జబర్దస్త్ కమెడియన్ నవసందీప్ అరెస్ట్ అయ్యాడు. ఓ యువతిని ప్రేమించి మోసం చేశాడని ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన మధురానగర్ పోలీసులు నవసందీప్ ను అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే… నవసందీప్ ఓ యువతిని ప్రేమిస్తున్నట్లు నమ్మించాడు. ఆమెతో వాట్సప్ చాటింగ్ కూడా చేశాడు. ఆమెను ఊరు విడిచి హైదరాబాద్ కు రావాలని కోరాడు. అందుకు అంగీకరించిన యువతి హైదరాబాద్ కు వచ్చి ఓ ప్రైవేట్ హాస్టల్ లో ఉంటోంది.
పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి హైదరాబాద్ కు వచ్చాక శారీరకంగా ఆ యువతితో సంబంధం పెట్టుకున్నాడు. ఇటీవల పెళ్లి చేసుకుందామని ఆ యువతి నవసందీప్ ను కోరగా గుండెలు పగిలే న్యూస్ చెప్పాడు. తాను నిన్ను పెళ్లి చేసుకోలేను. తను మరో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పాడు. నమ్మకా ద్రోహానికి గురై మోసపోయినట్లు గ్రహించిన యువతి మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
విచారణ చేపట్టిన పోలీసులు నవసందీప్ – యువతి వాట్సప్ చాటింగ్ ను పరిశీలించారు. అన్నింటిని పరిశీలించిన అనంతరం పోలీసులు నవసందీప్ ను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.
Also Read : హోల్ సేల్ గా తొలివెలుగు ను టీఆర్ఎస్ కు అమ్మేసిన రవిప్రకాష్..!!