పీసీసీ చీఫ్ గా నియామకమై పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. దాంతో ఆయన అటు పార్టీ, పాలనపరమైన అంశాలపై ఫోకస్ చేయడం కష్టమే. దాంతో నెక్స్ట్ పీసీసీ ఎవరు అనేది..? బిగ్ డిబేట్ గా మారింది.
గతంలో రేవంత్ తోపాటు పీసీసీని ఆశించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డి, జీవన్ రెడ్డి.. లాంటి వాళ్ళలో కోమటిరెడ్డి మంత్రి అవ్వగా.. మిగతా ఇద్దరు నేతలు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దాంతో ఈ ఇద్దరిలోసీనియర్ నేతగా అనుభవమున్న జీవన్ రెడ్డికి పీసీసీ ఇస్తారా..? అనే చర్చ జరుగుతోంది.
సీఎం పదవిని రెడ్డి సామజిక వర్గానికే ఇచ్చారు. ఇప్పుడు పీసీసీని కూడా అదే వర్గానికి ఇచ్చే అవకాశం లేదు. దాంతో బీసీ నేతకు పీసీసీ పదవి అప్పగించే అవకాశం ఉంది. రేవంత్ పీసీసీ పదవికి రాజీనామా చేయగానే ఢిల్లీ వెళ్లి ఆయన సూచన మేరకు పార్టీ అధ్యక్షుడిని అధిష్టానం నియమించే అవకాశం ఉంది.
రాహుల్ కు అత్యంత సన్నిహితుడు అయినా మధు యష్కీ పీసీసీ అధ్యక్షుడి రేసులో ఉన్నారు. ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన మధు యష్కీ ఎమ్మెల్సీగా, మంత్రివర్గంలో చోటు కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే బీసీ సామజిక వర్గానికి చెందిన ఆయన్ను పీసీసీ అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉంది.