Author: Prashanth Pagilla

తెలంగాణలో పసుపు బోర్డు , రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ఎట్టకేలకు కేంద్రం స్పందించింది. పార్లమెంట్ వేదికగా తన వైఖరిని స్పష్టం చేసింది. తెలంగాణలో పసుపు బోర్డు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే ప్రతిపాదనలు ఏవి తమ వద్ద లేవని తేల్చి చెప్పింది. పసుపు బోర్డు , రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఎంపీలు వెంకటేష్ నేత, దయాకర్ , రంజిత్ రెడ్డి , కవితలు కేంద్రాన్ని ప్రశ్నించారు. పసుపు బోర్డుపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పలుమార్లు కేంద్రాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. కానీ కేంద్రం దాటవేస్తూ వచ్చింది. ఇప్పుడు బీఆర్ఎస్ ఎంపీలు కూడా కేంద్రాన్ని నిలదీయడంతో కేంద్రం తన వైఖరిని స్పష్టం చేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాటిని తెలంగాణలో ఏర్పాటు చేయలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్రమంత్రి అనుప్రియ పటేల్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. దేశంలో పసుపు బోర్డు లేదా మరేదైనా బోర్డును ఏర్పాటు…

Read More

మాట ఇచ్చాడంటే.. మాట తప్పడంతే. ఈ డైలాగ్ గుర్తుంది కదా. ఏపీ ఎన్నికల ప్రచారం మొదలుకొని సీఎంగా ప్రమాణస్వీకార సభలోనూ జగన్ నోటి నుంచి పదేపదే జాలువారిన డైలాగ్ ఇది. విద్యుత్ ఒప్పందాలను సమీక్షించి ,కరెంట్ చార్జీలను తగ్గిస్తానని ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రోజే జగన్ హామీ ఇచ్చారు. జగన్ మాటను జనాలు పూర్తిగా నమ్మారు. మాటకు కట్టుబడి ఉంటాడని అనుకున్నారు. కానీ జనాల నమ్మకాన్ని జగన్ వమ్ము చేస్తున్నారు. నాలుగేళ్ల వైసీపీ పాలనలో కరెంట్ చార్జీలను తగ్గించడం దేవుడెరుగు. వరుసగా చార్జీలను పెంచుకుంటూ ప్రజలపై భారం మోపుతూ ఇచ్చిన హామీని విస్మరిస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో ఏకంగా ఏడు సార్లు కరెంట్ చార్జీలను పెంచారు. మరోసారి కరెంట్ చార్జీలను పెంచేందుకు రెడీ అయ్యారు. ట్రూ అప్ పేరుతో ప్రతీ నెలా బాదేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ మేరకు ఏపీఈఆర్‌సీ నుంచి అనుమతి తెచ్చుకున్నారు. ట్రూ అప్…

Read More

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బాగోతం మెల్లగా బయటపడుతోంది. ఒక్కొక్కరి అసలు రంగు బయటకు వస్తోంది. ఇటీవలే స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య రాసలీలల పర్వం బయటకు రాగా తాజాగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య లైంగిక వేధింపుల బాగోతం బయటకొచ్చింది. డెయిరీ వ్యాపారం నిర్వహించే ఓ మహిళా వ్యాపారిని వేధిస్తోన్న ఆడియోతోపాటు వాట్సప్ చాట్లు వెలుగులోకి వచ్చాయి. దీంతో దుర్గం చిన్నయ్య కామకేళి మీడియాలో హైలెట్ అవుతోంది. డెయిరీ వ్యాపారాన్ని విస్తరించేందు కోసం ఆ సంస్థ సీఈవో ఎమ్మెల్యేను కలిశారు. ఇందుకు సహకరించాలంటే తన వద్దకు అమ్మాయిల్ని పంపాలని దుర్గం చిన్నయ్య ఒత్తిడి చేశారని ఆ మహిళా వ్యాపారి ఆరోపిస్తున్నారు. దుర్గం చిన్నయ్య వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో ఎమ్మెల్యేలపై పోలీసులు చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారని తెలిపింది. అయితే ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తోన్న మహిళా వ్యాపారి కూడా…

Read More

ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ మరోసారి విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తోంది. ఆమె ఫోన్లలోని డేటాని రికవరీ చేసి పరిశీలించిన అనంతరం కవితకు నోటిసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కవిత తరుఫు న్యాయవాది సోమా భరత్ సమక్షంలో కవిత ఫోన్లను ఓపెన్ చేసిన అధికారులు ఆమె ఫోన్లో డిలీట్ అయిన డేటాను రికవరీ చేసే పనిలో పడ్డారు. ఇందుకోసం సాంకేతిక నిపుణుల సహాయం తీసుకుంటున్నారు. కవిత ఈడీ అధికారులకు సమర్పించిన పది ఫోన్లలోని డేటాను మొత్తం సేకరించిన తరువాత ఆమెకు మరోసారి విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తోంది. ఏమాత్రం అత్యుత్సాహం ప్రదర్శించకుండా సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతున్నది ఈడీ. రాజకీయ పరమైన కేసు కావడంతో స్మూత్ గా ఈ కేసును డీల్ చేస్తోంది. కవిత తమకు సమర్పించిన ఫోన్లలో డేటా రికవరీ చేయనున్నామని మంగళవారం ఈడీ కవితకు లేఖ రాసింది. ఇందుకోసం ఈడీ ఎదుట మీరైన…

Read More

మోడీపై రాజకీయ విమర్శ చేసిన కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ లోక్ సభ సెక్రటేరియట్ ఉత్తర్వులు జారీ చేసింది. రాహుల్ గాంధీపై వేటు పడటంతో కేరళలోని వయనాడ్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుందా.?అనేది బిగ్ డిబేట్ గా మారింది. తాజాగా కర్నాటక ఎన్నికలకు ఈసీ సిద్దం అవుతుండటంతో వయనాడ్ ఉప ఎన్నికకు కూడా నోటిఫికేషన్ ఇస్తారా అనే చర్చ జరుగుతోంది. రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడటంతో వయనాడ్ స్థానం ఖాళీ అయినట్లుగా అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. దాంతో ఉప ఎన్నిక నిర్వహణపై తాజాగా భారత ఎన్నికల సంఘం స్పందించింది. ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంటుందా..? లేదా అనే అంశంపై ఆచితూచి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఏదైనా ఖాళీ అయిన నియోజకవర్గంలో ఉప ఎన్నిక నిర్వహించేందుకు…

Read More

వైఎస్ వివేకా హత్యకేసులో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయాలు తీసుకుంది. దర్యాప్తు అధికారినున్న రాంసింగ్ ను విచారణ నుంచి తప్పించింది. మరో అధికారి నేతృత్వంలో విచారణకు ఆదేశించింది. రాంసింగ్ నేతృత్వంలో విచారణ ఆలస్యం అవుతుందన్న జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం..సీబీఐ ప్రత్యేక సిట్ ఏర్పాటు ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కేసు విచారణ కోసం ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక సిట్ లో చౌరాసియా నేతృత్వంలో ఆరుగురు సభ్యులు ఉంటారు. వివేకా కేసులో కుట్ర కోణాన్ని త్వరగా వెలికితీయాలని సీబీఐ సిట్ ను ఆదేశించింది ఉన్నత న్యాయస్థానం. ఈ సీబీఐ సిట్ లో ఐపీఎస్ అధికారి, ఎస్పీ వికాస్ కుమార్, అడిషన్ ఎస్పీ ముఖేష్ శర్మ, ఇన్‌స్పెక్టర్ ఎస్.శ్రీమతి, మరో ఇన్‌స్పెక్టర్ నవీన్ పునియా, సబ్ ఇన్‌స్పెక్టర్ అంకిత్ యాదవ్ సభ్యులుగా ఉండనున్నారు. వివేకా కేసు విచారణను ఏప్రిల్ 30లోగా ముగించాలని సుప్రీంకోర్టు గడువు విధించింది. ఆరు నెలల్లోగా ట్రయల్…

Read More

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అద్యక్షుడు బండి సంజయ్ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నారు. బీకాంలో ఫిజిక్స్ ఉంటుందని వ్యాఖ్యానించి నవ్వులపాలైన జలీల్ ఖాన్ తరహాలో బండి సంజయ్ కూడా ఓ ప్రశ్నకు సమాధానమిచ్చి అడ్డంగా బుక్ అయ్యాడు. ఓ యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బండి సంజయ్ తన తండ్రి ఉద్యోగం గురించి చెబుతూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రోల్‌ అవుతున్నాయి. ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన పలు ప్రశ్నలకు బండి సంజయ్ ఓపికగా సమాధానం చెప్పారు. తెలంగాణ ఆర్ధిక స్థితిగతులు, బీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలపై వివరించారు. గులాబీ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీనేనని వ్యాఖ్యానించారు. కేంద్రం తెలంగాణకు చేయూతనిస్తోన్న కేసీఆర్ తన వైఫల్యాన్ని కేంద్రంపై నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇదంతా బాగానే ఉంది కానీ తన బ్యాక్ గ్రౌండ్ గురించి చెబుతూ సంజయ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇంటర్వ్యూలో భాగంగా మీ నాన్నగారు ఏం చేస్తుంటారని బండి…

Read More

ఏపీలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొంతమంది మంత్రుల పనితీరుతో అసంతృప్తిగానున్న జగన్…అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ప్రస్తుత క్యాబినెట్ తో ఎన్నికలకు వెళ్తే వచ్చే ఎన్నికల్లో పరాభవం తప్పదని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. ప్రతిపక్షాల విమర్శలు, ఆరోపణలను సరైన రీతిలో తిప్పికొట్టడంలో కొంతమంది మంత్రులు నిర్లక్ష్యంగా ఉన్నారు. ఎప్పటికప్పుడు ప్రతిపక్షాలకు సరైన కౌంటర్ ఇచ్చి వారి నోరు మూయించాలని జగన్ ప్రతిసారి చెబుతూనే ఉన్నారు. కాని ఎవరూ ప్రతిపక్షాలకు సరైన కౌంటర్లను పేల్చలేకపోతున్నారు. అదే సమయంలో ప్రభుత్వ పథకాలను వివరించడంలో కొంతమంది మంత్రులు విఫలం అవుతున్నారని జగన్ ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మరోసారి క్యాబినెట్ పునర్ వ్యవస్థీకరణ చేపట్టాలని జగన్ భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. గత ఏడాది ఏప్రిల్ 11న మంత్రివర్గ విస్తరణ చేపట్టిన జగన్..ఇదే టీంతో ఎన్నికలకు వెళ్తామని అప్పట్లో స్పష్టం చేశారు. కానీ ప్రస్తుత…

Read More

పార్లమెంట్ సభ్యుడి అనర్హత వేటుపై లోక్ సభ సెక్రటేరియట్ కీలక నిర్ణయం తీసుకుంది. అనర్హత వేటును వెనక్కి తీసుకుంటున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇది రాహుల్ గాంధీ విషయంలో కాదు. లక్ష్యదీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్ విషయంలో. మహ్మద్ ఫైజల్ పై 2016 జనవరి 5న హత్యాయత్నం కింద అండ్రోథ్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసు కొనసాగుతుండగానే ఆయన 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో  ఎన్సీపీ తరుఫున పోటీ చేసి గెలిచారు. ఆయనపై నమోదైన కేసు విషయంలో ఈ ఏడాది జనవరి 11న ఫైజల్ కు పదేళ్ళ జైలు శిక్షను విధిస్తూ కోర్టు తీర్పునివ్వడంతో ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని లోక్ సభ సెక్రటేరియట్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. తనకు విధించిన శిక్షపై కేరళ హైకోర్టులో ఫైజల్ అప్పీల్ చేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఫైజల్ నిర్దోషి అని తీర్పు వెలువరించింది. ఆయనపై అనర్హత…

Read More

టాలీవుడ్ యంగ్ అండ్ మాస్ హీరో విశ్వక్ సేన్ గత మూవీ ప్రమోషన్ ఎంత వాయిలెంట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టీవీ9 లేడి జర్నలిస్ట్ దేవి నాగవల్లి హీరో విశ్వక్ సేన్ ని స్టూడియోకి పిలిచి ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ ప్రారంభమైయ్యాక కాసేపు చర్చ బాగానే జరిగింది. ఈ నేపథ్యంలో ఇద్దరికీ చెడింది. అసలు నా క్యారెక్టర్ ను తప్పుబట్టడానికి మీరెవరు అంటూ దేవి నాగవల్లి మీద విశ్వక్ సేన్ ఫైర్ అయ్యాడు. దాంతో ఆగ్రహానికి లోనైన దేవి నోరు జారారు. గెట్ అవుట్ మై స్టూడియో అంటూ రూడ్ గా వార్నింగ్ ఇచ్చింది. దేవి వార్నింగ్ తో ఆగ్రహానికి గురైన విశ్వక్ సేన్ వెంటనే మైక్ తీసేసి స్టూడియో నుంచి వెళ్ళిపోయాడు. ఈ గొడవ అప్పట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో కొందరు దేవికి మద్దతుగా నిలవగా…మరికొందరు విశ్వక్ సేన్ కు సపోర్ట్ గా…

Read More