Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
ఈసారి వైకాపా కాకినాడ పార్లమెంట్ టిక్కెట్ బలిజ అశోక్ కు కన్ఫర్మ్ అయిపోయింది. పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగానికి ఎస్పీగా పనిచేస్తున్న సత్య యేసుబాబుకు ఈయన స్వయానా పిల్లనిచ్చిన మామ అవుతారు. యేసుబాబు సీఎం జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ప్రతిరోజూ పొలిటికల్ రిపోర్ట్ నివేదికలు అందజేస్తారు. సీఎం జగన్ రెడ్డికి సన్నిహితుడికి మామ కావడంతో టిక్కెట్ రావడం సులభతరం అయ్యింది. బలిజ అశోక్ గతంలో ఇండియన్ రైల్వేస్ లో పనిచేశారు. అక్కడ కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆయన మేకపాటి కుటుంబానికి చెందిన కేఎంసీ కంపెనీలో సలహాదారుడిగా పనిచేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆ కంపెనీలపై కూడా సీబీఐ, ఈడీ దాడులు జరిగాయి. పలు కేసుల్లో కూడా బలిజ అశోక్ ముద్దాయిగా ఉన్నారు. అంతేకాకుండా మేకపాటి కుటుంబానికి చెందిన కంపెనీల్లో అశోక్ కు కీలక బాధ్యతలున్నాయి. ఇలాంటి వ్యక్తికి వైకాపా కాకినాడ పార్లమెంట్ టిక్కెట్ ఇవ్వడంపై స్థానిక వైకాపా శ్రేణులు ఆశ్యర్యం…
సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. తాము పాలకులం కాదు…సేవకులమని ప్రమాణస్వీకార సభలో ప్రకటించిన రేవంత్ అన్నట్టుగానే సాగుతున్నారు. రేవంతన్నా అని పిలవండి చాలు.. మీ సేవకుడిగా మీ కోసం పాటుపడుతానని ప్రకటించినట్లుగానే ప్రజలకు నమ్మకం కల్గిస్తున్నారు. ఆదివారం యశోదా ఆసుపత్రిలో మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించి రేవంత్ బయటకు వెళ్తుండగా… ఓ మహిళా రేవంతన్నా అని పిలిచింది. వెంటనే ఆమె వద్దకు వెళ్లిన రేవంత్ ఏమైందని అడగ్గా తన పాపకు ఇప్పటికే చాలా ఖర్చు అయిందని ఏడ్చుతూ చెప్పింది. వెంటనే ఏం బాధపడకు.. అంటూ వైద్యాధికారులను పిలిచి ఆ పాప వైద్యానికి సహాయం చేయాలనీ ఆదేశించారు. నిన్నటి ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చెప్పినట్టుగానే సేవకుడిగా సేవలు అందిస్తున్నాడని రేవంత్ ను అభినందిస్తున్నారు.
పీసీసీ చీఫ్ గా నియామకమై పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. దాంతో ఆయన అటు పార్టీ, పాలనపరమైన అంశాలపై ఫోకస్ చేయడం కష్టమే. దాంతో నెక్స్ట్ పీసీసీ ఎవరు అనేది..? బిగ్ డిబేట్ గా మారింది. గతంలో రేవంత్ తోపాటు పీసీసీని ఆశించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డి, జీవన్ రెడ్డి.. లాంటి వాళ్ళలో కోమటిరెడ్డి మంత్రి అవ్వగా.. మిగతా ఇద్దరు నేతలు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దాంతో ఈ ఇద్దరిలోసీనియర్ నేతగా అనుభవమున్న జీవన్ రెడ్డికి పీసీసీ ఇస్తారా..? అనే చర్చ జరుగుతోంది. సీఎం పదవిని రెడ్డి సామజిక వర్గానికే ఇచ్చారు. ఇప్పుడు పీసీసీని కూడా అదే వర్గానికి ఇచ్చే అవకాశం లేదు. దాంతో బీసీ నేతకు పీసీసీ పదవి అప్పగించే అవకాశం ఉంది. రేవంత్ పీసీసీ పదవికి రాజీనామా చేయగానే ఢిల్లీ వెళ్లి ఆయన సూచన మేరకు పార్టీ అధ్యక్షుడిని అధిష్టానం నియమించే…
ఔను.. ఆశ్చర్యకరంగా అనిపించినా ఇది నిజం. ఇదే నిజం. ఎందుకో తెలుసా? కేసీఆర్ ను ఓడించాలనే కసిని రేవంత్ లో ప్రేరేపించింది మరెవరో కాదు… స్వయంగా కేసీఆరే. కోవర్ట్ ఆపరేషన్ తో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని ప్లాన్డ్ గా ఇరికించి కేసీఆర్.. తన ఓటమికి తొలి బీజం వేసుకున్నారు. ఆపై జన్వాడ ఫామ్ హౌజ్ ఘటనలో బెయిల్ రాకుండా అడ్డుకొని, డిటెన్షన్ సెల్లో ఉగ్రవాది తరహాలో బంధించి రేవంత్ ను మరింత రెచ్చగొట్టారు. అప్పటివరకు ప్రభుత్వ విధానాలపైనే కొనసాగుతూ వచ్చిన రేవంత్ రెడ్డి పోరాటం.. ఈ రెండు ఘటనలతో కేసీఆర్ టార్గెట్ గా సాగింది. ఆయనను గద్దె దించడమే రేవంత్ రెడ్డి లక్ష్యంగా మారింది. అది మొదలు..కేసీఆర్ తనపై సంధిస్తున్న అస్త్రాలను ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేస్తూ..ఆయనకు కంటిమీద కునుకు లేకుండా చేస్తూ వచ్చాడు రేవంత్ రెడ్డి. కోవర్ట్ ఆపరేషన్ తో టీడీపీని కకావికలం చేసి, రేవంత్ రెడ్డికి రాజకీయంగా…
సోమాజిగూడ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్య వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.ప్రభుత్వం తరుఫున పూర్తి సహకారం అందిస్తామని..ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యలపై కేసీఆర్ సలహాలు, సూచనలు అవసరమని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ బాత్రూం లో జారి పడినట్లు తెలియగానే వైద్యశాఖ ఉన్నతాధికారి ని ఆసుపత్రికి పంపించారు రేవంత్. మొన్న జరిగిన రివ్యూలోనూ కేసీఆర్ హెల్త్ పై రేవంత్ ఆరా తీశారు. తాజాగా యశోదా ఆసుపత్రికి వెళ్లి స్వయంగా కేసీఆర్ ను పరామర్శించారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి తర్వాత పాలిటిక్స్ హాట్, హాట్ గా మారిన నేపథ్యంలో కేసీఆర్ ను రేవంత్ పరామర్శించడం రాజకీయాలకు ఆరోగ్యకరమైన వాతావరణం అద్దినట్లు అయింది. 2018 ఎన్నికల తర్వాత కేసీఆర్, రేవంత్ ఎదురుపడలేదు. ఆ తర్వాత కేసీఆర్, రేవంత్ ల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్ లో…
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా 1. కొడంగల్ – రేవంత్ రెడ్డి 2. నారాయణ పేట – ఎర్ర శేఖర్ 3. జడ్చర్ల – అనిరుధ్ రెడ్డి 4. షాద్ నగర్ – వీర్లపల్లి శంకర్ 5. కొల్లాపూర్ – జూపల్లి కృష్ణారావు 6. అచ్చంపేట – వంశీకృష్ణ 7. అలంపూర్ – సంపత్ కుమార్ 8. మక్తల్ – కొత్తకోట సిద్దార్థ రెడ్డి 9. దేవరకద్ర – జీ మధుసూధన్ రెడ్డి 10. వనపర్తి – మేఘారెడ్డి 11. గద్వాల్ – సరిత తిరుపతయ్య 12. కల్వకుర్తి – కసిరెడ్డి నారాయణ రెడ్డి 13. నాగర్ కర్నూల్ – కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి 14. మహబూబ్ నగర్ – యెన్నం శ్రీనివాసరెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లా 15. హుజూర్ నగర్ – ఉత్తమ్ కుమార్ రెడ్డి 16.కోదాడ – పద్మావతి 17. నల్లగొండ – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 18.…
తుక్కుగూడ వేదికగా కాంగ్రెస్ అగ్రనేతల త్రయం సోనియా గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు ప్రకటించిన ఆరు గ్యారంటీలు బీఆర్ఎస్ పెద్దలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నట్టు ఉన్నాయి. అతిశయోక్తి అనిపించినా బీఆర్ఎస్ మ్యానిఫెస్టో లీకులు చూస్తుంటే నిజమేనని అనిపించక మానదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల తర్వాత కాంగ్రెస్ తిరుగులేని ఆధిపత్యం చాటుతోంది. దాదాపు అన్ని సర్వేలూ కాంగ్రెస్ కు ఎడ్జ్ ఉందని తెల్చుతున్నాయి. ఒకటి రెండు సర్వేలో కేవలం రెండు శాతం ఓట్ల తేడాతో మాత్రమే కాంగ్రెస్ వెనుకంజలో ఉందని తేల్చుతున్నాయి. ఆరు గ్యారంటీలు బాగున్నాయని 52శాతం మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అమలు కూడా చేస్తుందని 48శాతం మంది కాంగ్రెస్ పై విశ్వాసం ఉంచారు. దీంతో బీఆర్ఎస్ లో అలజడి ప్రారంభమైంది. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలకు ధీటుగా హామీలు ఇవ్వాలని బీఆర్ఎస్ అన్వేషణ మొదలు పెట్టింది. ప్రొఫెసర్లు, రాజకీయ మేధావులు, నిపుణులతో చర్చించింది. చివరికి…
కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ప్రకటించిన నాటి నుంచే బీఆర్ఎస్ నేతల ఏడుపు మొదలైంది. అసలు ఆ పథకాలు అమలు సాధ్యం కాదని గగ్గోలు పెట్టారు. ప్రజలను మోసం చేసేందుకే ఇలాంటి ఆచరణ సాధ్యం కాని హామీలను ఇస్తున్నారని కేటీఆర్, హరీష్ తో సహా ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రకటించారు. కట్ చేస్తే కాంగ్రెస్ ఆరు గ్యారంటీలకు కౌంటర్ గా రూపొందించిన బీఆర్ఎస్ హామీలు లీక్ అవుతుండటంతో..ఈ హామీలను ఎలా అమలు చేస్తారు..? అనేది అందరి మదిలో కల్గుతున్న ప్రశ్న. కాంగ్రెస్ ప్రకటించిన మహా లక్ష్మీ పథకం ద్వారా ప్రతి నెలా మహిళకు రూ.2500 ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. దీంతో వీటికి నిధులు ఎక్కడి నుంచి తెస్తారని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. రాష్ట్ర బడ్జెట్ ను అంచనా వేయకుండా ఇలా హామీలు ఇవ్వడం ఎంటని ప్రశ్నించారు. కానీ , ఇప్పుడు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ పథకాన్ని కాపీ కొడుతూ అదే తరహా పథకం…
వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీనంపై కాంగ్రెస్ పార్టీ ఏదో ఓ నిర్ణయాన్ని వెలువరించాలని షర్మిల డెడ్ లైన్ విధించిన సంగతి తెలిసిందే. నేటితో డెడ్ లైన్ ముగిసినా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. దీంతో షర్మిల ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..? అనేది ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు షర్మిల ఆసక్తి కనబరిచినా కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం అందుకు సానుకూలతగా లేదు. సీమాంధ్ర మూలాలు కల్గిన షర్మిలను కాంగ్రెస్ లో చేర్చుకోవడం ద్వారా బీఆర్ఎస్ కు మళ్ళీ అస్త్రాన్ని ఇచ్చినట్లు అవుతుందని.. షర్మిల చేరిక విషయంలో హైకమాండ్ రాజకీయ పరమైన ఆలోచనలు చేసింది. ఆమె కాంగ్రెస్ లో చేరికతో బీఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగోడుతుందని అంచనా వేసి షర్మిల చేరికకు రెడ్ సిగ్నల్ ఇచ్చేసింది. వైఎస్సార్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు హైకమాండ్ విధించిన షరతులకు షర్మిల…
తెలంగాణ గవర్నర్ తమిళ సై చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశం అవుతున్నాయి. ఇటీవల నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను గవర్నర్ రిజెక్ట్ చేయడంతో మంత్రులు తమిళ సై పై తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె అందుకు కౌంటర్ గా తాజాగా మాటల తూటాలను పేల్చినట్లు స్పష్టం అవుతోంది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించడంతో రాజ్ భవన్ లో గవర్నర్ తాజాగా కృతజ్ఞత సభను ఏర్పాటు చేశారు. మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించిన ప్రధానమంత్రి మోడీకి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ సభలో తమిళ సై మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. గవర్నర్ గా తాను బాధ్యతలు చేపట్టే నాటికి కేబినెట్ లో ఒక్క మహిళా మంత్రి లేరు. తాను వచ్చాక ఇద్దరు మహిళా మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించానని తమిళ సై గుర్తు చేశారు. మహిళలకు మంత్రులుగా అవకాశం రావడం.. తను వారితో ప్రమాణస్వీకారం చేయించడం…