త్వరలోనే సిరిసిల్లకు ఉప ఎన్నిక రాబోతుందా? కేటీఆర్ రాజీనామాతో సిరిసిల్లకు మహర్ధశ పట్టబోతున్నట్లు కనిపిస్తోంది. నిజంగా చిత్తశుద్ది ఉంటే కేటీఆర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నోటికి వచ్చిన అబద్దాలు మాట్లాడుతున్న కేటీఆర్…ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు సవాళ్లు కూడా విసురుతున్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో గెలిచిన తర్వాత అక్కడ అభివృధ్దే జరుగలేదంటూ తన మార్కు ఫేక్ ప్రచారం మొదలు పెట్టారు. దీన్ని నమ్మించేందుకు సవాల్ కూడా విసిరారు. అయితే కాంగ్రెస్ హయాంలో జరుగుతున్న అభివృధ్ధి ముందు కేటీఆర్ ఫేక్ ప్రచారం బొక్క బోర్లా పడింది. అక్కడ ఏకంగా 4వేల కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు జరుగుతున్నట్లు ఆధారాలతో సహా రుజువు చేశారు స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకులు. ఇందుకు సంబంధించిన లెక్కలు విడుదల చేశారు.
వారు చెప్పిన లెక్కల ప్రకారం కంటోన్మెంట్ నియోజకవర్గంలో అభివృద్ది పనులు ఇలా ఉన్నాయి…
1. పారడైజ్ జంక్షన్ నుంచి శామీర్‌పేట వరకు ఎలివేటెడ్ కారిడార్ రూ. రూ.3,619
2. పారడైజ్ జంక్షన్ నుంచి డెయిరీ ఫాం రోడ్ ఎలివేటెడ్ కారిడార్ రూ.1580
3. కంటోన్మెంట్ బోర్డుకు రూ,303 కోట్లు డిపాజిట్. వీటితో ఇప్పటికే నియోజకవర్గంలో డ్రైనేజీలు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు మెరుగుపరిచే పనులను ప్రారంభించగా, అవి కొనసాగుతున్నాయి.
4. 10 కోట్లు స్పెషల్ ఫండ్స్
5. స్పోర్ట్స్ కాంప్లెక్స్ 14 కోట్లు
6. రూ.9.40 కోట్లతో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు పూర్తి
7. తిరుమలగిరి లేక్, రామన్నకుంట చెరువులకు రూ. 16 కోట్లు
ఇవి మాత్రమే కాదు ..నగరం నడిబొడ్డున ఉండి కూడా అభివృద్దికి నోచుకోని కంటోన్మెంట్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో అభివృద్ది పనులు పరుగులు పెడుతున్నాయి. ఇన్ని రుజువులు కంటికి కనిపిస్తున్నా కూడా నిస్సిగ్గుగా కేటీఆర్ పచ్చి అబద్దాలు చెప్పడం చూసి అంతా అవాక్కవుతున్నారు. అంతేకాదు పదేళ్లు అధికారంలో ఉండి సిరిసిల్లను అభివృధ్ధి చేసుకునేందుకు ఎంతో అవకాశం ఉండి కూడా…కేటీఆర్ తమకు ఏం చేశాడని సొంత నియోజకవర్గం ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిజంగా నిజాయితీ ఉన్న రాజకీయ నాయకుడు అయితే తక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి చిత్తశుద్ది నిరూపించుకోవాలంటూ ప్రజలు కోరుతున్నారు.
