Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Admin
చీపురుపల్లిని లైట్ తీసుకుని మరీ వైజాగ్ ఎంపి సీటు మీదే బొత్స ఎందుకు కన్నేశారు?..బొత్స ఝూన్సీకి వైజాగ్ లో గెలుపు అవకాశాలు ఎంతవరకూ ఉన్నాయి? తన సతీమణి దాదాపుగా పదేళ్ళ తరువాత ఎన్నికల రాజకీయాల్లోకి వచ్చారు. పైగా ప్రైమ్ సీటు. విశాఖ లాంటి మెగా సిటీలో ఎంపీ అంటే మామూలు విషయం కాదు. ఆ గోల్డెన్ చాన్స్ ఇపుడు కళ్ళముందు ఉంది. దాంతో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు.ఆయన చీపురుపల్లిని అలా వదిలేశారు. అక్కడ గెలుపు గ్యారంటీ అని ఆయన మాటలలోనే వ్యక్తం అవుతోంది. రోజుకో మీడియా మీటింగ్ ఆ మీదట పార్టీ జనాల మీటింగ్ ఇలా విశాఖలోనే మంత్రి గారు గడిపేస్తున్నారు. ఒకవైపు కళా తనపై పోటీ చేస్తున్నా…చీపురుపల్లిని పక్కన పెట్టి మరీ బొత్స తన భార్య సీటు మీదే ఫోకస్ పెట్టారు. విశాఖ ఎంపీ సీటులో సతీమణిని కూర్చోబెట్టేందుకు తనదైన స్కెచ్ ని…
ఈ మూవీకి ఇప్పటికే బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా?.ఈ మూవీ సమంత తో పాటు త్రిషకూడా హీరోయిన్ గా చేస్తోందా?..బన్నీ తో త్రిష కాంబో ఎలా ఉండబోతోంది అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా తర్వాత ఏ దర్శకుడితో తొందరగా సినిమా స్టార్ట్ చేస్తాడ నే విషయంలో మాత్రం చాలా సస్పెన్స్ క్రియేట్ అవుతోంది. ఫ్యాన్స్ అయితే బన్నీ నెక్స్ట్ అనౌన్స్మెంట్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. లిస్టులో ఇదివరకే చాలామంది దర్శకుల పేర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు హఠాత్తుగా అట్లీ పేరు టాప్ లిస్టులో చేరిపోయింది. తప్పకుండా మంచి ఫామ్ లో ఉన్న ఈ దర్శకుడు తోనే బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.ఇక ఇప్పుడు నిర్మాత అల్లు అరవింద్ తో పాటు సన్ పిక్చర్స్ కూడా రంగంలోకి దిగాయి. ఇక అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అఫీషియల్ గా ఒక క్లారిటీ…
పాలిట్రిక్స్ ఎప్పుడూ ప్రజల పక్షనా నిలిచింది. ప్రజల గొంతుకై మాట్లాడింది. అక్షరాలను సాయుధం చేసి అక్రమార్కుల గుండెల్లో దింపింది. అందుకే పాలిట్రిక్స్ పై ఎన్నో ఒత్తిళ్లు. అయినా…సవాళ్ళను ఎదుర్కొని నిలబడింది తప్పితే ఎక్కడా వెన్ను చూపలే. అందుకే తన ప్రస్థానాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తోంది. https://www.youtube.com/watch?v=AOR7GS1Echw కాళేశ్వరం అవినీతిపై అక్షరాలను ఆయుధంగా మలిచి కన్నెర్ర జేసింది. ఫోన్ ట్యాపింగ్ విషయములో పెద్దల ప్రమేయాన్ని ప్రజల ముందు ఉంచింది. జర్నలిజం అంటే నిజాన్ని ఎలాంటి డొంక తిరుగుడు లేకుండా చెప్పడమే. పాలిట్రిక్స్ అదే పని చేసింది. 2023లో కేసీఆర్ ప్రభుత్వం అధికారం కోల్పోతుందని ముందే వెల్లడించింది. పాలిట్రిక్స్ చేసిన సర్వేలు నిజం అయ్యాయి. నవంబర్ 30న వీ6 వేదికగా పాలిట్రిక్స్ సర్వే ఫలితాలను ప్రకటించాం.. సరిగ్గా అవే ఫలితాలు వచ్చాయి. నాడు పాలిట్రిక్స్ చెప్పిన సర్వే రిపోర్ట్ లను చూసి కాంగ్రెస్ కు బాకా ఊదుతుందని అనుకున్నారు..కానీ, డిసెంబర్3న ఫలితాలు చూసి…
అధికారం కోల్పోయాక కూడా బీఆర్ఎస్ కీలక నేతల తీరు ఏమాత్రం మారడం లేదు. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చినా కేసీఆర్ ఫామ్ హౌజ్ నుంచి అడుగు బయటపెట్టడం లేదు. హరీష్ రావు మాత్రం కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కేటీఆర్ తాను ఇంకా అధికారంలో ఉన్నట్టే ఫీల్ అవుతున్నారు. ఆయన తీరు చూసి ఆయన రాజకీయ సలహాలు ఇస్తోన్న వారిని తిట్టిపోస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ కొనసాగుతున్నారు. ఏదీ మాట్లాడినా అది పార్టీ అధికారిక ప్రకటనే. కానీ ఇదేమి పట్టించుకోకుండా కామెంట్స్ చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది చిన్న ఇష్యు అని కొట్టిపారేస్తున్నారు. ఒకరో, ఇద్దరో, ముగ్గురో ఫోన్ ట్యాపింగ్ చేశారని.. దానిని పెద్ద ఇష్యుగా ఎందుకు ట్రీట్ చేస్తున్నారని ప్రశ్నించడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. వస్తానికి ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద విషయం. ఎవరిదైనా ఫోన్ ట్యాప్ చేయాలంటే కేంద్రం అనుమతి ఉండాలి. కానీ గత బీఆర్ఎస్ సర్కార్…
రేవంత్ పై హైకమాండ్ పూర్తి భరోసా..అందుకే తాజా ఎంపిక..!!తెలంగాణలో మరో నాలుగు స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. మరో నాలుగింటిని పెండింగ్ లో పెట్టింది. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హైదారాబాద్ స్థానాలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వీటిని హోల్డ్ లో పెట్టేశారు.భువనగిరి ఎంపీ అభ్యర్థిగా తమ కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలని కోమటిరెడ్డి కుటుంబం పట్టు పట్టింది. కానీ, అదే స్థానం నుంచి సీఎం రేవంత్ కు అత్యంత సన్నిహితుడు చామల కిరణ్ కుమార్ టికెట్ కోసం ప్రయత్నించారు. ఇప్పటికే కోమటిరెడ్డి ఫ్యామిలీలో ఇద్దరికీ పదవులు ఉండటంతో మరొకరికి ఛాన్స్ ఇవ్వడం కరెక్ట్ కాదని చామలకు ఛాన్స్ ఇచ్చారు. అలాగే, మెదక్ ఎంపీ అభ్యర్థిగా నీలం మధుకు అవకాశం దక్కింది. ఆయన టికెట్ పై హామీతో కాంగ్రెస్ లో చేరారు. కానీ, ఈ స్థానం నుంచి జగ్గారెడ్డి ఫ్యామిలీ ప్రయత్నించింది. సర్వేలో నీలంకే ఎక్కువ గెలుపు అవకాశాలు ఉన్నాయని తేలడంతో ఆయన అభ్యర్థిత్వాన్ని…
టార్గెట్ 14.. సీఎం రేవంత్ చెప్తున్న నెంబర్. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 14 సీట్లు గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏ పార్లమెంట్ సీట్ ను రేవంత్ లైట్ తీసుకోవడం లేదు. అవసరమైతే హైదరాబాద్ స్థానంపై కూడా కాంగ్రెస్ జెండా పాతాలని పట్టుదలతో ఉన్నారు. తన వంద రోజుల పాలనకు పార్లమెంట్ ఎన్నికలు రెఫరెండమని చెప్తుండటంతో.. లోక్ సభ సీట్లపై గట్టిగా డోకాస్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒవైసీని ఓడించేందుకు బలమైన అభ్యర్థి కోసం అన్వేషణ కాంగ్రెస్ ప్రారంభించింది. ఒవైసీని ఓడించాలంటే అంత ఆషామాషీ కాదు. అందుకే ముస్లిం వర్గానికి చెందిన ఓ సెలబ్రిటీని బరిలో దింపాలని కసరత్తు చేస్తోందని టాక్ నడుస్తోంది. టీమిండియా టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జాతో కాంగ్రెస్ సంప్రదింపులు జరుపుతోందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే టెన్నిస్ కు గుడ్ బై చెప్పిన సానియా మీర్జా నెక్స్ట్ ప్లాన్ పై చర్చ జరుగుతోంది. క్రీడారంగంలో విజయవంతమైన టెన్నిస్…
సీఎంఆర్ఎఫ్ స్కామ్ లో హరీష్ రావు పీఏ.. అంతా తెలిసే జరిగిందా..? సీఎంఆర్ఎఫ్ స్కామ్ లో మాజీ మంత్రి హరీష్ రావు పీఏ నరేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులను డ్రా చేసుకొని సొమ్ము చేసుకోవడంతో జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హరీష్ పీఏ నరేష్ తోపాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. హరీష్ రావు దగ్గర పీఏగా పని చేసే నరేష్ సీఎంఆర్ఎఫ్ వ్యవహారాలను చూసుకునేవాడు. ఇతరులకు మంజూరైన చెక్కులను అదే పేరుతో ఉన్న వారి అకౌంట్ల వివరాలు పొందుపరిచి అక్రమంగా డబ్బును కాజేసేవాడు. ఈ బాధ్యతను ఓంకార్ అనే వ్యక్తికి అప్పజెప్పినట్లు తెలుస్తోంది. కొర్లపాటి వంశీ, బాలగోని వెంకటేష్ గౌడ్ తోపాటు ఓంకార్ కలిసి ఈ స్కామ్ చేసినట్లు సమాచారం. మొత్తం 17 చెక్కులను డ్రా చేశారు. మెదక్ పీర్ల తండాకు చెందిన రవి సీఎంఆర్ఎఫ్ విషయమై తెలుసుకోగా అసలు విషయం బయటపడింది. తమకు రావాల్సిన…
కొద్దీ రోజుల వరకు కేంద్రంలో బీజేపీదే అధికారమని ఆ నోటా, ఈ నోటా వినిపించింది. రోజులు గడిచే కొద్దీ పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. బీజేపీ 400సీట్లు ఖాయమని చెబుతున్నా అదేమంత ఈజీ కాదు. పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మరోసారి బీజేపీ అధికారాన్ని చేపట్టేందుకు చెమటోడ్చాల్సిందే. గతంలోలా ఈజీగా గెలుస్తామన్న నమ్మకం బీజేపీ అగ్రనేతల్లో ఎంతమాత్రం కనిపించడం లేదు. సౌత్ లో 132 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. కర్ణాటక, తెలంగాణ, ఏపీలో పొత్తు వలన ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభావం చూపగలదు. కానీ కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలో బీజేపీకి అనుకూలమైన వాతావరణం కనిపించడం లేదు. ఓవరాల్ గా సౌత్ లో ఇండియా కూటమి అత్యధిక సీట్లను గెలుచుకోనుంది. నార్త్ విషయానికి వస్తే పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ , ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ లో ఇండియా కూటమి అత్యధిక సీట్లను గెలుచుకోనుంది. నిన్నటి వరకు యూపీ, మధ్యప్రదేశ్ , రాజస్థాన్, గుజరాత్…
Kavitha suspended from BRS..? అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో సహించను. అవినీతికి పాల్పడితే నా కుటుంబ సభ్యులను కూడా చూడను. జైలుకు పంపిస్తానని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ప్రకటించారు. ఈటలపై విచారణ జరపకుండానే భూకబ్జాకు పాల్పడ్డాడని ఆయన రాత్రికి రాత్రి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. లిక్కర్ స్కామ్ లో కవితను నిందితురాలిగా అధికారులు చేర్చారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత విషయంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.? అనేది చర్చనీయాంశం అవుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు 14రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. దీంతో ఆమెను తీహార్ జైలుకు తరలించారు అధికారులు. బెయిల్ కోసం కవిత తరుఫు న్యాయవాదులు ఎంత ప్రయత్నిస్తున్నా ఫలితం ఉండటం లేదు. పలు రకాల కారణాలతో బెయిల్ కోరుతున్నా మనీ లాండరింగ్ కేసు కావడంతో బెయిల్ అంత ఈజీగా వచ్చే అవకాశం లేదు. ఎన్నికల ముంగిట కవిత…
టెన్షన్ లో కేసీఆర్ ఫ్యామిలీ.. సేఫ్ జోన్ లో హరీష్.. ఏంటి మేటర్..? వరుస కేసులతో కేసీఆర్ ఫ్యామిలీ టెన్షన్ పడుతోంది. ఇప్పటికే లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ అయింది. కేసీఆర్ అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నారావు భూకబ్జా కేసులో అరెస్ట్ అయ్యారు. సంతోష్ రావుపై కూడా కేసు నమోదైంది. వరుసగా కేసులు నమోదు అవుతుండటం బీఆర్ఎస్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని హైరానా పడుతున్నారు. ప్రభుత్వం విచారణలు కేసీఆర్ , కేటీఆర్ లను సైతం చుట్టే అవకాశం ఉంది. కాళేశ్వరం అక్రమాలపై జ్యుడిషియల్ విచారణ జరుగుతోంది. యాదాద్రి , భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాలపై, విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపై విచారణ జరుగుతోంది. ఈ విచారణ పూర్తయితే బీఆర్ఎస్ కీలక నేతలకు ఇబ్బంది తప్పకపోవచ్చు. విచారణ సంస్థలు కూడా వేగంగా దర్యాప్తు జరుపుతుండటంతో బీఆర్ఎస్ లో ఆందోళన కనిపిస్తోంది. ఫోన్ ట్యాపింగ్…