యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వార్తలు వస్తున్నాయి. వారం రోజులు నుంచి తీవ్ర జ్వరంతో ఆయన బాధపడుతున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ ను కూడా క్యాన్సిల్ చేసుకొని ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న ప్రభాస్ తాజాగా అస్వస్థతకు గురైయ్యారని అంటున్నారు.
గతేడాది నుంచి వరుస షూటింగ్ లతో ప్రభాస్ బిజీ అయిపోయారు. గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ప్రాజెక్ట్ కె, సలార్, రాజా డీలాక్స్ సినిమాలు చేస్తున్నారు. ప్రభాస్ అస్వస్థతకు గురయ్యారనే వార్తతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సినిమా షూటింగ్ లు మెల్లగా అయిన చేసుకోవచ్చు కాని, నీ ఆరోగ్యం జాగ్రత్త అన్నా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
ఇక.. కృతి సనన్- ప్రభాస్ ల పెళ్లి ఖరారు అయిందని ఫిలిం క్రిటిక్ ఉమర్ సంధు ట్వీట్ చేశారు. వారం రోజుల్లో వారిద్దరి నిశ్చితార్ధం జరగనుందని పేర్కొన్నాడు. ఈ వార్త నిజమా..? లేదా..? అన్నది క్లారిటీ లేదు. కాని డార్లింగ్ ఫ్యాన్స్ లో మాత్రం ఓ రకమైన ఆనందం కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ప్రభాస్ అస్వస్థతకు గురయ్యారనే వార్త అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది.
Also Read : ఆ హీరోయిన్ తో వచ్చే వారం ప్రభాస్ ఎంగేజ్మెంట్ – ఇదే ప్రూఫ్..!