2023 మేలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.కేసీఆర్ ముందస్తుకు వెళ్ళకపోతే డిసెంబర్ లో తెలంగాణలో ఎన్నికలు జరగుతాయి. ఈ రెండు రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి చాన్సెస్ ఎక్కువ. ఇంకాస్త గట్టిగా ఫైట్ చేస్తే తెలంగాణలోనూ కాంగ్రెస్ కు స్కోప్ ఉంది. అందుకే హైకమాండ్ ఈ రెండు రాష్ట్రాలకు కలిపి ఓ రాజకీయ వ్యూహకర్తను నియమించింది. అతడే సునీల్ కనుగోలు.
ఎస్కే స్ట్రాటజీలతో రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ దూకుడు కనబరుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ, తెలంగాణలో టీఆర్ఎస్ లు ఓటమి పాలైతే మరొసారి ఆధికారాన్ని చేరుకోవాలంటే ఆ రెండు పార్టీలకు కష్టమే. ఈ విషయాన్ని అంచనా వేసిన బీజేపీ అధినాయకత్వం సౌత్ లో బీఆర్ఎస్ భుజాలపై గన్ ఉంచి కాంగ్రెస్ ను చంపాలని ప్రయత్నిస్తోంది. ఇందుకోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నది. దీనికి బీఆర్ఎస్ తరుఫునసంపూర్ణ సహకారం అందుతున్నది. కర్ణాటకలో కాంగ్రెస్ కు అనుబంధంగా పని చేస్తున్న ప్రాంతీయ పార్టీలతో కెసిఆర్ చర్చలు జరపడం రెండు పార్టీల వ్యూహంలో భాగమేనని అంటున్నారు.
Also Read : కాంగ్రెస్ వార్ రూమ్ పై దాడులు..కేసీఆర్ కు భయం పట్టుకుందా..?
మొదట కర్ణాటకలో ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి, బీజేపీ- బీఆర్ఎస్ లు కలిపి కన్నడనాట కాంగ్రెస్ ను దెబ్బతీసే వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. ఢిల్లీలో బీఆర్ఎస్ జాతీయ కార్యాలయ భవన నిర్మాణం పూర్తి కాకుండానే అద్దె భవనంలోనే బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవం హడావిడిగా చేసేశారు. వీటి వెనక బీజేపీ అగ్రనాయకత్వం ఒత్తిడి ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ కర్ణాటకలో జెట్ స్పీడ్ తో దూసుకుపోతుండటంతో కమలనాథుల్లో కలవరం ఎక్కువవుతుంది. అందుకే బీఆర్ఎస్ గుర్తింపు ప్రక్రియ, కార్యాలయ ప్రారంభోత్సవ వేడుకలు చకచకా జరిగిపోయెలా బీజేపీ ప్లాన్ చేస్తున్నది.
డిసెంబర్ 10న గుల్బార్గాలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఏఐసీసీ అద్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే హాజరైన ఈ సభ సూపర్ సక్సెస్ అయింది. అదే సభలో కర్ణాటక మ్యానిఫెస్టోను కూడా విడుదల చేశారు. దీనిని ఈ ఆరు నెలలపాటు ముమ్మరంగా ప్రచారం చేయనున్నారు. గుల్బార్గా సభ విజయవంతం కావడంతో ఈ నెల 12న ఏఐసీసీ కార్యాలయంలో కర్ణాటక ఎన్నికలపై కీలక సమావేశం నిర్వహించారు. పార్టీ చేయించిన సర్వేలో కాంగ్రెస్ కు 135సీట్లు వస్తాయని, ఇంకాస్త ఫోకస్ చేయాలనీ ఈ సమావేశంలో నేతలు టార్గెట్ విధించుకున్నారు.
Also Read : రాజకీయ అత్యాశతోనే బీఆర్ఎస్ ఏర్పాటు..!
ఆ తరువాత మరుసటి రోజే కర్ణాటక కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలుకు చెందిన హైదరాబాద్ ఆఫీసులో పోలీసులు దాడి చేశారు. ఇందుకుగల కారణం పోలీసులు పైకి ఎదో చెబుతున్నా అసలు కారణం మరొకటి ఉందని అంటున్నారు. బీజేపీ అగ్రనాయకత్వం ఆదేశాల మేరకు ఎస్కే ఆఫీసును సీజ్ చేసినట్టు అనుమానాలు బలపడుతున్నాయి. ఎన్నికలకు సంబంధించి స్టోర్ చేసి పెట్టుకున్న వ్యూహాలను , పలు కీలక సమాచారాన్ని హైజాక్ చేసేందుకు దాడులు జరిగినట్లు చెబుతున్నారు. అందుకు ప్రతిఫలంగా బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయ ప్రారంభోత్సవ వేడుకకు బీజేపీ సహకరిస్తోందని అంటున్నారు.