Author: Admin

లోక్ సభ ఎన్నికల్లో సీఎం , పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టార్గెట్ 14. కానీ కొన్ని చోట్ల కాంగ్రెస్ వెనకబడిందన్న ప్రచారం జరిగింది. అభ్యర్థుల్లో కూడా కొంత ఆందోళన కనిపించింది. కానీ, రేవంత్ రెడ్డి సీన్ లోకి దిగితే ఎలా ఉంటుందో రుచి చూపించారు. నిజామాబాద్ , మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ సెగ్మెంట్లలో కాంగ్రెస్ వెనుకంజలో ఉందన్న ప్రచారం జరిగింది. కానీ, రేవంత్ రెడ్డి సోమవారం నిజామాబాద్, మాల్కాజ్ గిరి సభల్లో పాల్గొని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడమే కాదు. ప్రత్యర్ధి పార్టీ అభ్యర్థులను ఇరకాటంలోకి నెట్టేసేలా ప్రసంగించారు. నిజామాబాద్ రైతుల చిరకాల వాంఛ అయిన పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని.. నిజామాబాద్ ఎంపీగా జీవన్ రెడ్డిని గెలిపించండి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా చేసే బాధ్యత నాదంటూ చెప్పుకొచ్చారు. అంటే జీవన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి అయితే నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏమంత కష్టం కాదు.…

Read More

కోదండరాం…మలిదశ తెలంగాణ ఉద్యమ సారధి. రాజకీయ పార్టీలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చిన మేధావి. ఉద్యమ చరిత్రలో చెరిగిపోని ఘట్టాలుగా గుర్తుండిపోయే మిలియన్ మార్చ్, సాగర హారం వంటి ఉద్యమాలు ఆయన సారధ్యంలో జరిగినవే. ఉద్యమ కాలంలో ఎన్నో ఒత్తిళ్ళు, మరెన్నో సవాళ్ళు. అయినా వాటిన్నింటిని ఎదుర్కొని నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలను సాకారం చేసేందుకు వ్యూహం రచించిన ఉద్యమకారుడు. అలాంటి కోదండరాముడిపై బీఆర్ఎస్ సోషల్ మీడియా విషం కక్కుతోంది. పదవుల కోసం వెంపర్లాడుతున్నాడని చిల్లర ఆరోపణలు చేస్తోంది.పదవులే ముఖ్యం అనుకుంటే రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ళలోనే బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ రాజ్యసభ సీట్ ను కోదండరాంకు ఆఫర్ చేశారు. కానీ తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వామ్యం అవుతాను తప్పితే పదవులు అక్కర్లేదని సున్నితంగా తిరస్కరించారు. ఆ తర్వాత కేసీఆర్ అవలంభించిన విధానాలు, నిరుద్యోగ ర్యాలీకు పిలుపునిచ్చినప్పుడు ఆయన పట్ల బీఆర్ఎస్ సర్కార్ వ్యవహరించిన తీరు ఉద్యమకారులను ఆవేదనకు గురి చేశాయి. బీఆర్ఎస్…

Read More

    అగ్ని సాక్షిగా లేకపోతే ఆ వివాహం ధర్మ సమ్మతం కాదంటారు. ఎందుకలా అంటారు. పెళ్లికి, అగ్నికి సంబంధం ఏంటి. వేదాల్లో ఏం చెప్పారు. హిందూ సంప్రదాయంలో ఎందుకిలా పాటిస్తారు. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకోకుంటే ఏమవుతుంది?       పంచభూతాల్లో ఒకటైన అగ్ని ఎన్నో కర్మలకి సాక్షీ భూతం అని పురాణాలు చెబుతున్నాయి . అగ్ని పవిత్రతకి, శక్తికి మారు పేరు. అందుకే ఆయన సాక్షిగా శ్రీరాముడు మైత్రి చేసుకున్నాడు. అగ్ని పునీత అయిన సీతాదేవిని అయోధ్యకి తీసుకొచ్చి పట్టాభిషిక్తుడయ్యాడు. దేవతలకు అగ్ని పురోహితుడని చెబుతారు. అసలు అగ్నిని సాక్షిగా ఎందుకు పెడతాం.. ముఖ్యంగా వివాహ సమయంలో అగ్ని సాక్షి అని ఎందుకు అంటాం అనే విషయం రుగ్వేదంలో చాలా స్ప‌ష్టంగా ఉంటుంది. వివాహ సమయంలో వరుడు… వధువుకు ప్ర‌మాణం చేస్తాడు.అంటే నీ బాధ్యతని ప్రారంభ కాలంలో సోముడు, ఆ తర్వాత గంధర్వుడు, ఆ తర్వాత అగ్ని తీసుకున్నారు.…

Read More

గుడి ప్రధాన ద్వారం వద్దకు వెళ్లగానే అప్రయత్నంగానే వంగి ద్వారానికి నమస్కారం చేస్తారు. దాదాపు 90శాతం భక్తులు ఇలా చేస్తుంటారు. ఎందుకిలా చేస్తారు, ఆ గడపకి నమస్కరించడం వెనుక ప్రత్యేకమైన కారణం ఉందా?.గుడిలో అడుగుపెట్టే ముందు గడపకి ఎందుకు నమస్కారం చేస్తారు? భగవంతుడి ఆవాసంగా భావిస్తూ ఆరాధించే మందిరమే దేవాలయం. భగవంతుడికి-మానవుడికి మధ్య అనుసంధానం ఈ దేవాలయాలు. భారతదేశ చరిత్రలో అనాదిగా హిందువుల ఆధ్యాత్మిక జీవనాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రభావితం చేయడంలో ఆలయాలు ఘనమైన పాత్ర పోషిస్తున్నాయి. సమాజంలో సమస్త రంగాల వ్యవస్థీకృత రూపకల్పనకు ఆలయాలు తోడ్పాడు అందించాయి. హిందువులు భగవంతుడిని చేరుకునేందుకు ఎన్నో మార్గాలు అవలంభిస్తూ వస్తున్నారు. భారతదేశంలో వైదికపరమైన యజ్ఞయాగాదులతో కూడిన ఆరాధన ఓవైపు… పౌరాణిక మూర్తిమత్వ ఆరాధన మరోవైపు ఏకకాలంలో అభివృద్ధి చెందాయి. యజ్ఞయాగాదులు, వేదాధ్యయనం సమాజంలో కన్ని వర్గాలకే పరిమితమయ్యాయి. కానీ ఆలయ వ్యవస్థ మాత్రం కుల,మత, వర్ణ, లింగ బేధాలకు అతీతంగా అందర్నీ ఒకే…

Read More

చాలామంది ఇల్లు కట్టున్న తర్వాత, ఫ్లాట్ కొనుక్కున్న తర్వాత వాస్తు దోషాలున్నాయేమో అని వాస్తు నిపుణుల్ని సంప్రదిస్తారు. ఇంతకీ వాస్తు దోషం ఎందుకు ఏర్పడుతుంది, వాస్తు దోషం ఉన్నట్టు ఎలా తెలుసుకోవాలి… వాస్తు దోషం ఉందేమో ఎలా చెక్ చేయాలి?        వాస్తు దోషాలు ఏర్పడటానికి ముఖ్యంగా మూడు కారణాలు ఉంటాయి. భూమి కొనే ముందే అన్ని కోణాల్లో భూమి పరీక్ష చేయించాలి. ఎందుకంటే లూజ్ సాయిల్ అయితే అక్కడ కట్టిన ఇల్లు బలంగా ఉండదు. అలాగే నేల అడుగున దేవాలయాలు, శల్యాలు, దుష్ట శక్తుల ఆవాహన ఉన్న ప్రదేశంలో ఇల్లు కట్టినా ఆ ఇంట్లో మనశ్సాంతి ఉండదు. యజమాని నామ నక్షత్రాన్ని బట్టి ఇంటికి సింహ ద్వారాలు ఎక్కడ వుండాలి, ఎన్ని గుమ్మాలు వుండాలి, ఎక్కడెక్కడ వుండాలి, కిటికీలు ఎక్కడ వుండాలో ముందే నిర్ణయించుకోవాలి. అన్నీ చూసుకుని ఇల్లుకట్టుకున్న తర్వాత కూడా ఏదో తేడాఉంది అనిపిస్తే.. ఆ…

Read More

దేవాలయం నీడ ఇంటిపై పడకూడదని చెబుతుంటారు. కారణాలు తెలియక పోయినా పెద్దలు చెప్పారు ఫాలో అయిపోదాం అంటారు. ఇంతకీ కారణమేంటో తెలుసా…దేవాలయం నీడ ఇంటిపై పడితే ఏమవుతుంది..? దేవాలయం పవిత్రమైన స్థలం. ఒక ప్రశాంత మందిరం.. ఆలయంలోకి అడుగుపెట్టగానే బాధలన్నీ మరచిపోయి భక్తులు ఆ దేవుని సన్నిధిలో తన్మయత్వం పొందుతారు. శాస్త్రబద్ధంగా నిర్మించిన ఆలయం ఓ శక్తి కేంద్రం. ఆలయంలో ఎల్లప్పుడూ పూజలు, హోమాలు, యాగాలు జరుగుతుంటాయి. అందువల్ల ఆలయం ఉన్న చోట, గుడినీడ ఇంటిపై పడే చోట ఇల్లు కట్టుకోకూడ దంటారు శాస్త్రం తెలిసిన వారు. కొన్ని సమయాల్లో ఈ శక్తి ఇంటిని ప్రశాంతంగా ఉంచకపోవచ్చు అందుకే పురాతన గుళ్ల చుట్టూ పెద్ద ప్రహరీగోడలు నిర్మించి ఉంటాయి. అయితే గుడి సమీపంలో నివాస స్థలాలు ఉంటే కొంత మంచి, కొంత చెడు రెండూ ఉంటాయంటాయంటాయి ప్రాచీన గ్రంధాలు. స్పాట్.. గుడికి ఆనుకొని ఏ ఇల్లు ఉండకూడదు. ఒకవేళ గుడికి దగ్గర…

Read More

త‌న అన్న కిషోర్ రెడ్డి వైసిపిలో చేర‌డం అఖిల‌కు మైన‌స్ అవుతోందా?..అఖిల‌కు వ్య‌తిరేకంగానేసుబ్బారెడ్డి రాజ‌కీయాలు ఉండ‌బోతున్నాయా?.అఖ‌ల‌కు కుటుంబ స‌భ్యులే ఎందుకు యాంటీ అయ్యారు? క‌ర్నూలు జిల్లాలో భూమా నాగిరెడ్డి కుటుంబం రాజకీయంగా దశాబ్దాల కాలం శాసించింది. నాగిరెడ్డి దంప‌తుల మరణం అనంతరం జిల్లాలో రాజకీయం పూర్తిగా మారిపోయింది. ఆ కుటుంబం ప్రాతనిధ్యం వహిస్తున్న ఆళ్లగడ్డ ఒకప్పుడు ఫ్యాక్షన్‌కు ఖిల్లాగా ఉండేది. ప్రస్తుతం ఆ కుటుంబం నుంచి రాజకీయ వారసురాలిగా భూమా నాగిరెడ్డి కూతురు భూమా అఖిలప్రియ తెలుగుదేశం పార్టీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం పాలైన‌ప్ప‌టికీ.. అనేక వివాదాలు చుట్టుముట్టి న‌ప్ప‌టికీ.. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఆమెకు సీటు ఇవ్వ‌డ‌మే పెద్ద విజ‌య‌మ‌ని ఆమె అనుచరులే వ్యాఖ్యానిస్తుంటారు. అయితే, రాజ‌కీయాల్లో ఏదైనా ఎప్పుడైనా ఏమైనా జ‌ర‌గొచ్చ‌నే వాద‌న ఇప్పుడు కూడా జ‌రిగింది. ఈసారి కచ్చితంగా విజయం సాధిస్తామన్న ధీమాతో దూసుకెళ్తున్న భూమా కుటుంబానికి గట్టి ఎదురుదెబ్బే తగిలింది అని…

Read More

…ఖ‌మ్మం కాంగ్రెస్ ఎంపిగా సుహాసిని పోటీ చేస్తార‌నే ప్ర‌చారంలో వాస్త‌వం ఎంత‌?…సుహాసిని రేవంత్ రెడ్డితో ఎందుకు భేటీ అయ్యారు?…ఇదంతా చంద్ర‌బాబు స్కెచ్ అని ప్ర‌చారం ఎందుకు తెర‌పైకి వ‌చ్చింది? ఎన్టీఆర్ మనవరాలు చంద్రబాబు మేనకోడలు జూనియర్ ఎన్టీఆర్ అక్క అయిన నందమూరి సుహాసిని తెలంగాణా నుంచి మరోసారి తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు ఆమె 2018 లోనే రాజకీయ అరంగేట్రం చేశారు. టీడీపీ తరఫున కూకట్ పల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చూసారు. ఆ ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ కూటమిగా వచ్చినా అక్కడ బీఆర్ఎస్ గెలిచింది. ఆ తరువాత 2023లో టీడీపీ తెలంగాణా ఎన్నికల్లో పోటీ చేయలేదు. దాంతో సుహాసిని కూడా రాజకీయంగా తెలంగాణా లో కనిపించలేదు. ఈ మధ్యలో ఆమె ఏపీ నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తారన్న చర్చ న‌డిచింది. ఆమె వల్లభనేని వంశీని ఓడించడానికి గన్నవరం నుంచి బరిలో ఉంటారని ప్రచారం చేశారు.…

Read More

విడ‌ద‌ల ర‌జ‌నీ వ‌ర్సెస్ మాధ‌వి అన్న తీరుగా గుంటూరు వెస్ట్ రాజ‌కీయాలు మారిపోయాయా?…విడ‌ద‌ల ర‌జ‌నీకి ఉన్న ఇక్క‌డ ఉన్న క్రేజ్ ఎంత‌?..మాధ‌వి పై కూట‌మి ఎఫెక్ట్ ఎంత‌వ‌ర‌కూ ఉంటుంది? ఆంధ్రప్రదేశ్‌ లో అసెంబ్లీ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఇంకా ఎన్నికలకు 40 రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ఇప్పటికే అన్ని పార్టీలు అభ్యర్థులను కూడా ప్రకటించేశాయి. దీంతో అభ్యర్థులు విజయమే లక్ష్యంగా తమ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ఇందులో భాగంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నికల పోరు సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ఇక్కడ ఇద్దరు మహిళా నేతలు నువ్వా.. నేనా అనేరీతిలో ఢీ అంటే ఢీ అంటూ తలపడుతున్నారు. వైసీపీ తరఫున వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరఫున టీడీపీ అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి రంగంలోకి దిగారు. అటు రజిని, ఇటు మాధవి ఇద్దరూ బీసీ…

Read More

త‌న శిష్యుడు అవంతిపై ప్ర‌తీకారం తీర్చుకోవ‌డానికి రెడీ అయ్యాడా?.అస‌లు గంటా పూర్తిగా ఎంట‌ర్ కాక‌ముందే అవంతి అనుచ‌రులు క‌ల‌వ‌ర ప‌డుతున్నారా?ఇక్క‌డ వ‌రుస బెట్టి వైసిపి నేత‌లు టిడిపిలో ఎందుకు చేరుతున్నారు? మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఘటనా ఘటన సమర్ధుడు అని అంటారు. ఆయనకు ఓటమెరుగని నేత అని మరో పేరు ఉంది. ఆయనది పాతికళ్ళ రాజకీయం. ఇప్పటిదాకా గంటా అయిదు ఎన్నికలు చూసారు. కానీ ఏ ఒక్క ఎన్నికల్లోనూ ఓటమి పాలు కాలేదు. అసలు గంటా పొలిటికల్ టూర్ స్టైలే వేరుగా ఉంటుంది. ఆయన విశాఖ జిల్లాలో ఉన్న నాలుగు అసెంబ్లీ సీట్లలోనూ గెలుపొందారు. అందులోనూ పోటీ చేసిన సీట్లో మళ్లీ చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.కానీ రాజకీయ జీవితంలో మొదటిసారి ఆయన పోటీ చేసిన సీటులో మళ్ళీ పోటీకి దిగుతున్నారు. అదే భీమునిపట్నం. అయితే పదేళ్ళ తరువాత ఆయన ఈ ప్రయోగం చేస్తున్నారు. 2014లో భీమిలీ నుంచి పోటీ చేసి…

Read More