Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
అసలే అక్కడ ఇద్దరు అధికార పార్టీ నేతల మధ్య టికెట్ కోసం పంచాయితీ జరుగుతోంది. అందులో ఒకరు మాజీ ఎమ్మెల్యే కాగా, మరొకరు ప్రస్తుత ఎమ్మెల్యే. ఇద్దరు నేతలూ వచ్చే ఎన్నికల్లో టికెట్ నాదంటే , నాదేనని పోటాపోటీగా ప్రకటనలిస్తున్నారు. ఎవరూ తగ్గడం లేదు. ఇద్దరి మధ్య టికెట్ ఫైటింగ్ తారస్థాయికి చేరుతున్న సమయంలోనే.. ఈ ఇద్దరి మధ్యలో మరో నేత దూరిపోవడంతో ఇష్యూ మరింత ముదరడమో, ఎవరో ఒకరు పార్టీ జంప్ చేయడమో ఖాయంగా కనిపిస్తోంది. ఇంతకీ ఎవరా నేతలు..?ఎదా నియోజకవర్గం అనేగా మీ సందేహం.. అయితే ఈ స్టొరీని చదివేయండి.. ఆ నియోజకవర్గం పాలేరు. ఇక్కడి నుంచి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరుఫున పోటీ చేసిన తుమ్మల నాగేశ్వర్ రావు వచ్చే ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ టికెట్ తనదే అంటూ ప్రకటించారు. ఇటీవల ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి బల ప్రదర్శన చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తుమ్మలను…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలపై మనస్సు పారేసుకున్నారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తోన్న కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు. ఇందుకు సంబందించిన ప్రక్రియ వచ్చే నెల ఏడో తేదీ లోపు పూర్తి కానుంది. దీంతో ఆయన కార్యక్షేత్రాన్ని హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మార్చనున్నారు. హస్తిన వేదికగా బహిరంగ సభ ఏర్పాటు చేసి బీఆర్ఎస్ ఆవశ్యకత, విధి, విధానాలు అక్కడే ప్రకటించనున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాలపై పూర్తిస్థాయిలో ఫోకస్ చేయాలంటే ముందు రాష్ట్రంలో ఎన్నికలు పూర్తి కావాల్సి ఉంది. రాష్ట్రంలో ఎన్నికలకు ఏడాది సమయం ఉంది. మరోసారి కేసీఆర్ ముందస్తుకు వెళ్తారని ప్రచారం జరుగుతున్నా దాన్ని ఖండిస్తూ వస్తున్నారు. షెడ్యూల్ మేరకే ఎన్నికలు జరుగుతాయని ప్రకటిస్తున్నారు. మరోవైపు , కేటీఆర్ కు సీఎం బాధ్యతలను అప్పగిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. పార్టీ శ్రేణులు కూడా కేసీఆర్ తరువాత సీఎం చైర్ లో ఉండబోయేది కేటీఆరేనని అంటున్నారు. స్వయంగా…
తెలంగాణ రైతులు సర్కార్ ఇచ్చే పంట పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. యాసంగి పంట సాగు చేసి నెల రోజులు అవుతున్నా, రైతు బంధు నిధులు ఇంకా విడుదల చేయలేదు. పంట పెట్టుబడి కోసం రైతు బంధు డబ్బులు అక్కరకు వస్తాయని రైతులు వెయిట్ చేస్తుంటే.. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన లేకపోవడంపై పెదవి విరుస్తున్నారు. రైతు బంధు నిధుల విడుదలపై వ్యవసాయ శాఖతోపాటు ఆర్ధిక శాఖలో ఎలాంటి కదలిక కనిపించడం లేదు. దీంతో రైతు బంధు నిధులు ఎప్పుడు ఇస్తారన్న దానిపై స్పష్టత కొరవడింది. ఈ నెల ఆఖర్లో ఇస్తారని కొందరు, కాదు వచ్చే నెలలో ఇస్తారని మరికొందరు చెప్తున్నారు. ఏదీ ఏమైనా, కేసీఆర్ ఆమోదం తరువాతే రైతు బంధు నిధుల విడుదలపై క్లారిటీ రానుంది. అక్టోబర్ నుంచి యాసంగి పంట సాగు ప్రారంభమైంది. సర్కార్ ఇచ్చే రైతు బంధు వస్తుందని ధీమాతో రైతులు అప్పులు చేసి మరీ పంటలను…
గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ కో – ఆర్డినేటర్ రోహిన్ రెడ్డిని అభినందించారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణికం ఠాగూర్. తెలంగాణలో భారత్ జోడో యాత్ర పూర్తి స్థాయిలో విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఆయన.. ఇందులో క్రియాశీలక పాత్ర పోషించిన రోహిన్ రెడ్డికి ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. https://twitter.com/manickamtagore/status/1589947385702420480?t=-PjDzGa2MsnwwyiaCZwb1g&s=08 తెలంగాణలో భారత్ జోడో యాత్ర ప్రవేశించిన నాటి నుంచి ముగింపు వరకు పబ్లిసిటీ వ్యవహారాలను అన్ని తానై చూసుకున్నారు రోహిన్ రెడ్డి. ఎల్ఈడీ తెరలు, రాహుల్ యాత్ర సాగే రూట్ లో ప్లెక్సీలు, స్వాగతతోరణాలు ఏర్పాటు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలో జరిగిన భారత్ జోడో యాత్ర బహిరంగ సభకు రోహిన్ రెడ్డి చేసిన ఏర్పాట్లు ఔరా అనిపించాయి. మొత్తం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలను కాంగ్రెస్ కళతో ఉట్టిపడేలా చేయడమే కాకుండా జన సమీకరణతో బహిరంగ సభను సక్సెస్…
హైపర్ ఆది కూడా సుడిగాలి సుధీర్ ను అనుసరిస్తున్నాడు. రష్మీతో సుధీర్ నడిపిన లవ్ ట్రాక్ తో కెరీర్ ను సెట్ చేసుకున్నాడు. బుల్లితెర స్టార్ గా మారాడు. దాంతో ఇప్పుడు హైపర్ ఆది కూడా లవ్ ట్రాక్ సెట్ చేసుకునే పనిలో పడ్డాడు. జబర్దస్త్ కు కొత్త యాంకర్ వచ్చింది. సౌమ్యరావు యాంకర్ గా అలరిస్తోంది. అనసూయ , రష్మీ ఎ రేంజ్ లోనైతే స్కిన్ షో చేశారో వాళ్ళ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన సౌమ్య కూడా అదే ఫేర్ఫామేన్స్ ఇస్తోంది. షార్ట్ ఫ్రాక్ ధరించి సౌమ్య గ్లామరస్ గా కనిపించి డోస్ పెంచేసింది. దీంతో ఈ కొత్త యాంకర్ ను సెట్ చేసుకునే పనిలో పడ్డాడు హైపర్ ఆది. ఫస్ట్ ఎపిసోడ్ నుంచే గోకడం స్టార్ట్ చేశాడు. ఈ యవ్వారం ఎక్కడో తేడా కొడుతుందని అంచనా వేసిన సౌమ్యరావు.. నువ్వు ఎంత పులిహోర కలిపినా వెస్ట్ అంటూ ఇచ్చి…
అమ్మా, మల్లోజుల కుటుంబంతో, పెద్దపల్లి పట్టణంతో వందేళ్ల నీ రుణం తీర్చుకున్నావా అమ్మా! నీ కడుపున పుట్టిన ఆరుగురి సంతానంలో నేనే చివరివాన్ని తల్లీ. నిను చివరి వరకు ఏడ్పించిన వాన్నీ నేనే. అయితే, నీవున్నంత వరకు మేం క్షేమంగా వుండాలని సదా కోరుకునే నీ చివరి కోరికను మాత్రం తీర్చి నీకు ప్రజలు తృప్తిని మిగిల్చారమ్మా. జనం మధ్య, జనం కోసం, జనంతో ఉన్న నేను నీ అంత్యక్రియలైనా చూడలేకపోయానమ్మా. అయితేనేం, వేలాది జనం నిను ఘనంగా సాగనంపారమ్మా. నీ పార్థివ శరీరంపై వాళ్లు ఎర్రగుడ్డ కప్పుతారనీ, విప్లవ నినాదాలతో నీకు వీడ్కోలు చెపుతారనీ నేను ఊహించలేకపోయానమ్మా. నీ అంత్యక్రియలలో పాల్గొన్న వారందరికి అశ్రునయనాలతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వారు పాడిన పాటలు నా చెవులలో నేనున్నంత వరకు ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. అమ్మ వలపోతగా నా సహచర సోదరులు చేసిన గానం నా గుండెలలో భద్రంగా ఉంటుంది. నేను వారి ఆశలను…
తెలంగాణలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర ఖరారు అయినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 9నుంచి ఈ పాదయాత్ర కొనసాగనుంది. ప్రత్యేక రాష్ట్ర కళను సాకారం చేసిన సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అవ్వగానే పార్టీ బలోపేతం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టాలని భావించారు. కాని కొంతమంది సీనియర్లు పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో రేవంత్ రెడ్డి కూడా వేచిచూసే ధోరణి అవలంభించారు. ప్రస్తుతం సీనియర్ల ముసుగు రాజకీయం అధిష్టానంకు కూడా తెలియడంతో పార్టీ బలోపేతం కోసం రేవంత్ రెడ్డికి ఫుల్ పవర్స్ ఇచ్చింది అధిష్టానం. మునుగోడు ఉప ఎన్నికతోపాటు భారత్ జోడో యాత్రను ఒంటి చేత్తో సమన్వయము చేశారు రేవంత్. ఆయన పనితీరుకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఫిదా అయ్యారు. అదే సమయంలో తెలంగాణలో తాను చేపట్టాలనుకున్న పాదయాత్ర…
దేశవ్యాప్తంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై పెద్ద చర్చే నడుస్తోంది. ఈ రిజర్వేషన్లను సుప్రీంకోర్టు సమర్ధించడం పట్ల భిన్న వాదనలు వ్యక్తం అవుతున్నాయి. సర్వోన్నత న్యాయస్థానం తీర్పుపై సమీక్ష జరగాల్సిన అవసరముందని బీసీ సంఘాలు కోరుతున్నాయి. దేశంలో అగ్రవర్ణాల జనాభా ఏడు నుంచి ఎనిమిది శాతం ఉంది. అయినప్పటికీ వారికీ, జనాభాను మించి రెట్టింపు రిజర్వేషన్ల సౌకర్యం తీసుకురావడంపై పెదవి విరుస్తున్నారు. ఆర్థిక బలహీనత ప్రాతిపదికన ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చినప్పుడు అన్ని సామజిక వర్గాల్లో వెనకబాటుతనానికి గురైన వర్గాలకు ఈ రిజర్వేషన్లు పొందే వెసులుబాటు కల్పించాలి. అప్పుడే ఈ రిజర్వేషన్ల లక్ష్యానికి సార్ధకత చేకూరుతుంది. కాని అసలు లక్ష్యాన్ని వదిలేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల చట్టబద్దతను సవాల్ చేసేలా సుప్రీం తీరు ఉందనేది బీసీ/SC/ST మేధావులు ఆవేదన. గతంలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని మండల్ కమిటీ సిఫార్స్ చేసిన సమయంలో, ఎన్టీఆర్ హయంలో నియమించిన మురళీధర్ రావు కమిటీ కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని…
నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ విచారణ ప్రారంభమైంది. నిందితుల్ని కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించారు. వారి వాయిస్ శాంపిల్స్ కూడా తీసుకున్నారు. నెక్ట్స్ సిట్ అధికారులు ఎం చేయబోతున్నారన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ కేసులో నిందితులను విచారించి కేసును క్లోజ్ చేస్తారా..? అన్న ప్రశ్న తెరపైకి వస్తోంది. నిందితులతోపాటు నలుగురు ఎమ్మెల్యేలను కూడా విచారిస్తేనే అసలు విషయాలను కూపీ లాగేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఎమ్మెల్యేల కొనుగోలు కోసం మొదట ఎవరిని ఎవరు సంప్రదించారు..? అనే విషయం బోధపడితే తప్ప ఈ కేసు ముందుకు సాగదు. కేసును పునాది నుంచి అధ్యయనం చేయాలంటే ఆ నలుగురు ఎమ్మెల్యేలను సైతం విచారించాల్సిందే. కాని సిట్ అధికారులు ఎమ్మెల్యేలను విచారణకు పిలుస్తారా..?లేదా..? అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నాలు జరిగాయనే విషయం బయటకు పొక్కగానే నలుగురు ఎమ్మెల్యేలు ప్రగతి భవన్ కు వెళ్ళిపోయారు. అంతకుముందే తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్…
మాజీ మంత్రి, ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వర్ రావు తాను పార్టీ మారడం లేదనే ప్రకటన ఎందుకు చేయాల్సి వచ్చింది..? మునుగోడు ఉప ఎన్నిక ఫలితంనే పార్టీ మార్పుపై ఆయన వెనక్కి తగ్గారా..? బైపోల్ రిజల్ట్ మరోలా ఉండుంటే ఆయన కారు దిగేవారా..? టీఆర్ఎస్ అధిష్టానం ప్రాపకం కోసం మళ్ళీ ప్రయత్నాలు మొదలెట్టారా..? అనే అంశాలపై ఖమ్మం జిల్లా పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. తుమ్మల నాగేశ్వర్ రావు..ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన సీనియర్ నేత. ఒకప్పుడు కనుసైగలతోనే జిల్లా రాజకీయాలను శాసించిన నాయకుడు. సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు కావడంతో తన క్యాబినెట్ లో తుమ్మలకు మంత్రిగా అవకాశం కల్పించారు. ఆ తరువాత 2018 ముందస్తు ఎన్నికల్లో పాలేరు నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన తుమ్మల ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తారని అంత భావించారు. ఈ నేపథ్యంలోనే…