అధికార బీఆర్ఎస్ నాయకుల లైంగిక వేధింపులకు బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు బలైంది. పలుమార్లు తనను లైంగికంగా వేధించడంతో మానసిక వేదనకు గురైన ఈ మహిళ నేత పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు ఆమెను హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలించగా.. పదిరోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది.
దేవరకొండ మండలం చింతబావి గ్రామానికి చెందిన లక్ష్మీ బీజేపీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేది. రాజకీయ అంశాలపై ఆమెకు మంచి పట్టుంది. ఆమె పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడంతో దేవరకొండ మండల మహిళా మోర్చా అధ్యక్షురాలుగా నియమించారు. అప్పటి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమెపై బీఆర్ఎస్ నాయకుల కన్ను పడింది.
లక్ష్మిని తరుచుగా లైంగికంగా వేధించడం ప్రారంభించారు బీఆర్ఎస్ నాయకులు. ఈ క్రమంలోనే ఇటీవల లక్ష్మి ఒంటరిగానున్న సమయంలో ఇంట్లోకి చొరబడ్డారు. ఇదే అదునుగా భావించి ఆమెను లైంగికంగా వేధించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన లక్ష్మి పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది.
పదిరోజులుగా హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. లక్ష్మి మృతికి కారకులైన బీఆర్ఎస్ నాయకులను వదలవద్దని డిమాండ్ చేశారు. లక్ష్మిపై జరిగిన లైంగిక వేధింపులపై లిఖితపూర్వక ఫిర్యాదు చేసినా నిందితులపై ఇప్పటివ్బరకు కేసు ఫైల్ చేయలేదని.. వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ నాయకులు.
Also Read : మహిళా నేతపై లైంగిక దాడి జరిగితే స్పందించని బండి…నువ్వో లీడర్ వా..?