జబర్దస్త్ కామెడి షో ద్వారా చమ్మక్ చంద్ర పాపులారిటీ మరింత పెరిగింది. ఆయన చేసే ఫ్యామిలీ స్కిట్లు సూపర్ హిట్ అయ్యాయి. ఆయన స్కిట్ కోసం ప్రత్యేకంగా జబర్దస్త్ ను చూసేవారుంటారు. అంటే ఆయన ఏ రేంజ్ లో ఫ్యామిలీ స్కిట్ తో ఫర్ఫామ్ చేస్తారో ఊహించుకోవచ్చు. లేడి గెటప్ లు వేసి తెగ నవ్వించే చంద్ర టీమ్ లోకి సత్య శ్రీ అనే అమ్మాయి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత వీరిద్దరు కలిసి ఎన్నో స్కిట్లు చేశారు. కలిసి భార్య, భర్తల స్కిట్లు చేయడంతో మొదట్లో వీరంతా నిజ జీవితంలోనూ వైఫ్ అండ్ హస్బెండా అని అనుకున్నారు. కానీ ఆ తరువాత పలు ఇంటర్వ్యూలు, కథనాల ద్వారా అసలు విషయం తెలిసింది.
అయినప్పటికీ వీరిద్దరిపై అనేక పుకార్లు వచ్చాయి. ఈ పుకార్లపై సత్యశ్రీ ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ సంచలన విషయాలను బయటపెట్టింది. మొదట్లో తమ తల్లిదండ్రులు కూడా చమ్మక్ చంద్రతో ఎఫైర్ ఉందని అనుమానించారు. సోషల్ మీడియా పోస్టింగ్ లను చూసి బాగా కలత చెందారు. ఓ రోజు ఈ విషయాలపై మా తల్లిదండ్రులకు క్లారిటీ ఇచ్చానని స్పష్టం చేసింది సత్య శ్రీ. అసలు విషయం చెప్పడంతో వారు రిలాక్స్ అయ్యారని చెప్పుకొచ్చింది.
ఈ క్రమంలోనే ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సత్య శ్రీ మాట్లాడుతూ పలు విషయాలను షేర్ చేసుకున్నారు. తనకు చమ్మక్ చంద్ర గురువు లాంటి వారని అన్నారు. ఆయన ద్వారానే తనకు జబర్దస్త్ లో పాల్గొనే అవకాశం వచ్చిందని…ఈ స్థాయిలో పాపులారిటీ వచ్చిందంటే కారణం చమ్మక్ చంద్రేనని స్పష్టం చేశారు. అలాంటి గురు శిష్యుల మధ్య లేని పోని అపోహాలు సృష్టించొద్దన్నారు. మా తల్లి దండ్రులు కూడా ఇలాగే డౌట్ పడితే వారికి తాము గురు శిష్యులం మాత్రమే అని చెప్పానన్నారు. ఇక తాను జబర్తస్త్ ను వీడడానికి ప్రత్యేకంగా వ్యక్తిగత కారణాలు ఏమీ లేవని తెలిపింది. మా గురువు ఎక్కడుంటారో.. నేను అక్కడే పనిచేస్తానని వివరించింది.
Also Read : మా ఇంటికి వస్తావా, నన్నే మీ ఇంటికి రమ్మంటావా? మహాసేన రాజేష్ గురించి శ్రీరెడ్డి