• Home
  • Telangana
  • Government & Policy
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad Politics
  • Graduate MLC
    • Voter Registration Help

Subscribe to Updates

తెలంగాణ రాజకీయాలు, ఎన్నికలు, సర్వేలు మరియు ప్రత్యేక విశ్లేషణల తాజా అప్‌డేట్స్ పొందండి.

What's Hot

94 వేల దాటిన గ్రాడ్యుయేట్ దరఖాస్తులు… రిజిస్ట్రేషన్ రేసులో కాంగ్రెస్ ముందస్తు మొబిలైజేషన్

అక్టోబర్ 15, 2026

చెరువుకు రక్షణ… యువతకు భవిష్యత్తు… తినే తిండికి భరోసా!

అక్టోబర్ 1, 2026

భూమి హక్కుల నుంచి బతుకు భద్రత దాకా… రేవంత్ ప్రభుత్వ కొత్త చట్టాల ముచ్చట!

అక్టోబర్ 1, 2026
Facebook Twitter YouTube WhatsApp
Polytricks.in
  • About
  • Editorial Policy
  • Our Authors
  • Contact
Facebook Twitter YouTube WhatsApp
YouTube
  • Home
  • Telangana
  • Government & Policy
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad Politics
  • Graduate MLC
    • Voter Registration Help
Polytricks.in
Home » *మానవత్వంతో కూడిన ఆత్మవిశ్వాసం – సదా స్ఫూర్తిదాయకం*
AndhraPradesh

*మానవత్వంతో కూడిన ఆత్మవిశ్వాసం – సదా స్ఫూర్తిదాయకం*

Polytricks Editorial TeamBy Polytricks Editorial Teamడిసెంబర్ 7, 2023Updated:డిసెంబర్ 7, 2023వ్యాఖ్యలు లేవు2 Mins Read
Facebook Twitter WhatsApp Pinterest LinkedIn Tumblr Reddit Email VKontakte
Share
Facebook Twitter WhatsApp LinkedIn Email

ఒక సామాన్యుడిగా జీవితం ప్రారంభించి. అంచెలంచలుగా ఎదిగి ఉన్నత శిఖరాలకు చేరుకున్న వ్యక్తి సానా సతీస్ బాబు. జీవితంలో చిన్నగా ప్రారంభమై క్రమక్రమాభివృద్ధి పొంది మిన్నగా ఆయన ఎదిగారు. ఇంతింతై వటుడింతయై అన్నట్టుగా ఆయన ప్రగతి క్రమం సాగింది. ఎదురులేని సామ్రాజ్యాన్ని నిర్మించుకునే స్థాయికి చేరింది. అందుకే ఏ ఒక్కరిని పలకరించినా ఆయన పట్ల ప్రేమాభిమానాలే తప్ప, ఒక్క తప్పు మాటైనా పలకదు. ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన సానా సతీష్ బాబులో ఇసుమంతైనా అహంకారం కనిపించదు. నేను అనే గర్వం ఇంత కూడా ప్రతిబింబించదు. మాటల్లో ఆప్యాయత, పలకరింపులో ఆదరణ, వ్యక్తిత్వంలో మానవత్వం ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. నిలువెత్తు ఆత్మ విశ్వాసానికి ప్రతిరూపం సానా సతీష్ బాబు అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఎంతో ఆత్మవిశ్వాసం, బలమైన సంకల్పం ఉంటే తప్ప జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడం ఆషామాషీ విషయం కాదు. అందులోనూ మానవత్వ విలువలను కాపాడుకుంటూ లక్ష్య సాధన వైపు సాగడం నిజంగా ఎంతో గుండె నిబ్బరం ఉన్నవారికే సాధ్యమవుతుంది. అడుగడుగునా అవకాశవాదులు, మోసం చేయాలని చూసేవారు ఎదురుపడుతుంటారు. వారిని దాటుకొని లక్ష్యం వైపు పయనమవ్వాలి. అటువంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్ని ఓ ధ్రువ తారలా వ్యాపార సామ్రాజ్యంలో వెలుగొందుతున్నారు.

 

సానా సతీష్ బాబు అదృష్టాన్ని ఎన్నడూ నమ్ముకోలేదు. తన లక్ష్య సాధన కోసం కర్మను ఆచరణలో పెట్టారు. వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకున్నారు. నేర్చుకున్న పాఠాల అనుభవంతో జీవితంలో ముందడుగు వేశారు. అందుకు ఎన్నో వ్యయ ప్రయాసలను కూర్చి ఒక శక్తిగా ఎదిగారు. అందుకే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మాటలను ఆచరణలో పెడుతూ ఎంతో సాదాసీదాగా కనిపిస్తారు. ఆయన జీవితంలో కేవలం కలలు కనలేదు. వాటిని సాకారం చేసుకోవాలని అనుక్షణం తపన పడ్డారు. ఆ తపనే ఆయనను ఉన్నత స్థాయికి చేర్చిందని చెబుతారు. సానా సతీష్ బాబు ఒక సాధారణ విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీరుగా మొదలుపెట్టి వ్యాపార దిగ్గజంగా ఎదగడం వెనుక ఆయన పట్టుదల, కృషి ఎంతగానో ఉన్నాయి. 1994 సంవత్సరంలో ఉద్యోగం చేరిన తొలినాళ్లలోనే తుఫాను రూపంలో సవాలు ఎదురైంది.  నాటి తుఫానుకు చాలా ప్రాంతాల్లో విద్యుత్ తీగలు తెగిపోయాయి. ప్రజలు ఎన్నో అవస్థలకు గురవుతున్నారు. సానా సతీష్ బాబు ముందుకున్న ఒకే ఒక్క సవాల్ వీలైనంత త్వరగా విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలి. ప్రజలకు ఉపశమనం కల్పించాలి. అదే సమయంలో సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమవ్వాలి. వాటన్నింటినీ కూడా మానవత్వాన్ని చాటుతూ చేసి చూపించారు. వారం రోజుల పాటు నిద్రాహారాలు మాని విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణ మాత్రమే కాదు, వరద బాధితుల సహాయక చర్యల్లో పాలు పంచుకొని నాటి ప్రభుత్వ పెద్దలతో శబ్బాష్ సతీష్ బాబు అనిపించుకున్నారు. ప్రజా సేవ పట్ల ఆయనకున్న అంకిత భావం అటువంటిది. విధి నిర్వహణ పట్ల నిబద్ధత అంతటిది. 

 

అందుకే ఆయన నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవడంతో పాటు ఆ పాఠాల సారాన్ని అవపోసన పట్టి అనుభవాలను విజయాలుగా మలచుకోవడంలో స్ఫూర్తిని కలిగిస్తున్నారు సానా సతీష్ బాబు. ఎంతో మంది యువకులు ఆయన స్ఫూర్తితో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి అనూహ్య విజయాలను సొంతం చేసుకుంటున్నారు. అటువంటి వారికి వ్యాపారంలో ఆటుపోట్లు వచ్చినప్పుడు సానా సతీష్ బాబు వెన్నుదన్నుగా నిలుస్తూ ప్రోత్సహిస్తున్నారు. రంగం ఏదైనా కావొచ్చు సానా సతీష్ బాబు మా ఐకాన్ అంటున్నారు నేటి యువత. ఆయనలోని ఆత్మ విశ్వాసం, మానవత్వమే అంతటి అభిమానులను సంపాదించి పెట్టిందనడం నిజంగా సానా సతీష్ బాబు అభిమానులకు గర్వకారణం.

 

Foundation Activities kakinada Kakinada Activities Sana Sathish Babu Foundation sanasathishbabu who is sanasathishbabu
Share. Facebook Twitter Pinterest Tumblr Email WhatsApp
Polytricks Editorial Team
  • Website

Polytricks Editorial Team covers Telangana politics, governance, elections, surveys and public-interest analysis with a focus on verified facts, context and accountability.

Related Posts

ఆళ్ల‌గ‌డ్డ‌లో అఖిల‌కు అన్నీ ప్ర‌తికూల పరిస్థితులు ఎదుర‌వుతున్నాయా?

ఏప్రిల్ 3, 2024

నంద‌మూరి సుహాసిని ఎంపిగా పోటీ చేస్తున్నారా?

ఏప్రిల్ 3, 2024

గుంటూరు వెస్ట్ లో కీల‌క పోరు జ‌ర‌గ‌బోతోందా?

ఏప్రిల్ 3, 2024

Comments are closed.

Don't Miss

94 వేల దాటిన గ్రాడ్యుయేట్ దరఖాస్తులు… రిజిస్ట్రేషన్ రేసులో కాంగ్రెస్ ముందస్తు మొబిలైజేషన్

అక్టోబర్ 15, 20260

మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ Graduate MLC నియోజకవర్గంలో తాజా పబ్లిక్ రిపోర్టెడ్ Form-18 దరఖాస్తులు 94,059. 2021లో 5.17 లక్షల electorateతో పోలిక, కాంగ్రెస్ 43 observers–7 లక్షల target, BRS mobilisationతో PolyTricks విశ్లేషణ.

చెరువుకు రక్షణ… యువతకు భవిష్యత్తు… తినే తిండికి భరోసా!

అక్టోబర్ 1, 2026

భూమి హక్కుల నుంచి బతుకు భద్రత దాకా… రేవంత్ ప్రభుత్వ కొత్త చట్టాల ముచ్చట!

అక్టోబర్ 1, 2026

స్కిల్స్ నుంచి ఫ్యూచర్ సిటీ దాకా… రేవంత్ పాలన ముచ్చట!

సెప్టెంబర్ 30, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • YouTube
  • WhatsApp
Our Picks

94 వేల దాటిన గ్రాడ్యుయేట్ దరఖాస్తులు… రిజిస్ట్రేషన్ రేసులో కాంగ్రెస్ ముందస్తు మొబిలైజేషన్

అక్టోబర్ 15, 2026

చెరువుకు రక్షణ… యువతకు భవిష్యత్తు… తినే తిండికి భరోసా!

అక్టోబర్ 1, 2026

భూమి హక్కుల నుంచి బతుకు భద్రత దాకా… రేవంత్ ప్రభుత్వ కొత్త చట్టాల ముచ్చట!

అక్టోబర్ 1, 2026

స్కిల్స్ నుంచి ఫ్యూచర్ సిటీ దాకా… రేవంత్ పాలన ముచ్చట!

సెప్టెంబర్ 30, 2026
Facebook Twitter YouTube WhatsApp
  • Home
  • Andhra Pradesh
  • Telangana
  • About
  • Our Authors
  • Editorial Policy
  • Corrections
  • Privacy Policy
  • Contact
© 2026 Polytricks.in. All rights reserved.

Type above and press Enter to search. Press Esc to cancel.

Go to mobile version