Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
అన్ స్టాపబుల్ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ఎలాంటి సమాధానాలు చెప్తారో తెలుసుకుందామని ఫ్యాన్స్ లో, ఇండస్ట్రీలో ఒకరకమైన ఆతృత కనిపిస్తోంది. ఈ ఎపిసోడ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. తాజాగా టీజర్ ను విడుదల చేశారు. ఇందులో రాజకీయ పరమైన ప్రశ్నలే ఎక్కువ ఉన్నాయి. అందరి హీరోల్నీ నన్ను బాలా అని పిలవండి అని బాలయ్య అడగడం మామూలే. ఈసారి కూడా పవన్‌ని అలానే అడిగాడు. నేను ఓడిపోవడానికి సిద్ధం కానీ.. మిమ్మల్ని మాత్రం అలా పిలవలేనని పవన్ నవ్వేస్తే, ఈ పాలిటిక్సే వద్దు అంటూ బాలయ్య కౌంటర్ వేశాడు. ఈమధ్య నీ విమర్శల్లో వాడీ వేడీ డబుల్ ఇంపాక్ట్ లో కనిపిస్తోంది.. అని బాలయ్య అంటే.. చాలా పద్ధతిగానే మాట్లాడుతున్నానండీ అంటూ పవన్ చెప్పిన సమాధానం ఆకట్టుకొంటోంది. మెగాస్టార్ నుంచి నేర్చుకోవాలనుకొన్నవీ.. వద్దనుకొన్నవీ.. ఏమిటి” అని బాలయ్య అడిగినప్పుడు పవన్ ఉద్వేగభరితమైన సమాధానం ఇచ్చినట్టు కనిపిస్తోంది.…
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పట్టువీడారు. గాంధీ భవన్ మెట్లను ఎక్కారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో మాట్లాడేది లేదని గతంలో తేల్చి చెప్పిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎట్టకేలకు రేవంత్ తో సమావేశమయ్యారు. 40నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో వీరిద్దరి మధ్య ఏయే అంశాలపై చర్చ జరిగిందన్నది స్పష్టత లేదు. కాని పార్టీ పటిష్టతపైనే చర్చించినట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి- రేవంత్ రెడ్డిల భేటీతో కాంగ్రెస్ లో నూతనోత్తేజం స్పష్టంగా కనిపిస్తోంది. రేవంత్ పాదయాత్రకు ఐదు రోజుల ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడంతో పార్టీ శ్రేణులు సంబర పడుతున్నాయి. గాంధీ భవన్ లో కోమటిరెడ్డి ప్రత్యక్షం కావడంతో రాజకీయ వర్గాల్లో ఒకటే చర్చ. సీనియర్లంతా రేవంత్ పాదయాత్రకు బ్రేకులు వేసేందుకు తెరవెనక కత్తులు నూరుతుంటే.. రేవంత్ అంటేనే ఒంటికాలి మీద లేచే కోమటిరెడ్డి మాత్రం ఆయనతో భేటీ కావడం పార్టీ వర్గాలనే విస్మయానికి గురి చేసింది.…
బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమైనా విజయ్ అంటోని కోమాలోకి వెళ్ళారు. బిచ్చగాడు సినిమా సూపర్ హిట్ కావడంతో ప్రస్తుతం బిచ్చగాడు 2 తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఓ సన్నివేశం తెరకెక్కిస్తుండగా విజయ్ ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. మలేషియాలో ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ ఓ బోట్ సన్నివేశం తెరకెక్కిస్తుండగా ఎదురుగా వస్తున్న మరో బోట్ ఢీకొట్టడం వల్ల విజయ్ ఆంటోనీ బోట్ నుండి ఎగిరి క్రిందపడ్డాడు.అందువల్ల ఆయన తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. వెంటనే మూవీ యూనిట్ విజయ్ ను సమీపంలోని హాస్పిటల్ కి తరలించి అత్యవసర చికిత్స అందించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు మాట్లాడుతూ ‘విజయ్ ఆంటోనీ కి దవడ ఎముక మరియు పళ్ళు విరిగిపోయాయి..ముఖానికి కూడా దెబ్బలు తగిలాయి..చికిత్స అందిస్తున్నాము..ప్రస్తుతం ఆయన ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదు’ అని చెప్పడం తో అభిమానులు రిలాక్స్ అయ్యారు..తమ అభిమాన…
25మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని ఇటీవల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశం అయ్యాయి. వారిని మార్చితే అధికారం మరోసారి బీఆర్ఎస్ దేనని వ్యాఖ్యానించారు. ఆ 25మంది ఎమ్మెల్యేలు వీరేనంటూ పలువురి ఎమ్మెల్యేల పేర్లు బయటకొచ్చాయి. దాంతో ఎర్రబెల్లిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..ఆ నేతలంతా హైకమాండ్ కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. సిట్టింగ్ లకే మరోసారి టికెట్లు అంటూ కేసీఆర్ ప్రకటిస్తుంటే..మంత్రి ఎర్రబెల్లి మాత్రం అందుకు విరుద్దంగా కామెంట్స్ చేయడం పట్ల ఆ 25మంది ఎమ్మెల్యేల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అయింది. ఎర్రబెల్లి పరిధి దాటి కామెంట్స్ చేస్తున్నారని..ఆయన చేసిన వ్యాఖ్యల వలన తాము ఓడిపోయే నేతలమంటూ నియొజకవర్గాల్లో ప్రచారం జరిగిందని హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. మంత్రిని నియత్రించాలని 25 మంది ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయడంతో కేసీఆర్ ఎర్రబెల్లికి క్లాస్ పీకినట్లు సమాచారం. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దని , అత్యుత్సాహం ప్రదర్శించవద్దని…
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దాదాపు బీఆర్ఎస్ తో అనుబంధం తెంచుకున్నారు. దాంతో ఆయన పొలిటికల్ జర్నీ ఆసక్తికరంగా మారింది. బీజేపీ నుంచి ఆఫర్ వచ్చింది. ఖమ్మం రాజకీయాలను పూర్తిగా పొంగులేటి చేతిలో పెట్టేందుకు బీజేపీ అంగీకరించడంతో ఆయన బీజేపీలో చేరేందుకు రెడీ అయిపోయారని ప్రచారం జరిగింది. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తీవ్ర ప్రభావం చూపగలిగే పొంగులేటి కోసం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ప్రయత్నించారు. కాంగ్రెస్ లో చేరాలని ఆహ్వానించారు. కాని ఆయన చేరికకు భట్టి అడ్డుపతున్నారన్న ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే భట్టి మాట్లాడుతూ..పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరికకు తాను అడ్డుకాదని.. ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ లో పొంగులేటి చేరుతానంటే తనకు ఎలాంటి ఇబ్బంది లేదని భట్టి ప్రకటనతో పొంగులేటి, ఆయన సన్నిహిత నేతలు ఆలోచనలో పడ్డారు. అనుచరులతో వరుసగా సమావేశం అవుతు పొంగులేటి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. ఐతెహ్, అనుచరుల నుంచి కాంగ్రెస్ లో…
విశాఖతో పోలిస్తే చిన్న, చిన్న నగరాల్లో కూడా మెట్రో రైలు సర్వీసులు ప్రారంభమయ్యాయి. కాని విశాఖలో మాత్రం ఇంకా మెట్రో కూత వినబడటం లేదు. మెట్రో రైలు సేవల కోసం టీడీపీ హయంలో చేసిన ప్రయత్నాలను జగన్ సర్కార్ పట్టించుకోకపోవడం.. కనీసం పైసా కూడా కేటాయించకపోవడంతో విశాఖకు మెట్రో రైలు ఓ కలగానే మిగిలిపోయింది. విశాఖను రాజధానిగా చేయాలని పట్టుదలగానున్న జగన్ సర్కార్ మెట్రో సర్వీసులను ప్రారంభించాలని అస్సలు అనుకోవడం లేదు. వైసీపీ హయంలోనే మెట్రో సేవలు ప్రారంభం అవుతే జగన్ సర్కార్ కే ఖ్యాతి దక్కుతుంది. అయినప్పటికీ ఎందుకో మెట్రో రైలు ప్రారంభంపై జగన్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. 2019 ఎలక్షన్ టైంలోనే విశాఖకు రైల్వే జోన్ అంటూ కేంద్రం ప్రకటన చేసింది. కేంద్రం కోరిన మీదట విశాఖకు మెట్రో రైలుపై రూ.18వేల కోట్లు అవసరమవుతుందని నాటి టీడీపీ ప్రభుత్వం నివేదిక పంపింది. దానిని పురోగతిపై కేంద్రాన్ని అడగాల్సిన జగన్…
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలపడటం సాధ్యం కాదని అనుకున్నారు. కాని తెలంగాణలో ఊహించని విధంగా బీజేపీ బలపడుతుండటంతో ఏపీలోనూ పార్టీ ఎదుగుదలపై అగ్రనేతలు ఫోకస్ చేస్తున్నారు. ఇందుకోస ఒంటరిగానే ఏపీలో బలపడాలని అనుకుంటున్నారు. పొత్తులతో బీజేపీకి ఆశించిన లాభం చేకూరడం లేదని అందుకే పొత్తులకు ముగింపు పలకాలని అగ్రనేతలు భావిస్తున్నారు. తాజాగా ఏపీలో పొత్తులు అవసరం లేదనే ఆలోచనతో బీజేపీ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జనసేనతో పొత్తు ఉన్నా.. ఆ పార్టీ బీజేపీని పెద్దగా పట్టించుకోవడం లేదు. పక్క పార్టీల నేతలను ముఖ్యమంత్రి చేస్తామని బతిమాలాల్సిన అవసరం ఏముందనే ఆలోచనతో బీజేపీ హైకమాండ్ ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే ఇక ఏపీలో పొత్తులు లేకుండానే బలపడాలని స్కెచ్ గీస్తున్నారు కమలనాథులు. పొత్తుల్లేకుండానే సాగాలని ఢిల్లీలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఏపీ నేతలకు హైకమాండ్ స్పష్టం చేయడంతో.. సోము వీర్రాజు కూడా ఇదే విషయమై మాట్లాడారు. ఇక రాష్ట్రంలో పొత్తుల చర్చ ఉండదని…
నాణ్యమైన విద్య అందాలంటే దేశంలో ప్రైవేట్ పాఠశాలలను పూర్తిగా రద్దు చేయడం ఒక్కటే పరిష్కార మార్గంగా కనపడుతుంది. అప్పుడు ముఖ్యమంత్రుల పిల్లలు, మనుమలూ మనుమరాళ్ళు, అధికారుల పిల్లలు, ధనవంతుల పిల్లలు, పేద వారి పిల్లలు అందరినీ ప్రభుత్వ బడిలో మాత్రమే చదివించాల్సి వుంటుంది. దాంతో బడుల పని విధానం, సౌకర్యాలు, విద్య నాణ్యత అన్నీ మెరుగవుతాయి. మండలానికి ఆరు నుండి పది పాఠశాలలు పెట్టి మిగతా చిన్న గ్రామాలకు రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయడం ద్వారా పాఠశాలల సంఖ్య తక్కువై, సౌకర్యాలు మెరుగై విద్యాప్రమాణాలను పెంపొందుతాయి. భారత రాజ్యాంగంలో పేర్కొన్నట్టు ప్రభుత్వమే అందరికీ నాణ్యమైన విద్యను అందించాలి. ఏ దేశంలో అయినా పేదరికం పోయిందంటే, బాగా అభివృద్ధి జరిగిందంటే దానికి పునాది పాఠశాల విద్య, కాలేజి విద్య, విశ్వవిద్యాలయ విద్య అనేది చారిత్రక సత్యం. కానీ మన దేశంలో ప్రభుత్వ పెద్దలు, రాజకీయ నాయకులు, కాంట్రాక్టులకిచ్చే ప్రాజెక్టు పనుల మీద ఉన్నంత…
టాలీవుడ్ యంగ్ డైరక్టర్ లలో గోపీచంద్ మలినేని ఒకరు. తన వరుస సినిమాలు సూపర్ హిట్ టాక్ అందుకుంటుండంతో స్టార్ డైరక్టర్ జాబితాలో చేరిపోయరాయన. రవితేజ హీరోగా నటించిన ‘డాన్ శ్రీను’ సినిమా ద్వారా ఇండస్ట్రీ కి డైరెక్టర్ గా పరిచయమైనా గోపీచంద్ ఆ తర్వాత బాడీ గార్డ్ , విన్నర్ , క్రాక్ ,బలుపు , పండగ చేస్కో , వీర సింహా రెడ్డి వంటి సినిమాలను తెరకెక్కించారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన డాన్ శ్రీను , బలుపు , క్రాక్ మరియు వీర సింహా రెడ్డి చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇందులో మూడు సినిమాలు స్టార్ కిడ్ శృతి హసన్ తో చేశారు. ఈ సినిమాలన్నీ హిట్ టాక్ అందుకున్నాయి. శృతి హసన్ కథానాయికగా గోపీచంద్ తెరకేక్కిన్చినియా సినిమాలన్నీ హిట్ కావడంతో వీరి కాంబో సూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ వీడియో వైరల్…
సినిమాలో కొన్ని సన్నివేశాల్లో నటించడమంటే హీరో, హీరోయిన్లకు అంత ఈజీ కాదు. ముఖ్యంగా హీరోయిన్స్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎందుకంటే సినిమా షూటింగ్ ప్రారంభం నుంచి చివరి వరకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడమనేది అతి పెద్ద సాహసమే. అలాంటి సన్నివేశాల్లో అర్దనగ్నంగా నటించడమంటే హీరోయిన్స్ కు కత్తిమీద సామే. అదేవిధంగా హీరోతో రొమాంటిక్, బెడ్ రూమ్ సన్నివేశాలు వుంటాయి. అందుకే చాలా మంది హీరోయిన్స్ ఇలాంటి పాత్రలను తాము చేయమని చెప్పేస్తారు. కొద్ది మంది మాత్రమే వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని నటిస్తారు. అలా సినిమాల్లో ఒక్కోసారి వేశ్య పాత్రలు కూడా చేయాల్సి వస్తుంది. కెరీర్ కోసం వేశ్య క్యారెక్టర్లు చేసిన హీరోయిన్స్ ఎవరో చూద్దాం. స్టార్ హీరోయిని అనుష్క అర్థ నగ్న పాత్రల్లో చేయడం విశేషం. కెరీర్లో ఎదుగుతున్న రోజుల్లో డైరక్టర్ క్రిష్ తెరకెక్కించిన వేదం మూవీలో ఆమె ఆ పాత్రలో నటించారు. సీనియర్ హీరోయిన్ టబు…