సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పెద్దపీట వేస్తుందనడానికి మరో ఉదాహరణ ఇది. ఇటీవల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్…మరోసారి బీసీలకు పెద్ద ఎత్తున పదవులు ఇచ్చింది. మొత్తం పదవుల్లో ఏకంగా 14 మంది బీసీలకు అవకాశం ఇచ్చింది. కేవలం మాటివ్వడం మాత్రమే కాదు…దాన్ని నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని మరోసారి రుజువు చేసింది. మొత్తం 36మంది డీసీసీ అధ్యక్షులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ..అందులో 14 మంది బీసీలకు స్థానం కల్పించింది. ఇక 9 మంది ఓసీలు, ఆరుగురు ఎస్టీలు, ఐదుగురు ఎస్సీలు, ఇద్దరు మైనార్టీ నేతలకు డీసీసీ పదవులు దక్కాయి. కాంగ్రెస్ పార్టీకోసం పనిచేస్తున్న సిన్సియర్ నాయకులను గుర్తించి..సామాజిక న్యాయం, అనుభవాలను సమపాళ్లలో రంగరిస్తూ డీసీసీ అధ్యక్షుల నియామకాలు పూర్తిచేశారు.

సామాజిక న్యాయం అంటేనే కాంగ్రెస్…కాంగ్రెస్ అంటనే సామాజిక న్యాయం. తమకు అవకాశం వచ్చిన ప్రతీసారి..ప్రతీచోటా సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూనే ఉంటారు కాంగ్రెస్ నాయకులు. ఎన్నో ఏళ్లుగా బీసీలకు చాలా పార్టీలు ఎన్నో హామీలు ఇచ్చాయి…ఓట్లు వేయించుకున్న తర్వాతవాళ్లను ఏమార్చాయి. కానీ కామారెడ్డిలో బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నది. ఒకవైపు బీసీ రిజర్వేషన్లపై న్యాయపరంగా, చట్టబద్దంగా కృషి చేస్తూనే..తమకు అవకాశం దొరికిన ప్రతి చోటా బీసీలకు న్యాయం చేస్తున్నది.
