Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Duriki Mohan Rao
ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి పనులకు తెలంగాణ ప్రభుత్వం బిల్లులు ఇంకా చెల్లించలేదు. కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన పాత పెండింగ్ బిల్లులు. కొత్త పనులు మొదలు పెట్టాలంటే చేతిలో డబ్బు లేదు. పెరిగిన అప్పులు – తరిగిన ఆదాయం. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ. 2.45 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వం దగ్గర ఉన్నది కేవలం రూ.2.౦౦ కోట్ల మాతమే. అంటే దాదాపు రూ.45,౦౦౦ లోటు బర్జేట్. ఇదే ప్రభుత్వాన్ని కలవార పెట్టే అంశం. దీనిని వెంటనే పూరించాలని కెసిఆర్ అటు ఆర్టిక మంత్రి హరిష్ రావుకు, ఇటు ఆర్టిక నిపుణులను లోగడే ఆదేశించారు. అంటే ఆదాయం వచ్చే శాఖలను ఇంకా పిండి లాభాలు గడించాలి. లేదా పన్నులు పెంచి ఆదాయాన్ని సమకూర్చుకోవాలి. లేదా కొత్త అప్పులు తీసుకుని రావాలి. ఈ మూడింటిలో పనులు మొదలు పెట్టి ఆ లోటు బడ్జెట్ పూరించాలి కొంత గడువు ఇచ్చారు…
ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో తాడో పేడో త్వరగా తేల్చాలని జగన్ వేసిన పిటిషన్ని సుప్రీం కోర్ట్ కొట్టివేసింది. ఇప్పటికే ‘అమరావతి’ మీద రైతులు వేసిన కేసులు కుప్పలు తెప్పలుగా పడున్నాయి. ‘రాజధాని విషయాన్ని అంత తొందరగా ఎలా తెలుతుంది? ఒక కేసు విచారించకుండా మరో కేసును ఎలా విచారిస్తారు? ఇక్కడ చాలా కేసులు ఉన్నాయి. ఇలా తొందరపడితే ఎలా?’ అని సుప్రీం కోర్ట్ మంగళవారం జగన్ కి మొట్టికాయలు వేసినట్లు తెలిసింది. జస్టిస్ కే ఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మానసం ఈ కేసుని విచారించింది. తిరిగి ఈ కేసుని జూలై 11న దీనిని విచారిస్తారు. కానీ ఇది జగన్ సర్కార్ మింగుడు పడని అంశం. ఒక రాష్ట్రం రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అని ఆంధ్రప్రదేశ్ హై కోర్టు లోగడ ఇచ్చిన తీర్పు తెలిసిందే. ఇది తప్పని, మా…
మట్టి పిసికిన చేతులతో బంగారాన్ని పిసికే మహామనిషిని ఏమంటారు? ఇంకే మంటారు – తోట రామ్ కుమార్ అంటారు. గన్ పట్టాల్సిన చేతులతో పెన్ పట్టిన మేధావింది ఏమంటారు? ఇంకే మంటారు – తోట రామ్ కుమార్ అంటారు. దేశం కానీ దేశంలో రొడ్ల మీద తిరిగి, ఆ దేశాని ఏలుతున్న గొప్ప వ్యాపారిని ఏమంటారు? ఇంకే మంటారు – తోట రామ్ కుమార్ అంటారు. నాడు ఒకడి దగ్గర అన్నం తిన్నవాడు, నేడు వేలాదిమందికి అన్నం పెట్టేవాడిని ఏమంటారు? ఇంకే మంటారు – తోట రామ్ కుమార్ అంటారు. ఇంతకీ ఎవరి తోట రామ్ కుమార్? నిన్నటివరకు ఎవ్వరికి తెలియని పేరు. నేడు అందరికి తెలిసిన పేరు. ఇక్కడే కాదు – దుబాయ్ లో కూడా అందరికి తెలిసిన పేరు. దుబాయ్ లోని అధిక సంపన్నుల్లో ఒకడు. తెలుగు వాళ్ళ కీర్తి పతకాని దుబాయ్ లో ఎగరేసిన ఓ వ్యాపార…
బిఆర్ఎస్ ఎమ్మెల్లేల భాగోతాలు ఒకొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మొన్నటివరకు నవ్య ను వేధించిన రాజయ్య కేసు మరువకముందే ఇప్పడు మరో కీచకకుడి కథ వెలుగులోకి వచ్చింది. అతను ఎవరో కాదు, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బిఆర్ఎస్ ఎమ్మెల్లే దుర్గం చిన్నయ్యపై ‘ఆరిజన్ డెయిరీ సంస్థ’ సీఈవో బోడపాటి శైలజ సంచలన ఆరోపణలు చేశారు. ఆమెకు రాజకీయాలతో సంబంధం లేదు. వ్యాపారి. డెయిరీ పని అనుమతులకోసం ఆమె కలిసినప్పుడు దుర్గం చిన్నయ్య తన కామకేళి గురించి చెప్పాడు. ఆమెను గోకాలని చూసినట్లు ఆమె స్చెవయంగా చెప్పింది. తాను అలాంటిదానిని కాదని, కావాలనుంటే ‘అలాంటి’ అమ్మాయిలను సప్లయి చేస్తానని ఆమె ఒప్పుకున్నట్లు స్వయంగా చెప్పింది. స్త్రీ లోలుడైన అతను ఒప్పుకున్నాడు. అక్కడినుంచి ఆమె అమ్మాయిను సరఫరా చేస్తూ తన పనులు చేయించుకుంది. అతను హైదరాబాద్ లోని ఎంఎల్ఏ కాలానికి వచ్చిన ప్రతిసారి అమ్మాయిలను పంపేదని చెప్పింది. కొన్ని పనులను, కొన్ని పనుల అనుమతులకు డబ్బులు…
అగ్ర రాజ్యం అమెరికా మన దేశం ప్రతి కదలికను నిశితంగా పరిశీలిస్తుంది. ఎలాంటి అవాంతరాలు వచ్చినా జోక్యం చేసుకోదు. ఎప్పుడు నోరువిప్పి మాట్లాడదు. ఎవ్వరయినా గుచ్చి గుచ్చి అడిగినా ‘అది భారతదేశం అంతర్గత వ్యవహారం, మేము దానిని గురించి స్పంధించము’ అని డిప్లమాటిక్ గా, సున్నితంగా తప్పించుకుంటుంది. అలాంటి అమెరిక తొలిసారి అధికారికంగా అంతర్జాతీయ మీడియా ముందు రాహుల్ గాంధీకి పడిన రెండేళ్ళ జైలు శిక్షను ఖండించింది. మోడీకి పరోక్షంగా మొట్టికాయలు వేసి సంచలనం రేపింది. ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారింది. ఈ రోజు ఉదయం అమెరిక అధికార ప్రతినిది వేదాంత్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ ‘రాహుల్ గాంధీ జైలు శిక్ష, అయన పార్లమెంట్ అనర్హత వేటును మేము గమనిస్తున్నాము. భావప్రకటనా స్వేఛ్చ, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఇండియాతో కలిసి అమెరికా ముందుకు సాగుతుంది అని చెప్పారు. అంటే ఇండియాలో భావప్రకటనా స్వేఛ్చ, ప్రజాస్వామ్య పరిరక్షణ సన్నగిల్లింది అనే అర్థాన్ని…
కాంగ్రెస్ పార్టీ మహావృక్షాన్ని ఎక్కడికక్కడా ముక్కలు ముక్కలుగా నరకాలని బిజెపి కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఆ దిశగా తప్పటడుగులు వేస్తూ మునుపెన్నడూ కనీవిని ఎరుగని రీతిలో కుటిల రాజకీయాలకు కొత్తగా తెరలేపింది అని కాంగ్రెస్ నాయకులు ధ్వజమెత్తుతున్నారు. అందులో భాగంగా చివరికి తండ్రి – కొడుకు, అన్నా – తమ్ముడు అనే బేధాలు కూడా లేకుండా దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోంది. గత నాలుగు రోజులుగా ఈ పరిణామాలు దీనిని రుజువుచేస్తున్నాయి. రాహుల్ గాంధీకి జైలు శిక్ష విధించినప్పటినుంచి కాంగ్రెస్లో ఒక్కసారిగా చైతన్యం వచ్చింది. అనారోగ్యంతో మంచం పట్టిన సీనియర్ నేతలు కూడా మళ్ళి రంగంలోకి దిగుతున్నారు. అందులో భాగంగా మాజీ పిసిసి ప్రెసిడెంట్, రెండుసార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన సీనియర్ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్ చాలా కాలం తర్వాత తిరిగి కాంగ్రెస్ లో చేరారు. కాటికి కాళ్ళు చాపిన ఆయనను నలుగురు తీసుకొచ్చారు అందం కంటే మోసుకొచ్చారు అంటే బాగుంటుంది.…
మనిషి బతికుండగా ఎలాంటి వాడో మోసేది ‘ఆ నలుగురు’. అదే మనిషి ఛస్తే మోసేది కూడా ‘ఆ నలుగురే’. అందుకే నలుగురితో బాగుండాలి అని పెద్దలు అంటారు. శవాన్ని ‘ఆ నలుగురు’ మోశారు అంటే నిప్పుడు పెట్టడానికి ఐదోవాడు రెడీ అవుతాడు. ఆ తర్వాత చితి మీద కట్టెలు పేర్చేందుకు మిగతా వాళ్ళు కూడా తోడవుతారు. ఇప్పుడు వైసీపీ పరిస్థితి కూడా అదే. మొన్న జరిగిన ఎన్నికలలో జగన్ మనుషులు క్రాస్ ఓటింగ్ కు పాల్పడి తెలుగు దేశం పార్టీని గెలిపించిన ‘ఆ నలుగురు’ ఎమ్మెల్యేలు – ఆనం రామనారాయణ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి అని ముందుగా వార్తను మా ‘పాలీ ట్రిక్స్’ వెలుగులోకి తెచ్చింది. చివరికి అదే నిజమైంది. ‘ఆ నలుగురు’ వైసీపీ పార్టీ పరువును చంపేశారు. ‘ఆ నలుగురు’ ఇప్పడు ఆ పాడెను మోయాలని చూస్తుంటే ఏకంగా చితి…
”మల్లా రెడ్డి నిజంగానే హౌల గాడు, అతని మాటలు పట్టించుకోవద్దు” అని కాంగ్రెస్, బీజేపీ నాయకులే కాదు, చివరికి బిఆర్ఎస్ నేతలు కూడా నవ్వుకుంటారు. ఆయన ఏం మాట్లాడతాడో ఎవ్వరికి అర్థం కాదు. కానీ ఆ మాటలు నవ్విస్తాయి. అతను ఏం చేస్తాడో తెలియదు. కానీ ఓ మంత్రిగా ఏదో చేస్తున్నాడు అనిపిస్తుంది. చిరంజీవి లాంటి ఆక్షన్ హీరోలా సినిమాలల్లో బ్రమ్మానందం లాంటి కమేడియన్ ఉంటాడు. సీరియస్ గా సాగిపోతున్న సినిమాలో ఒక్కసారిగా నవ్వులు విరబూయాలంటే కమేడియన్ అవసరం. అలాగే సీరియస్ గా సాగే రాజకీయ సభలలో మల్లా రెడ్డి కూడా ఓ కమేడియన్ లాగా జనాన్ని గొల్లున నవ్విస్తాడు. అందుకే కేటిఆర్ తన సభలలో మల్లా రెడ్డిని కావాలని పిలిపించి మైక్ ఇస్తాడు. ఇంకే? కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లే. కానీ ఇప్పటివరకు కమేడియన్ లా ఉన్న మల్లా రెడ్డి ఇప్పుడు ‘పిట్టల దొరలా’ మారాడు. అందుకే నిన్న జరిగిన…
రాహుల్ గాంధీ లోక్ సభ అనర్హత వేటు పడే అవకాశం దాదాపు లేనట్లేనని తలలు పండిన సీనియర్ లాయర్లు చెపుతున్నారు. ఎందుకంటే ఈ కేసు శరద్ పవార్ కు చెందిన ఎన్సీపీ పార్టీ ఎంపీగా ఐన పి.పి. మహమ్మద్ ఫైజల్ కేసుకు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. పి.పి. మహమ్మద్ ఫైజల్ 2014 – 2019 ఎన్నికల్లో లక్షద్వీప్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. అయితే 2009లో జరిగిన ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ నాయకుడిపై దాడి చేశారన్న ఆరోపణలపై అతనిపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ కేసు తీర్పు ఈ ఏడాది జనవరిలో కవరత్తీ సెషన్స్ కోర్టు శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించింది. ఆయనపై అనర్హత వేటు వేస్తున్నట్లుగా లోక్ సభ సచివాలయం జనవరి 13న ఒక ప్రకటన విడుదల చేసి ఖాళీగా ఉన్న లోక్ సభ నియోజకవర్గాల్లో లక్షద్వీప్ ను ప్రకటించింది. ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ద్వారా…
ప్రముఖ సినీనటి మీనా రెండో పెళ్లి చేసుకోబోతోంది అని చాలా రోజులుగా పుకార్లు పుడుతున్నాయి. మొదట్లో ఆమె వాటిని ఖండించారు. ఆ తర్వాత అది నిజమేనని స్వయంగా ఒప్పుకున్నారు. ఆమె పెళ్లి ఈ ఏడాది జూలై లో ఓ సుప్రసిద్ధ నటుడితో జరగబోతోంది అని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. కానీ ఆమె దానిని మరోసారి ఎప్పటిలా ఖండించారు. కానీ ఆమెకు అతిసన్నిహితుడు అయిన మిత్రుడు, ప్రముఖ తమిళ నటుడు బెయిలవన్ రంగనాథన్ మీడియాతో మాట్లాడుతూ ”మీనా రెండో పెళ్లి ఓ పాన్ ఇండియన్ హీరోతో జూలై లో జరగబోతోంది. ఆ హీరో వయసు 39 ఏళ్ళు. ఆ హీరో ఎవరో మీకు ఈ పాటికి అర్థమయ్యి ఉంటుంది” అని చిన్న క్లూ ఇచ్చి తప్పించుకున్నాడు. ఈ వార్త గురించి మీన ఇంకా నోరు విప్ప లేదు. కానీ ఇది కేవలం పుకార్లు మాత్రమేనని నెటిజన్లు కొట్టిపడేస్తున్నారు. ఆమె అభిమానులు మాత్రం రంగనాథన్…