Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: ADMIN
తెలంగాణ బీజేపీ అధ్యక్షడు బండి సంజయ్ పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. ఎవరి కోసం బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారో చెప్పాలని సీఎల్పీ నేత భట్టి డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు వ్యతిరేకంగా చేస్తున్నారా? మతాల మధ్య చిచ్చు పెట్టి అధికారంలోకి రావాలని పాదయాత్ర చేస్తున్నారా? అని ప్రశ్నించారు. పేదల అకౌంట్స్‌లో రూ.15 లక్షలు వేస్తానని చెప్పి వేయనందుకా పాదయాత్ర చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. పెట్రో, డీజిల్ ధరలు పెంచమని పాదయాత్ర చేస్తున్నారా బండి సంజయ్..అని ప్రశ్నించారు భట్టి.
• సూర్యాపేటలో అంబేద్కర్ విగ్రహం వద్ద కాసేపు అయోమయం… • అంబేద్కర్ కి నివాళులు అర్పించేందుకు వచ్చిన బిఎస్పి నేత ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ • మంత్రి ప్రోటోకాల్ అంటూ అడ్డుకున్న అధికారులు • విషయం తెలుసుకున్న మంత్రి జగదీష్ రెడ్డి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని వెంటబెట్టుకుని ఇద్దరు కలిసి అంబేద్కర్ కి పూలమాల వేసి నివాళులర్పించారు . • అడ్డుకున్న అధికారుల పై అసహనం వ్యక్తం చేసిన ప్రవీణ్ కుమార్ • ప్రోటోకాల్ పేరుతో దళితులను అంబేద్కర్ కి దూరం చేస్తారా అని మండిపాటు • అధికారులపై ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తా అని చెప్పిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ …
ఈరోజు రాత్రి జోగులాంబ గద్వాల్ జిల్లా ఇమ్మాపూర్ కు (రాత్రి బస చేసే ప్రాంతం) చేరుకోనున్న కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి.పాదయాత్ర శిబిరం వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తో కలిసి భోజనం చేయనున్న కిషన్ రెడ్డి.పాదయాత్ర శిబిరంలో నే తొలిరోజు రాత్రి విడిది చేయనున్న కిషన్ రెడ్డిరేపు ఉదయం బండి సంజయ్ తో కలిసి పాదయాత్ర చేయనున్న కిషన్ రెడ్డి. బండితో కిషన్ రెడ్డి అడుగులు..!Bandi Sanjay And Kishan Reddy జోగులాంబ గద్వాల్ జిల్లా ఆలంపూర్ అమ్మ వారి ఆలయానికి భారీ కాన్వాయ్ తో బయలుదేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. మధ్యాహ్నం 3 గంటలకు అలంపూర్ చేరుకోనున్న బండి సంజయ్. అలంపూర్ లో అంబెడ్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించనున్న బండి సంజయ్. సాయంత్రం 4 గంటలకు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్న బండి…
రాష్ట్రంలో సీఎంఆర్ ధాన్యం కుంభకోణం… టీఆర్ఎస్ ప్రభుత్వ ముఖ్యుల పాత్ర… సీబీఐ విచారణకు డిమాండ్. తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం సేకరణ, కస్టమ్ మిల్లింగ్, ధాన్యాన్ని ఎఫ్ సీఐకి సరఫరా చేసే ప్రక్రియలో పెద్ద ఎత్తున అవక తవకలు జరుగుతున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యులు రైస్ మిల్లర్లతో కుమ్మక్కై ప్రతి ఏటా వందల కోట్ల రూపాయల మేర ధాన్యం కుంభకోణానికి పాల్పడుతున్నారు. ఈ ఏడాది మార్చి 22 – 24 తేదీల మధ్య ఎఫ్ సీఐ అధికారులు క్షేత్ర స్థాయిలో భౌతిక తనిఖీలు చేపట్టి గుట్టురట్టు చేసిన విషయం మీకు కూడా తెలుసు. 2020 – 21 యాసంగి, 2021 – 22 వానాకాలం పంటకు సంబంధించిన ధాన్యం నిల్వల విషయంలో ఈ తనిఖీలు జరిపారు. ఈ సందర్భంగా…కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) కింద ప్రభుత్వం రైస్ మిల్లులకు కేటాయించిన నిల్వల్లో ఏకంగా 4,53,896 బస్తాల ధాన్యం భౌతికంగా లేకపోవడాన్ని ఎఫ్ సీఐ…
భారతరత్న డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.గురువారం నల్లగొండ పట్టణంలోని చర్లపల్లి బైపాస్ వద్ద భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాదు.. ప్రపంచ మేధావి అని అన్నారు.అట్టడుగు వర్గంలో పుట్టిన అంబేద్కర్ ప్రపంచం గర్వించదగ్గ స్థాయికి ఎదిగాడని అన్నారు.అట్టడుగు వర్గాలు, దళితులు అన్ని విధాలుగా అభివృద్ధి చెందినప్పుడే అంబేద్కర్ కు నిజమైన నివాళి అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ పాలనలో ఎస్సీ, ఎస్టీలకు అన్ని విధాలుగా అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన అసైన్డ్ భూములను సిఎం కెసిఆర్ ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటుందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలు అభివృద్ధి చెందడం సీఎం కేసీఆర్ కు ఏమాత్రం…
“హైదరాబాద్ ను రక్షించుకుందాం ప్రజల ప్రాణాలను కాపాడుకుందాం. “జీవో 111 రద్దు-తుగ్లక్ జిద్దు”కాకతీయులు నిర్మించగా గొల్లకొండగా ప్రసిద్ధిచెంది, కుతుబ్ షాహీ పాలనలో విస్తరించి, ఆసఫ్ జాహీ నవాబుల పాలనలో ఆధునికమైన మన హైదరాబాద్ నేడు ఐటీ రంగంలో ప్రపంచప్రఖ్యాతి పొందింది. ఎత్తైన దక్కన్ పీఠభూమి మీద ప్రకృతియే ఎయిర్ కండిషన్ చేసిన మన నగరం ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణం వల్ల ప్రపంచంలోని అన్ని జాతుల ప్రజలకు వందల ఏళ్లుగా ఆవాసమైనది. మూసా(ప్రవక్త మోజెస్), ఈసా(ప్రవక్త జీసెస్) పేర్లతో పారుతున్న రెండు నదుల అలల మధ్య అలరారుతున్నజీవగడ్డ(దో ఆబ్) నేడు నిర్జీవగడ్డగా మారే దుస్థితి ఎదుర్కొంటున్నది. వందేళ్ల కింద ప్రపంచ ప్రఖ్యాత ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య పర్యవేక్షణలో కట్టిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లను బొందపెట్టడానికి సర్కార్ కుట్రపన్నింది. రియల్ ఎస్టేట్ మాఫియా తొడేలు ఆకలి తీర్చడానికి సరస్సులను మాయం చేస్తే పట్టణం నుంచి ఐటీ కంపెనీలు ఐపీ పెట్టి పారిపోతాయి.…
*ఇటీవల జరిపిన నియామకాలు చెల్లవు*ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ లోను, అనుబంధ విభగలలోను ఏ స్థాయి లో కూడా ఎలాంటి నియామకాలు జరపవద్దని టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్, ఆర్గనైజేషన్ ఇంచార్జి మహేష్ కుమార్ గౌడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు పీఏసీ తీసుకున్న నిర్ణయంలో భాగంగా సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఎలాంటి నియామకాలు జరపవద్దని ఆయన సూచించారు. ఇటీవల కాలంలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ మొదలు అయ్యాక జరిపిన అన్ని నియామకాలు చెల్లవని, సంస్థాగత ఎన్నికల తర్వాత అన్ని నియామకాలు మళ్ళీ నూతనంగా నియమిస్తామని ఆయన వివరించారు.
జాతీయ పార్టీగా టి.ఆర్.ఎస్ ..ఎప్పుడు ఏదో సంచలనం చేస్తూ దేశ వ్యాప్త గుర్తింపు కోసం ఆరాటపడుతుంటారు తెలంగాణ సీ.ఎం కె.సీ.ఆర్ అన్నది ఆ పార్టీ నేతలు బహిరంగంగానే చెబుతుంటారు. ఏది చేసినా తన రాజకీయ వ్యూహంగా కె.సీ.ఆర్ ఏకచక్రాధిపత్యంగా పార్టీని నడిపిస్తున్నారు కె.సీ.ఆర్ కుటుంబీకుల్లో పార్టీ ల్యాభియింగ్ చేస్తారని ప్రచారం ఉన్నా కె.సీ.ఆర్ నిర్ణయమే పైనల్ అన్నది పలు సందర్బాల్లో తెలిసిన విషయమే. రెండు దశాబ్దాల గులాభీ పార్టీ ప్రస్దానంలో కె.సీ.ఆర్ ఎన్నో అటు పోట్లు చవిచూశారు. తన పని అయిపోయింది . అనుకున్నప్పుడల్లా ఫామ్ హౌజ్ పాలిటిక్స్ తో సైలెంట్ పాలిటిక్స్ సాగిస్తూ అధికారాన్ని రెండు పార్లు దక్కించుకున్నారు కె.సీ.ఆర్. 20 ఏళ్లుగా కె.సీ.ఆర్ వన్ మ్యాన్ షో ను జాతీయ స్దాయిలో చక్రం తిప్పేలా ప్లాన్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ లో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చేలా తన సంక్షేమ ఫార్మూలాను ప్రకటించనున్నారని తెలుస్తుంది. ఇక పెఢరల్ ఫ్రంట్…
రాత్రికి వస్తావా.. నాతో గడిపితే గొడవ ఉండదు లేకపోతే అంతే సంగతులు. హైదరాబాద్ నగరంలో మరో వనమా రాఘవ, కూకట్ పల్లి ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడి ఆగడాలు, లైంగిక వేధింపులు తట్టుకోలేక.. సీపీకి మహిళ ఫిర్యాదు చేసిన మహిళ. హైదరాబాద్‌లో పేరొందిన నియోజకవర్గం కూకట్ పల్లి,ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కంటే అతని అనుచరులదే హవా.. అధికారుల దగ్గర నుంచి అన్ని వర్గాల వారు వీళ్ళు చెప్పింది వినాల్సిందే. లేదంటే వారికి చుక్కలు చూపిస్తారు.ఈ ప్రాంతం అతి ఖరీదైన ప్రాంతం కాబట్టి, ఇక్కడ వీరి కనుసన్నల్లోనే అక్రమంగా భవన నిర్మాణాలు కూడా జరుగుతాయి. ఎవరైనా ప్రశ్నిస్తే పోలీసు కేసులు, లేదా అనుచరులతో దాడులు.ఇది నాణానికి ఒకవైపు మాత్రమే… మరోవైపు కథలు పుంఖాను పుంకాలు.. అందులో ఒక మచ్చుతునక ఇది. కూకట్ పల్లి టిఆర్ఎస్ నియోజకవర్గ సమన్వయ కర్త సతీష్ ఆరోరా అలియాస్ రెడ్డి సతీష్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుడి భుజం ఇదంతా…