పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ కాంబోలో ఓ మల్టిస్టారర్ చిత్రం ‘వినోదయ సితం’ రీమేక్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణపై అధికారిక ప్రకటన లేదు కానీ రోజుకో గాలి వార్త చక్కర్లు కొట్టింది. పూజ కార్యక్రమాలు పూర్తి అయ్యాయని.. జనవరిలో షూటింగ్ మొదలైందని ప్రచారం జరిగింది. కానీ ఏనాడూ మూవీ యూనిట్ ఈ చిత్రంపై అధికారిక ప్రకటన చేసింది లేదు. ఈ క్రమంలోనే చిత్ర బృందం ఈ మూవీపై అప్డేట్ ఇచ్చింది.
‘ఇవాళ నుండి పవన్ కళ్యాణ్ -సాయి ధరమ్ తేజ్ మూవీ పట్టాలెక్కుతుంది. త్వరలో అదిరిపోయే అప్డేట్’ ఇవ్వనున్నామని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సాయి ధరమ్, పవన్, చిత్ర యూనిట్ ఫోటోలు కూడా షేర్ చేశారు. ఫైనల్ గా వినోదయ సితం రీమేక్ రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. సముద్ర ఖని దర్శకుడిగా ఈ సినిమా తెరకక్కనుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. పవన్, త్రివిక్రమ్ కాంబోకు సూపర్ హిట్ అనే పేరుంది. ఈ క్రమంలోనే వినోదయ సీతంకు త్రివిక్రమ్ స్క్రిప్ట్ రెడీ చేసి ఇచ్చినట్లు సమాచారం. స్టొరీ లైన్ ఏంటో తెలుసుకొని పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు తగ్గట్లుగా స్కిప్ట్ లో మార్పులు చేసినట్లు సమాచారం. అలాగే, పవన్ – సాయి ధరమ్ తేజ్ లకు పాత్రలు సెట్ అయ్యేలా కథనంలో మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
వినోదయ సితం చిత్రంలో పవన్ కళ్యాణ్ నిడివి తక్కువగానే ఉండనుందట. అందుకే ఆయన ఈ సినిమా షూటింగ్ కోసం జస్ట్ 20రోజుల సమయమే కేటాయించారని అంటున్నారు. మొదటిసరి సాయి ధరమ్ తేజ్ తన మావయ్యతో కలిసి నటిస్తున్నారు. ఈ మెగా హీరోల కాంబోలో సినిమా తెరకెక్కుతుండటంతో సహజంగానే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆగస్ట్ లో ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నా చిత్రీకరణ పూర్తయ్యే నాటికీ మరింత సమయం పట్టనుంది.. కాబట్టి ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
Also Read : విరాట్ కోహ్లీకి లిప్ కిస్ ఇచ్చిన యువతి..!