Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ టార్గెట్ బీజేపీ. ఆ పార్టీ అగ్రనేత బీఎల్ సంతోష్ పై ఫోకస్ చేసింది. నోటీసులు కూడా ఇచ్చింది. ఒకానొక దశలో ఆయనను అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో లిక్కర్ స్కాంలో కవిత పేరు బయటకు రావడంతో అమిత్ షా కు కూడా సిట్ నోటీసులు ఇస్తుందని లీకులిచ్చారు. కాని అనుకున్నదేం జరగలేదు.ఈ నెలలో బీఎల్ సంతోష్ హైదరాబాద్ కు వస్తున్నారు. 28,29 తేదీల్లో దక్షిణాది రాష్ట్రాల పార్లమెంట్ నియోజకవర్గాల కార్యకర్తల సమావేశానికి హైదరాబాద్ వేదిక కానుంది. అమిత్ షా, బీ ఎల్ సంతోష్ అండ్ సునీల్ బన్సల్ లు ఈ సమావేశంలో పాల్గొని పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు.బీఎల్ సంతోష్ కు నోటీసులు ఇవ్వలేకపోయారు పోలీసులు. సిట్ పై హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. ఈ కేసుపై ఇంకా విచారణ జరుగుతోంది. అసలు సిట్ విచారణ చేయడం కుదరదంటూ ఏసీబీ…
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ ప్రాపకాన్ని కోల్పోయారు. నూతనంగా ప్రకటించిన టిపిసిసి కమిటీలో ఎందులోనూ ఆయనకు అవకాశం కల్పించలేదు. దీంతో అనధికారికంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సేవలు ఇక చాలు అనే సంకేతాలు పార్టీ హైకమాండ్ ఇచ్చినట్లు అర్థం అవుతోంది. కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీని ఓ ఆట ఆడుకున్నారు. పార్టీని ఎంత వీక్ చేయాలో చేతనైనంత చేసేశారు. ఒకరు ఎంపీ, మరొకరు ఎమ్మెల్యే. ఏం మాట్లాడిన మమ్మల్ని పార్టీ సస్పెండ్ చేయదనుకొని ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. పార్టీకి నష్టం కల్గించే విధంగా వ్యవహరించారు. మునుగోడు ఉప ఎన్నికతో పార్టీ పీక నొక్కాలని ప్రయత్నాలు చేశారు. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో ఇటీవల కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ…ఎన్నికలకు నెల రోజుల ముందు ఏ పార్టీలోకి వెళ్తానన్నది ప్రకటిస్తానని చెప్పడంతో ఆయన్ను అధిష్టానం లైట్ తీసుకున్నట్లు ఉంది. మునుగోడు బైపోల్ సమయంలో బీజేపీ కి ఓటేయలంటూ స్వయంగా వెంకట్ రెడ్డి ఫోన్…
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ గతమైంది. ఇప్పుడు పేరు మార్చుకొని బీఆర్ఎస్ గా ఏర్పడింది. ప్రాంతీయభావంతో ఏర్పడిన పార్టీ ప్రజల్లో సెంటిమెంట్ ను ఆసరా చేసుకొని, భావోద్వేగాలను రెచ్చగొట్టి అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అయింది. కేసీఆర్ సీఎం అయిపోయారు. ఎనిమిదేళ్ళు పరిపాలించారు. ఓ ప్రత్యేక సందర్భంలో అనూహ్యంగా వచ్చిన సీఎం పదవి బోర్ కొట్టేసిందేమో , ఇప్పుడు జాతీయ రాజకీయాలని పలవరిస్తున్నాడు. తనను రాజకీయంగా శిఖరానికి చేర్చిన తెలంగాణను వదిలేసి దేశ రాజకీయాలంటూ ప్రయాణం ప్రారంభించాడు. అయితే ఇక్కడ టీఆర్ఎస్ పేరును మార్చి కేసీఆర్ తన పునాదుల్ని ఆయనే పెకిలించుకున్నట్టు అర్థం అవుతోంది. ఉద్యమ నాయకుడని నమ్మి కేసీఆర్ ను సీఎంను చేసింది తెలంగాణ. ప్రజల్లో అమూర్తభావంగా నిలిచిన ప్రత్యేక రాష్ట్ర సెంటిమెంట్ ను ఉద్యమంగా మలిచి..ఆ పోరాటానికి నాయకత్వం వహించడం వలన రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ బాహుబలిగా మారారు. అలా ఎదిగి వచ్చిన కేసీఆర్ ఇప్పుడు…
రంగారెడ్డి జిల్లా మన్నెగూడకు చెందిన యువతిని సినీ ఫక్కీలో కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. సిరి టౌన్ షిప్ లోకి 100మంది యువకులు వచ్చేసి యువతి ఇంటి ఎదుట నానా హంగామా చేసి ఆమెను ఎత్తుకెళ్ళారు. ఈ సంఘటన సినిమాటిక్ తరహాలో జరిగిపోయింది. సిరి టౌన్ షిప్ కు చెందిన ముచ్చెర్ల దామోదర్ రెడ్డి, నిర్మల దంపతుల కూతురు వైశాలిని కిడ్నాప్ చేశారు. శుక్రవారం మిస్టర్ టీ ఓనర్ నవీన్ రెడ్డి 100మంది యువకులతో వారి ఇంటికెళ్ళి వైశాలిని ఎత్తుకెళ్ళినట్లు దామోదర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి ఎట్టకేలకు యువతిని సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. అయితే, వైశాలిని మిస్టర్ టీ యజమాని నవీన్ రెడ్డి కిడ్నాప్ చేసేందుకు కారణం ఎంటని ఆరా తీస్తే ప్రేమ వ్యవహారమేనని తెలిసింది. నవీన్ రెడ్డి, వైశాలి కొంతకాలం కిందట ప్రేమించుకున్నారు. అయితే, వారి మధ్య…
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు నమోదైంది. సోషల్ మీడియాలో ఆయన వివాదాస్పద పోస్ట్ చేశారంటూ రాజసింగ్ కు నోటిసులు పంపారు. దీనిపై రెండు రోజుల్లో వివరణ ఇవ్వాల్సిందిగా నోటిసుల్లో పేర్కొన్నారు పోలీసులు. రాజాసింగ్ ఇచ్చిన వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంగళ్ హాట్ పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. డిసెంబర్ 6న అయోధ్య, అక్బర్ పై ట్వీట్లు చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్. పీడీ యాక్ట్ కొట్టేసిన సమయంలో హైకోర్టు విధించిన షరతులను ఉల్లంఘించారని ఆయనకు మంగళ్ హాట్ పోలీసులు నోటిసులు ఇచ్చారు. ఆ ట్వీట్లపై రాజాసింగ్ తరుఫు న్యాయవాది వివరణ ఇచ్చినా..పోలీసులు సంతృప్తి చెందలేదు. దీంతో రాజాసింగ్ పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు మంగళ్ హాట్ పోలీసులు.
సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకునే స్థోమత లేని వారికీ టి. సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇల్లును నిర్మించుకునేందుకు 3లక్షలు ఇచ్చేందుకు గైడ్ లైన్స్ ను అధికారులు పొందుపరచారు. శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ అద్యక్షతన జరగనున్న క్యాబినెట్ భేటీలో ఈ పథకంపై చర్చించనున్నారు. అదే రోజు ఈ పథకంపై ప్రకటన ఉండనున్నట్లు సమాచారం. సొంత జాగా ఉన్న వారికీ ఇల్లు కట్టుకునేందుకు 3లక్షల ఆర్ధిక సాయాన్ని అందించే పథకాన్ని 15రోజుల్లో ప్రారంభిస్తామని కేసీఆర్ మహబూబ్ నగర్ పర్యటనలో చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ ను అధికారులు ఖరారు చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలంటే భారీగా స్థల సేకరణ చేయాల్సి ఉంటుంది. ఒక్కో చోట ఇది సాధ్యమయ్యే పరిస్థితి లేదు. దాంతో కేసీఆర్ సొంత జాగా ఉన్న వారికీ 3లక్షల సాయాన్ని అందించాలని నిర్ణయించారు. నియోజకవర్గానికి వేయి మందిని ఎంపిక చేయనున్నారు. గైడ్…
ట్వింకిల్ ఖన్నా.. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ భార్యగా అందరికీ సుపరిచితమే. తెలుగు సినిమాలోనూ నటించింది. 1999లో వెంకటేష్ హీరోగా వచ్చిన “శీను” మూవీలో హీరోయిన్ గా కనిపించింది. ఇదిలా ఉండగా, ప్రముఖ నటి వహీదా రెహమాన్ యూట్యూబ్ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన జీవితంలో జరిగిన ఓ చేదు అనుభవాన్ని పంచుకుంది. ఓ రోజు సినిమా సెట్స్ లో ఉండగా దర్శకుడు వచ్చి ఆమెతో అసభ్యకరంగా బిహేవ్ చేశాడట. ట్వింకిల్ ఖన్నా, హీరోల మధ్య రెయిన్ సాంగ్ ను షూట్ చేస్తున్నారట. ఆ సాంగ్ కోసం తెల్లని కుర్తాను ట్వింకిల్ ఖన్నా ధరించిందట. సరిగ్గా సాంగ్ స్టార్ట్ అయ్యే ముందు దర్శకుడు వచ్చి ట్వింకిల్ ఖన్నా ఒంటిమీద శాలువా కప్పాడట. ఇప్పుడు నిన్ను మందాకినీ పాత్ర చేయమంటే నువ్వేం చేస్తావని దర్శకుడు అనడంతో అందుకు ఆమె స్పందిస్తూ.. మరేం ఆలోచించకుండా నో అనేస్తానని చెప్పడంతో దర్శకుడు అక్కడి…
ప్రస్తుతం సినిమాలతోపాటు సీరియల్స్ కూడా క్రేజ్ పెరుగుతోంది. అనూహ్యమైన ట్విస్ట్ లతో సీరియల్స్ ను కొనసాగిస్తుండటంతో వీటిపై కూడా ప్రేక్షకులు మక్కువ పెంచుకుంటున్నారు. ఇక గృహిణిలు టీవీలకు అతుక్కుపోయి సీరియల్స్ ను చూడటం హాబీగా పెట్టుకుంటారు. దీంతో సినిమాలతో కాకపోయిన కాస్త, కూస్తో సీరియల్స్ కూడా క్రేజ్ పెరిగింది. తమ టాలెంట్ తో ప్రేక్షకులను అలరిస్తోన్న సీరియల్ ఆర్టిస్టులు భారీగా పారితోషకం అందుకుంటారు. సీరియల్స్ తో రోజు అలరించే మన బుల్లితెర హీరోయిన్స్ తీసుకునే రెమ్యూనరేషన్ ఎంతో తెలుసుకుందాం. ప్రేమి విశ్వనాథ్ సీరియల్ పేరత్తగానే అందరికి టక్కున గుర్తొచ్చే సీరియల్ కార్తీక దీపం. ఇందులో వంటలక్కగా పరిచయమైన ప్రేమి విశ్వనాథ్ హీరోయిన్ తో సమానమైన క్రేజ్ సంపాదించుకుంది. ప్రతి ఇంట్లో వంటలక్క పేరు నానుతుందంటే ఆ సీరియల్ తో వంటలక్క ఎలాంటి గుర్తింపు పొందిందో చెప్పొచ్చు. ప్రేమి విశ్వనాథ్ ఒక రోజుకి కాల్ షీట్ కోసం రూ. 25 వేలు పారితోషికం…
డిసెంబర్ 12న టీఆర్ఎస్ గులాబీ కూలీ, అవినీతిపై ఢిల్లీ హైకోర్టులో కేసు విచారణకి రానుందన్నారు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. కేసు విచారణకు వచ్చే ముందే ఎన్నికల కమిషన్ టీఆర్ఎస్ పేరుని బీఆర్ఎస్ గా మార్చేశారని…బీజేపీ సూచనలతోనే ఎన్నికల కమీషన్ టీఆర్ఎస్ కి సహకరించిందని సంచలన ఆరోపణలు చేశారు. కోర్టు ధిక్కరణకి పాల్పడ్డ కేంద్ర ఎన్నికల కమీషన్ పై లీగల్ ఫైట్ చేస్తామని రేవంత్ తెలిపారు. ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రమాద భీమా చెక్కుల పంపిణీ, పేదలకు బట్టల పంపిణీ, రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సనర్భంగా రేవంత్ మీడియాతో మాట్లాడారు. గుజరాత్ మినహా అన్ని చోట్ల బీజేపీ ఓటమి పాలైందని..ఢిల్లీ ప్రజలు మోడీ నాయకత్వాన్ని తిరస్కరించారు. హిమాచల్ ప్రదేశ్ లో మోడీ మేనియా పని చేయలేదని చెప్పారు. గుజరాత్ లో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుందని.. మిగిలిన చోట్ల ఆ పార్టీని…
కాలం వేగంగా పరుగెడుతున్న కొద్ది మనుషుల ఆలోచనల సరళి కూడా మారుతోంది. వివాహన్ని పక్కకు పెట్టేసి సహజీవనం చేయాలనే ఆలోచన చేస్తోంది నేటి యువత. దీని వలన కొంత మంచి జరగడంతోపాటు అనేక దారుణ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో వివిధ దేశాలు చట్ట సవరణలు చేస్తున్నాయి. వివాహేతర సంబంధాలు, సహజీవనం వంటి అంశాలపై భారత సర్వోన్నత న్యాయస్థానం గతంలో సంచలన తీర్పులు ఇచ్చిన సంగతి తెలిసిందే. వీటిలో కొన్నింటిని నేరంగా పరిగణించలేమని అభిప్రాయపడింది. అయితే, సహజీవనం, వివాహేతర సంబంధాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాటిని నేరంగా పరిగణిస్తూ చట్ట సవరణ చేసింది. అయితే, ఈ నిర్ణయం తీసుకున్నది భారత్ కాదు ఇండోనేషియా ప్రభుత్వం. వివాహేతర సంబంధాలు, సహజీవనం వంటి విషయాలపై కఠిన నిర్ణయం తీసుకుంది. ఇకపై వాటిని నేరంగా పరిగణిస్తూ చట్టంలో మార్పులు చేసింది. ఇండోనేషియా నేర శిక్షాస్మృతికి చట్ట సవరణ చేసిన బిల్లును మంగళవారం అక్కడి పార్లమెంట్…