పాన్ ఇండియా హీరో ప్రభాస్ , బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ మధ్య ప్రేమాయణం కొనసాగుతుందని కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతోన్న ఆదిపురుష్ చిత్ర షూటింగ్ సమయంలోనే ప్రభ – కృతిల మధ్య ప్రేమ పుట్టిందని, త్వరలో పెళ్లిపీటలు కూడా ఎక్కనున్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది.
ఈ ప్రచారం జరుగుతుండగానే “బేధియా” సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ షో లో పాల్గొన్న కృతి సనన్ పై యువ హీరో వరుణ్ ధావన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కృతి సనన్ ఇక్కడే ఉన్నా ఆమె మనస్సు మాత్రం దీపిక పదుకునేతో నటిస్తోన్న హీరో వద్ద ఉందంటూ పరోక్షంగా ప్రభాస్ ప్రస్తావన తీసుకొచ్చాడు. దీంతో ప్రభాస్ – కృతి సనన్ మధ్య సంథింగ్ , సంథింగ్ అంటూ వీడియోలు వైరల్ అయ్యాయి.
దీంతో ప్రభాస్ తో ప్రేమాయణంపై కృతి సనన్ ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చేసింది. ప్రభాస్ తో తనకు ఎలాంటి రిలేషన్ షిప్ లేదంటూ చెప్పుకొచ్చింది. “బేధియా” సినిమా ప్రమోషన్లలో వరుణ్ ధావన్ సరదాగా చేసిన కామెంట్స్ ఇలాంటి పుకార్లకు దారితీసాయని తన ఇన్స్టాలో పేర్కొంది.
మహేష్ బాబుతో కలిసి 1 నేనొక్కడినే సినిమాతో వెండితెరపై మెరిసిన ఈ భామ.. ఆ తరువాత బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. ప్రస్తుతం ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ సరసన నటిస్తోంది. రాముడిగా ప్రభాస్ , కృతి సనన్ సీతగా నటిస్తున్నారు.