రెండేళ్లలోనే ఎంత మార్పు… పదేళ్ల పాటూ దోచుకోవడం, దాచుకోవడంపై మాత్రమే దృష్టి పెట్టిన బీఆర్ఎస్ నాయకులు…తెలంగాణ ఖ్యాతిపై దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. కానీ కేవలం రెండేళ్లలో తెలంగాణ ఖ్యాతి ఖండాంతరాలు దాటుతున్నది. మిస్ వరల్డ్ పోటీల నుంచి ఈ నెలలో జరుగనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ వరకు ప్రతి దశలో తెలంగాణ పేరు దేశదేశాన మార్మోగుతున్నది. కేవలం ఐటీ, ఫార్మా, డాటా సైన్సెస్ రంగాల్లో మాత్రమే కాదు…క్రీడా రంగంలోనూ తెలంగాణకు ప్రత్యేక పేజీ ఉండాలన్న సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న ప్రత్యేక చొరవ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తున్నది. క్రీడలంటే కేవలం క్రికెట్ మాత్రమే కాదు…గ్రామాల్లోని ప్రతిభావంతులను, మట్టిలోని మాణిక్యాలను వెలికి తీసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రణాళిక రచిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ గవర్నమెంట్ స్కూళ్లలోని విద్యార్ధులతో వరల్డ్ గ్రేటెస్ట్ ఫుట్ బాల్ ప్లేయిర్ లియోనెల్ మెస్సీ గేమ్ ఆడనున్నారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా గ్రౌండ్‌లోకి దిగి గవర్నమెంట్ స్కూల్ విద్యార్ధుల జట్టుకున్న ప్రాతినిథ్యం వహించనున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముగింపు సందర్భంగా డిసెంబర్ 13న ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో నిర్వహించనున్న డ్రీమ్ మ్యాచ్‌లో మెస్సీతో సీఎం రేవంత్ రెడ్డి తలపడనున్నారు. ఆర్‌ఆర్ -9 టీమ్‌కు రేవంత్ రెడ్డి, ఎల్‌ఎం-10 టీమ్‌కు మెస్సీ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.

గతంలో బీఆర్ఎస్ హయాంలోనూ హైదరాబాద్‌లో స్పోర్ట్స్ ఈవెంట్స్ జరిగాయి. కానీ అది కేవలం సంపన్నులకు పరిమితమైన ఫార్ములా వన్ రేసు. ఇందులోనూ అవినీతి కంపు. కేవలం తమ స్వలాభం కోసం, తమకు కావాల్సిన వారికి మేలు చేసేందుకు మాత్రమే నగర ప్రజలందరినీ ఇబ్బందులకు గురిచేస్తూ..రోడ్లన్నీ బ్లాక్ చేసి మరీ ఈవెంట్ నిర్వహించారు. పైగా పేదలు, గ్రామాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఏ మాత్రం ఉపయోగం లేని ఫార్ములా ఈ కార్ రేసుతో కేవలం లబ్ది చేకూరింది కేటీఆర్ అండ్ కో కు మాత్రమే. కోట్లాది రూపాయాలు దారి మళ్లించేందుకు, బడా బాబులను ఖుషీ చేసేందుకు మాత్రమే ఇలాంటి క్రీడలు ఉపయోగపడ్డాయి.

ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా గ్రౌండ్‌లోకి దిగి మెస్సీతో పోటీ పడుతుంటే…ప్రపంచమంతా తెలంగాణ వైపు చూస్తున్నది. పైగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులకు, తమ ప్రతిభకు ప్రోత్సాహం కోసం ఎదురుచూసే క్రీడాకారులకు ఈ గేమ్ జోష్ ఇవ్వనుంది. అంతేకాదు గతంలో పెట్టుబడుల ఆకర్షణ పేరిట కమిషన్లకు కక్కుర్తి పడి అర్హత లేని కంపెనీలకు వేల కోట్ల విలువైన భూములను కట్టబెట్టారు. కానీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో 10 కోట్ల టర్నోవర్ దాటిని కంపెనీలను ఆహ్వానించి వారిని పెట్టుబడులకు ఆహ్వానించనున్నారు రేవంత్ రెడ్డి. తద్వారా చిన్న పారిశ్రామిక వేత్తలకు ఊతం లభించనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బడా కంపెనీల నుంచి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల వరకు తెలంగాణ వేదికగా నిలువనుంది.
