Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Admin
మహారాష్ట్ర ఎన్నికల్లో కారు హారన్ మూగబోయింది. రెండేళ్ల క్రితం ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా మారిన భారత రాష్ట్ర సమితి..తమ మొదటి టార్గెట్ మహారాష్ట్ర ఎన్నికలే అని ప్రకటించింది. ఆ తర్వాత బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చేసిన హడావుడి, ప్రచార ఆర్భాటం అంతా ఇంతాకాదు. మేం అడుగు పెట్టగానే అక్కడి నేతల గుండెల్లో వణుకు మొదలైందని కేసీఆర్ సభల్లో స్వయంగా ప్రకటించుకున్నారు. వందలాది కార్లతో రోడ్ షో..మాజీ వార్డు మెంబర్ల నుంచి మాజీ సర్పంచ్ లు, జెడ్పీటీసీలు, ఒకరిద్దరు ఎన్సీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన నేతలకు గులాబీ కండువాలు కప్పేశారు. ఇక మహారాష్ట్ర రైతుల జీవితాలు బాగు చేసేవరకు విశ్రమించేది లేదని స్పీచ్ లు దంచికొట్టారు. అయితే ఏడాదిలోపే జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీన్ రివర్సయింది. దీంతో కారు పార్టీ అధినేత ఫామ్ హౌజ్ కే పరిమితమయ్యారు. రైతుల జీవితాలను బాగు చేసేవరకు తనకు విశ్రాంతి లేదన్న…
బీఆర్ఎస్ లో కేటీఆర్ ఒంటెత్తు పోకడలపై కార్యకర్తలే కాదు..కుటుంబ సభ్యులు కూడా అసహనంగా ఉన్నారు. ఏం మాట్లాడుతున్నాడో..ఏం చేస్తున్నాడో తెలియకుండా గుడ్డి గుర్రం చేనులో పరిగెత్తినట్లు సాగుతున్న కేటీఆర్ వ్యవహారశైలిపై ఇప్పటికే గులాబీ పార్టీ కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. పార్టీని నడిపించాల్సిన కేసీఆర్ ఫామ్ హౌజ్ కే పరిమితమయ్యారు. తోడుగా ఉంటాడనుకున్న హరీష్ రావు కలిసి రావడం లేదు. తన వర్గం నేతలను కూడా అటువైపు వెళ్లనివ్వడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన మాజీ మంత్రులు తెలంగాణ భవన్ వైపు కన్నెత్తి చూడటం లేదు. కేటీఆర్ మాటల్లో అహంకారం, ఓ విజన్ లేకుండా సాగుతున్న విమర్శలతో గులాబీ క్యాడర్ ఒకరొక్కరుగా దూరమవుతున్నారు. తాజాగా ఆయన సోదరి కవిత కూడా కేటీఆర్ పై తిరుగుబావుటా ఎగురవేసినట్లు కనిపిస్తోంది. లిక్కర్ స్కాంలో బెయిల్ పై విడుదలై బయటకు వచ్చినప్పటి నుంచి కవిత పెద్దగా కనిపించలేదు. కొన్నాళ్లు ఫామ్ హౌజ్ లో ఉండిపోయారు. తెలంగాణ…
రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. కొన్ని సందర్భాల్లో మనం చేసే విమర్శ నిజం కాదు అని తెలిసినప్పటికీ.. ఎదుటివారిని ఏదో ఒకటి అనాలి కాబట్టి నోటికి వచ్చింది వాగడం ఈ మధ్య ప్రతిపక్ష నేతలకు అలవాటుగా మారింది. ముఖ్యంగా తనను ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అన్న భయం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లో స్పష్టంగా కనిపిస్తోంది. ఫార్ములా ఈ కార్ రేసు స్కాంలో అడ్డంగా బుక్కవ్వడం, ఏసీబీ దూకుడు పెంచడంతో ఆయనలో ఫ్రస్టేషన్ తారాస్థాయికి చేరింది. దానికి తోడు లగచర్లలో వేసిన స్కెచ్ బెడిసికొట్టడంతో ఆయా గ్రామాల రైతులు బీఆర్ఎస్ ను దుమ్మెత్తిపోస్తున్నారు. దీంతో అరిగి పోయిన గ్రామ్ ఫోన్ రికార్డును బయటకు తీశాడు. సీఎం రేవంత్ రెడ్డిపై అవాకులు చెవాకులు పేలాడు. మూసీ సుందరీకరణలో భాగంగా బాపూఘాట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద గాంధీజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. గుజరాత్ లోని కెవాడియాలో…
లగచర్ల ఘటనలో కేసీఆర్ మాస్టర్ ప్లాన్ బట్టబయలైంది. అధికారం కోల్పోయాక ఫ్రస్టేషన్ లోకి వెళ్లిన గులాబీ బాస్..ప్రజాప్రభుత్వాన్ని ఎలాగైనా బద్నాం చేయాలని కొద్దినెలలుగా ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం చేసే ప్రతిపనికి మోకాలడ్డుతున్నారు. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వాన్నికూల్చేందుకు భారీ స్కెచ్ వేశారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో అశాంతిని రాజేసి, ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు భూసేకరణను అడ్డుపెట్టుకున్నారు. రైతుల్ని రెచ్చగొట్టి అధికారులపై తిరగబడేలా చేయడం, అదే సమయంతో తన కిరాయి మనుషులతో కలెక్టర్ సహా అధికారులను అంతమొందించడం వంటి కుట్రలు చేశారు. అంతేకాదు రైతుల ముసుగులోని కొందరు కిరాయి వ్యక్తులు పోలీసులను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడం..కాల్పులు జరిగే సీన్ క్రియేట్ చేయాలని కూడా పథకం రచించించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎప్పటికప్పుడు ఫామ్ హౌజ్ నుంచి గులాబీ బాస్ పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది ఈ మధ్య జరుగుతున్న తంతుకాదు..కొన్నినెలలుగా రేవంత్ సర్కారుపై బురదజల్లడం, గ్రామాల్లోకి పట్నం నరేందర్ రెడ్డి వెళ్లి రైతుల్ని రెచ్చగొట్టడం వంటివి…
వికారాబాద్ కలెక్టర్ పై దాడి కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సహా అధికారులపై దాడి కోసం ముందు నుంచి పథకం రచించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ కేసులో ఇప్పటికే 46 మంది నిందితులను గుర్తించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏ-1గా ఉన్న బోగమోని సురేష్ తో పాటూ పలువురు పరారీలో ఉన్నారు. అయితే దాడిలో పాత్రధారిగా ఉన్న సురేష్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇక ఈ ఘటనలో సురేష్ ను వెనుకుండి ఎప్పటికప్పుడు సూచనలిస్తూ నడిపించిన బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కలెక్టర్ పై దాడికి కొన్ని గంటల ముందు, ఆ తర్వాత కాల్స్ లిస్ట్ పరిశీలించిన పోలీసులకు కీలక సమచారం లభించింది. ఏ-1 సురేష్ కు బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి నుంచి ఏకంగా 50 సార్లకు…
అవినీతి మెడకు గట్టిగా బిగుస్తుండటంతో హస్తినకు పరుగులు పెట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫార్ములా ఈ – కార్ రేసింగ్ వ్యవహారంలో ఏసీబీ దూకుడుతో ఆయన హుటాహుటిన ఢిల్లీలో వాలిపోయారు. అప్పటికే ఆయన రహస్య మిత్రుల్ని కలిసేందుకు వెళ్లారని సోషల్ మీడియా కోడై కూయడంతో…అక్కడికెళ్లి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. ఏ మాత్రం పసలేని ఆరోపణలను వినిపించేందుకు కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కలిసేందుకు వెళ్లారు. నిజానికి ఆయన చెప్పింది కేవలం సాకు మాత్రమే అనేది జగమెరిగిన సత్యం. ఫార్ములా ఈ – కార్ కేసు నుంచి తప్పించండి మహా ప్రభో అంటూ వేడుకోవడమే కేటీఆర్ ఢిల్లీ పర్యటన వెనుకున్న ఆంత్యర్యం అనేది ఆయన సన్నిహితులకు కూడా తెలుసు. పైగా ఆర్ఎస్ఎస్ కు సన్నిహితుడైన కేంద్రమంత్రిని కలిసి..తన అరెస్టును ఎలాగైనా ఆపేందుకు గవర్నర్ పై ఒత్తిడి తెచ్చేందుకు శతవిధాలా ప్రయత్నించారని గులాబీ కార్యకర్తలే గుసగుసలాడుకుంటున్నారు. అంతేకాదు కేటీఆర్ రాత్రికి రాత్రి హోంమంత్రి…
వరంగల్ లో జరిగిన గ్లోబల్ యాక్షన్ టీం 1.5 మిలినియం కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కేసముద్రం కు అవార్డు లభించింది. వారు చేస్తున్న సేవలకు గానూ సేవా అవార్డును అందజేశారు. సోమవారం బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ లో లయన్స్ 320 ఎఫ్ గవర్నర్ కుందూరు వెంకట్ రెడ్డి అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అవార్డును అందించారు. లయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ లయన్ గట్టమనేని బాబురావు చేతుల మీదుగా క్లబ్ లకి అవార్డులు అందజేసారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కేసముద్రం ద్వారా మరెంతో సమాజ సేవ చేయాలని గట్టమనేని బాబు రావు క్లబ్ సభ్యులకి సూచించారన్నారు అధ్యక్షుడు మామిడి అశోక్. కార్యక్రమంలో పాస్ట్ మాజీ జెడ్ సి లయన్ ఉకంటి యాకూబ్ రెడ్డి, లయన్ ప్రభు కిరణ్, లయన్ సుధాకర్, లయన్ కె రమేష్, రాము గౌడ్ రమేష్, నాయుడు తదితరులు ఉన్నారు.
ఏళ్లుగా పాతుకుపోయిన నాన్ క్యాడర్ ఉన్నతాధికారులు. -వాళ్ళు చేయాలనున్నదే ఫైల్, లేకుంటే వెనక్కి తిప్పి ముప్పుతిప్పలు. ఎచ్ఎండిఏ లో అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. హైదరాబాద్ అభివృద్ధిలో కీలకంగా ఉండే మెట్రోపాలిటన్ అథారిటీకి కొత్త కమిషనర్ గా సీనియర్ ఐఏఎస్ అధికారిని వేశాక అందులో కొంత ప్రక్షాళన జరుగతుంది. ఎన్నో ఏళ్లుగా తిష్ట వేసి అక్రమాలకు ఆలవాలంగా మారిన కొన్ని శాఖలను ఇప్పటికే దుమ్ము దులిపారు. కానీ కొందరు నాన్ క్యాడర్ ఉన్నతాధికారులు మాత్రం కొన్నేళ్లుగా అక్కడే తిష్ట వేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఒక నాన్ క్యాడర్ ఉన్నతాధికారి తన దగ్గరకి వచ్చే ఫైల్స్ విషయంలో ఏదైనా ముట్టజెపితేనే ఆ ఫైల్ ముందుకు పోతుంది. లేకుంటే అది తిరిగి మళ్ళీ పై పేషీకి వెళ్ళిపోతుంది. దీంతో ఈ మధ్యే ఎచ్ఎండిఏ కు వచ్చిన ఐఏఎస్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇలాంటి ఎన్నో ఫైల్స్ పెండింగ్ లో పడి అనుమతులు ఆగిపోయి…
నాన్న లేరు.. తాత పట్టించుకోలేదు! అమ్మ కసితో పెంచిన ఈ రాఖీ భాయ్ కథ తెలుసా? మధ్యతరగతి జీవితాల్లో చాలా కథలు కన్నీటితో మొదలై.., కన్నీటితో ఆగిపోతాయి. అక్కడ ఎలాంటి మిరాకిల్స్ ఉండవు. కానీ.., టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కథ ఇలాంటిది కాదు. అక్కడ ఉప్పొంగిన కన్నీరు తరువాత.. ఓ అద్భుతం జరిగింది. ఆకలిపస్తులు ఉన్న ఆ ఇంట్లో కూడా ఆనందం వెల్లువెరిసింది. ఈ అద్భుతానికి కారణం బుమ్రా తల్లి దల్జిత్ కౌర్ బుమ్రా. వేలుపట్టుకుని నడిచే కొడుకు తప్ప పక్కన ఎవ్వరూ లేరు. రాష్ట్రం కాని రాష్ట్రం, భాష కాని భాష, తిన్నావా అని అడిగే మనిషి కూడా లేని స్థితి. మామూలుగా అయితే ఓ స్త్రీ కుప్పకూలిపోయేది. కానీ.., దల్జిత్ కౌర్ అక్కడే ఆగిపోలేదు. పరిస్థితులను ఎదిరించింది, నిలబడింది. ఆ బిడ్డలో తన భవిష్యత్ చూసుకుంది. అతన్ని ఓ యోధుడిగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకుంది. ఆ…
మర్పల్లి ఎమ్మార్వో గణేష్ నాయక్ వసూళ్ల పర్వం… ధరణిని అడ్డుపెట్టుకుని దందా. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ అధికారి ప్రధాన కర్తవ్యం. ఏవైనా సమస్యలు వస్తే తక్షణమే స్పందించి, పరిష్కార మార్గం చూపాల్సిన నైతిక బాధ్యత ప్రభుత్వ అధికారిపై ఉంటుంది. ఇలాంటి గౌరవనీయమైన స్థానంలో ఉంటూ కూడా వికారాబాద్ జిల్లా మర్పల్లి ఎమ్మార్వో గణేష్ నాయక్ అనేక అక్రమాలకు పాల్పడుతున్నాడు. అక్రమార్జనే ధ్యేయంగా, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ దోచుకుంటున్నాడు. ప్రజలకు సేవ చేయాల్సింది పోయి తిరిగి వారినే పట్టి పీడిస్తున్నాడు. వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి మండల ఎమ్మార్వో గణేష్ నాయక్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని అనేక అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడు. ఈయన ఏ పని చేయాలన్నా చేయి తడపాల్సిందే. పైసలు ఇవ్వనిదే ఫైలు ముందుకు కదలదు. ధరణి పోర్టల్లో మార్పులొచ్చాక ఎమ్మార్వో గణేష్ నాయక్ వ్యవహారం మరింత ముదిరిందని స్థానిక మండల రైతులు ఆరోపిస్తున్నారు. తెలంగాణలోని రైతులకు సంబంధించిన భూ వివరాలు…