Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
జబర్దస్త్ కామెడి షో ద్వారా చమ్మక్ చంద్ర పాపులారిటీ మరింత పెరిగింది. ఆయన చేసే ఫ్యామిలీ స్కిట్లు సూపర్ హిట్ అయ్యాయి. ఆయన స్కిట్ కోసం ప్రత్యేకంగా జబర్దస్త్ ను చూసేవారుంటారు. అంటే ఆయన ఏ రేంజ్ లో ఫ్యామిలీ స్కిట్ తో ఫర్ఫామ్ చేస్తారో ఊహించుకోవచ్చు. లేడి గెటప్ లు వేసి తెగ నవ్వించే చంద్ర టీమ్ లోకి సత్య శ్రీ అనే అమ్మాయి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత వీరిద్దరు కలిసి ఎన్నో స్కిట్లు చేశారు. కలిసి భార్య, భర్తల స్కిట్లు చేయడంతో మొదట్లో వీరంతా నిజ జీవితంలోనూ వైఫ్ అండ్ హస్బెండా అని అనుకున్నారు. కానీ ఆ తరువాత పలు ఇంటర్వ్యూలు, కథనాల ద్వారా అసలు విషయం తెలిసింది. అయినప్పటికీ వీరిద్దరిపై అనేక పుకార్లు వచ్చాయి. ఈ పుకార్లపై సత్యశ్రీ ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ సంచలన విషయాలను బయటపెట్టింది. మొదట్లో తమ తల్లిదండ్రులు కూడా చమ్మక్ చంద్రతో…
గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాలకే సర్కార్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని ఇప్పటికే ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇతర నియోజకవర్గాలపై కేసీఆర్ సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని దుయ్యబడుతున్నాయి. ఇదంతా ప్రతిపక్షాల ఆరోపణలే అనుకున్నారు ఇన్నాళ్ళు. కానీ సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో సర్కార్ అవలంభిస్తోన్న విధానం చూస్తుంటే…ప్రతిపక్షాలు చేసేవి ఆరోపణలు కావు. నిజమేనని ఈజీగా అర్థం అవుతుంది. సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో ఈ మూడు నియోజకవర్గాలపై ఒకలా…మిగతా 116నియోజకవర్గాలపై ప్రభుత్వం మరోలా ప్రేమ కనబరుస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం లాబియింగ్ చేస్తోన్న ఏ ప్రయత్నాలు వర్కౌట్ కావడం లేదు. సిరిసిల్ల, గజ్వేల్, , సిద్ధిపేట నియోజకవర్గాలకు మాత్రమే సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో కేసీఆర్ కరుణ చూపిస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేదల వైద్యానికి ఆర్ధిక సాయం చేసే విధానం ఉమ్మడి రాష్ట్రం నుంచే కొనసాగుతోంది. ఈ స్కీంకు దరఖాస్తు చేసుకుంటే పేదలు వైద్యం కోసం ఖర్చు చేసిన దాంట్లో…
తెలంగాణ బీజేపీ అద్యక్షుడు బండి సంజయ్ మతితప్పిన రాజకీయాలు చేస్తున్నారు. అసలేం మాట్లాడుతున్నారో ఆయనకైనా అర్థం అవుతుందో లేదో కానీ ఆయన వ్యాఖ్యలు మాత్రం జనాలకు పిచ్చేక్కిస్తున్నాయి. బొండిగుండుకు, మోకాలికి లింక్ పెట్టేలా బండి సంజయ్ కామెంట్స్ ఉన్నాయి. సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నా బండి సంజయ్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో బండికి కేఏ పాల్ పూనినట్టు ఉందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వరంగల్ మెడికల్ కాలేజీలో చదువుకున్న ప్రీతి అనే పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. సైఫ్ అనే సీనియర్ విద్యార్ధి వేధింపులే ఆమె సూసైడ్ అటెంప్ట్ చేయడానికి కారణమని వరంగల్ సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని వాటిని బయటపెట్టారు. ఓ కేసు షీట్ విషయంలో ప్రీతిని సైఫ్ టార్గెట్ చేసి వేధించడం స్టార్ట్ చేయడంతో వ్యవహారం ఆత్మహత్యయత్నం వరకు వెళ్లిందని సీపీ చెప్పుకొచ్చారు. అందులో ప్రేమ కోణం ఎక్కడ…
తెలంగాణ బీజేపీలో కొత్త దందాకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెరతీశాడని కొన్నాళ్ళుగా ప్రచారం జరుగుతోంది. టికెట్లు ఆశిస్తోన్న కొంతమంది నేతల నుంచి బండి సంజయ్ టీం డబ్బులు దండుకుంటున్నారాని ఆరోపణలు కూడా ఉన్నాయి. 2024వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ కొనసాగుతాడని అధిష్టాన పెద్దలు స్పష్టం చేయడంతో… ఎన్నికలకు ఆయన సారధ్యంలో వెళ్తారని తేలింది. దీంతో ఎమ్మెల్యే టికెట్ ఆశావహులు బండి సంజయ్ మెప్పు కోసం పాకులాడుతున్నారు. ఇదే అదునుగా భావించిన బండి సంజయ్ తన టీంలోని ఒకరిద్దరి నేతల సహకారంతో పార్టీలో “పైసా వసూళ్లు” కు శ్రీకారం చుట్టాడని గుసగుసలు కమలం క్యాంప్ నుండే వినిపిస్తున్నాయి. తెలంగాణలో మునుపటి కంటే బీజేపీ బలోపేతం అయిందనేది బహిరంగ రహస్యమే. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు బీజేపీ ముచ్చెమటలు పట్టించింది. అనంతరం వరుస ఉప…
వైఎస్ వివేకా హత్య కేసులో రెండోసారి సీబీఐ విచారణకు హాజరైన కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని అనుకున్నారు. కానీ ఐదుగంటలపాటు విచారించి ఆయనను ఇంటికి పంపించారు. మరోసారి విచారణకు రమ్మని అధికారులు చెప్పలేదని అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. ఈ హత్యకేసుకు సంబంధించి హైకోర్టులో సీబీఐ వేసిన కౌంటర్ లో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలు కలిసి వివేకాను హత్య చేసేందుకు ఎలా ప్రయత్నించారో వివరించడంతో శుక్రవారం రోజున అవినాష్ రెడ్డి అరెస్ట్ ఖాయమని ఉదయం నుంచి ప్రచారం జరిగింది కానీ ఆయన్ను విచారించి బయటకు పంపించారు. సీబీఐ విచారణ అనంతరం బయటకొచ్చిన అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వివేకా హత్య కేసు విచారణలో ఉందని ఈ సమయంలో మీడియా సంస్థలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. అబద్దాన్ని సున్నా నుంచి వందకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారని…ఓ నిజాన్ని సమాధి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు. అదే సమయంలో సీబీఐ…
మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై రెచ్చిపోయారు కొడాలి నాని. గన్నవరం వెళ్లి ఒక్కొక్కడి అంతు తెలుస్తానని మాట్లాడుతున్న చంద్రబాబుకు దమ్ముంటే సెక్యూరిటీని వదిలి తమతో ఫైట్ కు రావాలని సవాల్ విసిరారు. చంద్రబాబుకు పిచ్చి పట్టిందని.. ఆ పిచ్చిలో ఏదేదో మాట్లాడుతున్నారని తనదైన శైలిలో రెచ్చిపోయారు కొడాలి నాని. చంద్రబాబు పిచ్చి ఛాలెంజ్‌లకు ముఖ్యమంత్రి జగన్ స్పందించరని.. చంద్రబాబుకు తామే ఎక్కువని వ్యాఖ్యానించారు. మెంటల్ ఆసుపత్రి నుంచి తప్పించుకొని వచ్చినట్లు చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నారని.. వెంటనే ఆయన్ను పిచ్చాస్పత్రిలో గానీ, జైల్లో గానీ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. జగన్ రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తి కనుక చంద్రబాబు చిల్లర మాటలకు జగన్ స్పందించరని తెలిపారు. లోకేష్ ఓ బ్రెయిన్ లెస్ కిడ్ అని సెటైర్లు వేశారు కొడాలి నాని. 7పదుల వయస్సు వచ్చినా ఇంకా కొట్టుకుందాం..పోలీసులు లేకుండారా అని చంద్రబాబు సవాల్ విసురుతున్నారు… చంద్రబాబుకు దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి..…
జబర్దస్త్ ఆర్టిస్ట్ లు రాకింగ్ రాకేశ్ – జోర్దార్ సుజాతలు పెళ్లి చేసుకున్నారు. ఇటీవల వీరి ఎంగేజ్ మెంట్ జరగగా…తాజాగా మూడుముళ్ల బంధంతో ఈ జంట ఒక్కటయ్యారని తెలుస్తోంది. తిరుమల తిరుపతిలో వీరి పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. రాకేశ్ దంపతుల పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో వీరి పెళ్లి జరిగిందనే విషయం వెలుగులోకి వచ్చింది. అయితే.. గోప్యంగానే ఈ ప్రేమ జంట వివాహం జరిగినట్లు సమాచారం. కేవలం బంధు, మిత్రులను మాత్రమే పెళ్లికి ఆహ్వానించారు. జబర్దస్త్ మాజీ జడ్జి రోజా వీరి పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదించింది. ఇక, వీరు పెళ్లి చేసుకున్నారని తెలియడంతో నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పెళ్లికి ముందే సుజాత రాకేష్ ఇంటి సభ్యురాలిగా మారిపోయారు. సంవత్సరకాలంగా ఆమె రాకేశ్ ఇంట్లోనే ఉంటూ వస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా రాకేశ్ తల్లి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆమె మా ఇంట్లో అడుగు పెట్టాకే మా…
వరంగల్ లోని కాకతీయ మెడికల్ కాలేజ్ విద్యార్ధిని ప్రీతి ఆత్మహత్యయత్నం చేయడానికి కారణం సీనియర్ విద్యార్ధి వేధింపులేనని స్పష్టం చేశారు సీపీ రంగనాథ్. రెండు నెలలుగా సీనియర్ విద్యార్ధి సైఫ్ నుంచి ఆమెకు వేధింపులు ఎదురు అవుతున్నాయని ఈ క్రమంలోనే ఆ వేధింపులు తీవ్రరూపం దాల్చడంతో ఆత్మహత్యయత్నం చేసిందని చెప్పారు. ఇందుకు సంబంధించి ఆధారాలు ఉన్నాయని బయటపెట్టారు. సైఫ్ ఆధిపత్యపు అహంకారాన్ని ప్రీతి ప్రశ్నించడంతోనే ఆమెను లక్ష్యంగా చేసుకొని వేధించినట్లు తేలిందని సీపీ తెలిపారు. అందరి ముందు ప్రీతిని అవమానించడంతో మనస్తాపానికి గురై ఆమె ఆత్మహత్యాయత్నం చేసిందన్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామన్నారు. ప్రీతి ధైర్యం కల్గిన అమ్మాయి అని.. అలాగే ఆమె సున్నిత మనస్తత్వం అని తెలిపారు. కేసు షీట్ విషయంలో ప్రీతిని అవమానించేలా సైఫ్ ప్రశ్నించడమే ఈ వివాదానికి కారణమైందన్నారు. ఫిబ్రవరి 18న వాట్సప్ గ్రూపులో సైఫ్ పెట్టిన మెసేజ్ పై ప్రీతిని వ్యక్తిగతంగా సైఫ్…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశవాద రాజకీయాలపై ఆ పార్టీ నేతల్లో అంతర్మథనం మొదలైనట్లు తెలుస్తోంది. కేసీఆర్ ను నమ్మి పార్టీలో చేరితే ఇప్పుడు పట్టించుకునే నాథుడే లేడని తెగ ఫీల్ అవుతున్నారు. బీజేపీ పట్టించుకోవడం లేదని కమలాన్ని వదిలేసి కారెక్కితే… డ్రైవర్ పట్టించుకోవడం లేదని అసంతృప్తితో రగిలిపోతున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కు హైప్ తీసుకొచ్చేందుకు మాత్రమే తమను కారెక్కించారని మధనపడుతున్నారు. పార్టీలో చేరిన సమయంలో తగిన ప్రాధాన్యత ఉంటుందని చెప్తే ఆనందంతో ఊహల్లో తెలియాడిన నేతలు ఇప్పుడు కేసీఆర్ కరుణ కోసం వెయిట్ చేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో బీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్యను బీజేపీలో చేర్చుకోవడంతో బీజేపీకి పుంజుకుంటుందని జనాల్లోకి సందేశాన్ని ఆ పార్టీ నేతలు తీసుకెళ్ళారు. రాజకీయాల్లో తనదైన వ్యూహాలను అమలు చేసే కేసీఆర్ బీజేపీకి దీటుగా ఆ పార్టీలో ఉన్న స్వామిగౌడ్, భిక్షమయ్య గౌడ్, దాసోజు శ్రావణ్, పల్లె రవిలను తిరిగి…
వచ్చే ఎన్నికలను ఎదుర్కొనేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రణాళిక బద్దంగా సాగుతున్నారు. గతంలో చేసిన పొరపాట్లను గుర్తించి… వ్యూహం ప్రకారం ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకొని శత్రు పక్షానికి ఆయుధం అప్పగించవద్దని భావిస్తున్నారు. అందుకే పవన్ వారాహి యాత్రను ఎప్పుడు..? ఎక్కడ మొదలు పెట్టాలనే విషయంలో చాలా జాగురుకతతో అడుగులు వేస్తున్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని వారాహి యాత్రను పోస్ట్ పోన్ చేశారు పవన్. గత ఎన్నికల్లో వైసీపీ ఏకపక్ష విజయానికి ప్రతిపక్షాల అనైక్యత ఓ కారణమైతే.. మరో కారణం ఉద్యోగ , ఉపాధ్యాయ, నిరుద్యోగుల ఓటు బ్యాంక్ అంత వైసీపీ వైపు మొగ్గడమే. జగన్ ఇచ్చిన హామీలు అలాంటివి మరి. అధికారంలోకి వచ్చాక కొత్త పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం కొనసాగిస్తామని..ఉద్యోగ బదిలీలలో పారదర్శకత పాటిస్తామని, ఉద్యోగ క్యాలెండర్ ను ప్రతి ఏటా రిలీజ్ చేస్తామని.. ప్రత్యేక హోదా…