నాలుగు పదుల వయస్సు. ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆ పాన్ ఇండియా హీరో పెళ్లి ఎప్పుడని టాలీవుడ్ మీడియానే కాదు బాలీవుడ్ మీడియా కూడా కథనాలు ప్రచురిస్తోంది. ఆయన అనుష్కతో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని ఇలా రకరకాల ప్రచారం ప్రభాస్ పెళ్లి గురించి జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఎట్టకేలకు యంగ్ రెబల్ స్టార్ పెళ్లి గురించిన అప్డేట్ వచ్చేసింది.
ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు, ఫిల్మ్ క్రిటిక్ ఉమర్ సందు సంచలన ట్వీట్ చేశాడు. బ్రేకింగ్. వచ్చేవారం ప్రభాస్ – కృతి సనన్ ల ఎంగేజ్మెంట్. మాల్దీవ్స్ లో జరగనుంది అంటూ ట్వీట్ చేశాడు. ప్రభాస్ పెళ్లి గురించి ట్వీట్ కావడంతో క్షణాల్లో వైరల్ అయింది. ఇటీవల ప్రభాస్ – కృతి సనన్ ల మధ్య ఎఫైర్ నడుస్తుందంటూ ఊహాగానాలు వినిపించిన నేపథ్యంలో ఈ ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ విషయానికి సంబంధించి ఉమర్ సంధుకు స్పష్టమైన సమాచారం ఉందా..? లేదా ఉరికే ట్వీట్ చేశాడా అన్నది తేలాల్సి ఉంది.
BREAKING NEWS: #KritiSanon & #Prabhas will get engaged next week in Maldives 🇲🇻!! So Happy for them.
— Umair Sandhu (@UmairSandu) February 5, 2023
బెడియా మూవీ ప్రమోషన్స్ లో కరుణ్ జోహార్ , వరుణ్ ధావన్ , కృతి సనన్ ఓ షోలో పాల్గొన్నారు. ఆ షో పాల్గొన్న వరుణ్ ధావన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కృతి సనన్ మనస్సు ఇక్కడ లేదు. వేరే చోట ఉంది. ఆయన ముంబైలో లేరని వ్యాఖ్యానించారు. అయితే.. అప్పుడు ప్రభాస్, దీపిక పదుకునేతొ షూటింగ్ లో ఉన్నారు. దాంతో కృతి – ప్రభాస్ ల మధ్య నిజంగానే సంథింగ్ – సంథింగ్ ఉందని అనుకున్నారు. అయితే ఈ వార్తలను కృతి ఖండించారు. ప్రభాస్ నాకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే. మా మధ్య ఏం లేదన్నారు.
Also Read : బాలీవుడ్ హీరోయిన్ తో ప్రభాస్ పెళ్లి – క్లారిటీ ఇచ్చిన కృతి సనన్
ఈ క్రమంలోనే ఉమర్ సంధు ట్వీట్ చేయడం ఈ అనుమానాలను మరింత పెంచేసింది. నిజంగానే కృతి- ప్రభాస్ లు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారా..? అని చర్చించుకుంటున్నారు. ఒక వారం రోజుల్లో ఎంగేజ్మెంట్ అని పేర్కొన్నాడు కానీ.. వారం రోజుల్లో ఇందుకు సంబందించిన అసలు విషయం తేలుతుంది.
ఇకపోతే ప్రభాస్, కృతి జంటగా నటించిన ఆదిపురుష్ జూన్ 16న విడుదల కానుంది.