Author: Admin

టార్గెట్ 14.. సీఎం రేవంత్ చెప్తున్న నెంబర్. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 14 సీట్లు గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏ పార్లమెంట్ సీట్ ను రేవంత్ లైట్ తీసుకోవడం లేదు. అవసరమైతే హైదరాబాద్ స్థానంపై కూడా కాంగ్రెస్ జెండా పాతాలని పట్టుదలతో ఉన్నారు. తన వంద రోజుల పాలనకు పార్లమెంట్ ఎన్నికలు రెఫరెండమని చెప్తుండటంతో.. లోక్ సభ సీట్లపై గట్టిగా డోకాస్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒవైసీని ఓడించేందుకు బలమైన అభ్యర్థి కోసం అన్వేషణ కాంగ్రెస్ ప్రారంభించింది. ఒవైసీని ఓడించాలంటే అంత ఆషామాషీ కాదు. అందుకే ముస్లిం వర్గానికి చెందిన ఓ సెలబ్రిటీని బరిలో దింపాలని కసరత్తు చేస్తోందని టాక్ నడుస్తోంది. టీమిండియా టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జాతో కాంగ్రెస్ సంప్రదింపులు జరుపుతోందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే టెన్నిస్ కు గుడ్ బై చెప్పిన సానియా మీర్జా నెక్స్ట్ ప్లాన్ పై చర్చ జరుగుతోంది. క్రీడారంగంలో విజయవంతమైన టెన్నిస్…

Read More

సీఎంఆర్ఎఫ్ స్కామ్ లో హరీష్ రావు పీఏ.. అంతా తెలిసే జరిగిందా..? సీఎంఆర్ఎఫ్ స్కామ్ లో మాజీ మంత్రి హరీష్ రావు పీఏ నరేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులను డ్రా చేసుకొని సొమ్ము చేసుకోవడంతో జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హరీష్ పీఏ నరేష్ తోపాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. హరీష్ రావు దగ్గర పీఏగా పని చేసే నరేష్ సీఎంఆర్ఎఫ్ వ్యవహారాలను చూసుకునేవాడు. ఇతరులకు మంజూరైన చెక్కులను అదే పేరుతో ఉన్న వారి అకౌంట్ల వివరాలు పొందుపరిచి అక్రమంగా డబ్బును కాజేసేవాడు. ఈ బాధ్యతను ఓంకార్ అనే వ్యక్తికి అప్పజెప్పినట్లు తెలుస్తోంది. కొర్లపాటి వంశీ, బాలగోని వెంకటేష్ గౌడ్ తోపాటు ఓంకార్ కలిసి ఈ స్కామ్ చేసినట్లు సమాచారం. మొత్తం 17 చెక్కులను డ్రా చేశారు. మెదక్ పీర్ల తండాకు చెందిన రవి సీఎంఆర్ఎఫ్ విషయమై తెలుసుకోగా అసలు విషయం బయటపడింది. తమకు రావాల్సిన…

Read More

కొద్దీ రోజుల వరకు కేంద్రంలో బీజేపీదే అధికారమని ఆ నోటా, ఈ నోటా వినిపించింది. రోజులు గడిచే కొద్దీ పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. బీజేపీ 400సీట్లు ఖాయమని చెబుతున్నా అదేమంత ఈజీ కాదు. పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మరోసారి బీజేపీ అధికారాన్ని చేపట్టేందుకు చెమటోడ్చాల్సిందే. గతంలోలా ఈజీగా గెలుస్తామన్న నమ్మకం బీజేపీ అగ్రనేతల్లో ఎంతమాత్రం కనిపించడం లేదు. సౌత్ లో 132 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. కర్ణాటక, తెలంగాణ, ఏపీలో పొత్తు వలన ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభావం చూపగలదు. కానీ కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలో బీజేపీకి అనుకూలమైన వాతావరణం కనిపించడం లేదు. ఓవరాల్ గా సౌత్ లో ఇండియా కూటమి అత్యధిక సీట్లను గెలుచుకోనుంది. నార్త్ విషయానికి వస్తే పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ , ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ లో ఇండియా కూటమి అత్యధిక సీట్లను గెలుచుకోనుంది. నిన్నటి వరకు యూపీ, మధ్యప్రదేశ్ , రాజస్థాన్, గుజరాత్…

Read More

Kavitha suspended from BRS..? అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో సహించను. అవినీతికి పాల్పడితే నా కుటుంబ సభ్యులను కూడా చూడను. జైలుకు పంపిస్తానని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ప్రకటించారు. ఈటలపై విచారణ జరపకుండానే భూకబ్జాకు పాల్పడ్డాడని ఆయన రాత్రికి రాత్రి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. లిక్కర్ స్కామ్ లో కవితను నిందితురాలిగా అధికారులు చేర్చారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత విషయంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.? అనేది చర్చనీయాంశం అవుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు 14రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. దీంతో ఆమెను తీహార్ జైలుకు తరలించారు అధికారులు. బెయిల్ కోసం కవిత తరుఫు న్యాయవాదులు ఎంత ప్రయత్నిస్తున్నా ఫలితం ఉండటం లేదు. పలు రకాల కారణాలతో బెయిల్ కోరుతున్నా మనీ లాండరింగ్ కేసు కావడంతో బెయిల్ అంత ఈజీగా వచ్చే అవకాశం లేదు. ఎన్నికల ముంగిట కవిత…

Read More

టెన్షన్ లో కేసీఆర్ ఫ్యామిలీ.. సేఫ్ జోన్ లో హరీష్.. ఏంటి మేటర్..? వరుస కేసులతో కేసీఆర్ ఫ్యామిలీ టెన్షన్ పడుతోంది. ఇప్పటికే లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ అయింది. కేసీఆర్ అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నారావు భూకబ్జా కేసులో అరెస్ట్ అయ్యారు. సంతోష్ రావుపై కూడా కేసు నమోదైంది. వరుసగా కేసులు నమోదు అవుతుండటం బీఆర్ఎస్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని హైరానా పడుతున్నారు. ప్రభుత్వం విచారణలు కేసీఆర్ , కేటీఆర్ లను సైతం చుట్టే అవకాశం ఉంది. కాళేశ్వరం అక్రమాలపై జ్యుడిషియల్ విచారణ జరుగుతోంది. యాదాద్రి , భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాలపై, విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపై విచారణ జరుగుతోంది. ఈ విచారణ పూర్తయితే బీఆర్ఎస్ కీలక నేతలకు ఇబ్బంది తప్పకపోవచ్చు. విచారణ సంస్థలు కూడా వేగంగా దర్యాప్తు జరుపుతుండటంతో బీఆర్ఎస్ లో ఆందోళన కనిపిస్తోంది. ఫోన్ ట్యాపింగ్…

Read More

Phone Tapping Case Is Going To KCR NECK ? ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్వేకొద్దీ సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఈ కేసుతో ప్రమేయం ఉన్న వారి పేర్లు ఒక్కొక్కరిగా బయట పడుతుండటంతో బీఆర్ఎస్ కీలక నేతల్లో టెన్షన్ మొదలైంది. తమ పేర్లు బయట పడుతాయా అని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తుండటం..అధికారులంతా తాము గత ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పడంతో నెక్స్ట్ విచారణకు ఎవర్ని పిలుస్తారు..? అని టెన్షన్ పడుతున్నారు. కాంగ్రెస్ నేతలు ఎన్నికల సమయంలో ఎవరిని కలుస్తున్నారు..? ఎక్కడ కలుస్తున్నారు..? ఏం మాట్లాడుతున్నారు..? అనే వాటన్నిటినీని గుర్తించి దానికి కౌంటర్ గా ఏం చేయాలనే ప్లాన్ తో బీఆర్ఎస్ వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఆషామాషీగా తీసుకోవడం లేదు.సీరియస్ గానే ఉన్నారు. దాంతో ఫోన్ ట్యాపింగ్ కేసు ఎవరి మెడకు చుట్టుకుంటుంది…

Read More

హైదరాబాద్ ను మరికొంతకాలం ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలన్న ఏపీ ప్రభుత్వ పెద్దల వ్యాఖ్యల వెనక కేసీఆర్ ఉన్నారా..? ఆయన డైరక్షన్ లోనే జగన్ బాబాయ్, వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి ఈ కామెంట్స్ చేశారా..? రేవంత్ సర్కార్ ను ఇరకాటంలో పడేసేందుకు మరో మార్గం లేకపోవడంతో ఈ కామెంట్స్ తో సెంటిమెంట్ రెచ్చగొట్టవచ్చునని భావించారా..? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారు. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వెళ్ళడం అవమానంగా ఫీల్ అవుతున్నారు. రేవంత్ తీసుకుంటున్న నిర్ణయాలు బీఆర్ఎస్ కు ఊపిరి సలపనివ్వడం లేదు. కేసీఆర్ ఫ్యామిలీని సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అందుకే తెలివిగా రాజకీయాలు చేసేందుకు కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు. మళ్ళీ సెంటిమెంటే తనకు, పార్టీ ఉనికికి రక్షా అని నమ్ముతున్నారు. సెంటిమెంట్ తనకు అధికారాన్ని అప్పగించింది. సో, ఇప్పుడు అదే సెంటిమెంట్ తో రాజకీయం చేసేందుకు కేసీఆర్…

Read More

“నేను మళ్ళీ పుట్టిన…….” పునర్జన్మ ఉందో లేదో నాకు తెలియదు కానీ నేను మాత్రం మళ్లీ పుట్టిన ఇది నిజం…….. నాది ఒకటి, రెండు తరాల చరిత్ర కాదు, భూమి పుట్టినాటి నుండి 2021 వరకు నాకు చరిత్ర ఉంది. నాకు చావు, పుట్టుక లేదని అనుకున్నా! కానీ నేను చచ్చిపోయి మళ్లీ పుట్టిన!…. నా పేరు “ఏటిగడ్డ కిష్టాపూర్” (తిరుమలగిరి (పల్లె),లంబాడి తండా) మండలం తొగుట, జిల్లా సిద్దిపేట నేను ఎన్ని లక్షల సంవత్సరాల క్రితం పుట్టానో నాకే తెలియదు! నేను అనుకుంటున్నా మానవజాతి పుట్టినప్పుడే నేను పుట్టానని! 2021లో నన్ను చంపితే రెండు చోట్ల అన్ని అంగవైకల్యాలతో పుట్టాను. కొంత నా గత చరిత్రను మీకు చెబుతున్నాను వినండి….. నేను (వాగు) ఏరు గడ్డకు పుట్టడం మూలంగా ఏటిగడ్డ, కృష్ణారావు పాలించడం మూలంగా కృష్టాపురం గా మొత్తంగా రాను రాను నన్ను ఏటిగడ్డ కిష్టాపూర్ గా నాకు పేరు…

Read More

కరెంటు ఆర్థిక స్థితిగతులను, దాచి 85 వేల కోట్లు అప్పులు చేసి. దాన్ని ప్రజలకు తెలియనీయకుండా దాచిపెట్టినాడు……. కాంగ్రెస్ వస్తే కరెంటు కష్టాలు ఉంటాయని ప్రజలు తప్పు దోవ పట్టించడానికి ఈ పని చేశారు…… ప్రభాకర్ రావు రాజీనామాను ఆమోదించవద్దు….. ఈరోజు ఆయన పిలిపించి 85 వేల కోట్ల అప్పు ఎలా అయింది ఎందుకయింది, ఎలా అయింది, ఏమి కొన్నారు. ఆయన ద్వారానే ప్రజలకు తెలిపే ప్రయత్నము…….. ఒకవేళ లెక్కలు సరిగ్గా తేలకపోతే, అప్పుడప్పుడే ప్రభాకర్ రావు ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది???? కరెంటు సెగ మన మాజీ దొర గారికి తగిలే అవకాశం ఉంది, అందుకే ముందు జాగ్రత్తగా, కాలుజారి ఎనుఏముక విరికింది, అంట… వాళ్ల హాస్పిటల్ యశోదలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పేరిట విదేశాలకు వెళ్లే అవకాశం????? ఉంది……… ఇప్పుడే అందిన వార్త, ప్రభాకర్ రావు, విదేశాలకు పారిపోయే ప్రయత్నం, అన్ని ఎయిర్ పోర్టులను అప్రమత్తం చేసిన…

Read More

బీఆర్ఎస్ హ్యాట్రిక్ అసాధ్యమన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రత్యర్థి పార్టీలకు చెందిన గెలుపు గుర్రాలపై ఫోకస్ పెట్టారు. రోజువారీ షెడ్యూల్ ముగించుకున్న అనంతరం కాంగ్రెస్ లో బలమైన నేతలకు ఎలా చెక్ పెట్టాలనే అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కేఎల్ఆర్, వివేక్ ఇంట్లో, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు జరపడం వెనక కేసీఆర్ హస్తం ఉందన్న విమర్శలు వస్తుండగా… తాజాగా తాండూర్ కాంగ్రెస్ అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డి కార్యాలయంలో ఐటీ సోదాల వెనక కూడా కేసీఆరే ఉన్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వికారాబాద్ లో ఉన్న ఆర్బీఎల్ కంపెనీలో ప్రస్తుతం ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రోజువారీగా ఎప్పటికప్పుడు నిఘా వర్గాలు కేసీఆర్ కు అందిస్తున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తాండూర్ లో బుయ్యని మనోహర్ రెడ్డి గెలుపు దాదాపు ఖాయమని నివేదించాయి. ఇటీవలి తాండూర్ లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ తర్వాత కూడా జనాల…

Read More