ప్రజల గొంతు వినిపించే అవకాశం ఇవ్వండి : ఎంపీ రేవంత్​రెడ్డి

హైదరాబాద్‌కు ఆరేళ్లలో తెరాస ప్రభుత్వం ఖర్చుచేసింది కేవలం రూ. 6 వేల కోట్లు మాత్రమేనని కాంగ్రెస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మీట్‌ ది

Read more

రెండో జాబితా ప్రకటించిన కాంగ్రెస్

16 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ రెండో జాబితాను విడుదల చేసింది. మొదటి జాబితాలో 29 మందిని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ తాజాగా మరో 16 మంది

Read more

29 మందితో కాంగ్రెస్ తొలి జాబితా

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 29 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ జాబితాను విడుదల చేసింది. వెల్లడించిన 29 మంది అభ్యర్థుల్లో 13 మంది మహిళలు ఉన్నారు.

Read more

జీహెచ్ఎంసీ ఎన్నికలకు నగారా

జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ మంగళవారం విడుదలైంది. నవంబర్ 18 నుంచి జీహెచ్ఎంసీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర ఎన్నికల అధికారి పార్థసారథి తెలిపారు. నవంబర్ 18

Read more

బిహార్ లో బీజేపీకి పరోక్షంగా ఎంఐఎం సహాయం

బిహార్ ఎన్నికల అనంతరం అనేక మీడియా సంస్థలు వెల్లడించిన ఎక్జిట్ పోల్స్ ప్రకారం మహాగట్ బంధన్ కూటమి అయిన ఆర్జేడీ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తాయని అందరూ ఊహించారు. కానీ అంచనాలకు తలకిందులు చేసేలా తీర్పు వెలువడింది. ఎన్డీయే కూటమిలోని జేడీయూ, బీజేపీ ప్రతిపక్షానికి పరిమతమైతుందని ఊహించినా అలా జరగకపోవడం కొంత ఆశ్చర్యానికి గురి చేసే విషయమే….  గత 15 సంవత్సరాలుగా బిహార్ రాష్ట్రంలో నితీష్ కుమార్ అధికారంలో కొనసాగుతూ వచ్చారు. 15 సంవత్సరాలుగా పాలించడం మూలాన నితిష్ కుమార్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటుందని దానితో తాము అధికారంలోకి రావడం ఖాయం అని ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి అంచనాలు వేసుకుంది. లాలూ ప్రసాద్ చిన్న కుమారుడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి బిహార్ లో ఆ కూటమి ప్రచారం జోరుగా సాగింది. కాని కొన్ని పరిస్థితుల కారణంగా మహా గట్ బంధన్ కూటమి అధికారానికి స్వల్ప దూరంలో ఆగిపోవాల్సి వచ్చింది.  బిహార్ రాష్ట్రంలో ఎంఐఎం చేసిన పని కారణంగానే మహాగట్ బంధన్ కూటమి ఓడిపోయిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎంఐఎం పార్టీ బిహార్ రాష్ట్రంలో ఏం చేసింది? ఎందుకు చేసింది? సీమాంచల్ ప్రాంతంలోనే పోటీ చేయడానికి కారణాలేంటి? ఎవరికి లాభం చేకూర్చేందుకు చేసిందనే చర్చ సాగుతోంది. బిహార్ ఎన్నికల అనంతరం సీమాంచల్ ప్రాంతం గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు. దాని ముఖ చిత్రం ఏంటి?  పూర్ణియా, కతిహార్, కిషన్ గంజ్, అరియారియా అనే నాలుగు జిల్లాలతో కూడినదే సీమాంచల్ ప్రాంతం. సీమాంచల్ ప్రాంతంలో ముస్లిం జనభా అత్యధికాంగా ఉంటారు. ఎన్నికల సంఘం అంచనాల ప్రకారం ఆ నాలుగు జిల్లాల్లో కలిపి 40 శాతానికి పైగా ముస్లిం జనభా ఉంది. ఇక్కడి ప్రజలంతా ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్, ఆర్జేడీలకు ఓటు బ్యాంకుగా ఉన్న ప్రాంతం. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కూడా ఇది కీలకమైన ప్రాంతం. ఇక్కడ కాంగ్రెస్, ఆర్జేడీ ఓటు బ్యాంకును దెబ్బకొట్టేందుకే ఎంఐఎం పార్టీ బిహార్ ఎన్నికల్లో పోటీలో నిలబడింది అనే వాదనలు వినబడుతున్నాయి. ఎన్డీయే కూటమికి సహకరించేందుకే బిహార్ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేసిందనే వాదనలూ వినబడుతున్నాయి. అయితే ఇది ఎవరికి సహకరించేందుకో చెప్పాల్సిన బాధ్యత ఎంఐఎం పార్టీ, నాయకులుపై ఖచ్చితంగా ఉంది.   సీమాంచల్ ప్రాంతంలో 24 అసెంబ్లీ సీట్లకు గానూ 14 సీట్లలో ఎంఐఎం పార్టీ పోటీ చేయగా మిగిలిన స్థానాల్లో దాని కూటమిలోని అభ్యర్థులు పోటీ చేశారు. కానీ కేవలం 5 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే వీరు విజయం సాధించగలిగారు. మరి ఆర్జేడీ ఓటమికి ఎంఐఎం పార్టీ ఎలా కృషి చేసిందనే ప్రశ్న ఎదురౌతుంది. ఎంఐఎం పార్టీ పోటీ చేసి గెలిచింది 5 స్థానాల్లోనే అయినా మిగతా స్థానాల్లో ఓట్ల విషయంలో ఆర్జేడీ కూటమికి ఆ పార్టీ బాగానే దెబ్బకొట్టింది. సీమాంచల్ లోని మిగిలిన అన్ని సీట్లలో ఆర్జేడీ కూటమి మూడో స్థానంలో నిలిచేందుకు పరోక్షంగా ఎంఐఎం పార్టీ పోటీ చేయడమే ప్రధానమైన కారణం.  ఎన్నికల ప్రచారంలో భాగంగా సీమాంచల్ ప్రాంతంలో సీఏఏ,ఎన్ఆర్సీల చట్టాల గురించి మాట్లాడుతూ ఈ ప్రాంతం వెనకబాటు తనాన్ని లేవనెత్తి చూపారు. దీని కారణంగా కాంగ్రెస్, ఆర్జేడీకి గత కొంత కాలంగా ఓట్లు వేస్తున్న ముస్లిం ప్రజలు ఈ సారి వారికి కాకుండా ఎంఐఎం వైపు మొగ్గు చూపారు. దీని కారణంగా 24 అసెంబ్లీ సీట్లలో మహాగట్ బంధన్ కూటమి వెనకబడిపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీ 9, ఆర్జేడీ 3 సీట్లు సాధించాయి. ఒకవేళ ఎంఐఎం పార్టీ ఆ ప్రాంతంలో పోటీ చేయకుంటే బిహార్ రాష్ట్రంలో మహాగట్ బంధన్ కూటమి అధికారంలోకి వచ్చేదన్నది విశ్లేషకుల అంచనా.   సీమాంచల్ ప్రాంతంలో కాంగ్రెస్, ఆర్జేడీని దెబ్బకొట్టేందుకే ఎంఐఎం పార్టీతో బీజేపీ లోపాయికారి ఒప్పందం చేసుకుందనేది ఆ ప్రాంత వాసుల వాదన. ఏది ఏమయినప్పటికీ బిహార్ లో కాంగ్రెస్, ఆర్జేడీ ఓటమికి ప్రధాన కారణం మాత్రం ఎంఐఎం పార్టీదే. 

Read more

పార్టీ మారే యోచనలో విజయశాంతి…..!

టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ విజయశాంతి బీజేపీలో చేరడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఏరోజు అనేది మాత్రమే తేలాల్సి ఉందని బీజేపీలోని నాయకులు చెబుతున్నారు. భారతీయ జనతా

Read more

పీసీసీ మార్పుపై స్పష్టతనిచ్చిన మధు యాష్కీ

దుబ్బాక ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన చేస్తామని ఏఐసీసీ కార్యదర్శి మధు యాష్కీ తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో తెలంగాణలో పార్టీ ప్రక్షాళన తప్పదని

Read more

కాంగ్రెస్ పార్టీ సీనయర్ నాయకుడు వి హన్మంతరావు గూర్చి ఎవరికి తెలియని విషయాలు

విశ్వసనీయత శిఖరం వీ హనుమంతరావుపదవుల కోసం పరుగులు తీయడు డబ్బు మీద యవలేదు ఆడంబరాలు మీద ఆసక్తి అసలే లేదు అబద్దాలు నక్కజిత్తులు మాయో పాయాలు వెన్నుపోట్లు

Read more

యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ Mobile App – రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలా ?

మీ ఫోన్ లో “ప్లే స్టోర్” నుండి “IYC ఆప్ ను ” డౌన్ లోడ్ చేసుకోండి .(ప్రిఫరెన్సెస్ ను allow చెయ్యండి ) ఇక్కడ MEMBERSHIP

Read more

సొమ్ము సింగరేణిది – సోకు కోనేరు కోనప్ప గారిది / పాల్వాయి హరీశ్ బాబు ప్రెస్ మీట్

కాగజ్ నగర్ లోని ప్రజా కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సిర్పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారు చేసిన *మధ్యాహ్న భోజన కుంభకోణం

Read more