మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్‌లో అసలు నిజాలు బయటకు వస్తున్నాయి. తమ అరాచకాలకు అడ్డు పడుతున్నందుకు ఓ కంపెనీ చేసిన తప్పుడు ప్రచారమే ఈ మొత్తం వ్యవహారానికి కారణమని తెలుస్తోంది. తప్పుడు సమాచారంలో పోలీసులను తప్పుదోవ పట్టించడమే కాకుండా…మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు వాడుకుంటూ దందాలు చేయడమే ఆ కంపెనీ నైజం. ఇచ్చిన పర్మీషన్లను మించి మైనింగ్ చేయడమే కాకుండా.. ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్న దక్కన్ సిమెంట్స్ కంపెనీ అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. బీఆర్ఎస్ హయాంలో సాగినట్లు..తమ దందాలు ఇప్పుడు సాగకపోవడంతో దక్కన్ సిమెంట్స్ ప్రతినిధులు అల్లిన కట్టుకథ అని తేలిపోయింది.
దక్కన్ సిమెంట్స్ అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని ప్రయత్నించినందుకు రోహిన్ రెడ్డిపై కావాలని తప్పుడు ప్రచారం చేశారని ఎవరికైనా అర్ధం అవుతుంది. అంశాన్ని లోతుగా తెలుసుకోకుండా బద్నాం చేయడం సరికాదు.#DeccanCements #RohinReddy #CMRevanthReddy #KondaSurekha pic.twitter.com/MnNiy2Yx7g
— PolyTricks (@PolyTricks_in) October 24, 2025
నిజానికి ఈ మొత్తం వ్యవహారంలో ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డిని ఇరికించాలి, సీఎం రేవంత్ రెడ్డికి చెడ్డ పేరు తీసుకురావాలన్నదే దక్కన్ సిమెంట్స్ కంపెనీ ప్లాన్ గా కనిపిస్తోంది. ఇందుకోసం తప్పుడు ప్రచారం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దక్కన్ సిమెంట్స్ వ్యవహారం ప్రభుత్వ పెద్దల దృష్టికి వచ్చింది. పరిశ్రమలకు పెద్దపీట వేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ఈ సమస్యను మంచి వాతావరణంలో పరిష్కరించాలని భావించింది. దక్కన్ సిమెంట్స్ చేస్తున్న అక్రమాలు మానుకోవాలంటూ హెచ్చరించినట్లు సమాచారం. దీంతో సీఎం రేవంత్ రెడ్డికి చెడ్డ పేరు తీసుకువచ్చేందుకు పకడ్బందీగా ప్లాన్ చేసి ఈ రచ్చ చేశారు. ఇందులో మాజీ మంత్రి కొండా సురేఖ ఓఎస్డీని పావుగా వాడుకున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డికి ఎప్పుడూ సన్నిహితంగా ఉండే రోహిన్ రెడ్డిని ఈ వివాదంలోకి లాగితే తమ ప్రచారానికి మరింత బలం చేకూరుతుందనే ఉద్దేశంలో ఆయన పేరును కూడా వాడుకున్నారు.
రోహిన్ రెడ్డి గన్ పెట్టి బెదిరించారనే మాట అస్సలు నిజం కాదు. ఇది సాక్షాత్తూ ఫిర్యాదుదారుడు చెప్తున్న మాట. ఎందుకంటే అక్కడ ఏం జరిగిందో తనకు పూర్తిగా తెలుసు. కంపెనీ వాళ్లను పిలిచి కేవలం వివరణ అడిగితే..వాళ్లు కక్షగట్టి చేసిన విష ప్రచారమని అర్ధమవుతోంది.#DeccanCements #RohinReddy… pic.twitter.com/ldnqbPEWTg
— PolyTricks (@PolyTricks_in) October 24, 2025
తొలుత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చారని, ఆ తర్వాత గన్‌తో బెదిరించారని, మరోవైపు సెటిల్మెంట్ జరిగిందని…ఇలా పొంతన లేని సమాధానాలు చెప్పారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో నిజానిజాలను లోతుగా పరిశీలించకుండా మంత్రి కొండా సురేఖ కుటుంబ సభ్యులు ఆవేశానికి లోనవ్వడంతో దక్కన్ సిమెంట్స్ ప్లాన్ వర్కవుట్ అయింది. ముందుగానే దక్కన్ సిమెంట్స్ ప్రతినిధులు కొందరు సోషల్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుకొని ఈ అంశాన్ని కావాల్సిన దానికంటే ఎక్కువ ప్రచారం కల్పించారు.
దక్కన్ సిమెంట్స్ అక్రమాలను ప్రశ్నించారన్న అక్రోశంతోనే తప్పుడు ప్రచారం చేయించారన్నది క్లియర్‌గా కనిపిస్తోంది. మధ్యలో కాంగ్రెస్ మంత్రుల్ని, నేతల్ని బద్నాం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉంటారు కాబట్టి రోహిన్ రెడ్డిపై బట్టకాల్చి మీద వేయాలని దక్కన్ సిమెంట్స్ పెద్ద పథకమే… pic.twitter.com/lxL3uwz8Vi
— PolyTricks (@PolyTricks_in) October 24, 2025
అయితే మంత్రి ఉత్తమ్ ఇచ్చిన కంప్లైంట్ కానీ, రోహిన్ రెడ్డి ఇన్వాల్వ్ మెంట్ కానీ ఎక్కడా రుజువు అవ్వలేదు. అందుకు కావాల్సిన ఆధారాలు కూడా లేవు
