Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
పట్టాభిని వైసీపీ టార్గెట్ చేయడం వెనక వ్యూహమేంటి.? సొంత పార్టీలో ప్రత్యర్ధులతోపాటు పట్టాభి తోడైతే గన్నవరంలో తన రాజకీయ ఉనికి ప్రశ్నార్ధకం అవుతుందని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆందోళన చెందారా..? గన్నవరంపై పట్టాభి చూపును సైడ్ చేసి… అతడిలో భయాన్ని ప్రోది చేసేందుకే ఆయనపై దాడి జరిగిందా..? గన్నవరం ఎమ్మెల్యే వంశీ. గత ఎన్నికల్లో టీడీపీ తరుఫున పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత టీడీపీని వీడి అధికార వైసీపీలో చేరారు. వంశీ వైసీపీలో చేరడంతో అక్కడ టీడీపీకి బచ్చుల అర్జునుడు అన్ని తానై వ్యవహరిస్తున్నారు. కానీ ఇటీవల ఆయన అనారోగ్యానికి గురి కావడంతో.. వంశీకి ధీటైన నాయకుడిని టీడీపీ అధిష్టానం అన్వేషించసాగింది. ఈక్రమంలోనే టీడీపీ హైకమాండ్ పట్టాభి పేరును పరిశీలనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రత్యర్ధి పార్టీలో బలమైన వాయిస్ ను రైజ్ చేసే నేతలే లక్ష్యంగా దాడులు చేసింది. దాంతో టీడీపీలో బలమైన నేతలు సైతం…
బీఆర్ఎస్ కు సిగ్గు లేదు..బీజేపీకి శరం లేదు. అవును. ఇది విమర్శ కాదు. అసలు విషయం తెలిస్తే మీరే ఈ రెండు పార్టీలను ‘ఛీ’ కొడుతారు. రెండు పార్టీలను తప్పుబడుతారు. ఇంతకీ విషయం ఏంటంటే.. దేవరకొండ మండలం చిన్నబావి గ్రామానికి చెందిన లక్ష్మి…బీజేపీ మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు. బీజేపీలో కీలకంగా వ్యవహరిస్తుందని.. అందులోనూ ఓ మహిళ బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పని చేస్తుందని అధికార పార్టీ నాయకులు ఆమెను లైంగికంగా వేధించారు. అయినా భరించింది. కానీ ఇటీవల ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి చొరబడి బీఆర్ఎస్ నాయకులు లైంగికంగా వేధించారు. తీవ్ర మనస్తాపానికి గురైన లక్ష్మి పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది. పది రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. బీజేపీకి నిస్వార్ధంగా పనిచేసిన లక్ష్మి మరణవార్త బయటకు వచ్చేంత వరకు ఆమెపై లైంగిక దాడి జరిగిన విషయం ఎక్కడ బయటకు రాలేదు. లక్ష్మి…
అధికార బీఆర్ఎస్ నాయకుల లైంగిక వేధింపులకు బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు బలైంది. పలుమార్లు తనను లైంగికంగా వేధించడంతో మానసిక వేదనకు గురైన ఈ మహిళ నేత పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు ఆమెను హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలించగా.. పదిరోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. దేవరకొండ మండలం చింతబావి గ్రామానికి చెందిన లక్ష్మీ బీజేపీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేది. రాజకీయ అంశాలపై ఆమెకు మంచి పట్టుంది. ఆమె పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడంతో దేవరకొండ మండల మహిళా మోర్చా అధ్యక్షురాలుగా నియమించారు. అప్పటి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమెపై బీఆర్ఎస్ నాయకుల కన్ను పడింది. లక్ష్మిని తరుచుగా లైంగికంగా వేధించడం ప్రారంభించారు బీఆర్ఎస్ నాయకులు. ఈ క్రమంలోనే ఇటీవల లక్ష్మి ఒంటరిగానున్న సమయంలో ఇంట్లోకి చొరబడ్డారు. ఇదే అదునుగా భావించి ఆమెను…
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఇద్దరు బీజేపీ కీలక నేతలు డీకే అరుణ, జితేందర్ రెడ్డిలు తమ వారసులను రాజకీయ అరంగేట్రం చేయించేందుకు పావులు కదుపుతున్నారు. ఇందుకోసం ఇప్పటి నుంచే వారికీ నియోజకవర్గాలపై పట్టు సాధించి పెట్టేందుకు ఈ ఇద్దరు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. అయితే, తమతోపాటు తమ వారసులకు టికెట్లు ఇప్పించుకొని పార్టీలో ప్రాబల్యం పెంచుకోవాలని చూస్తోన్న ఈ ఇద్దరి నేతల ప్రయత్నాలు సక్సెస్ అవుతాయా..? డీకే అరుణ తన కూతురు స్నిగ్ధారెడ్డిని వచ్చే ఎన్నికల్లో గద్వాల నుంచి పోటీ చేయించాలని చూస్తున్నారు. తను మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి పోటీ చేయాలనే తలంపుతోనున్న గద్వాల జేజెమ్మ.. తన కూతురిని మాత్రం తన ఇలాకా గద్వాల నుంచి బరిలో నిలపాలని ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారన్న టాక్ గద్వాల పొలిటికల్ సర్కిల్లో చాన్నాళ్ళుగా చక్కర్లు కొడుతోంది. అదేవిధంగా..మహబూబ్ నగర్ మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి కూడా…
పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ కాంబోలో ఓ మల్టిస్టారర్ చిత్రం ‘వినోదయ సితం’ రీమేక్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణపై అధికారిక ప్రకటన లేదు కానీ రోజుకో గాలి వార్త చక్కర్లు కొట్టింది. పూజ కార్యక్రమాలు పూర్తి అయ్యాయని.. జనవరిలో షూటింగ్ మొదలైందని ప్రచారం జరిగింది. కానీ ఏనాడూ మూవీ యూనిట్ ఈ చిత్రంపై అధికారిక ప్రకటన చేసింది లేదు. ఈ క్రమంలోనే చిత్ర బృందం ఈ మూవీపై అప్డేట్ ఇచ్చింది. ‘ఇవాళ నుండి పవన్ కళ్యాణ్ -సాయి ధరమ్ తేజ్ మూవీ పట్టాలెక్కుతుంది. త్వరలో అదిరిపోయే అప్డేట్’ ఇవ్వనున్నామని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సాయి ధరమ్, పవన్, చిత్ర యూనిట్ ఫోటోలు కూడా షేర్ చేశారు. ఫైనల్ గా వినోదయ సితం రీమేక్ రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. సముద్ర ఖని దర్శకుడిగా ఈ సినిమా తెరకక్కనుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా…
తెలంగాణ కాంగ్రెస్ లో ఆశాజనకమైన మార్పు కనిపిస్తోంది. హత్ సే హత్ జోడో యాత్రతో నేతలంతా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను వివరిస్తూ…కాంగ్రెస్ అధికారంలోకి ఏం చేస్తుందో చెబుతున్నారు. ఎవరెవరు యాత్రలు చేస్తున్నారో, ఎవరెవరు చేయడం లేదో ఫీడ్ బ్యాక్ ను అధిష్టానం కోరుతుండటంతో నేతలు సీరియస్ గా ఈ హత్ సే హత్ జోడో యాత్రలను చేస్తున్నారు. ఒక్క కోమటిరెడ్డి మినహా నేతలంతా పాదయాత్రలు చేస్తున్నారు. త్వరలోనే ఆయన కూడా యాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. టీపీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి హత్ సే హత్ జోడో యాత్ర యాత్రపేరుతో ములుగు నుంచి యాత్ర చేపట్టారు. రెండు నెలలపాటు జనంలోనే ఉండేలా ఆయన ఏర్పాట్లు చేసుకున్నారు. రేవంత్ పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ లో మునుపటి జోష్ కనిపిస్తోంది. సీనియర్లు సైతం ఆయనకు మద్దతు ప్రకటించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ నేతలు వీహెచ్, మధుయాష్కీ, మహేష్ కుమార్…
హైదరాబాద్ లో నాలుగేళ్ల పసివాడు వీధికుక్కల బారిన పడి ప్రాణాలు కోల్పోయిన ఘటన ప్రతి ఒక్కరి మనస్సును తీవ్రంగా కలచివేస్తోంది. సీసీ కెమెరా దృశ్యాలు చూసిన వారందరూ ఆ పిల్లాడు అనుభవించిన నరకయాతన తలచుకొని వీడియోను చూడటం పక్కన పెట్టేస్తున్నారు. ఓ మాంసపు ముద్ద దొరికినట్లుగా వీధికుక్కలు ఆ బాలుడిపై చెలరేగిపోయాయి. చుట్టూ నాలుగు కుక్కలు ఒకదాని వెనక ఒకటి ఆ పసివాడిపై ఎగబడి పీకుతింటున్న దృశ్యాలు చూసి కంటతడి పెట్టని మనషులు ఉంటారా..? హైదరాబాద్.. ప్రపంచ ప్రఖ్యాత నగరం. ఎంత అభివృద్ధి ఉంటుందో నగరం లోపలికి వెళ్లి చూస్తె అంతేమొత్తంలో దారిద్ర్యం కేంద్రీకృతమై కనిపిస్తోంది. నగరంలో ఉండే ఎనభై శాతం జనాభా ఈ స్థితిలోనే ఉంటుంది. అతి తక్కువ జీవితాలతో .. అరకొర వసతులతో బతికేస్తూ ఈ ఎనభై శాతం మంది ఉంటారు. ఇలాంటి ప్రాంతాల్లోనే ఈ దుర్ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ సౌకర్యాలు కల్పించమని ఎవరూ అడగరు..ఎలాగోలా జనం…
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ కుమారులకు టికెట్లు ఇప్పించుకునేందుకు అప్పుడే పలువురు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు మొదలెట్టారు. ఇందుకోసం ఆయా నియోజకవర్గాల్లో రాజకీయ వారసులకు ప్రత్యేకంగా ఓ కోటరీని ఏర్పాటు చేస్తున్నారు. పలు ఈవెంట్లు నిర్వహిస్తూ ప్రజలకు, ముఖ్యంగా యువతకు దగ్గరయ్యేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రులు తలసాని తన కొడుకుకు మరోసారి సికింద్రాబాద్ టికెట్ కోసం ప్రయత్నిస్తుంటే.. మల్లారెడ్డి మాత్రం అల్లుడిపై కేసీఆర్ కరుణ కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలోకి చేరారు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడిని పోటీ చేయించేందుకు తెరవెనక పావులు కదుపుతున్నారట. మైనంపల్లి రోహిత్ ను 2023 ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని మైనంపల్లి హన్మంతరావు కసరత్తు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ దిశగా ఆయన మెదక్ నియోజకవర్గ ప్రజలకు సంకేతాలు కూడా పంపుతున్నారని అంటున్నారు. మల్కాజిగిరి ఎమ్మెల్యేగానున్న…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. వరుస సినిమా షూటింగ్ లు, రాజకీయ వ్యవహారాల్లో తలమునకలై ఉండాల్సి రావడంతో పవన్ అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. ఆయన అస్వస్థతకు గురి కావడంతో ఈ మధ్య ప్రారంభం కావాల్సిన తమిళ చిత్రం ‘వినోదయ్యా సీతం’ రీమేక్ షూటింగ్ వాయిదా పడింది. ‘వినోదయ్యా సీతం’ రీమేక్ సినిమా కోసం గత కొద్ది రోజులుగా పవన్ ప్రత్యేకమైన డైట్ తీసుకుంటున్నారు. స్లిమ్ గా కావాల్సి ఉండటంతో ఆయన స్వల్ప అనారోగ్యానికి గురైనట్లు ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా పవన్ స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో ఆయన ముందుగా ఫిక్స్ చేసుకున్న షెడ్యూల్ ను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. జనవరి వరకు ‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ కి తాత్కాలిక బ్రేక్ ఇచ్చి #OG మరియు వినోదయ్యా సీతం రీమేక్ డేట్స్…
కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అకాల మరణంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నికపై జోరుగా చర్చ జరుగుతోంది. ఖాళీ అయిన నియోజకవర్గానికి ఆరు నెలల్లోపు ఎన్నిక నిర్వహించాలేది రాజ్యాంగ నిబంధన. అదే సమయంలో ఎన్నిక నిర్వహణ అనంతరం పదవి కాలం సంవత్సరంపాటు ఉంటేనే ఉప ఎన్నిక నిర్వహిస్తారని అంటున్నారు. ఈ ఉప ఎన్నిక నిర్వహణ మొత్తం కేంద్ర ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. ఒకవేళ కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నిక నిర్వహణకు మొగ్గు చూపితే కర్ణాటక ఎన్నికలతోపాటు కంటోన్మెంట్ ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంది. ఉప ఎన్నిక ద్వారా బీఆర్ఎస్ పై పట్టు సాధించాలని బీజేపీ పట్టుదలగా ఉంది. గతంలో జరిగిన ఉప ఎన్నికల ద్వారా బీఆర్ఎస్ కు ముచ్చెమటలు పట్టించిన బీజేపీ… కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా జరిగితే మరోసారి పట్టు బిగించే అవకాశం ఉందని బీఆర్ఎస్ భావిస్తోంది. పైగా.. అర్బన్ ఏరియాలో బీజేపీకి మొదటి…