Author: Prashanth Pagilla

కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థల మధ్య పోరాటంలో సిట్ వెనకబడిపోతుంది. ఈడీ మాత్రం దూకుడుగా వ్యవహరిస్తోంది. సిట్ మొదట్లో కాస్త దూకుడుగా వ్యవహరించినట్లుగా కనిపించిన తెలంగాణేతరులను రప్పించి ప్రశ్నించడంలో తేలిపోయింది. ఇద్దరిపై లుక్ అవుట్ నోటిసులు జారీ చేసినా వాటితో ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. నోటిసులు ఇష్యూ చేసిన వెంటనే వారు కోర్టులకు వెళ్లి సిట్ పనితీరుపై సందేహం వ్యక్తం చేస్తూ స్టే లు తెచ్చుకున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సిట్ నోటిసులు ఇచ్చింది. విచారణకు హాజరు కావాలంటూ నోటిసుల్లో పేర్కొంది. దాంతో ఆయన హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. తుషార్ కు కూడా సిట్ నోటిసులు ఇవ్వగా… నోటిసులపై సమాధానం ఇచ్చాక కూడా తనను ఇబ్బంది పెడుతున్నారని, ఈ కేసును సీబీఐకి బదలాయించాలని పిటిషన్ దాఖలు చేసిన తుషార్ ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు చెప్పింది. హైకోర్టుకు సిట్…

Read More

సినీ ఇండస్ట్రీలో ఒక్కొక్కరు బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పేస్తున్నారు. వరుసగా ఒకరెనుక ఒకరు పెళ్లిపీటలెక్కుతున్నారు. ఇటీవల బెంగళూరు కు చెందిన అనుషను టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య వివాహం చేసుకోగా.. స్టార్ హీరోయిన్ హన్సిక ప్రియుడితో కలిసి ఎంగేజ్ మెంట్ చేసుకుంది. తాజాగా మరో జంట వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. హీరోయిన్ హరిప్రియ, కేజీఎఫ్ ఫేమ్ నటుడు వశిష్ఠ సింహాలు జంటగా కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దుబాయ్ నుంచి బెంగళూర్ కి తిరిగి వస్తుండగా విమానాశ్రయంలో మీడియా కంటికి చిక్కారు. ఇంకేముంది. వీరి లవ్ ఎపిసోడ్ క్షణాల్లో ఇండస్ట్రీ అంత పాకింది. వీరిద్దరి మధ్య చాలా కాలంగా ప్రేమాయణం కొనసాగుతుందని.. పెళ్లి కూడా చేసుకోవాలని ఆలోచనతో ఉన్నారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఈ నెల మొదటి వారంలో నిశ్చితార్ధం చేసుకొని… వచ్చే నెలలో పెళ్లి చేసుకోవాలని…

Read More

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత ప్రేమయం ఉందని ఈడీ ఆధారాలను సేకరించింది. ఢిల్లీ డిప్యుటీ సిఎం మనిష్ సిసోడియాకు అత్యంత సన్నిహితుడైన అమిత్ అరోరాను అరెస్ట్ చేసిన ఈడీ… కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ లో కవిత పేరును ప్రస్తావించి ఆధారాలను బయటపెట్టింది. దీంతో త్వరలోనే ఈడీ నోటీసులను కవిత అందుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఎమ్మెల్సీ కవిత టార్గెట్ గా ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీజేపీ నేతలు ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంతో సంబంధమున్న వారందరికి నోటిసులు ఇచ్చి వారిని ఈడీ, సీబీఐలు విచారించాయి. కవితకు కూడా నోటిసులు అందుతాయని ప్రచారం జరిగింది. నోటిసులు అందకపోవడంతోపాటు చార్జీషీట్ లో కవిత పేరు ఎక్కడ ప్రస్తావించకపోవడంతో ఢిల్లీ లిక్కర్ స్కాం నుంచి కవితకు విముక్తి అనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో అమిత్ అరోరాను అరెస్ట్ చేసి కోర్టులో ప్రోడ్యుస్ చేసిన రిమాండ్ రిపోర్ట్ లో కవిత పేరును…

Read More

రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణం పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ గాలి అనిల్ కుమార్. రైతు సమస్యలపై సర్కార్ నాన్చుడుధోరణిని వ్యతిరేకిస్తూ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు పఠాన్ చెరులోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన నిరసన దీక్షలో గాలి అనిల్ కుమార్ పాల్గొన్నారు. ధరణి , రైతు రుణమాఫీ , రైతు భీమా , పోడు భూములు, ధాన్యం కొనుగోలు , పంటలకు గిట్టుబాటు వంటి అంశాలలో రైతులకు సర్కార్ తీవ్ర అన్యాయం చెసిందని విమర్శించారు గాలి అనిల్. టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారని, దానికి తోడు రైతు సమస్యలను పూర్తిగా విస్మరించి రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్, బీజేపీలు ప్రజలను వంచిస్తున్నాయని, గడిచిన 8 ఏళ్ల కాలంలో ప్రజల సంక్షేమం కోసం రెండు…

Read More

పాన్ ఇండియా హీరో ప్రభాస్ , బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ మధ్య ప్రేమాయణం కొనసాగుతుందని కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతోన్న ఆదిపురుష్ చిత్ర షూటింగ్ సమయంలోనే ప్రభ – కృతిల మధ్య ప్రేమ పుట్టిందని, త్వరలో పెళ్లిపీటలు కూడా ఎక్కనున్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఈ ప్రచారం జరుగుతుండగానే “బేధియా” సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ షో లో పాల్గొన్న కృతి సనన్ పై యువ హీరో వరుణ్ ధావన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కృతి సనన్ ఇక్కడే ఉన్నా ఆమె మనస్సు మాత్రం దీపిక పదుకునేతో నటిస్తోన్న హీరో వద్ద ఉందంటూ పరోక్షంగా ప్రభాస్ ప్రస్తావన తీసుకొచ్చాడు. దీంతో ప్రభాస్ – కృతి సనన్ మధ్య సంథింగ్ , సంథింగ్ అంటూ వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో ప్రభాస్ తో ప్రేమాయణంపై కృతి సనన్ ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చేసింది. ప్రభాస్ తో తనకు…

Read More

టీఆర్ఎస్ నేతలు మంత్రి గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజ్ రవిచంద్రలకు సీబీఐ నుంచి పిలుపు వచ్చింది. గురువారం విచారణకు హాజరు కావాలంటూ నోటిసులు జారీ చేసింది. ఢిల్లీలో అరెస్ట్ అయిన నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ కు సంబంధించిన కేసులో గంగుల కమలాకర్, వద్దిరాజ్ రవిచంద్రలకు సీబీఐ నోటిసులు పంపింది. అరెస్ట్ అయిన నకిలీ అధికారి శ్రీనివాస్ మంత్రి గంగుల కమలాకర్ తో టచ్ లో ఉన్నారని సీబీఐ వర్గాలు అంటున్నాయి. తనకు ఉన్న పరిచయాలతో గ్రానైట్ వ్యవహారాలకు సంబంధించిన కేసులో ఉపశమనం పొందేలా శ్రీనివాస్ ప్రయత్నాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్ లోని మంత్రి గంగుల కమలాకర్ ఇంటికి వెళ్ళారు. శ్రీనివాస్ తో సంబంధాలు , ఎవరెవరితో మాట్లాడారు అనే దానిపై సమాచారం తెలుసుకునేందుకు గంగుల , వద్దిరాజ్ లకు సీబీఐ నోటిసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

Read More

పటాస్ కామెడి షో తో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు యాదమ్మ రాజు. అమాయకమైన ఫేస్ తో పంచ్ లు వేస్తూ నవ్వించడం ఇతని ప్రత్యేకత. పటాస్ షో నుంచి తప్పుకున్నాక అదిరింది షో లో ఎంట్రీ ఇచ్చి అలరించాడు. ఇదిలా ఉండగా స్టెల్లా అనే అమ్మాయితో లవ్ లో ఉన్నట్లు ఎన్నోసార్లు చెప్పిన యాదమ్మ రాజు ఇటీవల ఇరువురి కుటుంబ సభ్యుల అంగీకారంతో నిశ్చితార్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ ప్రేమ జంట పెళ్లి పీటలెక్కనుంది. స్టెల్లా – యాదమ్మ రాజుల ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్వరలోనే ఓ ఇంటి వాడు కాబోతున్న యాదమ్మ రాజుకు నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు. పలువురు జబర్దస్త్ కమెడియన్స్, బుల్లితెర యాంకర్లు కూడా ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. కాని కొంతమంది మాత్రం ఓ విషయన్ని ప్రస్తావిస్తూ టార్గెట్ చేస్తున్నారు. యాదమ్మ రాజు నీకు…

Read More

జాతీయ భద్రతసలహాదారు అజిత్ దోవల్ హైదరాబాద్ కు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు. ఆయన వచ్చినట్లుగా రాష్ట్ర పోలీసులకు కాని, నిఘా వర్గాలకు కానీ సమాచారం లేదు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో అజిత్ దోవల్ హైదరాబాద్ వచ్చారు. భద్రత లేకుండానే కారులో ప్రయాణించారు. కొంతమంది కీలక వ్యక్తులతో భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలన్నీ గోప్యంగా ఉంచారు. మూడు గంటల తరువాత అజిత్ దోవల్ తిరుగు ప్రయాణమై ఢిల్లీ వెళ్ళిపోయారు. జాతీయ భద్రత సలహాదారుగా కొనసాగుతున్న అజిత్ దోవల్ కు కేంద్రమంత్రితో సమానమైన భద్రత కల్పిస్తున్నారు. అలాంటిది ఆయన హైదరాబాద్ లో ఎలాంటి భద్రత లేకుండానే పర్యటించడం ఆసక్తికరంగా మారింది. ఎవరెవరితో అజిత్ దోవల్ భేటీ అయ్యారు..? ఈ సమావేశం ఎజెండా ఏంటి..? అనే వివరాలను రహస్యంగా ఉంచారు. దీంతో ఆయన పర్యటన వెనక గట్టి మతలబే ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో అజిత్ దోవల్ పాకిస్తాన్ లో రహస్యంగా ఉన్నారు.…

Read More

“లైగర్” సినిమా నిర్మాణానికి విదేశాల నుంచి పెట్టుబడులు అందాయన్న ఫిర్యాదు మేరకు ఈడీ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి లైగర్ దర్శకుడు పూరి జగన్నాథ్ , నిర్మాత ఛార్మిలను ఇప్పటికే విచారించిన ఈడీ తాజాగా హీరో విజయ్ దేవరకొండను విచారిస్తున్నట్లు తెలుస్తోంది. లైగర్ సినిమా నిర్మాణంలో నిబంధనలకు విరుద్దంగా విదేశాల నుంచి పెట్టుబడులు వచ్చాయన్న ఆరోపణలపై మనీలాండరింగ్ కోణంలో ఈడీ విచారణ సాగిస్తోంది. దుబాయ్ కి డబ్బులు పంపించి అక్కడి నుంచి తిరిగి సినిమాలో పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ ప్రాథమికంగా గుర్తించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఈ వ్యవహారంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ప్రమేయం ఉందని కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారాయన. లైగర్ సినిమా పెట్టుబడులకు సంబందించి హీరో విజయ్ దేవరకొండకు నోటిసులు ఇష్యూ చేసిన ఈడీ అధికారులు.. ఈ వ్యవహారంలో ఎవరెవరి ప్రమేమయందని ఆయన్ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.…

Read More

తెలంగాణలో వెస్ట్ బెంగాల్ తరహ రాజకీయం చేసేందుకు టీఆర్ఎస్ – బీజేపీలు ప్లాన్ చేస్తున్నాయని టి. కాంగ్రెస్ సారధి రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అక్కడ ఎలాగైతే కాంగ్రెస్ బలహీనం చేసేందుకు టీఎంసీ – బీజేపీలు ప్రయత్నించి సక్సెస్ అయ్యాయో… తెలంగాణలోనూ కాంగ్రెస్ ను నిర్వీర్యం చేసేందుకు ఏ చిన్న అవకాశాన్ని టీఆర్ఎస్ – బీజేపీలు వదులుకోవడం లేదు. రాష్ట్రంలో రైతాంగ సమస్యలపై బుధవారం అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరసనలు తెలపాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. దీంతో ఈ కార్యక్రమంపై జనాల్లో చర్చ లేకుండా చేసేందుకు షర్మిల, బండి సంజయ్ కు టీఆర్ఎస్ మైలేజ్ ఇచ్చిందన్న విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక ఫలితం పార్టీలో నిస్తేజం నింపినా దాని నుంచి బయటపడేందుకు ప్రజా సమస్యలపై ఉద్యమించాలని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దశలవారీగా ఉద్యమాలు నిర్వహించి టీఆర్ఎస్ పై ప్రజా వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలనుకున్న హస్తం ఆశలపై టీఆర్ఎస్ నీళ్ళు చల్లేందుకు…

Read More