పటాస్ కామెడి షో తో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు యాదమ్మ రాజు. అమాయకమైన ఫేస్ తో పంచ్ లు వేస్తూ నవ్వించడం ఇతని ప్రత్యేకత. పటాస్ షో నుంచి తప్పుకున్నాక అదిరింది షో లో ఎంట్రీ ఇచ్చి అలరించాడు. ఇదిలా ఉండగా స్టెల్లా అనే అమ్మాయితో లవ్ లో ఉన్నట్లు ఎన్నోసార్లు చెప్పిన యాదమ్మ రాజు ఇటీవల ఇరువురి కుటుంబ సభ్యుల అంగీకారంతో నిశ్చితార్ధం చేసుకున్న సంగతి తెలిసిందే.
త్వరలోనే ఈ ప్రేమ జంట పెళ్లి పీటలెక్కనుంది. స్టెల్లా – యాదమ్మ రాజుల ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్వరలోనే ఓ ఇంటి వాడు కాబోతున్న యాదమ్మ రాజుకు నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు. పలువురు జబర్దస్త్ కమెడియన్స్, బుల్లితెర యాంకర్లు కూడా ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. కాని కొంతమంది మాత్రం ఓ విషయన్ని ప్రస్తావిస్తూ టార్గెట్ చేస్తున్నారు. యాదమ్మ రాజు నీకు సిగ్గులేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే..యాదమ్మ రాజు ప్రేమించిన అమ్మాయి పేరు స్టెల్లా. ఆమె పేరుతోనే ఆమె క్రైస్తవులు అని తెలుస్తోంది. రాజు హిందువు. అయినప్పటికీ వీరు ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఇందుకోసం పెద్దలను ఒప్పించి ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. ఈ నిశ్చితార్ధంలో యాదమ్మ రాజు బొట్టు పెట్టుకోలేదని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
హిందూ మతంలో పుట్టావు. క్రైస్తవ మతానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావ్. ఇదంతా బాగానే ఉంది. నీ ప్రేమికురాలు ఎంచక్కా క్రైస్తవ మత సంప్రదాయాలు పాటిస్తూ బొట్టు పెట్టుకోకుండా ఉంటే.. నువ్వు మాత్రం హిందూ మత సంప్రదాయం మేరకు నడుచుకోకుండా బొట్టు పెట్టుకోకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పద్ధతుల్ని అన్నింటిని గాలికి వదిలేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిగ్గు లేదా అంటూ రెచ్చిపోతున్నారు.