రిషను సంప్రదించినట్లు తెలుస్తోంది.
స్పాట్..
సమంత కాంబినేషన్లో బన్నీ ఇదివరకే కనిపించాడు. కాబట్టి త్రిషతో నటిస్తే మాత్రం చాలా కొత్తగా ఉంటుంది. ప్రస్తుతం ఇద్దరు హీరోయిన్ల విషయంలో అయితే చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. తుది నిర్ణయం అయితే తీసుకోలేదు.అల్లు అర్జున్ పుట్టినరోజు ఏప్రిల్ 8న ఈ విషయంలో ఫైనల్ గా ఒక క్లారిటీ ఇవ్వనున్నారు. ఇక త్రిష కూడా ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకుంటున్న విషయం తెలిసిందే. విజయ్ తో చేసిన లియో సినిమా కూడా కమర్షియల్ గా సక్సెస్ అయ్యింది. అలాగే మరోవైపు రజినీకాంత్ కమలహాసన్ లాంటి స్టార్ హీరోలతో కూడా జోడి కట్టబోతోంది. కాబట్టి ఈ సమయంలో బన్నీ సినిమాలో ఆమె నటిస్తే మాత్రం మరింత క్రేజ్ పెరిగే అవకాశం ఉంది. ఈ కాంబినేషన్ సెట్ అవుతుందో లేదో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.