Author: Admin

మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్‌లో అసలు నిజాలు బయటకు వస్తున్నాయి. తమ అరాచకాలకు అడ్డు పడుతున్నందుకు ఓ కంపెనీ చేసిన తప్పుడు ప్రచారమే ఈ మొత్తం వ్యవహారానికి కారణమని తెలుస్తోంది. తప్పుడు సమాచారంలో పోలీసులను తప్పుదోవ పట్టించడమే కాకుండా…మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు వాడుకుంటూ దందాలు చేయడమే ఆ కంపెనీ నైజం. ఇచ్చిన పర్మీషన్లను మించి మైనింగ్ చేయడమే కాకుండా.. ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్న దక్కన్ సిమెంట్స్ కంపెనీ అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. బీఆర్ఎస్ హయాంలో సాగినట్లు..తమ దందాలు ఇప్పుడు సాగకపోవడంతో దక్కన్ సిమెంట్స్ ప్రతినిధులు అల్లిన కట్టుకథ అని తేలిపోయింది. దక్కన్ సిమెంట్స్‌ అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని ప్రయత్నించినందుకు రోహిన్ రెడ్డిపై కావాలని తప్పుడు ప్రచారం చేశారని ఎవరికైనా అర్ధం అవుతుంది. అంశాన్ని లోతుగా తెలుసుకోకుండా బద్నాం చేయడం సరికాదు.#DeccanCements #RohinReddy #CMRevanthReddy #KondaSurekha pic.twitter.com/MnNiy2Yx7g — PolyTricks (@PolyTricks_in) October 24, 2025 నిజానికి ఈ…

Read More

టీకప్పులో తుపాన్ ముగిసింది. కాంగ్రెస్ కుటుంబమంతా ఒకటే అని మరోసారి రుజువైంది. తెలంగాణ మంత్రివర్గంలో ఏదో జరిగిపోతుందని చిలువలు పలువలు చేసిన బీఆర్ఎస్ సోషల్ మీడియాతో పాటూ నాయకులకు రాత్రంతా నిద్ర పట్టలేదు. మంత్రివర్గ సమావేశం అనంతరం కొండాసురేఖ ఇచ్చిన క్లారిటీతో సమస్య సమసిపోయింది. మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డితో కలిసి ఆమె క్లారిటీ ఇవ్వడంతో అక్కడితో పుల్‌స్టాప్ పడింది. తమది ఒక కుటుంబం అని..ఇందులో చిన్న చిన్న బేధాభిప్రాయాలు సహజమే అని మంత్రి కొండా సురేఖ చెప్పారు. ముఖ్యమంత్రిపై తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కూడా చెప్పారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం…ఇక్కడ మంత్రుల నుంచి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంటుంది. పార్టీ విధివిధానాలు, ప్రభుత్వ పనితీరుపై ఓపెన్ గా మాట్లాడే ఫ్రీడమ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. సలహాలు, సూచనలు స్వీకరించేందుకు ఎక్కడా వెనుకాడదు ప్రజా సర్కార్. విమర్శలను కూడా చాలా హుందాగా స్వీకరిస్తుంది. అయితే…

Read More

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్ గెలుపును ఆపేందుకు బీఆర్ఎస్‌ నానా విధాలుగా ప్రయత్నిస్తోంది. సిట్టింగ్ సీటులో తిరిగి గెలిచేందుకు తంటాలు పడుతున్నప్పటికీ …అది సాద్యం కాదని వారికి అర్ధమయింది. కాబట్టి ఏదో రకంగా కాంగ్రెస్‌పై బురద జల్లేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఓటర్లను వర్గాలుగా విభజించే కుట్రలకు తెరతీసింది. వాస్తవానికి జూబ్లీహిల్స్‌లోని ముస్లిం ఓటర్లంతా కాంగ్రెస్‌ అభ్యర్ధి నవీన్‌ యాదవ్‌కు మద్దతు తెలుపుతున్నారు. మరోవైపు ఎంఐఎం కూడా నవీన్ యాదవ్ అభ్యర్ధిత్వానికి మద్దతు పలికింది. దీంతోపాటూ జూబ్లీహిల్స్‌లో స్థానికుడైన నవీన్ యాదవ్‌కు సమస్యలపై అవగాహన, కొట్లాడేతత్వం ఉందని ప్రజలందరి నోటా వినిపిస్తున్న మాట. వీటన్నింటికీ తోడు ప్రజా సర్కార్ చేస్తున్న సంక్షేమ పాలనపై ప్రజల్లో ఉన్న పాజిటివ్‌ రెస్పాన్స్ కూడా నవీన్ యాదవ్‌ గెలుపునకు కారణంగా మారుతుంది. ఈ క్రమంలో ముస్లీం ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు బీఆర్‌ఎస్ పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఎన్నో ఏళ్లుగా ముస్లింలకు…

Read More

ఎంపీటీసీ స్థాయి వ్యక్తి అయినా సరే తన ప్రత్యర్ధినో, లేదా తనతో విభేధించే వ్యక్తి కనిపిస్తే అధికార దర్పం ప్రదర్శిస్తారు. పదవులు రాగానే తనకంటే సీనియర్లను కూడా లెక్క చేయరు. రాజకీయాల్లో సీనియారిటీ కంటే పదవులకే పవర్ ఎక్కువ కాబట్టి ఇది సాధారణమే. మరి సీఎం స్థాయి వ్యక్తికి ఎంత పవర్ ఉంటుంది. ఆయన తలచుకుంటే తనతో విభేదించే ఎమ్మెల్యేను ఎలాగైనా ట్రీట్ చేయొచ్చు. కావాలంటే ముప్పుతిప్పలు పెట్టొచ్చు. కానీ రేవంత్ రెడ్డి స్టయిలే వేరు. అందరినీ కలుపుకొని వెళ్లడమే ఆయన సక్సెస్ మంత్రా. వ్యక్తిగతంగా తనతో ఎంత విభేధించే నాయకుడు అయినా సరే..కలుపుకొని వెళ్లేందుకే ప్రయత్నిస్తారు. అందుకే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులను వరించని ముఖ్యమంత్రి పదవి ఆయనకు దక్కింది. గత ఎన్నికల ముందు బేషజాలకు వెళ్లకుండా అందరినీ కలుపుకొని వెళ్లి పార్టీని విజయతీరాలకు చేర్చాడు. ఇదంతా ఇప్పుడెందుకు అనుకుంటున్నారా? తాజాగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని కలిసిన సందర్భంలో…

Read More

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధర్మపురి ప్రభుత్వ పాఠశాల ట్యాంకులో విషం కలిపిన ఘటన వెనుక తవ్వేకొద్దీ సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. సిబ్బంది అప్రమత్తతతో 80 మంది పిల్లల ప్రాణాలు నిలిచాయి. కానీ ఒకవేళ ఎవరూ గమనించకపోతే పెద్ద ప్రమాదమే జరిగేది. అయితే ఈ ఘటన ఎవరో మతిస్థిమితం లేని వ్యక్తి చేసిందిగా ప్రచారం జరుగుతున్నప్పటికీ…లోతుగా ఆలోచిస్తే దీని వెనుక పెద్ద కుట్రే ఉన్నట్లు అనుమానం వ్యక్తం అవుతోంది. రేవంత్‌రెడ్డి సీఎం అయినప్పటి నుంచి గురుకులాల్లో అక్కడక్కడా ఫుడ్ పాయిజన్ ఘటనలు వరుసగా జరుగడం, ఈ విషయం పిల్లల పేరెంట్స్ కంటే ముందుగానే బీఆర్ఎస్‌ నేతలకు తెలియడం, వారు అక్కడికి వెళ్లి హడావుడి చేయడం అంతా పక్కా పథకం జరిగిందని జగమెరిగిన సత్యం. బీఆర్ఎస్ వికృత క్రీడ కోసం పిల్లలను అడ్డం పెట్టుకోవడం ఇది మొదటిసారి కాదు…ఆ పార్టీ ఉనికి కోల్పోతుందన్న ప్రతీసారి యువతను రెచ్చగొట్టడం, అమాయక జనం ఉద్వేగాలతో…

Read More

గచ్చిబౌలిలో 400 ఎకరాల భూవివాదం ఓ పచ్చి నిజాన్ని బయటపెట్టింది. చాలా రోజులుగా రహస్యంగా సాగుతున్న బీఆర్ఎస్, బీజేపీ స్నేహం బట్టబయలైంది. నిజానికి కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి ప్రభుత్వానికే చెందినదని అక్కడ ఆందోళనలు చేస్తున్నవారికి కూడా తెలుసు. దాని వెనుకున్న నిజానిజాలను అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. సర్వేనం.25 లోని 400 ఎకరాల భూమిని 2004 లో నాటి ప్రభుత్వం క్రీడా సౌకర్యాల అభివృద్ధి కోసం IMG అకాడమీస్ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే కంపెనీకి కేటాయించింది. అయితే ఆ కంపెనీ ప్రాజెక్టును ప్రారంభించకపోవడంతో 2006లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూకేటాయింపును రద్దు చేసింది. దీంతో ఆ కంపెనీ 2006లో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. దీనికి సంబంధించిన అన్ని రుజువులను కోర్టుల్లో రుజువు చేసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఆ భూమి చట్టపరంగా తమదేనని, ఏ ప్రైవేట్ సంస్థకు లేదా వ్యక్తికి…

Read More

ఆమె కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ముఖ్యనేత.. అందులోనూ అధికారంలో ఉన్న పార్టీకి కొత్త ఇంచార్జి జనరల్ సెక్రెటరీ. ఇలాంటి సందర్భంలో ఇంచార్జి దృష్టిలో పడటానికి కాంగ్రెస్ నాయకులు పడని పాట్లు ఉండవు, బిజినెస్ క్లాస్ ఫ్లైట్ టిక్కెట్లు వేయడం, భారీ కాన్వాయ్ లు, ఫ్లెక్సీలు గట్రా కట్టి హడావుడి చేయడం కామన్. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి పని చేసిన గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్ లు గాంధీ భవన్ వస్తె హైదరాబాద్ మొత్తం పబ్లిసిటీతో నిండిపోయేది. అలాంటిది దేశంలోనే రిచేస్ట్ స్టేట్ తెలంగాణ స్టేట్ ఇంచార్జి అంటే ఇంకొంచెం ఎక్కువగానే ఆర్భాటం ఉంటుంది…కానీ సీన్ కట్ చేస్తే…. ఆమె మాత్రం ట్రెయిన్ లో నుండి దిగింది. తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జ్‌ మీనాక్షి నటరాజన్ రూటే సపరేటు. ఆమె అసలు సిసలైన గాంధేయవాది. సుధీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు కానీ ఆమెకు రాజకీయ నాయకులకు ఉండే హంగు ఆర్భాటాలు అబ్బలేదు.…

Read More

తెలంగాణలో ఏం నడుస్తుండంటే…జనాల నోటి నుంచి వినిపిస్తున్న మాట ఏంటో తెలుసా? ప్రజా ప్రభుత్వం పెట్టుబడుల వేటలో ఉంటే..ప్రతిపక్షం మాత్రం అబద్దాలను ప్రచారం చేసే పనిలో బిజీ అయిపోయిందని చర్చించుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడుల కోసం కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నారు. రాష్ట్రంలో అవకాశాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. దీంతో ఆయనపై నమ్మకంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా చాలా కంపెనీలు ముందుకు వస్తున్నాయి. సింగపూర్‌కు చెందిన పలు కంపెనీలు రాష్ట్రంలో సెమీ కండక్టర్ల పరిశ్రమల్లో ఇన్వెస్టిమెంట్ చేయనున్నారు. రాబోయే రోజుల్లో వేల కోట్లు ఇక్కడ పెట్టుబడులు పెట్టనున్నారు. సీఎం వెళ్లి స్వయంగా రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితులు వివరించి..పారిశ్రామిక వేత్తలకు భరోసా ఇస్తే ఎవరు కాదంటారు. గతంలో అమెరికా పర్యటనలోనూ పెట్టుబడుల కోసం అనేక సమావేశాలు నిర్వహించారు రేవంత్‌రెడ్డి. ఆయన కృషితో పలు రంగాల్లో 31వేల 532 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. తద్వారా 30వేల నూతన ఉద్యోగాలు రానున్నాయి. ఇక…

Read More

అధికారం పోయిన‌ప్ప‌టి నుంచి ఆగం ఆగం అవుతున్న గులాబీ పార్టీ నేత‌లకు అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు ఎక్కువై పోయాయి. పార్టీలో ఆధిప‌త్యం కోసం నాలుగు వ‌ర్గాలుగా ఏర్ప‌డి కొట్టుకుంటున్న క‌ల్వ‌కుంట్ల కుటుంబ స‌భ్యులు…బ‌య‌ట‌కు స‌ఖ్య‌త‌గా క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ..లోప‌ల మాత్రం కుట్ర‌లు కంటిన్యూ చేస్తున్నారు. ఇప్ప‌టికే భార‌త జాగృతి పేరుతో సొంత కుంప‌టి పెట్టుకొని రాజకీయ కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. ఇక మిగిలిన కేటీఆర్, హ‌రీష్ రావు వ‌ర్గాల మ‌ధ్య ఆధిప‌త్య పోరు తారాస్థాయికి చేరింది. ఫార్ములా ఈ కార్ స్కామ్ లో కేటీఆర్ జైలుకు వెళ్ల‌డం ఖాయ‌మ‌ని చాలా రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో హ‌రీష్ రావు వ‌ర్గం లోలోప‌ల చాలా సంతోషంగా ఉందంట‌. అయితే ఫార్ములా ఈ కార్ స్కామ్ తో పాటూ కేటీఆర్ చేసిన అరాచ‌కాల‌న్నీ తెలిసిన హ‌రీష్ రావు వాటి బంఢారం కూడా బ‌య‌ట ప‌డితే బాగుండు అని అనుకుంటున్నార‌ట‌. ఇందుకోసం వ‌చ్చిన ఏ ఒక్క అవ‌కాశాన్నీ వ‌దులుకోవ‌డం లేదు. ఒక‌వైపు…

Read More

నిజం చెప్పులేసుకునేలోపు…అబద్దం దునియా మొత్తం తిరిగి వస్తుంది. ఈ విష‌యంలో బీఆర్ఎస్ సోష‌ల్ మీడియా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. అబ‌ద్దాల‌ను ప్ర‌చారం చేయ‌డంలో అభిన‌వ గోబెల్స్ గా మారిపోయింది. ఏడాది కాలంగా కాంగ్రెస్ ప్ర‌భుత్వ పాల‌న‌పై ఉన్న‌వి లేనట్లు చూపిస్తోంది. తాజాగా గ‌త ప్ర‌భుత్వం తీసుకున్న త‌ప్పుడు నిర్ణ‌యాల‌ను స‌రిచేస్తుంటే కూడా వాటిని వ‌క్రీకరించి చూపిస్తోంది. నాన‌క్ రాంగూడ‌లో ఏర్పాటు చేసిన 23 కిలో మీట‌ర్ల సైకిల్ ట్రాక్ విష‌యంలో త‌ప్పుడు ప్ర‌చారం చేస్తోంది. నిజానికి ట్రాక్ ను బీఆర్ఎస్ హయాంలోనే హ‌డావుడిగా ఏర్పాటు చేశారు. ఎన్నిక‌ల‌కు కొద్ది రోజుల ముందు దాన్ని కంప్లిట్ చేయాల‌ని టార్గెట్ గా పెట్టుకున్నారు. దీంతో అధికారులు చేసిన కొన్ని సూచ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదు. శివారు ప్రాంతంలో నిర్మించిన సైకిల్ ట్రాక్ ఒక రికార్డుగా మిగిలిపోవాల‌నే ఉబ‌లామే త‌ప్పితే..దాని వల్ల వ‌చ్చే స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకోలేదు. నాన‌క్ రాంగూడ నుంచి నార్సింగి వెళ్లే మార్గంలో గచ్చిబౌలిని…

Read More