Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
భారత రాష్ట్ర సమితి ఏపీ శాఖను ఏర్పాటు చేశారు. అద్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను నియమిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. సంక్రాంతి తరువాత ఏపీలో ఆఫీసు కూడా ప్రారంభిస్తామని చెప్పారు. పార్టీని మరింత విస్తరించేందుకు ఏపీలో భారీ బహిరంగ కూడా సభను ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే కేసీఆర్ ఏపీ పర్యటనకు ముందు ఆయన కొన్ని అంశాలపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఏపీలో నెలకొన్న సమస్యలపై కేసీఆర్ తన విధానం స్పష్టం చేయాల్సి ఉంది. సమస్యలపై బీఆర్ఎస్ విధానం ప్రకటించకుండానే ఏపీలో పార్టీని విస్తరిస్తే జనాలు విశ్వసించే అవకాశం లేదు. గత ఎన్నికల్లో ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టిన కేసీఆర్ వైసీపీకి సహకరించారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రానికి లేఖ రాస్తామన్నారు. కాని ఇప్పటివరకు లేఖ రాయనేలేదు. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ మరుగున పడిపోయిన అంశమే అయినా మూడు రాజధానులపై కేసీఆర్ తన విధానం ప్రకటించాల్సి ఉంది. గతంలో కేటీఆర్ మూడు రాజధానులకు…
అయ్యప్ప స్వామిపై బైరి నరేష్ చేసిన వ్యాఖ్యలను మరవకముందే సరస్వతి అమ్మవారిపై రేంజర్ల రాజేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సరస్వతి మాతపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన రాజేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని హిందుత్వ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే పోరాటాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించాయి. Also Read : బైరి నరేష్ తో బండి సంజయ్ భేటీ – ఆ తరువాతే అసలు కథ..! సరస్వతీ అమ్మవారు చదువుల తల్లి కాదని, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ గిటార్ ఎలా పట్టుకుంటాడో.. అమ్మవారు వీణ అలా పట్టుకుంటుంది కాబట్టి..ఆవిడ మ్యూజిక్ టీచర్ అని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు రాజేష్. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ బాసరలో బంద్ కు పిలుపునిచ్చారు. ఉదయం నుంచే స్వచ్ఛందంగా వ్యాపార సముదాయాలు,…
యాంకర్ శ్రీముఖి త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ కు చెందిన బడా వ్యాపారవేత్తతో శ్రీముఖి ఎఫైర్ నడిపిస్తోందని వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారని ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇరు కుటుంబ సభ్యులు కూడా వీరి ప్రేమకు అంగీకారం తెలిపారని.. త్వరలోనే పెళ్లి కూడా చేసేయాలనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. కోట్లకు పడగలెత్తిన బిగ్ షాట్ ఇంటికి శ్రీముఖి ఇల్లాలిగా వెళ్తున్నారట. ప్రస్తుతం శ్రీముఖి కెరీర్ పీక్స్ స్టేజ్ లో ఉంది. అరడజన్ షో లకు ఆమె యాంకర్ గా చేస్తోంది. ఇటీవల బీబీ జోడి పేరుతో స్టార్ మా లో డ్యాన్స్ రియాలిటీ షో కూడా శ్రీముఖినే యాంకర్. డాన్స్ ఐకాన్ పేరుతో ఆహాలో ఓ షో ప్రసారమైంది. సదరు షోకి కూడా శ్రీముఖి యాంకర్ అండ్ జడ్జిగా వ్యవహరించింది. Also Read : శ్రీముఖి పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అతనా..? ఈ షో లలో మరీ…
ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా ప్రేమలో ఉందన్న సమాచారం వెలుగులోకి వచ్చింది. అయితే ఆ ప్రియుడు ఎవరో కాదు బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ. ఇతనితో ప్రేమలో ఉన్నట్టు సోషల్ మీడియా కోడై కూస్తోంది. వీరు డేటింగ్ లో ఉన్నట్లు నెటిజన్లు చెప్తున్నారు. కొత్త సంవత్సరం వేడుక సందర్బంగా ఈ ఇద్దరూ కలిసి గోవాలో జల్సా చేస్తూ.. ప్రేమ మైకంలో మునిగితేలుతూ ఒక్కరినొకరు ముద్దులు పెట్టుకున్న వీడియోస్ సోషల్ ఇందుకు బలం చేకూర్చుతున్నాయి. 2017 లో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించినా ఎంసిఏ మూవీలో విలన్ పాత్రలో విజయ్ వర్మ నటించాడు. ఇదిలా ఉండగా వీరిద్దరు కలిసి లవ్ స్టోరీ 2వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. మొదటి సరిగా ఈ మూవీ షూటింగ్ లో తమన్నా, విజయ్ వర్మల మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమకు దారితీసినట్లు తెలుస్తోంది. డిసెంబర్…
మనసులో ఏం దాచుకోకుండా మాట్లాడేవారు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఎవరైనా ఉన్నారంటే అందరికీ వెంటనే గుర్తుకొచ్చేది బండ్ల గణేష్. ఆయన నోటి దురుసు కారణంగానే అప్పుడప్పుడు ట్రోలింగ్ కు గురవుతుంటారు. చిక్కుల్లో పడుతుంటారు. వాటిని కవర్ చేసుకునేందుకు పడరాని పాట్లు పడుతుంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే తాజాగా బండ్ల గణేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పై పరోక్ష వ్యాఖ్యలు చేసి మళ్ళీ వార్తలోకెక్కారు. పవర్ స్టార్ తో స్నేహం విషయంలో టాలీవుడ్ డైరక్టర్ త్రివిక్రమ్ ని బండ్ల గణేష్ టార్గెట్ చేస్తున్నారు. తనను పవన్ కళ్యాణ్ దూరం పెట్టడానికి త్రివిక్రమే కారణమని ఆయన భావిస్తున్నట్టున్నారు. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో బండ్ల గణేష్-త్రివిక్రమ్ మధ్య విబేధాలు వెలుగుచూశాయి. బండ్ల గణేష్ త్రివిక్రమ్ ని ఉద్దేశిస్తూ ఫోన్లో అనుచిత వ్యాఖ్యలు చేశాడు. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుకకు త్రివిక్రమ్ నన్ను రాకుండా చేస్తున్నాడని అందులో ఆరోపించారు. ఈ…
పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా హరిహర వీరమల్లు. నిధి అగర్వాల్, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పవన్ స్టార్ కెరీర్లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా హరి హర వీరమల్లు తెరకెక్కుతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇకపోతే, ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ సినిమాను కంప్లీట్ చేసి పాలిటిక్స్ పై ఫోకస్ పెట్టాలని పవన్ భావిస్తున్నారు. ఇందుకోసం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. హైదరాబాద్ లో ప్రత్యేకమైన సెట్స్ లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించి తదుపరి షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. Also Read : హైపర్ ఆదిపై రెచ్చిపోయిన శ్రీరెడ్డి – కారణం రోజానేనా..? ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన వార్త బయటకొచ్చింది. జబర్దస్త్ కమెడియన్, పవర్ స్టార్ అభిమాని హైపర్ ఆది హరిహర వీరమల్లు సినిమాకు రైటర్ గా పని చేస్తున్నాడట. పూర్తిస్థాయిలో కాకుండా కామెడి సీన్స్ కోసం…
నోట్ల రద్దుపై కేంద్రం నిర్ణయం తీసుకోవడం సబబేనా అనే అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సాధారణంగా ఇలాంటి నిర్ణయాలు రిజర్వ్ బ్యాంక్ తీసుకోవాలి కాని, కేంద్రమే తీసుకుంది. దీంతో ఈ నిర్ణయం చట్టబద్దమేనా అనే అంశంపై విచారణ చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టమైన తీర్పు వెలువరించింది. నోట్ల రద్దు సరైన నిర్ణయమేనని స్పష్టం చేసింది. జస్టిస్ ఎస్ఏ నజీర్ ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నోట్ల రద్దుపై విచారణ చేపట్టి సోమవారం తుది తీర్పు వెల్లడించింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో జస్టిస్ నాగరత్న మాత్రమే నోట్ల రద్దును వ్యతిరేకించగా మిగిలిన నలుగురు సమర్ధించారు. 4: 1 మెజార్టీతో సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. ఇక ఇదిలా ఉండగా.. కేంద్రం అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం వలన శిక్షకు గురైన వారి మాటేమిటి..? అన్నది ఎవరూ ఆలోచించడం లేదు. 2016, నవంబర్ ఎనిమిదిన రాత్రి మీడియా ముంగిటకు వచ్చిన ప్రధాని మోడీ సంచలన ప్రకటన…
మయోసైటిస్ వ్యాధితో బాధపడుతోన్న సమంత ఇటీవల సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది. ప్రాణాంతక వ్యాధి ఓ వైపు ఇబ్బంది పెడుతోన్న అభిమానులతో కాసేపు చిట్ చాట్ చేసింది. ఆరు నెలలుగా ఆసుపత్రికే పరిమితమైన సమంత ఆరోగ్యం ఎలా ఉందోనని అభిమానులు అడగ్గా ఆమె షాకింగ్ రిప్లై ఇచ్చింది. ఓ అభిమాని మీరు ఎలా ఉన్నారని అడగగా.. జీవితం ఇంతకు ముందులాగ లేదని సమంత ఎమోషనల్ గా సమాధానం చెప్తుంది. ఆ తర్వాత అభిమానులు నీకు మేము ఉన్నాము. అధైర్య పడొద్దు, నీ ఆరోగ్యం మెరుగుపడడానికి ప్రార్థనలు చేస్తున్నామని పేర్కొన్నారు. అందుకు థ్యాంక్స్ చెబుతూ అభిమానులకు ఎమోషనల్ రిప్లై ఇచ్చింది. దానికి సమంత అందుకు బదులుఇస్తూ మీ అందరి ప్రేమాభిమానాలు, ఆశీస్సులు ఎప్పుడూ ఇలాగే ఉండాలని చెప్తుంది. ఇక సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘శాకుంతలం’ అనే సినిమా వచ్చే నెల 17 వ తారీఖున విడుదల కాబోతుంది..ప్రముఖ డైరెక్టర్ గుణశేఖర్ ఈ…
బాలయ్య హోస్ట్ చేస్తోన్న అన్ స్టాపబుల్ షో పై ఏపీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ షోలో తాను పాల్గొనని స్పష్టం చేశారు. కూతరు కోసం , రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్టీఆర్ ని తప్పు చేసినట్లు చిత్రీకరించిన బాలకృష్ణ షో కు తాను వెళ్లబోనని తేల్చి చెప్పారు. అన్ స్టాపబుల్ లో పాల్గొనాలని గతంలోనే ఆహ్వానించారు. అప్పుడు అసెంబ్లీ సమయం. ఆ సమయంలో బాలయ్య షో లో పాల్గొంటే జనాల్లోకి తప్పుడు సందేశం వెళ్తుందని షో కు రాలేనని చెప్పినట్లు గుర్తు చేశారు రోజా. అన్ స్టాపబుల్ లో చంద్రబాబు ఎపిసోడ్ చూసాక అస్సలు వెళ్లకూడదని డిసైడ్ అయ్యానని స్పష్టం చేశారు రోజా. సినీ ఇండస్ట్రీకి ఎన్టీఆర్ అంటే ఎనలేని గౌరవం ఉంటుందని.. అలాంటి వ్యక్తి మంచి జీవితం ఇచ్చి, ఆస్తులు పంచి ఇస్తే ఆయన్నే తప్పు చేసినట్లు నిరూపించాడు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తిని…
తనను నమ్మి కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చాడు. అందుకు న్యాయం చేయాలనుకుంటారో ఏమో కాని మల్లారెడ్డి మంత్రి అతిగా మాట్లాడుతారు. కాని ఆయన కాన్ఫిడెన్స్ లెవల్ మాత్రం పీక్స్ లో ఉంటాయి. అందుకే మల్లారెడ్డిని పొలిటికల్ జబర్దస్త్ ఆర్టిస్ట్ అంటుంటారు. కడుపుబ్బా నవ్వించేలా ఆయన ప్రెస్ మీట్ ఉంటుంది. ఏపీకెళ్ళి మీడియా ముంగిట ఆయన మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రజలకే కాదు ఏపీ వాసులకు కూడా నవ్వు తెప్పిస్తున్నాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంత్రి మల్లారెడ్డి సోమవారం తిరుమల వెళ్లారు. ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రాలో 175 స్థానాల్లో బీఆర్‌ఎస్ పోటీ చేస్తుందని ప్రకటించారు. ఆంధ్రాలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని తనదైన శైలిలో చెప్పడంతో అక్కడున్న మీడియా ప్రతినిధులు నవ్వు ఆపుకోలేకపోయారు. Also Read : ఆ నలుగురికి కేసీఆర్ బిగ్ షాక్ – మంత్రివర్గం నుంచి ఔట్ బీఆర్ఎస్…