Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: ADMIN
తెలంగాణలో ఒక వ్యక్తి వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు: రాహుల్‌గాంధీప్రజల సొమ్ము వేల కోట్లు మింగింది ఎవరో ప్రజలకు తెలుసు: రాహుల్ప్రజలను మోసం చేసిన వారితో కాంగ్రెస్‌కు సంబంధం ఉండదు: రాహుల్‌మోసపూరిత పార్టీలతో కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం ఉండదు: రాహుల్ పొత్తుల గురించి కాంగ్రెస్‌లో ఎవరు మాట్లాడినా బహిష్కరిస్తాం: రాహుల్‌తెరాస, భాజపాతో అనుబంధముండే వాళ్లు కాంగ్రెస్‌లో ఉండొద్దు: రాహుల్ వచ్చే ఎన్నికల్లో తెరాస, భాజపాను ఓడిస్తాం: రాహుల్‌గాంధీతెరాస, భాజపాతో కాంగ్రెస్ నేరుగా పోరాడుతుంది: రాహుల్ తెలంగాణ యువతను మోసం చేసిన వారిని గద్దె దించుతాం: రాహుల్ ప్రజల అభిమానం పొందిన వారికే ఈసారి టికెట్లు ఇస్తాం: రాహుల్‌గాంధీ
తెలంగాణ సులువుగా ఏర్పడిన రాష్ట్రం కాదు: రాహుల్ ఎంతో మంది త్యాగాల మీద తెలంగాణ సాకారమైంది: రాహుల్తెలంగాణ ఒక వ్యక్తి, ఒక కుటుంబం కోసం ఏర్పాటు చేయలేదు: రాహుల్‌గాంధీరాష్ట్రం ఏర్పడి 8 ఏళ్లు గడిచినా ప్రజల కష్టాలు తీరలేదు: రాహుల్ తెలంగాణ ప్రజల కలలను ఈ సర్కార్ నెరవేర్చలేదు: రాహుల్ తెలంగాణలో రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆగలేదు: రాహుల్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని కాంగ్రెస్ ఎంతో పోరాటం చేసింది ఆత్మదానాలకు చలించిపోయి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసీ సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు తెలంగాణ ఇస్తే రైతులు, ప్రజల ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశించాంప్రజలు, నిరుద్యోగులు, కాంగ్రెస్ ఆశించిందేదీ నెరవేరలేదు: రాహుల్‌గాంధీరైతుల సమస్యలను తెరాస ప్రభుత్వం వినిపించుకోవట్లేదు: రాహుల్ దేశంలో, రాష్ట్రంలో పంటలకు మద్దతు ధర దొరకట్లేదు: రాహుల్ చరిత్రాత్మకమైన వరంగల్ డిక్లరేషన్‌ను ప్రకటిస్తున్నా: రాహుల్‌గాంధీకాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ: రాహుల్‌ఏ ఆశయంతో…
లక్షలోపు రుణమాఫీ కోసం.. 34లక్షల మంది రైతన్నల ఎదురుచూపులు. • ఆగమ్యగోచరంగా అన్నదాతల పరిస్థితి• బడ్జెట్ రూ. కోట్లు కేటాయిస్తున్నా.. విడుదలలో తీవ్ర జాప్యం• రుణాలు చెల్లించాలని రైతులపై బ్యాంకర్ల వత్తిడి ఉన్నమాట: “వడ్డీ.. వడ్డీ.. పెరిగి రైతుల నడ్డి విరుగుతోంది కానీ రైతు రుణాలు మాత్రం మాఫీ కావడం లేదు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలకు వేల కోట్లలో బడ్జెట్ కేటాయిస్తున్నా.. నిధులు మాత్రం పైసా కూడా విడుదల చేయ్యడం లేదు. రుణమాఫీ సకాలంలో అమలు కాకపోవడంతో రాష్ట్రంలో రైతన్నల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.. రైతురుణాల మాఫీ కోసం ప్రభుత్వం ఈ మూడేండ్లలో 17 వేల కోట్లు కేటాయిస్తే.. రూ.3వేల కోట్లు మాత్రమే విడుదల చేసింది. దీనిలో తొలిసారి రూ.400 కోట్లు, రెండోసారి రూ. 300 కోట్లు తిరిగి ప్రభుత్వ ఖజానాలోకే చేరాయి. రాష్ట్ర వ్యాప్తంగా 40.66 లక్షల మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉండగా.. రూ.25 వేల లోపు 2.96…
White challenge మాత్రమే కాదు…ఏ ఛాలెంజ్ కైనా కాంగ్రెస్ పార్టీ సిద్ధమే కేటీఆర్.. సినిమా వాళ్ల డ్రగ్స్ కేసు వివరాలు బయటపెట్టేందుకు నువ్వు సిద్ధమా ?టాలీవుడ్ నటుల డ్రగ్స్ కేసు విచారణ సమయంలోనీది, నీ అనుచరుల ఫోన్ కాల్ లిస్ట్ బయటపెడతావా ?డ్రగ్స్ కేసుని మూలాలతో సహా పెకిలిస్తున్న ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ ని ఎందుకు బదిలీ చేశావో చెబుతావా ?పార్క్ హయత్, నోవాటె సీసీ ఫుటేజ్ మొత్తం బయటకు తీద్దామా ?హైదరాబాద్ లో అర్థరాత్రి దాగా పబ్ లకి పర్మిషన్ ఎందుకు ఇచ్చావో వివరిస్తావా ?పబ్ లలో 24 గంటలూ మద్యం సరఫరాకి పర్మిషన్ నీకు తెలియకుండా ఇచ్చారా ? డ్రగ్స్ సరఫరాపై దాడులు అంటూ రెండు రోజులు హడావుడి చేసిఇప్పుడు ఎందుకు గమ్మున కూర్చున్నావో బయటకు వచ్చి ప్రజలకు చెబుతావా ?నీ నక్క జిత్తులకి కాంగ్రెస్ పార్టీ భయపడదు కేటీఆర్… వైట్ ఛాలంజ్ మొదట విసిరిందే రేవంత్…
టీపీసీసీ క్రమశిక్షణ సంఘం సమావేశం చైర్మన్ చిన్నారెడ్డి అధ్యక్షతన గాంధీభవన్ లో ఆదివారంనాడు జరిగింది.తుంగతుర్తి నియోజక వర్గంలో పోటీ చేసిన అభ్యర్థి అద్దంకి దయాకర్ కు షో కాజ్ నోటీస్ ఇవ్వాలని నిర్ణయం..ఢిల్లీ లో ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లపై క్రమశిక్షణ ఉల్లంఘించి మాట్లాడినందుకు ఆయనపై మాజీ మంత్రి దామోదర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కమిటీ పరిశీలించి షోకాజ్ నోటీస్ ఇవ్వాలని వారం రోజులలో జవాబు ఇవ్వాలని నిర్ణయం..జహీరాబాద్ పార్లమెంట్ నియోజక వర్గంలో పోటీ చేసిన మదన్ మోహన్ తన పరిధిలో చేసే కార్యక్రమాలు పార్టీ పేరుతో కాకుండా myf మదన్ యూత్ ఫోర్స్ పేరుతో చేస్తున్నారని దీనిపై కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మదన్ మోహన్ కు లేఖ రాయాలని ఇక నుంచి ఏ కార్యక్రమాలు చేసిన అవి పార్టీ పరిధిలోనే…
-వరంగల్ సభలో కీలక ప్రసంగం-ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలతో భేటీ-అమరవీరుల కుటుంబాలతో కలిసి భోజనం – ముఖ్యనేతలతో సమావేశం, దిశానిర్దేశం- రెండు రోజుల పాటు సాగనున్న రాహుల్ టూర్ తెలంగాణలో రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన షెడ్యూల్ ఖరారయింది. మే 6 న సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ చేరుకోనున్నా రాహుల్.. హెలికాప్టర్‌లో నేరుగా వరంగల్ వెళ్తారు. వరంగల్ ‘రైతు సంఘర్షణ సభ’లో పాల్గొంటారు. సభా ప్రాంగణంలో రెండు వేదికలు ఏర్పాటు చేశారు. రాహుల్, ముఖ్య నాయకులు ఒక వేదికపై కూర్చుంటారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల సభ్యుల కోసం మరో వేదికను కేటాయించారు. రాత్రి 7 గంటల వరకు ముఖ్య నేతల ప్రసంగం ఉంటుంది. 7 గంటలకు రాహుల్ ప్రసంగిస్తారు.సభ తరువాత రోడ్డు మార్గాన రాహుల్ హైదరాబాద్ చేరుకుంటారు. రాత్రి హైదరాబాద్‌లోనే బస చేస్తారు. ఏడో తేదీన ముఖ్య నాయకులతో అల్పాహారం చేస్తారు. అక్కడి నుంచి సంజీవయ్య…
కిషన్ ఇట్యాలతహసీల్ధార్ , జన్నారం మండలం , మంచిర్యాల్ జిల్లా 9908198484 ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ విడుదల చేసి భర్తీ చేయబోతున్నందున మరియు వచ్చే 2022 – 23 విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతున్నందున అర్హులైన బీసీ అభ్యర్ధులు రాష్ట్ర స్థాయిలో నాన్ – క్రిమిలేయర్ సర్టిఫికేట్ ని మరియు సెంట్రల్ లెవెల్ జాబ్స్ మరియు విద్యా సంస్థలలో ప్రవేశం కోసం OBC సర్టిఫికెట్ ని సులభంగా పొందడం కోసం మరియు వారికి గానీ జారీ చేసే అధికార యంత్రాంగానికి గానీ ఉండే పలు అనుమానాల నివృత్తి కోసం. వెనుకబడిన తరగతులకు (OBC ) మన రాష్ట్రస్థాయిలో (పూర్వపు AP) రిజర్వేషన్ సౌకర్యమును (25%) 1970వ సం॥లో జీ.ఓ.యం.యస్ . నెం . 1793 ద్వారా , కేంద్రస్థాయిలో మండల్ కమీషన్ సిఫారసుల మేరకు (27%) 1993 వ సం…
హైదరాబాద్ నలువైపులూ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తానని సీఎం కేసీఆర్ తెగ హడావుడి చేస్తున్నారు. కేసీఆర్ ఈ హామీ ఇచ్చి కూడా దాదాపు నాలుగేళ్లు అవుతోంది. ఇంత కాలానికి ఆ హామీ శంకుస్థాపన దశ పూర్తి చేసుకుంది. ఈ నాలుగేళ్లలో ఆస్పత్రుల నిర్మాణమే పూర్తి చేయొచ్చు.. కానీ కేసీఆర్ మాత్రం చాలా కష్టపడి ఇన్నాళ్లకు శంకుస్థాపనలు మాత్రం చేశారు. ఇప్పుడు శంకుస్థాపనలు చేసిన ఆస్పత్రుల నిర్మాణమైనా సమీప భవిష్యత్‌లో పూర్తి అవుతుందా అనేది భేతాళ ప్రశ్నే. సారు గతంలోనూ వరంగల్‌లో 24 అంతస్తులతో, అత్యాధునికమైన సూపర్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తానని మహా గొప్ప హామీ ఇచ్చారు. గతేడాది మే నెలలో ఉన్నపళంగా వరంగల్ జైలు కూల్చివేసి అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. ఆస్పత్రి నిర్మాణం అధ్యయనం కోసం కెనడాకు ఒక బృందాన్ని వారంలోనే పంపుతానని గొప్పగా చెప్పారు. వరంగల్ జైలు కూల్చి వేసి కూడా ఏడాది కావొస్తోంది. కానీ ఇప్పటి వరకు…
రైతుల కోసం దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని పథకాలను… తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తోందని కేసీఆర్, కేటీఆర్, హరీశ్ ఢంకా బజాయించి చెబుతున్నారు. అయితే వారివన్నీ ఉట్టి ప్రగల్భాలే అని.. వాస్తవం మాత్రం ఇంకోలా ఉందని రైతు రుణమాఫీ పథకం అమలు తీరుని చూస్తూనే అర్థం అవుతుంది. 2018 ఎన్నికల్లో గెలిచిన తెల్లారే రూ. లక్ష రుణమాఫీ చేస్తున్నట్లు హామీలు ఇచ్చారు. రైతులను నమ్మించి, మోసం చేసి గద్దెనెక్కారు. ఆ వెంటనే మాట మార్చి.. దఫాలుగా మాఫీ చేస్తమన్నారు. రుణమాఫీ అయితది, కొత్త రుణాలు తీసుకుని పంటలు పండించుకోవచ్చు అని ఆశగా ఎదురుచూసిన రైతుల నోట్లో మట్టికొట్టారు. కనీసం.. రెండో మాట ప్రకారమైనా, దఫ దఫాలుగా మాఫీ చేశారా అంటే.. అదీ లేదు. రెండోసారి అధికారం చేపట్టి 4 ఏళ్లు పూర్తయినా, ఇప్పటికీ సగానికిపైగా రైతుల తమ రుణాలు ఎప్పుడు మాఫీ అవుతాయా అని ఎదురు చూస్తున్నారు. ప్రశ్నించిన…
కొల్లాపూర్ లో తగ్గిన ప్రాధాన్యం కార్యక్రమాలకూ పిలవకుండా అవమానంప్రాధాన్యం ఉన్నచోటికే వెళ్లాలని నిర్ణయం జూన్ లో హస్తం గూటికి ?ఆపరేషన్ ఆకర్ష్ తో ఓవర్ లోడ్ తో ప్రయాణిస్తోన్న కారు.. నెమ్మదిగా ఖాళీ అవుతోందా ? గులాబీ దళంలో అసంతృప్తితో ఉన్న సీనియర్ నేతలు ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారా ? కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకుని, వాపుని చూసి బలుపుగా భావిస్తోన్న టీఆర్ఎస్ కి త్వరలో షాక్ ల మీద షాక్ లు తగలనున్నాయా ? రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలను పరిశీలిస్తే.. ఈ ప్రశ్నలన్నింటికీ ఔననే సమాధానమే వస్తోంది. టీఆర్ఎస్ లో పాత, కొత్త నేతల మధ్య పొసగడం లేదని, కొత్తవారికి అధిక ప్రాధాన్యం ఇస్తుండటంతో.. కొంతమంది సీనియర్లు గుర్తింపు ఉన్నచోటికే వెళ్లేందుకే సిద్ధమవుతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతగా ఉన్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు… త్వరలోనే ఆ పార్టీని వీడి, తిరిగి కాంగ్రెస్ లో…