రెండేళ్ల ప్రజాపాలనకు ప్రజలు రెఫరెండం ఇచ్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 65 అసెంబ్లీ స్థానాల్లో గెలిపించి అధికారం అందిస్తే…తాజాగా జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఏకంగా 87 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు విజయబావుటా ఎగురవేశారు. ఇప్పటికే కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ లాంటి అర్బన్ ఏరియాల్లో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు పట్టం గట్టారు పట్నం ప్రజలు. ఇప్పుడు గ్రామపంచాయతీ ఎన్నికల్లోనూ అఖండ మెజార్టీ అందించి అండగా నిలిచారు పల్లెవాసులు. రెండేళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమానికి వందకు వందశాతం మార్కులు వేసి, సంపూర్ణంగా ఆశీర్వదించారు.

మొత్తం 12 వేల 702 పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ 8 వేల 335 మంది కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్ధులు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేసినా కూడా 33శాతం స్థానాల్లో మాత్రమే గెలవగలిగారు. ఏకంగా 66శాతం స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్ధులు గెలవడమంటే…పల్లెల్లో ప్రజాపాలనపై ఏ స్థాయిలో నమ్మకం పెరిగిందో అర్ధం చేసుకోవచ్చు.
![]()
గ్రామ పంచాయతీ లెక్కలతో చూసుకుంటే 94 సెగ్మెంట్లలో జరిగిన ఎన్నికల్లో 87 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ లీడ్‌లో ఉంది. ఇక బీఆర్ఎస్ తనకు లక్కీ నంబర్ అయిన 6 స్థానాల్లో, బీజేపీ ఒక స్థానంలో మాత్రమే ఆదిక్యం ప్రదర్శించగలిగాయి. పదేళ్ల పాటూ పల్లెల్ని అద్భుతంగా తీర్చిదిద్దామని చెప్పుకునే బీఆర్ఎస్‌కు గ్రామీణ ఓటర్లు ఇచ్చిన తీర్పుతో అయినా తత్వం బోధపడి ఉంటుంది.
