సినిమాలో కొన్ని సన్నివేశాల్లో నటించడమంటే హీరో, హీరోయిన్లకు అంత ఈజీ కాదు. ముఖ్యంగా హీరోయిన్స్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎందుకంటే సినిమా షూటింగ్ ప్రారంభం నుంచి చివరి వరకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడమనేది అతి పెద్ద సాహసమే. అలాంటి సన్నివేశాల్లో అర్దనగ్నంగా నటించడమంటే హీరోయిన్స్ కు కత్తిమీద సామే.
అదేవిధంగా హీరోతో రొమాంటిక్, బెడ్ రూమ్ సన్నివేశాలు వుంటాయి. అందుకే చాలా మంది హీరోయిన్స్ ఇలాంటి పాత్రలను తాము చేయమని చెప్పేస్తారు. కొద్ది మంది మాత్రమే వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని నటిస్తారు. అలా సినిమాల్లో ఒక్కోసారి వేశ్య పాత్రలు కూడా చేయాల్సి వస్తుంది. కెరీర్ కోసం వేశ్య క్యారెక్టర్లు చేసిన హీరోయిన్స్ ఎవరో చూద్దాం.
స్టార్ హీరోయిని అనుష్క అర్థ నగ్న పాత్రల్లో చేయడం విశేషం. కెరీర్లో ఎదుగుతున్న రోజుల్లో డైరక్టర్ క్రిష్ తెరకెక్కించిన వేదం మూవీలో ఆమె ఆ పాత్రలో నటించారు. సీనియర్ హీరోయిన్ టబు భక్తిరస చిత్రం పాండురంగడు మూవీలో బాలకృష్ణను వలలో వేసుకున్న పాత్రల్లో కనిపించి మెప్పించారు. ఇక డైరెక్టర్ పూరి జగన్నాధ్ పార్ట్నర్ ఛార్మి జ్యోతిలక్ష్మీ చిత్రంలో కూడా చేశారు.
మరో సీనియర్ స్టార్ హీరోయిన్ శ్రియ శరన్ సైతం అలాంటి పాత్ర చేయడం విశేషం. పవిత్ర మూవీలో ఆమె ఈ ఛాలెంజింగ్ రోల్ లో మెస్మరైజ్ చేశారు. ఖడ్గం ఫేమ్ సంగీత తమిళ చిత్రం ధనంలో వేశ్యగా నటించారు. హోమ్లీ హీరోయిన్ స్నేహ వేశ్య రోల్ చేసింది. ధూల్ పేట్ చిత్రంలో స్నేహ వేశ్యగా అలరించారు. స్టార్ కిడ్ శృతి హాసన్ కెరీర్ బిగినింగ్ లోనే బోల్డ్ రోల్స్ చేశారు. హిందీ మూవీ ‘డి డే’లో ఆమె పాకిస్థాని వేశ్యగా కనిపించారు.
బాహుబలి మూవీల్లో శివగామి పాత్రగా నటించిన రమ్యకృష్ణ ఈ విషయంలో అందరికంటే ముందు ఉన్నారు. కమల్ హాసన్ హీరోగా విడుదలైన కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ పంచతంత్రం చిత్రంలో రమ్యకృష్ణ అర్థనగ్న పాత్రల్లో నటించారు. హీరోయిన్స్ అంజలి, బిందుమాధవి కూడా అలాంటి పాత్రల్లో నటించి మెప్పించారు.
ఇక నాలుగు దశాబ్దాల క్రితమే కొందరు తెలుగు హీరోయిన్స్ కూడా అలాంటి పాత్రలో చేయడం విశేషం. అలనాటి తారలు జయసుధ, జయప్రద వంటి వారు కూడా వేశ్య పాత్రలు చేసి మెప్పించారు.
Also Read : పెళ్లి కాకుండానే తండ్రైన స్టార్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ