మయోసైటిస్ వ్యాధితో బాధపడుతోన్న సమంత ఇటీవల సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది. ప్రాణాంతక వ్యాధి ఓ వైపు ఇబ్బంది పెడుతోన్న అభిమానులతో కాసేపు చిట్ చాట్ చేసింది. ఆరు నెలలుగా ఆసుపత్రికే పరిమితమైన సమంత ఆరోగ్యం ఎలా ఉందోనని అభిమానులు అడగ్గా ఆమె షాకింగ్ రిప్లై ఇచ్చింది.
ఓ అభిమాని మీరు ఎలా ఉన్నారని అడగగా.. జీవితం ఇంతకు ముందులాగ లేదని సమంత ఎమోషనల్ గా సమాధానం చెప్తుంది. ఆ తర్వాత అభిమానులు నీకు మేము ఉన్నాము. అధైర్య పడొద్దు, నీ ఆరోగ్యం మెరుగుపడడానికి ప్రార్థనలు చేస్తున్నామని పేర్కొన్నారు. అందుకు థ్యాంక్స్ చెబుతూ అభిమానులకు ఎమోషనల్ రిప్లై ఇచ్చింది.
దానికి సమంత అందుకు బదులుఇస్తూ మీ అందరి ప్రేమాభిమానాలు, ఆశీస్సులు ఎప్పుడూ ఇలాగే ఉండాలని చెప్తుంది. ఇక సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘శాకుంతలం’ అనే సినిమా వచ్చే నెల 17 వ తారీఖున విడుదల కాబోతుంది..ప్రముఖ డైరెక్టర్ గుణశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ నిర్మించాడు.. దిల్ రాజు సహనిర్మాత గా వ్యవహారించాడు.