ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా ప్రేమలో ఉందన్న సమాచారం వెలుగులోకి వచ్చింది. అయితే ఆ ప్రియుడు ఎవరో కాదు బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ.
ఇతనితో ప్రేమలో ఉన్నట్టు సోషల్ మీడియా కోడై కూస్తోంది. వీరు డేటింగ్ లో ఉన్నట్లు నెటిజన్లు చెప్తున్నారు. కొత్త సంవత్సరం వేడుక సందర్బంగా ఈ ఇద్దరూ కలిసి గోవాలో జల్సా చేస్తూ.. ప్రేమ మైకంలో మునిగితేలుతూ ఒక్కరినొకరు ముద్దులు పెట్టుకున్న వీడియోస్ సోషల్ ఇందుకు బలం చేకూర్చుతున్నాయి.
2017 లో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించినా ఎంసిఏ మూవీలో విలన్ పాత్రలో విజయ్ వర్మ నటించాడు. ఇదిలా ఉండగా వీరిద్దరు కలిసి లవ్ స్టోరీ 2వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. మొదటి సరిగా ఈ మూవీ షూటింగ్ లో తమన్నా, విజయ్ వర్మల మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమకు దారితీసినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 21వ తేదీన తమన్నా పుట్టిన రోజు కావడంతో విజయ వర్మ తమన్నా నివాసంలో ఆమె పుట్టిన రోజు వేడుకలను నిర్వహించినట్లు సమాచారం.
గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ లవ్ బర్డ్స్ తరుచుగా పలు ఈవెంట్లకు హాజరు అవుతున్నారు. మరి.. వీరి ప్రేమ వ్యవహారం పెళ్లి పీటల వరకు వెళ్తుందో..? లేదా మధ్యలో బ్రేకప్ అవుతుందో చూడాలి.