ఈసారి వైకాపా కాకినాడ పార్లమెంట్ టిక్కెట్ బలిజ అశోక్ కు కన్ఫర్మ్ అయిపోయింది. పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగానికి ఎస్పీగా పనిచేస్తున్న సత్య యేసుబాబుకు ఈయన స్వయానా పిల్లనిచ్చిన మామ అవుతారు. యేసుబాబు సీఎం జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ప్రతిరోజూ పొలిటికల్ రిపోర్ట్ నివేదికలు అందజేస్తారు. సీఎం జగన్ రెడ్డికి సన్నిహితుడికి మామ కావడంతో టిక్కెట్ రావడం సులభతరం అయ్యింది. బలిజ అశోక్ గతంలో ఇండియన్ రైల్వేస్ లో పనిచేశారు. అక్కడ కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆయన మేకపాటి కుటుంబానికి చెందిన కేఎంసీ కంపెనీలో సలహాదారుడిగా పనిచేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆ కంపెనీలపై కూడా సీబీఐ, ఈడీ దాడులు జరిగాయి. పలు కేసుల్లో కూడా బలిజ అశోక్ ముద్దాయిగా ఉన్నారు. అంతేకాకుండా మేకపాటి కుటుంబానికి చెందిన కంపెనీల్లో అశోక్ కు కీలక బాధ్యతలున్నాయి. ఇలాంటి వ్యక్తికి వైకాపా కాకినాడ పార్లమెంట్ టిక్కెట్ ఇవ్వడంపై స్థానిక వైకాపా శ్రేణులు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నాయి.
2019లో బలిజ అశోక్ కాకినాడ పార్లమెంట్ వైకాపా టిక్కెట్ ఆశించారు. అప్పుడు వైకాపా అధిష్టానం వంగ గీతకు టిక్కెట్ కేటాయించింది. అప్పటి నుంచి బలిజ అశోక్ వైకాపా నాయకులతో సన్నిహితంగా ఉంటూ వ్యాపార సంబంధాలు బలోపేతం చేసుకున్నారు. అయితే ఈయనకు కాకినాడలో స్థానికంగా గానీ, సామాజికంగా గానీ, ప్రజల్లో గాని ఎటువంటి పేరు లేదు. ఎన్నడూ కూడా సామాజిక, రాజకీయ కార్యక్రమాలను చేసినట్లుగా తెలియదు. అకస్మాత్తుగా ఇటువంటి వ్యక్తికి టిక్కెట్టు కేటాయిస్తారని వార్తలు రావడం పట్ల సీనియర్ వైకాపా నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎంత వ్యాపారవేత్త, ఇంటెలిజెన్స్ ఎస్పీకి స్వయానా పిలనిచ్చిన మామ అయ్యి వైకాపా నేతలతో స్నేహం ఉంటే మాత్రం టిక్కెట్ ఇచ్చేస్తారా అని వారు ప్రశ్నిస్తున్నారు.