Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    తారకరత్న హెల్త్ క్రిటికల్ గానే ఉందా..?కళ్యాణ్ రామ్ చెప్పలేకపోతున్నారా..?

    February 8, 2023

    గౌతమ్ అదానీ విదేశాలకు పారిపోవడానికి రంగం సిద్ధం

    February 8, 2023

    సచివాలయం ప్రారంభించిన తర్వాత కేసీఆర్ సంచలన ప్రకటన

    February 8, 2023
    Facebook Twitter Instagram
    Polytricks.inPolytricks.in
    • POLYTRICKS
    • AndhraPradesh
    • Telangana
    • CONTACT
    Facebook Twitter Instagram YouTube WhatsApp
    SUBSCRIBE
    • Home
    • Telangana
    • AndhraPradesh

      తారకరత్న హెల్త్ క్రిటికల్ గానే ఉందా..?కళ్యాణ్ రామ్ చెప్పలేకపోతున్నారా..?

      February 8, 2023

      వైసీపీ ఎమ్మెల్యే మేకపాటికి గుండెపోటు – ఆసుపత్రికి తరలింపు

      February 8, 2023

      మీరు మూడు పెళ్లిల్లు చేసుకున్నారు – మరి మీ భార్యలు ఎందుకు చేసుకోలేదు?

      February 7, 2023

      వార్త ఫేక్ అని తేల్చేది కేంద్రమే..!

      February 7, 2023

      ‘అదాని’ ఆరనిచిచ్చు – కాలితే కాలిందిలే బొచ్చు!

      February 4, 2023
    • News
      1. AndhraPradesh
      2. Telangana
      3. CinemaPolytricks
      4. View All

      తారకరత్న హెల్త్ క్రిటికల్ గానే ఉందా..?కళ్యాణ్ రామ్ చెప్పలేకపోతున్నారా..?

      February 8, 2023

      వైసీపీ ఎమ్మెల్యే మేకపాటికి గుండెపోటు – ఆసుపత్రికి తరలింపు

      February 8, 2023

      మీరు మూడు పెళ్లిల్లు చేసుకున్నారు – మరి మీ భార్యలు ఎందుకు చేసుకోలేదు?

      February 7, 2023

      వార్త ఫేక్ అని తేల్చేది కేంద్రమే..!

      February 7, 2023

      గౌతమ్ అదానీ విదేశాలకు పారిపోవడానికి రంగం సిద్ధం

      February 8, 2023

      సచివాలయం ప్రారంభించిన తర్వాత కేసీఆర్ సంచలన ప్రకటన

      February 8, 2023

      రేవంత్ గూగ్లీకి ప్రగతి భవన్ పాలేర్లు క్లీన్ బోల్డ్..!

      February 8, 2023

      చెప్పుతో కొడితే కొట్టాడు మండి – పిప్పి పన్ను ఊడిందిలే ‘బండి’

      February 8, 2023

      తారకరత్న హెల్త్ క్రిటికల్ గానే ఉందా..?కళ్యాణ్ రామ్ చెప్పలేకపోతున్నారా..?

      February 8, 2023

      మీరు మూడు పెళ్లిల్లు చేసుకున్నారు – మరి మీ భార్యలు ఎందుకు చేసుకోలేదు?

      February 7, 2023

      బ్రేకింగ్ – ప్రభాస్ కు అస్వస్థత

      February 7, 2023

      ఆ హీరోయిన్ తో వచ్చే వారం ప్రభాస్ ఎంగేజ్మెంట్ – ఇదే ప్రూఫ్..!

      February 7, 2023

      తారకరత్న హెల్త్ క్రిటికల్ గానే ఉందా..?కళ్యాణ్ రామ్ చెప్పలేకపోతున్నారా..?

      February 8, 2023

      గౌతమ్ అదానీ విదేశాలకు పారిపోవడానికి రంగం సిద్ధం

      February 8, 2023

      సచివాలయం ప్రారంభించిన తర్వాత కేసీఆర్ సంచలన ప్రకటన

      February 8, 2023

      రేవంత్ గూగ్లీకి ప్రగతి భవన్ పాలేర్లు క్లీన్ బోల్డ్..!

      February 8, 2023
    • Contact
    Polytricks.inPolytricks.in
    Home » అమ్మా! నను మన్నించు – మావోయిస్ట్ అగ్రనేత లేఖ
    News

    అమ్మా! నను మన్నించు – మావోయిస్ట్ అగ్రనేత లేఖ

    Prashanth PagillaBy Prashanth PagillaNovember 13, 2022Updated:November 14, 2022No Comments4 Mins Read
    Facebook Twitter WhatsApp Pinterest LinkedIn Tumblr Reddit Email VKontakte
    Share
    Facebook Twitter WhatsApp LinkedIn Email

    అమ్మా, మల్లోజుల కుటుంబంతో, పెద్దపల్లి పట్టణంతో వందేళ్ల నీ రుణం తీర్చుకున్నావా అమ్మా! నీ కడుపున పుట్టిన ఆరుగురి సంతానంలో నేనే చివరివాన్ని తల్లీ. నిను చివరి వరకు ఏడ్పించిన వాన్నీ నేనే. అయితే, నీవున్నంత వరకు మేం క్షేమంగా వుండాలని సదా కోరుకునే నీ చివరి కోరికను మాత్రం తీర్చి నీకు ప్రజలు తృప్తిని మిగిల్చారమ్మా. జనం మధ్య, జనం కోసం, జనంతో ఉన్న నేను నీ అంత్యక్రియలైనా చూడలేకపోయానమ్మా. అయితేనేం, వేలాది జనం నిను ఘనంగా సాగనంపారమ్మా. నీ పార్థివ శరీరంపై వాళ్లు ఎర్రగుడ్డ కప్పుతారనీ, విప్లవ నినాదాలతో నీకు వీడ్కోలు చెపుతారనీ నేను ఊహించలేకపోయానమ్మా.

    నీ అంత్యక్రియలలో పాల్గొన్న వారందరికి అశ్రునయనాలతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వారు పాడిన పాటలు నా చెవులలో నేనున్నంత వరకు ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. అమ్మ వలపోతగా నా సహచర సోదరులు చేసిన గానం నా గుండెలలో భద్రంగా ఉంటుంది. నేను వారి ఆశలను వమ్ము చేయకుండా, నీకూ, అమరుడైన నా సోదరునికి మన కుటుంబానికి ఏ కళంకం రాకుండా, జనానికి దూరం కాకుండా తుదివరకూ నమ్మిన ఆశయాల కోసం నిలబడుతాననీ మరోసారి హామీ ఇస్తున్నానమ్మా. ‘పెద్దపల్లి పెద్దవ్వ లేద’నీ, ‘విప్లవ మాతృమూర్తి కన్ను మూసిందనీ, ‘అమ్మా మళ్లీ పుడుతావా?’ అనీ నీ జీవితాన్ని గుర్తు చేసుకుంటూ తమ భావాలకు అక్షరరూపం ఇచ్చిన కలం యోధులందరికీ వినమ్రంగా ఎర్రెర్ర వందనాలు తెలుపుకుంటున్నాను.

    బయట పత్రికలు నీ త్యాగాన్ని ఎత్తిపడుతున్నట్టే, లోపల నాకు సహచర కామ్రేడ్స్‌ నుండి అందుతున్న సాంత్వన సందేశాలలో ఒకరు ‘అమ్మ చివరి వరకు కూడ విప్లవకారులకు స్ఫూర్తిదాయకంగా ఉంది. తన ఇద్దరు కొడుకులను ఉద్యమానికి అంకితం చేసింది. పిల్లలను ఉద్యమానికి అంకితం చేసిన వీరమాతకు విప్లవ జోహార్లర్పిద్దాం’ అంటూ రాస్తే, మరో కామ్రేడ్‌, ‘మధురమ్మ నిజంగానీ మధురమైన గొప్పమాతృమూర్తిగా నిలిచిపోయింది. రాంజీదాదా (కోటన్న) కూడ మాకు అమ్మ గురించి చెప్పేవాడు. అమ్మకు జోహార్లు’ అంటూ రాసింది. ‘నేను చివరిసారి 1980 వేసవిలో అమ్మా–బాపును కలిశాను. నేను ఎప్పుడు ఇంటికి వెళ్లినా మా అమ్మలాగే ‘తిని పో బిడ్డా అనేది. అడవిలో ముదిమి వయసులోని తల్లులు వచ్చి ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నపుడు నాకు అమ్మా–నాన్నలే గుర్తొస్తారు. వాళ్లలోనే మన అమ్మా–బాపులను చూసుకుందాం’ అంటూ మరో కామ్రేడ్‌ ఓదారుస్తూ రాశాడు. ఇలా సహచర కామ్రేడ్స్‌ అంతా నీ సేవలను గుర్తు చేసుకుంటున్నారమ్మా. జన్మనిచ్చిన నా తల్లి రుణం ఎర్ర జెండా సాక్షిగా నేను ఆమెను సదా పీడిత ప్రజలు గుర్తుంచుకునే విధంగా వారి విముక్తికి అంకితమై తీర్చుకుంటానమ్మా.

    నీ మరణ వార్త మాకు మరుక్షణంలోనే తెలియదనీ, మన మధ్య ఎలాంటి ఆన్‌ లైన్‌ సంబంధాలు లేవనీ ఉండవనీ, కడసారి చూపుకైనా నేను రాలేననీ తెలిసినప్పటికీ, ఈ ఆఖరి నిముషంలోనైనా పెద్దపల్లిపెద్దవ్వకు ఖాకీ రాబందుల పొడపడకుండా ప్రాణం పోతులేదు కదా అని జనం తిట్టిపోసుకుంటారనీ లోలోపల బాధగా ఉన్నప్పటికీ హృదయమున్న పీడిత ఖాకీసోదరులు విధిలేక తమ బాస్‌ల ఆదేశాల ప్రకారం నీ అంతిమయాత్రకు కాపలా నిర్వహించడం రాజ్యస్వభావాన్ని వెల్లడిచేస్తుంది. అయితే, నీ మరణంతో వారు ఇక గతంలా తరచుగా మన కడప తొక్కే అవసరం లేకుండా చేశావమ్మా. నీవు లేకున్నా, మిగిలిన నా సోదరుని కుటుంబాన్నైనా ఇకపై వాళ్లు వేధించకుండా ఉంటారనుకోగలమా?

    నీకు మూడేళ్ల వయసులోనే బాపుతో పెళ్లి జరిపించారని చెప్పేదానివి. చిన్న వయసులోనే నీ కడుపున పుట్టిన బిడ్డలు నీకు దక్కడం లేదని, వరుసగా ముగ్గురిని కోల్పోయిన తరువాత బాపు హేతువాదే అయినప్పటికీ నీవు మాత్రం రాతి దేవుళ్లను కడుక్క తాగి, మట్టి దేవుళ్లను పిసుక్కు తిని ముగ్గురిని బతికించుకున్నానని ఏడుస్తూ చెప్పేదానివి. ముగ్గురు పోగా మిగిలిన మా ముగ్గురిలో చెట్టెత్తు నీ నడిపి కొడుకును (మల్లోజుల కోటీశ్వర్లు) విప్లవకారుడని, ప్రమాదకారి అనీ 57వ ఏట దోపిడీ రాజ్యం పొట్టనపెట్టుకోగా, అతడు ఆపాదమస్తకం గాయాలతో విగతజీవిగా నీ ఇంటికి, నీ ముందుకు రాక తప్పలేదు. నీవు ఆ దృశ్యాన్ని చూసి తట్టుకోలేకపోయావు. దోపిడీ రాజ్యం నిర్దాక్షిణ్యమైనది. పేదల రాజ్యం కోసం అన్నింటికి తెగించి పోరాడక తప్పదమ్మా.నీవు బతికున్నంతవరకు నీ కొడుకులు క్షేమంగా వుండాలనీ నిత్యం కోరుకుంటూ ఉండేదానివి. కానీ, అన్నను రాజ్యం హత్య చేసింది. కానీ, ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా పీడిత ప్రజలు ఆయన విప్లవ సేవలను స్మరించుకుంటూ గత సంవత్సరం కూడ ఆయన దశమ వర్ధంతి వేళ ‘ప్రహార్’ దాడిని ఓడిద్దామని ప్రతినబూనారు. ఆయన అమరత్వాన్ని చాటుతూ ప్రపంచ సోషలిస్టు విప్లవం వర్థిల్లాలని నినదిస్తూ ఆయన ఆశయాల సాధనకై ప్రతినబూనారు. అమరులను స్మరించుకునే ప్రతి నిముషం వారిని కన్న వారు కూడా గుర్తొస్తారు. ఆ రకంగా మన రక్త బంధం చరిత్రలో విప్లవ బంధంగా నిలిచిపోయి అజరం అమరం అయిందని అనుకోవచ్చమ్మా. నా ప్రజలకు తుదివరకు సేవ చేసి నీ రుణం తీర్చుకుంటానమ్మా. నీ కడుపున పుట్టినందుకు సంతోషంగా ఉంది.ప్రతీ తల్లీ తన బిడ్డలు ఎలాంటి వారైనప్పటికీ సహజంగానే పేగు బంధంతో తుది వరకూ వారి బాగునే కోరుకుంటుందమ్మా. నిన్ను చూడలేని నిర్బంధ పరిస్థితుల్లో ఉండడం నా తప్పేమీ కాదమ్మా. నిర్దాక్షిణ్యమైన ఫాసిస్టు పాలకుల పాలన అలాంటిదమ్మా. తల్లులకు బిడ్డలను దూరం చేస్తున్నారు, కట్టుకున్నదానికి తనవాన్ని కాకుండా చేస్తున్నారు. పల్లెల్లో పడచు బిడ్డల బతుకులను బుగ్గిపాలు చేస్తున్నారు, రైతును పంటకు దూరం చేస్తున్నారు, మూలవాసులను అడవికి పరాయివాళ్లుగా చేస్తున్నారు, కార్మికులను వీథుల పాలు చేస్తున్నారు. ముస్లిం, దళిత సోదరులను ఊచకోత కోస్తున్నారు. వాళ్ల దాష్టీకాలను ఎన్నని రాయను తల్లీ! ఇప్పటివరకూ నా మనసులోని భావాలను నీతో పంచుకోవడానికి చాలా సందర్భాలలో పౌర, పోలీసు అధికారులే అవకాశాలు కల్పించారమ్మా. నీతో పాటు వాళ్లూ గుర్తుంటారు.

     

    అమ్మా, నీ అంతరంగం నా ఇద్దరన్నల కన్నా నాకే ఎక్కువ తెలుసే. నేను చిన్నవాడిని. ఎక్కువ కాలం నీతో గడిపినవాన్ని. మధ్యతరగతి మర్యాదల మధ్య నువు నలిగిన తీరు నేను మరువలేదు. నువు మా చదువుల కోసం కడుపుకట్టుకొని పాలు, పెరుగు అమ్మి సాదినవు గాదే. ‘ప్రాణం పోయినా మానం పోవద్దనే’ (జాన్‌ గయేతోభీ పర్వా నహీ, లేకిన్‌ షాన్‌ మే ఫర్క్‌ నహీ ఆనా) మధ్య తరగతి మనస్తత్వానికి నీవు, మన ఇల్లే ఒక పెద్ద ఉదాహరణ. ‘మీది బ్రాహ్మణ కుటుంబం, వరి అన్నం తినాలి కానీ గట్క తింటారా?’ అని లోకం ఎక్కడ ఎద్దేవా చేస్తుందోనని నీవు ఇంట్లో బియ్యం నిండుకున్నప్పుడు జొన్న గట్క, జొన్న అట్లు పోసి గుంభనంగా మా కడుపులు నింపిన రోజులు, అడవిలో ఉపవాసం తప్పనప్పుడు నాకు తప్పకుండా గుర్తొస్తాయమ్మా. పేదరికంలో పెరగడం విప్లవావశ్యకతను నాలో అనుక్షణం గుర్తు చేస్తున్నదమ్మా.అమ్మా, మన బంధువులలో కొందరు మేం ‘చెడిపోవడానికి’ మీరే (అమ్మా–బాపు) కారణమని నీ ముఖం మీదే మాట్లాడినపుడు కన్నీళ్లు తుడుచుకుంటూ ‘నా బిడ్డలు దొంగలు కాదు, లంగలు కాదు, వాళ్లు ప్రజల కోసం పని చేస్తున్నారు, వాళ్ల బాపు గుణం వారికి అబ్బింది’ అని నీవు బదులిచ్చిన మాటలు జీవితాంతం గుర్తుంటాయమ్మా. బాపును పోలీసులు అవమానపరిచినపుడు, మన ఇల్లు కూల్చినపుడు మీరు భరించిన ఆత్మక్షోభ మీకే తెలుసమ్మా. ఇంకేమీ రాయలేక పోతున్నానమ్మా. కళ్లు మసకబారుతున్నాయి. నీ మాట నిలబెడుతానమ్మా. నను నమ్ము నా తల్లీ. నీకివే నా అంతిమ జోహార్లు.

    వేణు మావోయిస్టు అగ్రనేత

    mallojula madhuramma mallojula venugopal mallojula venugopal wrote letter to his mother maoist leader mallojula venugopal మల్లోజుల వేణుగోపాల్
    Share. Facebook Twitter Pinterest Tumblr Email WhatsApp
    Prashanth Pagilla

    Related Posts

    తారకరత్న హెల్త్ క్రిటికల్ గానే ఉందా..?కళ్యాణ్ రామ్ చెప్పలేకపోతున్నారా..?

    February 8, 2023

    గౌతమ్ అదానీ విదేశాలకు పారిపోవడానికి రంగం సిద్ధం

    February 8, 2023

    సచివాలయం ప్రారంభించిన తర్వాత కేసీఆర్ సంచలన ప్రకటన

    February 8, 2023

    Leave A Reply Cancel Reply

    Don't Miss
    AndhraPradesh

    తారకరత్న హెల్త్ క్రిటికల్ గానే ఉందా..?కళ్యాణ్ రామ్ చెప్పలేకపోతున్నారా..?

    February 8, 20230

    బెంగళూర్ లోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో నందమూరి తారకరత్న చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్యం ఎలా ఉందొ…

    గౌతమ్ అదానీ విదేశాలకు పారిపోవడానికి రంగం సిద్ధం

    February 8, 2023

    సచివాలయం ప్రారంభించిన తర్వాత కేసీఆర్ సంచలన ప్రకటన

    February 8, 2023

    రేవంత్ గూగ్లీకి ప్రగతి భవన్ పాలేర్లు క్లీన్ బోల్డ్..!

    February 8, 2023
    Stay In Touch
    • Facebook 1000K
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo
    • WhatsApp
    Our Picks

    తారకరత్న హెల్త్ క్రిటికల్ గానే ఉందా..?కళ్యాణ్ రామ్ చెప్పలేకపోతున్నారా..?

    February 8, 2023

    గౌతమ్ అదానీ విదేశాలకు పారిపోవడానికి రంగం సిద్ధం

    February 8, 2023

    సచివాలయం ప్రారంభించిన తర్వాత కేసీఆర్ సంచలన ప్రకటన

    February 8, 2023

    రేవంత్ గూగ్లీకి ప్రగతి భవన్ పాలేర్లు క్లీన్ బోల్డ్..!

    February 8, 2023

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Demo
    Facebook Twitter Instagram Pinterest
    • Home
    • AndhraPradesh
    • Telangana
    • News
    © 2023 Polytricks. Designed by Polytricks.

    Type above and press Enter to search. Press Esc to cancel.