ఉద్యోగం కోసం ఎదురుచూస్తోన్న వారికీ గుడ్ న్యూస్ ప్రకటించింది ఇండియన్ పోస్ట్. ఖాళీగానున్న నాలుగు విభాగాల్లో పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత , ఆసక్తి కల్గిన అభ్యర్థులు ఆఫ్ లైన్ పద్ధతిలో ఈ ఉద్యోగాలకు జనవరి తొమ్మిది తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొంది. నైపుణ్య పరీక్షల ఆధారంగా ఉద్యోగులను ఎంపిక చేయనున్నారు.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు
- 1.M.V Machanic ( Skilled )-04
- 2. M.V Electrician ( Skilled ) -01
- 3.Copper&Tinsmith-01,
- 4. Upholster (Skilled)-01.
అర్హతలు
- గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్స్టిట్యుట్ నుంచి సాంకేతిక విభాగంలో ఐటిఐ ట్రేడ్ సర్టిఫికేట్ కల్గి ఉండాలి.
- 8వ తరగతి అర్హతతో సంబంధిత టెక్నికల్ విభాగంలో ఒక సంవత్సర అనుభవం కల్గి ఉండాలి.
- M.V Machanic పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు, ప్రామాణిక డ్రైవింగ్ లైసెన్స్ (HMV) హెవీ మోటార్ వెహికల్ కల్గి ఉండాలి.
వయోపరిమితి
- 01.07.2022నాటికీ 18సంవత్సరాలు పూర్తి చేసుకొని 23సంవత్సరాల లోపు ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
- పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
సెలక్షన్ ప్రాసెస్
- దరఖాస్తులను పరిశీలించి వాటిని షార్ట్ లిస్టు చేసి , సంబంధిత విభాగంలో కనబరిచిన టెక్నికల్ విద్యార్హతల ఆధారంగా రాత పరీక్ష/నైపును పరీక్షలను నిర్వహించి ఎంపిక చేస్తారు.
- ట్రేడుల ఆధారంగా రాత పరీక్ష/ సిలబస్ వివరాలను షార్ట్ లిస్టు అయిన అభ్యర్థులను తదుపరి అనౌన్స్ చేస్తారు.
గౌరవ వేతనం
లెవల్-2, 7th CPC పే మ్యాట్రిక్స్ ప్రకారం రూ. 19,900 నుంచి రూ. 63,200ప్రకారం అన్ని అలవెన్సులు కలిపి ప్రతినెల ఉచితంగా చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజ్ : 100
రాత పరీక్ష నైపుణ్య పరీక్ష ఫీజ్
- సెలక్ట్ అయిన అభ్యర్థులు రాత పరీక్ష నైపును పరీక్ష కోసం 400ఫీజ్ చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ మహిళా అభ్యర్థులకు రాత పరీక్ష ఫీజ్ మినహాయించారు.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా
The senior Manager ( JAC) , Mail Moter service, No.37, Greams Road , Chennai-600006.
Also Read : పదో తరగతి అర్హతతో రేషన్ డీలర్ల ఖాళీల భర్తీ