జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో వార్ వన్‌సైడ్ అవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలతో ప్రత్యర్ధులు చిత్తవుతున్నారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మెజార్టీ వర్గాలు కాంగ్రెస్‌కు మద్దతు తెలిపాయి. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి రోడ్ షోతో లెక్కలన్నీ మారిపోయాయి. నియోజకవర్గానికి ఏం కావాలో, ఏం చేస్తామో స్పష్టంగా చెప్పడంతో ప్రత్యర్ధుల గుండెల్లో రాయి పడింది. సంక్షేమ పథకాలు, రేషన్ కార్డుల ద్వారా లబ్దిపొందిన వారితో పాటూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల సమయంలో జూబ్లీహిల్స్ బస్తీల్లో జరిగిన అభివృద్ధి, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అరాచకాలను ప్రజలు బేరీజు వేసుకుంటున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో తర్వాత జూబ్లీహిల్స్ బస్తీల్లో కొత్త చర్చ మొదలైంది. కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి, నవీన్ యాదవ్ ప్రజాసేవపై విస్తృతంగా చర్చించుకుంటున్నారు ఓటర్లు. పేరుకే నగరం నడిబొడ్డున ఉన్న నియోజకవర్గం కానీ తెలంగాణ వచ్చిన తర్వాత తమ బస్తీల్లో ఒక్క ఇంచు కూడా మార్పు జరుగలేదని పలు బస్తీవాసులు చెప్తున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాల సమయంలో ఇండ్లు వచ్చాయి..ఇప్పుడు తమకు రేషన్ కార్డులు, ప్రభుత్వ పథకాలు వస్తున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదు ముస్లీం ఓటర్లయితే మూకుమ్మడిగా కాంగ్రెస్‌కే మద్దతు తెలుపుతున్నారు. కాంగ్రెస్ హయాంలోనే తమకు రిజర్వేషన్లు వచ్చాయని, ఇప్పుడు రేవంత్‌రెడ్డి పాలనతోనే తమ జీవితాలు బాగుపడుతాయని గట్టిగా నమ్ముతున్నారు. వీటన్నింటికీ తోడు మైనార్టీలకు బీఆర్ఎస్, బీజేపీలు చేసిందేమీ లేదని గ్రహించారు ఓటర్లు. వీటన్నింటితో పాటూ నిత్యం అందుబాటులో ఉండే నవీన్ యాదవ్ లాంటి స్థానికుడే కావాలని బలంగా కోరుంటున్నారు. ఇలా రోజురోజుకూ జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరుగుతూనే ఉంది.
