Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Admin
పుష్ప క్రేజ్ తో వాపును చూసి బలుపు అనుకున్నాడు బన్నీ. అది ఆయన తప్పిదమా? లేకపోతే చుట్టూ ఉన్న మందీ మార్భలం చూపించిన అత్యుత్సాహమా? అన్న చర్చ విస్తృతంగా నడుస్తోంది. నిజానికి అల్లు అర్జున్ అరెస్టు విషయంలో పోలీసులు ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదు. సెలబ్రెటీ అరెస్టు కాబట్టి శాంతిభద్రతల సమస్యను దృష్టిలో పెట్టుకొని ముందస్తు చర్యలు కూడా తీసుకున్నారు. అందుకే మొత్తం ఎపిసోడ్ చాలా ప్రశాంతంగా సాగింది. ఆయన్ను అదుపులోకి తీసుకోవడం తర్వాత నిబంధనల ప్రకారం ఆస్పత్రికి, కోర్టుకు తీసుకెళ్లడంలో ఎక్కడా జాప్యం చేయకుండా కట్టుదిట్టంగా సాగింది ప్రక్రియ. దీనిపై పోలీసు శాఖను ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు. అయితే అసలు అల్లు అర్జున్ అరెస్టుకు ఆయన సొంత మేనేజర్ చేసిన నిర్వాకమే కారణమన్న విషయం బయటకు పొక్కింది. సంధ్యా థియేటర్ ఘటనపై రెండు రోజుల తర్వాత స్పందించిన అల్లు అర్జున్…బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. దీంతో అంతా ప్రశాంతమే అనుకున్నారు.…
ఊర్లో పెళ్లికి కుక్కల హడావుడి అంటే తెలుసు కదా! ఇప్పుడు తెలంగాణలో ప్రతిపక్షాల పని అలాగే ఉంది. చట్టం తనపని తాను చేసుకుంటూ వెళ్తుంటే ప్రతిపక్షాలు నానాయాగీ చేస్తున్నాయి. పదేళ్లు అధికారం వెలగబెట్టిన వారికి చట్టం ఎలా పనిచేస్తుంది. ఒక కేసు నమోదైతే ఎలాంటి ప్రొసీడింగ్స్ ఉంటాయన్నది తెలియక కాదు. కానీ రేపో…ఎల్లుండో తమకు కూడా ఇలాంటి గతే పడుతుందన్న భయం వారిని వెంటాడుతోంది. ఇంతకీ ఇదంతా దేని గురించో అర్ధమైంది కదా! అల్లు అర్జున్ అరెస్ట్ గురించే. సంధ్యా థియేటర్ లో బెనిఫిట్ షో సందర్భంగా మహిళ మృతిపై నమోదైన కేసులో అల్లు అర్జున్ ఏ 11గా ఉన్నారు. ఇప్పటికే థియేటర్ మేనేజర్, సెక్యూరిటీ ఇంచార్జ్, మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. ఇదంతా చట్టప్రకారం జరుగుతున్న చర్య. నిజానికి తన అరెస్ట్ విషయం అల్లు అర్జున్ కు కూడా ముందే తెలుసు…అందుకే హైకోర్టులో క్వాష్ పిటీషన్ వేశారు. దానిపై…
వరంగల్ జిల్లాలోని ఆ పోలీస్ స్టేషన్ లో అసలు కేసులే రిజిస్టర్ అవ్వవు. ప్రతి సంవత్సరం ముగింపులో జరిగే మదింపులో వారి పీఎస్ పరిధిలోనే అతితక్కువ కేసులు నమోదవతున్నాయి. అబ్బా ఎంత చక్కటి పరిపాలన, శాంతిభద్రతలు ఎంత చక్కగా కాపాడుతున్నారు. ఇదే కదా మీ మదిలోకి వచ్చిన ఆలోచన. నిజానికి ఇక్కడ పనిచేస్తున్నది పోలీసుల సమర్ధవంతమైన పహారా కాదు. స్థానిక ఎస్సై బెదిరింపులు, అమ్యామ్యాలు. ఇంతకీ ఆ పోలీస్ స్టేషన్ ఎక్కడనే కదా మీ అనుమానం. నర్సంపేట నియోజకవర్గంలోని నెక్కొండ పోలీస్ స్టేషన్. కేసులు పెట్టేందుకు ఎవరైనా స్టేషన్ కు వచ్చారంటే అంతే సంగతులు. వారి జేబులు ఖాళీ అవ్వాల్సిందే. వారి కేసు నమోదు అయ్యేందుకు తిరిగి, తిరిగీ చెప్పులు అరగాల్సిందే. ఎన్ని ఆధారాలున్నా అక్కడ పనిచేయవు. కేవలం అక్కడ పనిచేసేంది లంచాలు మాత్రమే. చేయి తడపనిదే ఆ పోలీస్ స్టేషన్ లో పని జరుగదు. ఒకవేళ కేసు రిజిస్టర్ చేయాల్సిందే…
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏడాది ప్రజా విజయోత్సవాలను చూస్తూ ఓ పక్క బాధలో ఉన్న బీఆర్ఎస్ నేతలకు..తమ పార్టీలో జరుగుతున్న పరిణామాలు అయోమయానికి గురిచేస్తున్నాయి. ఏడాది పాలనపై చేసేందుకు విమర్శలు ఏవీ లేకపోవడతో చిల్ అయ్యేందుకు కేటీఆర్ విదేశాలకు వెళ్లిపోయారు. దీంతో ఈ ఉత్సవాలపై పడి ఎలా ఏడ్వాలో తెలియక గులాబీ కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. అయితే ఇదే సందర్భంలో కవిత మళ్లీ యాక్టీవ్ అయ్యారు. అలాగని పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు. కేవలం తనకు కావాల్సిన కొందరు నేతలతో మాత్రమే క్రియాశీలకంగా మాట్లాడుతున్నారు. దీంతో కారు పార్టీ నేతల్లో ఓ చర్చ ఆసక్తికరంగా మారింది. ఏపీలో వైఎస్ జగన్ కు షర్మిల్ ఎలా కొరకరాని కొయ్యగా మారిందో…ఇక్కడ కేటీఆర్ కు కవిత కూడా అలాగే తయారయ్యారని చెప్పుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు దోచుకునేందుకు కేటీఆర్ కంటే తనకు తక్కువ అవకాశం లభించిందని, పార్టీలో కూడా తన మాట చెల్లలేదని ఆమె…
ములుగు జిల్లా వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్య కలకలం సృష్టిస్తోంది. సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. రెండు రోజులుగా ఆయన పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస ఘటనలు జరిగాయి. ఇన్ ఫార్మర్ల నెపంతో ఇద్దరిని మావోయిస్టులు చంపేశారు. ఆ తర్వాత రోజే భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఇందులో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. మరుసటి రోజు తెల్లవారుజామున ఎస్సై ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో ఆయన మరణానికి కారణాలపై అనేక కథనాలు వచ్చాయి. ఎన్ కౌంటర్, ఇన్ ఫార్మర్ల హత్యకు లింక్ పెట్టి వార్తలు వచ్చాయి. కానీ పోలీసుల ప్రాథమిక విచారణలో మాత్రం ఇది పూర్తిగా వ్యక్తిగత కారణాలతో జరిగిన ఆత్మహత్యగా తేలింది. ఆయనకు ఉన్న వ్యక్తిగత కారణాల వల్లనే ఆయన సూసైడ్ చేసుకున్నారని సన్నిహితులు కూడా చెప్తున్నారు. ఆత్మహత్యకు పాల్పడ్డ ఎస్సై హరీష్ స్వస్థలం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం వెంకటేశ్వరపల్లి గ్రామం. ఆయనకు…
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అవుతున్నది. కేవలం ఏడాదిలోనే రుణమాఫీ, ఉద్యోగాల కల్పన సహా అనేక అంశాల్లో రేవంత్ రెడ్డి సాధించిన విజయాలు బీఆర్ఎస్ పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. లక్ష రూపాయల రుణమాఫీ కోసం ఐదేళ్లు రైతుల్ని తమ చుట్టు తిప్పుకున్న కేసీఆర్ ప్రభుత్వం ఎక్కడ.. ఒకే విడతలో రెండు లక్షలు మాఫీ చేసిన ప్రజా ప్రభుత్వం ఎక్కడ అని రైతుల్లో చర్చ మొదలైంది. మెగా డీఎస్సీ ప్రక్రియును చక చకా పూర్తిచేసిన రేవంత్ సర్కారుపై నిరుద్యోగ యువత ప్రశంసలు కురిపిస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పెంపుతో లబ్ది పొందిన కుటుంబాలు ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నాయి. దేశంలోనే అతి ఎక్కువ వరి పండిచిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఇలా రాష్ట్రం పచ్చబడుతుంటే గులాబీ నేతల కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. ఏడాది సంబురాలను నీరు గార్చాలని పక్కా పథకం రచించారు. సీఎం సొంత నియోజకవర్గంలో కుట్రలు చేసి…
కొడంగల్ భూసేకరణ విషయంలో తొందరపడి బీఆర్ఎస్ కోయిల ముందే కూసింది. కోట్లు ఖర్చు చేసి వేసిన ప్లాన్ వర్కవుట్ అయిందని సంబురాలు చేసుకున్నారు కేటీఆర్ అండ్ బ్యాచ్. కొడంగల్ అభివృద్దిని అడ్డుకున్నామని ఆనందంతో తబ్బిబ్బయ్యారు. అయితే అసలు కథ తెలిసి ఉసూరుమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన షాక్ ను తేరుకోలేకున్నారు. లగచర్ల, పోలేపల్లి, హకీంపేట్ పరిసర ప్రాంతాల్లో రానున్నది ఫార్మా కంపెనీ కాదు, ఇండస్ట్రీయల్ పార్క్ అని ఎప్పటి నుంచో ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఏడు నెలల క్రితమే ఫార్మా కంపెనీ ప్రతిపాదనను వెనక్కు తీసుకున్నట్లు అక్కడ ప్రజల్లో చాలామందికి తెలుసు. ఈ విషయాన్ని అధికారులు చెప్తూనే వచ్చారు. కానీ కోట్లు ఖర్చు పెట్టి బీఆర్ఎస్ చేసి విషప్రచారంలో ఇది చాలామంది వరకు వెళ్లలేకపోయింది. గతంలో ఐదేళ్ల పాటూ కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధిని కావాలని నిర్లక్ష్యం చేసిన బీఆర్ఎస్..ఇప్పుడు అక్కడ యువతకు ఉపాధి లభిస్తుందంటే కళ్లలో నిప్పులు పోసుకుంటోంది. ఇండస్ట్రీలు…
ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో బీఆర్ఎస్, బీజేపీ నేతల పరిస్థితి తేలు కుట్టిన దొంగల్లా తయారైంది. రైతుల ఆందోళనలతో ప్రజా ప్రభుత్వం తక్షణమే స్పందించి…అనుమతులపై పునరాలోచన చేస్తామని ప్రకటించింది. అయితే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, స్థానిక బీజేపీ ఎమ్మెల్యే కంటికి కూడా కనిపించడం లేదు. ఎందుకంటే అటువైపు వెళ్లే రైతులు తమను తరిమి కొడతారని బీఆర్ఎస్, బీజేపీ నేతలకు తెలుసు. అసలు ఇథనాల్ ఫ్యాక్టరీ అంశంపై కాంగ్రెస్ కు ఏ మాత్రం సంబంధం లేదు. కానీ ఆ బురదను ప్రస్తుత సర్కారుకు అంటించేందుకు కారు పార్టీ సోషల్ మీడియా ప్రయత్నిస్తోంది. అయితే దిలావార్ పూర్, గుండంపల్లి మధ్య ఇథనాల్ కంపెనీ కోసం బీఆర్ఎస్ హయాంలోనే అనుమతులు లభించాయన్న సంగతి బయటకు రావడంతో ఆ పార్టీ నేతలు కిక్కురుమనం లేదు. ఇథనాల్ ఫ్యాక్టరీపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి ప్రక్రియ చేపట్టలేదు. కానీ రేవంత్ సర్కారుకు ఈ పాపాన్ని అంటగట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది బీఆర్ఎస్ పార్టీ.…
బీఆర్ఎస్ వికృత క్రీడకు తెర తీసింది. ప్రజాపాలనను తట్టుకోలేక కుట్ర రాజకీయాలను ప్రోత్సహిస్తోంది. అధికారం కోల్పోయి నిండా సంవత్సరం కూడా పూర్తికాలేదు. అప్పుడే అరాచక శక్తుల్ని రంగంలోకి దించుతోంది. ఇప్పటికే వికారాబాద్ కలెక్టర్ పై దాడి వెనుక ప్రత్యక్షంగా కేటీఆర్, పట్నం నరేందర్ రెడ్డి వంటి బీఆర్ఎస్ నేతలు ఉన్నట్లు రుజువైంది. పరోక్షంగా గులాబీ బాస్ ఉన్నట్లు ఆధారాలు కూడా లభ్యమయ్యాయి. అయితే తవ్వేకొద్ది బీఆర్ఎస్ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మహబూబాబాద్ లో అల్లర్లకు కుట్ర చేసి ఫెయిల్ అయిన సంగతి తెలిసింది. అయితే ఇవి మాత్రమే కాదు వీలైన ప్రతీ చోటా అశాంతిని రాజేయాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. దీనికోసం బీహారీ గ్యాంగ్ ను రంగంలోకి దించింది. మాజీ మంత్రి హరీష్ రావు వీటిని పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఈ గ్యాంగ్ సభ్యులు పల్లెల్లో పర్యటించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీడియోలు తీయడమే లక్ష్యంగా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ…
అధికారం కోల్పోగానే ఆగం ఆగం అవుతున్నారు బీఆర్ఎస్ నేతలు. రాజకీయ విమర్శలు మాని వ్యక్తిగత విమర్శల వరకు వచ్చారు. కిందిస్థాయి క్యాడర్ ను కంట్రోల్ లో పెట్టాల్సిన అధ్యక్ష స్థాయి నేతే నోటికొచ్చిన బూతులు మాట్లాడుతున్నారు. సీఎం, మంత్రులు అని చూడకుండా తిట్ల పురాణం అందుకున్నాడు. అవన్నీ రాజకీయ విమర్శలు అని సరిపెట్టుకుందాం అనుకుంటే..ఈ మధ్య అధికారులను కూడా వదలడం లేదు. రాజకీయాలతో సంబంధం లేకుండా పనిచేసుకునేవారిని రొచ్చులోకి లాగుతున్నాడు కేటీఆర్. వారి పనులకు పదే పదే అడ్డుపడేలా కిందిస్థాయి క్యాడర్ ను రెచ్చగొడుతున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు నిజంగా సైకో రామ్ లాగానే వ్యవహరిస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. అధికారంలో ఉండగా కలెక్టర్లతో కాళ్లు మొక్కించుకున్న అహంకారాన్ని…ఇప్పుడు కూడా ప్రదర్శిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. మొన్నటికి మొన్న వికారాబాద్ కలెక్టర్ పై దాడికి అమాయకుల్ని రెచ్చగొట్టడం, ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర చేయడం వంటివి ప్రజలందరికీ తెలిసిందే. అధికారం కోల్పోతే ఇంతగా…