Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Duriki Mohan Rao
శ్రీరామనవమి వేడుకలలో భాగంగా సీతారాములు కళ్యాణం వైభోగంగా, కన్నుల పండుగగా జరుగుతోంది. భక్తులు ఆదమరిచి కళ్యాణ మంత్రాలు వింటూ పులకిస్తున్నారు. ఒక్కసారిగా ఆహాకారాలు. మంటలు చెలరేగాయి. ఏం జరుగుతుందో ఎవ్వరికి అర్థంకాని పరిస్థితి. ఆడవాళ్లు, మగవాళ్ళు ఆర్తనాదాలు చేస్తూ పరుగులు తీశారు. పిల్లలు, వృద్ధులు వాళ్ళ కాళ్ళ కింద పడి నలిగారు. కళ్యాణం చేస్తున్న పూజారులు ముందుగా ఆ షాక్ లోంచి కోలుకుని మంటలను ఆర్పే పనిలో పడ్డారు. మరికొందరు యువకులు వాళ్లకు సహాయం చేసి మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. కానీ అప్పటికే జరగవలసి నష్టం జరిగింది. చలువ పందిళ్లు కాలి మసయ్యాయి. ఎవ్వరికి ప్రాణ నష్టం జరగకపోయినా కొందరికి కాళ్లు, చేతులు కాలాయి. ఇలాంటి సీన్ ఆ మధ్య వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో మీరు చూసి ఉంటారు. మహేష్ బాబు, వెంకటేష్ ఆ మంటలను ఆర్పీ భక్తులను కాపాడతారు. ఆ సీన్ ఇప్పుడు నిజంగానే భక్తుల…
శ్రీరామ నవమి రోజు ‘దాసరా’ను చూపిన గొప్ప సినిమా ఇది. అంటే శ్రీరామ నవమికంటే సరదా గొప్ప పండగ అని మా ఉద్దేశం కాదు. శ్రీరామ నవమి అంటే వెజిటేరియన్ పండగ. మటన్, మందు ఉండరు. కానీ దసరాకు మటన్, మందు, జల్సాలు ఉంటాయి. కాబట్టి ఈ రోజు ‘దసరా’ సినిమా ఆక్షన్ అనే మటన్, శృంగారం అనే మందుతో కూడిన మంచి పార్టీ ఇచ్చారు నిర్మాత సుధాకర్ చెరుకూరి. ఇది నిర్మాత సినిమా అనవచ్చు. ఎందుకంటే నాని లాంటి మిడిల్ రేంజ్ హీరోతో చిరంజీవి లాంటి హీరోతో తీయవలసిన భారీ సినిమాను భారీగా తీశారు కాబట్టి. ప్రపంచంలో 14 కథలు మాత్రమే ఉన్నాయి. అందులోంచి ఇదో కథ. చాలా పాత కథ. కానీ ఎత్తుకున్న నేపధ్యం చాలా కొత్తగా, కన్నుల విందుగా ఉంది. తెలంగాణకు చెందిన గోదావరిఖని తాలూకు వీర్లపల్లి బ్యాక్ గ్రౌండ్ తీసుకునే సరికి సినిమా చాలా ఫ్రెష్…
ఇకనుంచి మీరు ఇంటిలో ఉంది మీ ఓటు హక్కును వినియోగించుకునే హాకును కేంద్ర ఎన్నిక సంఘం ప్రవేశ పెడుతోంది. దీనిపేరు ‘వి ఎఫ్ ఎం’. అంటే ‘వోట్ ఫ్రమ్ హోమ్’. అంటే ఇంట్లో ఉంది ఓటు వేసే ప్రయోగం. అయితే ఇది అందరికి వర్తించదు. 80 ఏళ్ళు నిండిన వృద్దులకు మాత్రమే వర్టిస్తుంది. ముందుగా ఓటర్ తన వివరాలను ఎన్నిక కమిషన్ వెబ్ సైట్ లో నమోదు చేసుకుని ఓ పాస్ వర్డ్ తీసుకోవాలి. ఓటింగ్ రోజు మాత్రమే ఇది పనిచేస్తుంది. మొబైల్ లేదా డెస్క్ టాప్ నుంచి వృద్దులు ఇంట్లోంచి ఆన్ లైన్ ద్వార ఓటు వేయవచ్చు. ఈ ప్రయోగాన్ని కర్ణాటకలో వచ్చే ఎన్నికలలో ప్రయోగాత్మకంగా చేపట్టనున్నారు. దీనివలన ఆ రాష్ట్రం లో ఉన్న దాదాపు 12 లక్షల 50 వేల మంది వృద్దులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు అని ఎన్నిక సిఈఓ రాజీవ్ కుమార్ చెప్పారు. ఇది…
మహా భారతంలో దృతరాష్ట్రుడికి 101 పిల్లలకు జన్మనిచ్చాడు అని మనం చదువుకున్నాము. అది ఎలా సాధ్యం అని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెపుతారు. అతని చమటను (వీర్యం) 100 కుండలల్లో వేయడంవల్ల కౌరవులు పుట్టారు అని కొందరు అంటారు. అది లాజిక్కి అందవు, హేతువాదుల ముందు నిలువవు. దానిని కాసేపు పక్కన పెడదాము. కానీ నేటి కలియుగంలో 550 పిల్లలకు జన్మనిచ్చిన ఓ దృతరాష్ట్రుడికి గురించి తెలుసుకుందాము. ఇది కల్పితం కాదు. నెదర్లాండ్స్ దేశం లోని ‘ది హేగ్’ అనే నగరంలో జోనాధన్ అనే డాక్టర్ ఉన్నాడు. ఇతని వయసు 41 ఏళ్ళు. మనం రక్త దానం చేస్తే ఎంత పుణ్యం అనుకుంటామో, వీర్యం దానం చేయడం కూడా అంతే పుణ్యం అని అతను అనుకున్నాడు. ఆ దేశంలో ‘స్పెర్మ్ బ్యాంకు’లు విరివిగా ఉన్నాయి. అంటే ‘వీర్యం బ్యాంకు’లు. మగవాళ్ళు దానం చేసే వీర్యాని బ్యాంకు లో ఏళ్ల తరబడి…
ఎనక నుంచి ఏనుగులు పోయినా పర్వాలేదు. కానీ ముందు నుంచి ఎలుకలు పోరాదు అన్నట్లు ఉంది మన దేశ పరిస్టితి. నేరాలు – ఘోరాలు జరిగి దేశం అల్లకల్లోలం అవుతుంటే పట్టించుకోని బిజెపి నాయకులు చిన్న చిన్న విషయాల గురించి పట్టించుకుని, పోలీసు కేసులు పెట్టి, కోర్ట్ ల చుట్టి తిరుగుతున్నారు. ఇటు దక్షణ సినిమాలతో పాటు, అటు హిందీ సినిమాలల్లో కూడా బిజీగా ఉన్న ప్రముఖ హీరోయిన్ తాప్సి మొన్న ముంబాయి లో జరిగిన ‘లాక్మే ఫ్యాషన్ షో’ లో మోడలింగ్ చేశారు. మోడలింగ్ అంటేనే పలుచని గౌనులు, అర్థ నగ్న దుస్తులు తప్పక ధరించాలి. మోడలింగ్లో అమ్మాయిలు తమ అందాలను ఆరబోయకపోతే ఎవ్వరు చూడరు. ఆ బ్రాండ్ ఉత్పత్తికి గిరాకి పెరగదు. అది అందరికి తెలిసిన కిటుకే. ఇది కాదు బిజెపి నాయకుల బాధ. బిజెపి ఏమ్మెల్లె మాలిని ముద్దుల కొడుకు, యువకుడు ఏకలవ్య గౌర్. అతను కూడా…
ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి పనులకు తెలంగాణ ప్రభుత్వం బిల్లులు ఇంకా చెల్లించలేదు. కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన పాత పెండింగ్ బిల్లులు. కొత్త పనులు మొదలు పెట్టాలంటే చేతిలో డబ్బు లేదు. పెరిగిన అప్పులు – తరిగిన ఆదాయం. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ. 2.45 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వం దగ్గర ఉన్నది కేవలం రూ.2.౦౦ కోట్ల మాతమే. అంటే దాదాపు రూ.45,౦౦౦ లోటు బర్జేట్. ఇదే ప్రభుత్వాన్ని కలవార పెట్టే అంశం. దీనిని వెంటనే పూరించాలని కెసిఆర్ అటు ఆర్టిక మంత్రి హరిష్ రావుకు, ఇటు ఆర్టిక నిపుణులను లోగడే ఆదేశించారు. అంటే ఆదాయం వచ్చే శాఖలను ఇంకా పిండి లాభాలు గడించాలి. లేదా పన్నులు పెంచి ఆదాయాన్ని సమకూర్చుకోవాలి. లేదా కొత్త అప్పులు తీసుకుని రావాలి. ఈ మూడింటిలో పనులు మొదలు పెట్టి ఆ లోటు బడ్జెట్ పూరించాలి కొంత గడువు ఇచ్చారు…
ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో తాడో పేడో త్వరగా తేల్చాలని జగన్ వేసిన పిటిషన్ని సుప్రీం కోర్ట్ కొట్టివేసింది. ఇప్పటికే ‘అమరావతి’ మీద రైతులు వేసిన కేసులు కుప్పలు తెప్పలుగా పడున్నాయి. ‘రాజధాని విషయాన్ని అంత తొందరగా ఎలా తెలుతుంది? ఒక కేసు విచారించకుండా మరో కేసును ఎలా విచారిస్తారు? ఇక్కడ చాలా కేసులు ఉన్నాయి. ఇలా తొందరపడితే ఎలా?’ అని సుప్రీం కోర్ట్ మంగళవారం జగన్ కి మొట్టికాయలు వేసినట్లు తెలిసింది. జస్టిస్ కే ఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మానసం ఈ కేసుని విచారించింది. తిరిగి ఈ కేసుని జూలై 11న దీనిని విచారిస్తారు. కానీ ఇది జగన్ సర్కార్ మింగుడు పడని అంశం. ఒక రాష్ట్రం రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అని ఆంధ్రప్రదేశ్ హై కోర్టు లోగడ ఇచ్చిన తీర్పు తెలిసిందే. ఇది తప్పని, మా…
మట్టి పిసికిన చేతులతో బంగారాన్ని పిసికే మహామనిషిని ఏమంటారు? ఇంకే మంటారు – తోట రామ్ కుమార్ అంటారు. గన్ పట్టాల్సిన చేతులతో పెన్ పట్టిన మేధావింది ఏమంటారు? ఇంకే మంటారు – తోట రామ్ కుమార్ అంటారు. దేశం కానీ దేశంలో రొడ్ల మీద తిరిగి, ఆ దేశాని ఏలుతున్న గొప్ప వ్యాపారిని ఏమంటారు? ఇంకే మంటారు – తోట రామ్ కుమార్ అంటారు. నాడు ఒకడి దగ్గర అన్నం తిన్నవాడు, నేడు వేలాదిమందికి అన్నం పెట్టేవాడిని ఏమంటారు? ఇంకే మంటారు – తోట రామ్ కుమార్ అంటారు. ఇంతకీ ఎవరి తోట రామ్ కుమార్? నిన్నటివరకు ఎవ్వరికి తెలియని పేరు. నేడు అందరికి తెలిసిన పేరు. ఇక్కడే కాదు – దుబాయ్ లో కూడా అందరికి తెలిసిన పేరు. దుబాయ్ లోని అధిక సంపన్నుల్లో ఒకడు. తెలుగు వాళ్ళ కీర్తి పతకాని దుబాయ్ లో ఎగరేసిన ఓ వ్యాపార…
బిఆర్ఎస్ ఎమ్మెల్లేల భాగోతాలు ఒకొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మొన్నటివరకు నవ్య ను వేధించిన రాజయ్య కేసు మరువకముందే ఇప్పడు మరో కీచకకుడి కథ వెలుగులోకి వచ్చింది. అతను ఎవరో కాదు, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బిఆర్ఎస్ ఎమ్మెల్లే దుర్గం చిన్నయ్యపై ‘ఆరిజన్ డెయిరీ సంస్థ’ సీఈవో బోడపాటి శైలజ సంచలన ఆరోపణలు చేశారు. ఆమెకు రాజకీయాలతో సంబంధం లేదు. వ్యాపారి. డెయిరీ పని అనుమతులకోసం ఆమె కలిసినప్పుడు దుర్గం చిన్నయ్య తన కామకేళి గురించి చెప్పాడు. ఆమెను గోకాలని చూసినట్లు ఆమె స్చెవయంగా చెప్పింది. తాను అలాంటిదానిని కాదని, కావాలనుంటే ‘అలాంటి’ అమ్మాయిలను సప్లయి చేస్తానని ఆమె ఒప్పుకున్నట్లు స్వయంగా చెప్పింది. స్త్రీ లోలుడైన అతను ఒప్పుకున్నాడు. అక్కడినుంచి ఆమె అమ్మాయిను సరఫరా చేస్తూ తన పనులు చేయించుకుంది. అతను హైదరాబాద్ లోని ఎంఎల్ఏ కాలానికి వచ్చిన ప్రతిసారి అమ్మాయిలను పంపేదని చెప్పింది. కొన్ని పనులను, కొన్ని పనుల అనుమతులకు డబ్బులు…
అగ్ర రాజ్యం అమెరికా మన దేశం ప్రతి కదలికను నిశితంగా పరిశీలిస్తుంది. ఎలాంటి అవాంతరాలు వచ్చినా జోక్యం చేసుకోదు. ఎప్పుడు నోరువిప్పి మాట్లాడదు. ఎవ్వరయినా గుచ్చి గుచ్చి అడిగినా ‘అది భారతదేశం అంతర్గత వ్యవహారం, మేము దానిని గురించి స్పంధించము’ అని డిప్లమాటిక్ గా, సున్నితంగా తప్పించుకుంటుంది. అలాంటి అమెరిక తొలిసారి అధికారికంగా అంతర్జాతీయ మీడియా ముందు రాహుల్ గాంధీకి పడిన రెండేళ్ళ జైలు శిక్షను ఖండించింది. మోడీకి పరోక్షంగా మొట్టికాయలు వేసి సంచలనం రేపింది. ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారింది. ఈ రోజు ఉదయం అమెరిక అధికార ప్రతినిది వేదాంత్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ ‘రాహుల్ గాంధీ జైలు శిక్ష, అయన పార్లమెంట్ అనర్హత వేటును మేము గమనిస్తున్నాము. భావప్రకటనా స్వేఛ్చ, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఇండియాతో కలిసి అమెరికా ముందుకు సాగుతుంది అని చెప్పారు. అంటే ఇండియాలో భావప్రకటనా స్వేఛ్చ, ప్రజాస్వామ్య పరిరక్షణ సన్నగిల్లింది అనే అర్థాన్ని…