ప్రస్తుతం సినిమాలతోపాటు సీరియల్స్ కూడా క్రేజ్ పెరుగుతోంది. అనూహ్యమైన ట్విస్ట్ లతో సీరియల్స్ ను కొనసాగిస్తుండటంతో వీటిపై కూడా ప్రేక్షకులు మక్కువ పెంచుకుంటున్నారు. ఇక గృహిణిలు టీవీలకు అతుక్కుపోయి సీరియల్స్ ను చూడటం హాబీగా పెట్టుకుంటారు. దీంతో సినిమాలతో కాకపోయిన కాస్త, కూస్తో సీరియల్స్ కూడా క్రేజ్ పెరిగింది. తమ టాలెంట్ తో ప్రేక్షకులను అలరిస్తోన్న సీరియల్ ఆర్టిస్టులు భారీగా పారితోషకం అందుకుంటారు. సీరియల్స్ తో రోజు అలరించే మన బుల్లితెర హీరోయిన్స్ తీసుకునే రెమ్యూనరేషన్ ఎంతో తెలుసుకుందాం.
ప్రేమి విశ్వనాథ్
సీరియల్ పేరత్తగానే అందరికి టక్కున గుర్తొచ్చే సీరియల్ కార్తీక దీపం. ఇందులో వంటలక్కగా పరిచయమైన ప్రేమి విశ్వనాథ్ హీరోయిన్ తో సమానమైన క్రేజ్ సంపాదించుకుంది. ప్రతి ఇంట్లో వంటలక్క పేరు నానుతుందంటే ఆ సీరియల్ తో వంటలక్క ఎలాంటి గుర్తింపు పొందిందో చెప్పొచ్చు. ప్రేమి విశ్వనాథ్ ఒక రోజుకి కాల్ షీట్ కోసం రూ. 25 వేలు పారితోషికం తీసుకుంటుందని బుల్లితెర వర్గాల సమాచారం. సీరియల్ లో లీడ్ రోల్ పోషించే మహిళా ఆర్టిస్టులో ప్రేమి విశ్వనాథ్ హైయేస్ట్ పారితోషకం తీసుకుంటుంది.
నవ్య స్వామి
కన్నడకు చెందిన నవ్యస్వామికి నా పేరు మీనాక్షి సీరియల్ తో క్రేజ్ వచ్చింది. ఈ సీరియల్ తో వచ్చిన గుర్తింపు వలన ఈమెకు పలు షో లో సందడి చేసే అవకాశం కూడా వచ్చింది. ఇక నవ్య సీరియల్ లో నటించేందుకు ఒక్కరోజుకు 20వేలు తీసుకుంటుందని సమాచారం.
ఐశ్వర్య
అగ్ని సాక్షి సీరియల్ లో గుర్తింపు పొందిన ఐశ్వర్య కూడా డైలీ 20వేలు తీసుకుంటుందని సమాచారం.
సుహాసిని
అపరంజి అనే సీరియల్ ద్వారా బుల్లితెర ప్రవేశం చేసిన సుహాసిని.. అష్టాచమ్మా, ఇద్దరు అమ్మాయిలు, నా కోడలు బంగారం అనే సీరియల్స్ లో నటించింది. ప్రస్తుతం దేవత అనే సీరియల్ రుక్మిణీ పాత్రలో నటిస్తోంది. సీరియల్స్ లో నటించేందుకు ఒక రోజుకుగాను సుహాసిని 20వేల పారితోషకం తీసుకుంటుందని సమాచారం.
పల్లవి రామిశెట్టి
భార్యామణి సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది పల్లవి రామిశెట్టి. ఆడదే ఆధారం సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన పల్లవి రామిశెట్టి ఆ తరువాత మాటే మంత్రం, అత్తారింటికి దారేది వంటి సీరియల్స్ లో నటిస్తూ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం మా పాపే మా జీవన హ్యోతి సీరియల్ లో నటిస్తోంది. పల్లవి ఒకరోజు సీరియల్ లో నటించేందుకు 15వేలు తీసుకుంటుందని సమాచారం.