సానా సతీష్ బాబు ఫౌండేషన్ యువత జీవితాల్లో సకారాత్మక మార్పును తెచ్చేందుకు కట్టుబడి ఉంది. వారి జీవితాలను ఉజ్వలంగా మార్చేందుకు పాటుపడుతోంది. అందుకోసం యువతకు అన్ని విధాల సహాయ సహకారాలను అందిస్తూ వారికి అండగా నిలుస్తోంది. సొంత కాళ్లపై నిలబడటమే కాదు ఇతరులకు బాసటగా నిలిచేలా వారిని స్వశక్తులను చేస్తోంది. ఎందుకంటే సానా సతీష్ బాబు ఫౌండేషన్ వ్యవస్థాపకులు సానా సతీష్ బాబుకు యువత శక్తి సామర్థ్యాలు తెలుసు. ఆ శక్తికి సరైన దిశా నిర్దేశం జరిగితే సాధించగలిగే విజయాలను దర్శించగల దార్శనికులు సానా సతీష్ బాబు. అందుకే సానా సతీష్ బాబు ఫౌండేషన్ ప్రాధాన్యాలలో యువతకు సింహభాగం లభిస్తోంది. వారి భవితకు సోపానాలను వేసేందుకు కార్యాచరణ నిరాటంకంగా సాగుతోంది. యువత భవిష్యత్తు తీర్చిదిద్దడం ద్వారా కాకినాడ భవిష్యత్తు నిర్మాణం మరింత వడివడిగా సాగుతోంది. ఎందుకంటే నేటి శ్రమ పరిశ్రమల రేపటిని నిర్ణయిస్తుంది. కష్టే ఫలి అనే పెద్దల మాటను నిజం చేస్తుంది. యువత కన్న కలలను వాస్తవ రూపంలోకి తీసుకొస్తుంది.
నేటి కాకినాడ యువత ప్రధానంగా డాక్టర్, ఇంజనీరింగ్ వృత్తులను కెరీర్ గా ఎంచుకుంటుంది. ఎందుకంటే ఆ వృత్తుల్లో ఉజ్వలమైన భవిష్యత్తు ఉందనే విశ్వాసం వారికుంది. అయితే వాటిని ఎంచుకునే వారిలో చాలా మంది యువతి, యువకులు పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారే. కొందరు సొంత కలలు నెరవేర్చుకోవడానికైతే, మరికొందరు తమ తల్లిదండ్రుల కలలను నెరవేర్చడానికి ఈ వృత్తి విద్యలను ఎంచుకుంటారు. కానీ ఖర్చుతో కూడుకున్న చదువులు కావడంతో కొందరు ముందుగానే వెనుకడుగు వేస్తే, మరికొందరు చదువు మధ్య వరకు వచ్చి ఇబ్బందులు పడుతుంటారు. ఆర్థిక కారణాలతో మధ్యలో మానేయాలనుకునేవారు ఇంకొందరుంటారు. అటువంటి యువతకు అండగా నిలవాలని, వారి కలలు కల్లలు కావొద్దని సానా సతీష్ బాబు ఫౌండేషన్ ముందడుగు వేసింది. కేవలం ఆర్థిక కారణాలతో యువత తమ లక్ష్యానికి దూరం కావొద్దని నిర్ణయించుకుంది. అందుకే పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన ఎంబిబిఎస్, ఇంజనీరింగ్ వృత్తి విద్య ఎంచుకున్న యువతి యువకులకు అండగా నిలుస్తోంది. వారి కలలు నెరవేర్చుకునేందుకు ఆర్ధిక చేయూతనిస్తోంది. వారికి అవసరమైన వాటిని సమకూరుస్తూ వారు ఉత్తమ ఫలితాలను సాధించేందుకు తోడ్పాటునిస్తోంది. వారి కలలను నెరవేర్చుకునే మార్గాన్ని సుగమం చేస్తోంది. కేవలం ఎంబిబిఎస్, ఇంజనీరింగ్ చదివే వారికే కాదు ఇతర వృత్తి నైపుణ్య విద్యలు నేర్చుకునే వారికి కూడా సానా సతీష్ బాబు ఫౌండేషన్ సహకరిస్తోంది.
యువత అంటే కేవలం ఉద్యోగం కోసం పరుగులు పెట్టేవారు కాదు, సొంత కాళ్లపై నిలబడి నలుగురికి దారి చూపాలనే ఆశయం ఉన్నవారు కూడా ఉంటారు. కానీ కుటుంబ ఆర్థిక నేపథ్యం కారణంగా అలాంటి ప్రతిభావావంతులు ఉద్యోగాలకే పరిమితమవుతారు. మరికొందరు లక్ష్య సాధన మధ్యలో నిరాశకు లోనవుతారు. అందుకే ఔత్సాహిక యువతకు వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో ఉన్నతిని సాధించేందుకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తోంది. సానా సతీష్ బాబు ప్రోత్సాహంతో వారందరూ ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు మార్గదర్శనం చేస్తుంది. రేపటి మన కాకినాడను ఆర్థికంగా బలపరిచేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. ఎందుకంటే కాకినాడ నిర్మాణంలో యువతను భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా పనిచేస్తోంది.