• Home
  • Telangana
  • Government & Policy
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad Politics
  • Graduate MLC

Subscribe to Updates

తెలంగాణ రాజకీయాలు, ఎన్నికలు, సర్వేలు మరియు ప్రత్యేక విశ్లేషణల తాజా అప్‌డేట్స్ పొందండి.

What's Hot

దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఖైరతాబాద్ ఉపఎన్నికకు తొలగిన ప్రధాన అడ్డంకి!

సెప్టెంబర్ 24, 2026

388 ఎకరాల వివాదం: ఫామ్‌హౌస్ రాజకీయాల మధ్య చిక్కుకున్న పేద రైతు

సెప్టెంబర్ 22, 2026

సెప్టెంబర్ 28–30 బ్యాంకు సమ్మె: ఐదు రోజులు బ్రాంచ్ సేవలు ఆగుతాయా? UPI, ATM, చెక్కులపై అసలు ప్రభావం

సెప్టెంబర్ 22, 2026
Facebook Twitter YouTube WhatsApp
Polytricks.in
  • About
  • Editorial Policy
  • Our Authors
  • Contact
Facebook Twitter YouTube WhatsApp
YouTube
  • Home
  • Telangana
  • Government & Policy
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad Politics
  • Graduate MLC
Polytricks.in
Home » ప్రీతి కేసులో లవ్ జిహాద్ – బండి సంజయ్ కి కేఏ పాల్ పూనాడా..?
News

ప్రీతి కేసులో లవ్ జిహాద్ – బండి సంజయ్ కి కేఏ పాల్ పూనాడా..?

Prashanth PagillaBy Prashanth Pagillaఫిబ్రవరి 25, 2023వ్యాఖ్యలు లేవు2 Mins Read
Facebook Twitter WhatsApp Pinterest LinkedIn Tumblr Reddit Email VKontakte
Share
Facebook Twitter WhatsApp LinkedIn Email

తెలంగాణ బీజేపీ అద్యక్షుడు బండి సంజయ్ మతితప్పిన రాజకీయాలు చేస్తున్నారు. అసలేం మాట్లాడుతున్నారో ఆయనకైనా అర్థం అవుతుందో లేదో కానీ ఆయన వ్యాఖ్యలు మాత్రం జనాలకు పిచ్చేక్కిస్తున్నాయి. బొండిగుండుకు, మోకాలికి లింక్ పెట్టేలా బండి సంజయ్ కామెంట్స్ ఉన్నాయి. సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నా బండి సంజయ్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో బండికి కేఏ పాల్ పూనినట్టు ఉందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

వరంగల్ మెడికల్ కాలేజీలో చదువుకున్న ప్రీతి అనే పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. సైఫ్ అనే సీనియర్ విద్యార్ధి వేధింపులే ఆమె సూసైడ్ అటెంప్ట్ చేయడానికి కారణమని వరంగల్ సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని వాటిని బయటపెట్టారు. ఓ కేసు షీట్ విషయంలో ప్రీతిని సైఫ్ టార్గెట్ చేసి వేధించడం స్టార్ట్ చేయడంతో వ్యవహారం ఆత్మహత్యయత్నం వరకు వెళ్లిందని సీపీ చెప్పుకొచ్చారు. అందులో ప్రేమ కోణం ఎక్కడ లేదు. కానీ సైఫ్ అనే పేరు కనిపించడంతో మత రాజకీయం చేయాలని ప్రీతి ఆత్మహత్యయత్నం చేయడానికి లవ్ జిహాద్ కారణమని అని అనేశారు బండి సంజయ్. ఇది ర్యాగింగ్ అండ్ లవ్ జిహాద్ కేసు అని తనకు కావాల్సిన రాజకీయం కోణాన్ని ఆవిష్కరిస్తూ చెప్పేశారు.

హిందూ అమ్మాయిలను టార్గెట్ చేస్తున్నారని.. నిందితుడు బయట ఉంటె దాడి చేస్తారని నామ్కే వాస్తే కేసు పెట్టి చేతులు దులుపెసుకొని ప్రయత్నం జరుగుతుందని బండి సంజయ్ ఆరోపించారు. దీని వెనక రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఆరోపించారు. గత కొంతకాలంగా హిందూ అమ్మాయిలను లక్ష్యంగా చేసుకొని ఈ లవ్ జిహాద్ కొనసాగుతుందని.. ఇందుకోసం విదేశాల నుంచి డబ్బులు వస్తున్నాయని చెప్పారు. ఈ లవ్ జిహాద్ కోసం విదేశాల నుంచి సొమ్ము అందితే కేంద్రం ఏం చేస్తున్నట్టు..? మరి ఇన్నాళ్ళు బండి సంజయ్ కేంద్రానికి ఎందుకు ఫిర్యాదు చేయకుండా మిన్నకుండిపోయినట్లు..? అంటే ఇటువంటి ఘటన జరిగే వరకు కళ్ళప్పగించి చూద్దామని ఆగిపోయారా..?అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

ప్రీతి కేసులో లవ్ అనేదే లేదు. కానీ ఈ అంశంలో రాజకీయం చేస్తే విద్యార్థుల నుంచి మద్దతు లభిస్తుందని అనుకున్నారేమో బండి సంజయ్ లవ్ జిహాద్ అనేశారు. ప్రేమ అనే కోణం లేనప్పటికీ రాజకీయాల కోసం బండి సంజయ్ ఇలా మాట్లాడటం సరైనదేనా.? ఇలా ప్రతీ దానికి మతానికి .. లవ్ జీహాద్ అంటూ లింక్ పెట్టి మాట్లాడితే కొన్ని వర్గాల ప్రజలను కించ పరిచినట్లవుతుంది. వారు కూడా భారతీయులే. ఓ వర్గం వారయినంత మాత్రాన ప్రతీది జీహాద్ లా చేస్తారని అనుకుంటే వారిని విడగొట్టడమే అవుతుంది. బండి సంజయ్ చేసిన లవ్ జిహాద్ వ్యాఖ్యలను ప్రీతి తండ్రి ఖండించారు. ఇప్పటికైనా బండి సంజయ్ సున్నితమైన అంశాల్లో రాజకీయాలను చొప్పించడం మానుకోవాలి.

Bandi Sanjay Medical Student Preethi Preethi Incident
Share. Facebook Twitter Pinterest Tumblr Email WhatsApp
Prashanth Pagilla

Related Posts

దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఖైరతాబాద్ ఉపఎన్నికకు తొలగిన ప్రధాన అడ్డంకి!

సెప్టెంబర్ 24, 2026

388 ఎకరాల వివాదం: ఫామ్‌హౌస్ రాజకీయాల మధ్య చిక్కుకున్న పేద రైతు

సెప్టెంబర్ 22, 2026

సెప్టెంబర్ 28–30 బ్యాంకు సమ్మె: ఐదు రోజులు బ్రాంచ్ సేవలు ఆగుతాయా? UPI, ATM, చెక్కులపై అసలు ప్రభావం

సెప్టెంబర్ 22, 2026

Comments are closed.

Don't Miss
News

దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఖైరతాబాద్ ఉపఎన్నికకు తొలగిన ప్రధాన అడ్డంకి!

సెప్టెంబర్ 24, 20260

దానం నాగేందర్ అనర్హతపై దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఖైరతాబాద్ ఉపఎన్నికకు ఇక మిగిలిన అధికారిక ప్రక్రియ ఏమిటి?

388 ఎకరాల వివాదం: ఫామ్‌హౌస్ రాజకీయాల మధ్య చిక్కుకున్న పేద రైతు

సెప్టెంబర్ 22, 2026

సెప్టెంబర్ 28–30 బ్యాంకు సమ్మె: ఐదు రోజులు బ్రాంచ్ సేవలు ఆగుతాయా? UPI, ATM, చెక్కులపై అసలు ప్రభావం

సెప్టెంబర్ 22, 2026

ఎర్రవల్లి నుంచి కొటూర్ వరకూ భూముల యుద్ధం: అసెంబ్లీలో ఆరోపణలు, విచారణ సవాళ్లు

సెప్టెంబర్ 22, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • YouTube
  • WhatsApp
Our Picks

దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఖైరతాబాద్ ఉపఎన్నికకు తొలగిన ప్రధాన అడ్డంకి!

సెప్టెంబర్ 24, 2026

388 ఎకరాల వివాదం: ఫామ్‌హౌస్ రాజకీయాల మధ్య చిక్కుకున్న పేద రైతు

సెప్టెంబర్ 22, 2026

సెప్టెంబర్ 28–30 బ్యాంకు సమ్మె: ఐదు రోజులు బ్రాంచ్ సేవలు ఆగుతాయా? UPI, ATM, చెక్కులపై అసలు ప్రభావం

సెప్టెంబర్ 22, 2026

ఎర్రవల్లి నుంచి కొటూర్ వరకూ భూముల యుద్ధం: అసెంబ్లీలో ఆరోపణలు, విచారణ సవాళ్లు

సెప్టెంబర్ 22, 2026
Facebook Twitter YouTube WhatsApp
  • Home
  • Andhra Pradesh
  • Telangana
  • About
  • Our Authors
  • Editorial Policy
  • Corrections
  • Privacy Policy
  • Contact
© 2026 Polytricks.in. All rights reserved.

Type above and press Enter to search. Press Esc to cancel.

Go to mobile version